Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 43


    "లీవిట్ ప్రియా....నా మార్గంలో నన్ను వెళ్ళనీయ్....అయినా ఈ విషయం ప్రస్తుతానికి నాన్నకు గానీ, అమ్మకుగానీ తెలియనీయకు...సంవత్సరం తర్వాత... నేను కోరుకున్న వ్యక్తి దొరికాక, ఏదో మంచి టైం చూసి నాన్నకు నేనే చెబుతాను." అంది.
    "నీ యిష్టం..." అని మాత్రమే అనగలిగింది ప్రియ చేసేది లేక!
    
                                                             * * *
    
    "ఏంటీ... మీ అక్కకు క్లాసు పీకేస్తున్నావా?" ప్రనూష గదిలో నుంచి బయటకు వస్తోన్న ప్రియను అడిగాడు శ్రీచరణ్.
    "బావా.....నీలో అల్లరి వుంది. మంచితనం వుంది. అంతర్లీనంగా మనుషులను (ప్రేమించే గుణం వుంది. అక్కను నువ్వయినా మందలించాల్సింది" అంది ప్రియ.
    "సారీ ప్రియా....దారులు కలవనప్పుడు....ఎవరేదారిలో వెళ్ళాలన్నా కష్టమే. ఒకరిదారి మరొకరికి గమ్యం కాదు కదా...అందుకే ఎవరికీ దారి ఏదో చూసుకోవడం బెటర్.
    "అంటే....ఈ పెళ్ళి? ఈ బంధం..."
    "అవి మాత్రమే ఏం లేకుండా జరిగాయి....నాన్వెజ్ తినేవాళ్ళని. వెజిటేరియన్ తినమంటే ఎలా.... నాకు ఫాస్ట్ గళ్ అంటే ఇష్టం. మోడ్రన్ గా వుండే అమ్మాయి అంటే ఇష్టం. ఎమోషన్స్ కన్నా, టెమ్టేషన్ వున్నా అమ్మాయంటే ఇష్టం..."
    "బావా... మీ ఇద్దరికీ ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. అయినా కొన్ని సమస్యలను పరిష్కారం కాలమే చెప్పాలేమో....ఒక్కటి మాత్రం నిజం బావా....ఇద్దరు వ్యక్తులు కలిసి వుండాలంటే....ఒకరిమీద ఒకరు "కన్సర్న్ ఫీలింగ్ ముందు ఏర్పరచుకోవాలి.
    అప్పుడు ఆటోమేటిక్ గా ఒకరికొకరు ఖచ్చితంగా నచ్చుతారు..."
    "నీలా పెద్ద పెద్ద పదాలు, భావాలు తెలియవు ప్రియా..." అన్నాడు శ్రీచరణ్.
    ప్రియా మౌనంగా అక్కడ్నుంచి కదిలింది.
    
                                                                 * * *
    
    ప్రనూష ఆఫీసుకు వెళ్ళినా ప్రియ మాటలే గుర్తు చేసుకుంటోంది. తను తొందరపడిందా? తన నిర్ణయంలో లోపముందా?" అన్న సందిగ్ధంలో వుంది.
    అప్పుడే ఫ్యూన్ వచ్చి మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పాడు.
    ప్రసూనాంబ, కామాక్షి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మేనేజర్ ప్రనూష మీద ప్రత్యేకమైన శ్రద్ద" ను కనబర్చడం వాళ్ళు గమనిస్తూనే వున్నారు.
    ఆ విషయం ప్రనూషకూ తెలుసని అర్దమైంది.
    
                                                                * * *
    
    "గుడ్ మార్నింగ్ ప్రనూష గారూ..."
    "గుడ్ మాణింగ్ సార్. మరీ గారూ అని నా పేరుకు తోక తగిలించకండి" అంది ప్రనూష.
    థాంక్యూ..." అన్నాడు ప్రభాత్.
    "దేనికి?"
    "గారూ, మీరూ..అనే పదాలు మనుష్యుల మధ్య కృత్రిమమైన" గౌరవాలు సృష్టిస్తాయి, 'గారూ! ఇప్పుడు దూరమైంది, మీ మనసుకు నా పిలుపు దగ్గరైంది. యామె రైట్ అన్నాడు.
    "రైట్....!! అంది అసంకల్పితంగా.
    "నిన్న రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా..." అన్నాడు ప్రభాత్.
    ప్రనూష మార్నింగ్ ఆఫీసుకు రాగానే....రోజూ తన ఛాంబర్ లోకి పిలుస్తున్నాడు ప్రబాత్...
    లంచ్ వరకూ మాఎతో కబుర్లే చెబుతున్నాడు.
    ఆ విషయంలో అప్పటికే ఆఫీసులో చెవులు కొరుక్కోవడం మొదలైంది ప్రనూషకు వర్క్ తక్కువైంది. ఇప్పుడామె వర్క్ ప్రబాత్ తో మాట్లాడ్డమే.
    "మాట్లాడరేంటి ప్రనూషా... రాత్రంతా మీ గురించే ఆలోచించాను....ఎందుకో మీరు గుర్ఘుకు రాగానే నా మనసులో చిత్రమైన స్పందన.....వెంటనే తోటలోకి వెళ్ళాను. గులాబీలు కోసి వరుసగా మీ పేరు పేర్చాను. ఎంత సంతోషం వేసిందో. అలా ఆ గులాబీలా మీ పేరు చూసుకుంటూ మురిసిపోయాను....
    ప్రభాత్ మాట్లాడుతుంటే మంత్రముగ్ధలా వుంటూ వుంది. అప్పటివరకూ ప్రియ మాటల్లో వున్న నిజానిజాలు విశ్లేషణలో పడినా ప్రనూష ప్రభాత్ మతాల గారడీలో పడి, ఆ విషయాన్ని తొక్కిపెట్టింది.
    "ఎందుకో ప్రనూష....ఎప్పుడూ మీ ఆలోచనలే నన్ను చుట్టుముడుతున్నాయి, ఇది వరకైతే రాత్రి అవుతుందంటే భయమేసేది. ఒంటరిగా... చీకటి రాత్రిని చూస్తూ.
    ఒంటరి తనాన్ని చూస్తూ..." ఒరే ప్రభాత్....నువ్వు ఒంటరిగాడివిరా....ఎవరూ లేని అనధవు రా ఫూల్ అని నా అంతరాత్మ అంటుంటే...బిక్క చచ్చిపోయేవాడ్ని....బట్....ఇప్పుడు ఒరే ప్రభాత్....నువ్వు లక్కీఫెలోవిరా....నీకోసం బాధపడడానికి ప్రనూష అనే గుడ్ గళ్ వుందిరా." అంటూ అంతరాత్మ చెబుతూంటే....ఆకాశంలో నీ మొహం చందమామలా కనిపిస్తోంది. ప్రామిస్..." అంటూ కళ్ళను తుడుచుకున్నాడు (తుడుచుకున్నట్టు నటించాడు) కదిలిపోయింది ప్రనూష.
    తన గురించి ఓ మనిషి ఇంతగా ఆలోచిస్తున్నాడా? వెంటనే శ్రీచరణ్ ని ప్రబాత్ పక్కన వూహించుకొని, "కంపేర్ చేసుకోసాగింది. ఓ మనిషి మీద ఏర్పరచుకున్న పాజిటివ్ ఫీలింగ్స్ ఎలా వుంటాయో అర్ధమైంది.
    తనని ఎప్పుడూ శ్రీచరణ్ ఇలా పొగడలేదు. తను లేకపోతే, జీవితం లేదని, తను ఆకాశంలో చందమామని తనని గుర్తించలేదు. తనకోసం తపించి పోలేదు. అంటే శ్రీచరణ్ కు తనమీద ప్రేమలేదు మరి ప్రభాత్ కు..."
    ప్రభాత్ వంక చూసింది.
    మొహాన్ని చాలా ఇన్నోసెంట్ గా పెట్టి, "ప్రనూషా....మీ ప్రెజన్సీ నాకెంతో రిలీఫ్ ని ఇస్తుందో తెలియదు....బహుశా మీలాంటి అంధమైన, మంచి మనసున్న భార్య దొరికితే నేను జీవితాంతం ఏ మందులూ వాడక్కర్లేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలేదు....నూరేళ్ళు ఆయుష్షును సంపూర్ణంగా అందించే శక్తి నీ ప్రేమకుంది" అతడు మరో మెట్టుపైకెళ్ళి అనేసాడు.
    ప్రనూష ఆ ట్రాప్ లో ఇరుక్కుపోయింది.
    మరోసారి అప్రయత్నంగా "థాంక్యూ సార్ అంది.
    "థాంక్స్ నేను చెప్పాలి....ప్రనూషా' అనుకున్నాడు ప్రభాత్.
    ప్రనూషకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. అతని ప్రేమ చూస్తోంటే....ఆమె మనసులో వేలవేల ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముడుతున్నాయి. తన అన్వేషణకు ఇది తుది మజిలీలా అనిపిస్తోంది. తనక్కావాల్సిన వ్యక్తి ఎవరో అర్ధమైంది.
    "ఏంటి.... నేనేమైనా తప్పుగా మాట్లాడానా?" అన్నాడు ఎక్స్ ప్రెషన్ మార్చి ప్రభాత్.
    నో సార్....అదేమి లేదు" అంది వెంటనే.
    "ఒక చిన్న కోరిక." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS