Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 43

 

    "ఏయ్ డియర్! అలా పాన్ మహల్ కు వెళ్లి రెండు హనీమూన్ పాన్ లు వేసుకుని వద్దామా?" హుషారుగా అంది పీలూ.


    ఓసారి అదోలా చూసాడు పీలూ వైపు.


    ఆమె అదేం పట్టించుకునే మూడ్ లో లేదు.


    "అలాగే ఆ ప్రక్కనున్న బాస్కిన్ రాబిన్స్ లో కేసరి పిస్తా గానీ ఫిగ్- ఓ- హాని ఐస్ క్రీమ్ గానీ తిందాం మహా టెస్టిగా ఉంటుంది" అంది.


    "ఆ! ఎందుకుండదు డబ్బులు నీవి కాకుంటే ఆన్నీ టెస్టుగానే వుంటాయి" అనుకున్నాడు మనసులో గరుడాచలం.


    గర్ల్ ఫ్రెండుంటే ఇవే బాధలు అనుకున్నాడు.


    
                                                       * * *


    "ఏయ్....అపు....అపు" అంటూ ఓ స్కుటరిస్ట్ దగ్గరకి వెళ్ళి అరిచాడు.


    ట్రాఫిక్ కానిస్టేబుల్ గెటప్ లో వున్న త్రిలోకాన్ని చూసి ఆ స్కూటరిస్ట్ స్కూటర్ ఆపాడు.


    "లైసన్స్ ఉందా?" అడిగాడు త్రిలోకం.


    ఆ స్కుటరిస్ట్ నీళ్ళు నమిలాడు.


    "ఓహొ......ఆర్ సి బుక్కుందా?"


    మళ్ళీ నీళ్ళు నమిలాడు.


    "పోనీ ఇన్సురెన్స్......"


    మళ్ళీ నీళ్ళు నమిలాడు.


    "ఇలా ఎన్నిసార్లు నీళ్ళు నములుతావయ్యా....అసలు ఆ స్కూటర్ నీదేనా?" అప్పుడు కూడా నీళ్ళు నమిలి "మా ఫ్రిండ్ ది" అన్నాడా వ్యక్తీ.


    "కట్టు.....ఫైన్ కట్టూ" అంటూ చేతిలో రసీదు పుస్తకం తేలేదు" అనుకుని లేకపోవడంతో తనలో తనే "ఏంటి నేను రసీదు పుస్తకం తేలేదు" అనుకుని అతని వైపు తిరిగి--


    "బుద్దిగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ కు వెళ్లి పైన కట్టు" అన్నాడు త్రిలోకం.


    త్రిలోకం వైపు అదోలా చూసి "సరే" నన్నడతను.


    "దట్స్ గుడ్. నిజ్జంగా వెళ్లి కట్టు.....ఏది తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పు" అడిగాడు త్రిలోకం.


    ఆ స్కూటరిస్ట్ తన తలను స్కూటర్ కేసి కొట్టుకుని "అలాగే" అంటూ స్కూటర్ స్టార్ట్ చేసాడు.


    సరిగ్గా అదే సమయంలో.....


    కేనటిక్ హొండా స్పీడుగా వస్తోంది. కాస్త మందు ఎక్కువ అవ్వడం వల్ల అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తోంది పీలూ.


    "ఏయ్.....ఏయ్...." అని వెనుక సీట్లో కూచున్న గరుడాచలం భయంతో అరుస్తూనే వున్నాడు.


    ఇంతలో జరగాల్సిన డేమేజి జరిగిపోయింది కేనటిక్ హొండా త్రిలోకం మీద కొచ్చేసింది.


    త్రిలోకం గట్టిగా అరిచాడు.


    అంతకన్నా గట్టిగా , భయంతో అరిచాడు గరుడాచలం. ఏమాత్రం అరవకుండా ఓ ములకు పడింది పీలూ.


    తాగిన మత్తులో వున్న పీలూ పడ్డాక అరిచింది.


    "ఓమై లార్డ్.....సేవ్ మీ" అంటూ గరుడాచలం ఆమె మీదపడి తర్వాత కిందపడ్డాడు. చుక్కలు కళ్ళెదురుగా కనబడిన భ్రాంతి.


    ఆ ఒంటరి బండి త్రిలోకాన్ని డ్యాష్ ఇచ్చి ఆగిపోయింది. త్రిలోకం కూడా యధాశక్తిగా కేకేసి కోపంగా పీలూ వంక చూసాడు.


    "ఏయ్ మిస్! యాక్సిడెంట్ చేయడమే తప్పంటే ఆ యాక్సిడెంట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని అయిన నాకే చేస్తావా? పైగా నేను డ్యుటిలో వున్నాను. నువ్వు తాగి వచ్చావు. పద స్టేషన్ కు పద.....నీ సంగతి తేలుస్తా" అరిచేసాడు త్రిలోకం.


    గరుడాచలానికి లబోదిబోమని అరవాలనిపించింది. ఓ ప్రక్క నడ్డి విరిగింది. మరోపక్క పోలిస్ కేస్ అవుతుందన్న భయం.


    మెల్లగా లేని లేని ఓపిక కూడగట్టుకుని త్రిలోకం వైపు చూసి-


    "బావా......నువ్వా?" అన్నాడు అరచినంత పన్జేసి గరుడాచలం.


    "వాట్ బావా? వై బావా వరసలు కలిపి కేసు మాఫీ చేసుకోవాలనుకుంటున్నావా? అదేం కుదుర్దు. నేను డ్యుటిలో యమ స్ట్రిక్టు పదండి పోలీసుస్టేషన్ కు" అన్నాడు త్రిలోకం.


    "బావా! నేను గరుడాచలాన్ని నీ ఒక్కగానొక్క చెల్లెలి మొగుడ్ని" అన్నాడు గరుడాచలం.


    "వాట్ నాన్సెన్స్. నాకసలు చెల్లి తల్లి ఎవరూ లేరు. బంధుత్వాలు కలిపి నన్ను కొనేద్దామనుకుంతున్నావా?" మరింత కోపంగా అన్నాడు త్రిలోకం.


    "ఒరే బావా! నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రేపో మాపో మనం వియ్యంకులం కాబోతున్నాం."


    "వియ్యంకులమైనా సరే.....అయినా నాకసలు కూతురే లేందే.....ఏంటి వెధవ వేషాలు వేస్తున్నావా?"


    "కాదు.....క్యారెక్టర్ ఆర్టిస్టు వేషాలు వేస్తున్నాను" కసిగా అన్నాడు గరుడాచలం.


    "అయితే వెళ్లి సినిమా ప్రొడ్యుసర్ ని కలువు. ముందు పోలీసు స్టేషన్ కు నడువు."


    నెత్తినోరు బాదుకోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు గరుడాచలం.


    "ఒరే బావా! బాగా ఆలోచించుకో, ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో....." చివరిసారిగా అన్నాడు గరుడాచలం.


    "రూల్ ఈజ్ రూల్ ఫర్ అల్...." అన్నాడు సీరియస్ గా.


    "ధూ.....నీయబ్బ.....నీ యూనిఫామ్ ని కొండ చిలువ ఎత్తుకుపోను ముదనష్టపు బావ సచ్చినోడు" అంటూ తన మాములు బాషలో తిట్ల దండకం మొదలుపెట్టాడు.


    "ఇలా నోరు పారేసుకుంటే న్యూసెన్స్ కేసు కూడా బుక్ చేస్తామని" అన్నాడు త్రిలోకం హుందాగా.


    "ఓర్నీ......నన్నే గుర్తు పట్టలేదా....నీ మాయదారి మతిమరుపు రోగాన్ని సంతలోకి తీసుకెళ్ళి......"నెత్తి కొట్టుకుంటూ అన్నాడు గరుడాచలం.


    "అంత పెద్ద తిట్టుకు అర్ధమేమిటి గరుడా డియర్"


    ఫట్ మని లాగి చెంపమీద కొట్టి హుసేన్ సాగర్ లోకి పెట్టేద్దామన్నంత కోపం వచ్చింది పీలూ ప్రశ్నకు.


    "ఇప్పుడదంతా అవసరమా డాళింగ్" అన్నాడు బలవంతంగా కోపాన్ని అణుచుకుంటూ.


    "కూల్ డౌన్ డియర్" ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ సంగతి నేను చూసుకుంటాను" అంది పీలూ.


    "ఏం చూసుకుంటావు?" భయంగా , అనుకూలంగా అడిగాడు.


    పీలూ త్రిలోకాన్ని పక్కకు తీసుకెళ్ళింది.


    మరో అయిదు నిముషాల తరువాత పీలూ మాములుగా వచ్చి కిందపడ్డ తన కేనటిక్ తీసి "కమాన్ గరుడా డియర్" అంది బండి స్టార్ట్ చేస్తూ.


    త్రిలోకం మెలికలు తిరిగిపోతూ నిలబడి వున్నాడు.


    ఇద్దరి వైపు చూసి జుట్టు పిక్కుని అనుమానంగా అడిగాడు పీలూని గరుడాచలం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS