Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 43

 

    ఆ పోస్టు డబ్బాని చూసి ఎవర్ని చూడాలని కోరుకుంటానో వాళ్ళు కనిపిస్తారన్న మాట అదో సెంటిమెంట్ "చూశావ్ గా ఉదయం వెళ్ళి పోస్టుడబ్బాని చూసి నువ్వు కనిపించాలని కోరుకున్నాను. సాయంకాలానికి కనిపించావ్"
    
    "అంటే నీకు పోస్టు డబ్బా దేవుడన్న మాట" హాయిగా నవ్వాడతను.
    
    "వూ- రేపు సాయంకాలం వరకు నిన్ను చూడొచ్చు. కూలీల్ని పిలుచుకుని ఉదయానికల్లా వచ్చేస్తాను. సరేనా"
    
    "అలాగే"
    
    ఇద్దరూ ఏటిగట్టు దగ్గరికి వచ్చారు.
    
    అతను కిందదిగి ఊరికి వచ్చేయాలి.
    
    "మరి వస్తాను" అతనికి ఆమెని వదిలి వెళ్ళాలని లేరు. కానీ ఊరకనే ఎలా వుండడం. అప్పటికే బాగా పొద్దుపోయింది.
    
    చీకట్లో ఏట్లో నడవడం కొద్దిగా కష్టమైన పనే. దారి సరిగాలేదు.
    
    "ఇకనుంచి నేనూ నిన్ను చూడాలనిపిస్తే పోస్టుడబ్బాను వేడుకుంటాను" అన్నాడు.
    
    ఆమె నవ్వుతుంది. చీకట్లో ఆమె నవ్వు మల్లెపొద కదిలినట్లుంది.
    
    ఆమెకు టాటా చెబుతూ కిందకు దిగుతున్నాడు.
    
    ఏమైందో తెలియదు. అతని కాలు జారింది. మరీ డౌన్ కాబట్టి పట్టుదొరకడం లేదు. "అమ్మో" అంటూ బ్యాలెన్స్ కోసం పరిగెత్తాడు. కానీ పట్టుతప్పి కింద పడిపోయాడు.
    
    అయితే అప్పటికే అతను డౌన్ లోకి వచ్చేశాడు.
    
    అతనికి కాలు జారిందని అనిపించగానే పడిపోకుండా పట్టుకోవడానికి ఆమె కూడా అంతే వేగంతో కిందకు వురికింది.
    
    చివరికొచ్చేసైరకి అతని కాళ్ళకు తగిలి ఆమెకూడా అతనిపై పడిపోయింది. ఆ పడడం కూడా అతనికి అభిముఖంగా పడడంతో కరెక్టుగా ఆమె గుండెలు అతని ఎదపై వత్తుకుపోయినాయి.
    
    గత జన్మలో ఏ పుణ్యం చేయడం వల్లో ఈ జన్మలో ఈ అదృష్టం దొరికినట్టు అతను ఆమెను పొదివి పట్టుకున్నాడు.
    
    "కింద పడ్డావు- దెబ్బలేమైనా తగిలాయా" అని అడగాలనుంది ఆమెకి. కానీ గొంతు పెగలడం లేదు. రక్తమంతా వేగంగా ప్రవహిస్తుండడం వల్ల శరీరం ఎగిరెగిరి పడుతోంది.
    
    అందుకే తన సంచలనాన్ని అణుచుకోవడానికి మరింత గట్టిగా అదుముకుంది.
    
    తను కింద పడిపోతున్నానన్నా విషయం గుర్తులేదు అతనికి.
    
    వదిలేస్తే ఈ సుఖమంతా ఎక్కడ మాయమవుతుందోనన్న భయంతో అతను మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు.
    
    ఆమె అతనిలో కలిసిపోవాలన్న తపనతో మరింత ఒదిగిపోతూ వుంది.
    
    తనని అంతగా రెచ్చగొడుతున్న ఆమె ఎదలో ముఖం దాచుకోవాలని అతను ప్రయత్నిస్తున్నాడు.
    
    ఎప్పుడో చవిచూసి మరిచిపోయిన అనుభవం కోసం శరీరం యాగీ చేస్తుంది ఆమెకి. ఎక్కడెక్కడో ఏదో తెలియని తీపులు మొదలయ్యాయి.
    
    అతను ముఖం పైకిలేపి ఆమెచుట్టూ చేతులు వేశాడు.
    
    ఆమె అతనికి మరింత కష్టం కలిగించకూడదని బట్టల్ని ఒక్కొక్కటే తీసివేయడం మొదలుపెట్టింది.
    
    ఆమె నగ్నత్వాన్ని చూడడానికి అతడి రెండు కళ్ళూ పెట్రోమాక్స్ లైట్లయ్యాయి.
    
    అలా పద్మజ, గోకుల్ మధ్య కొత్త సంబంధం మొదలైంది. ఇద్దరికీ సాయంకాలం కాకూడదు. శరీరాలూ, మనసులూ రెండూ లాగేవి. అతనైతే మరీ మోసం.
    
    సాయంకాలపు చీకట్లు వాలడం తరువాయి శుభ్రంగా తయారై బయల్దేరేవాడు. ఇంకా వెలుగంటే ఏట్లో ఏ రాయిమీదో కూర్చుని చీకటిపడే వరకు గడిపేవాడు.
    
    ఆ మీదట మెల్లగా నడుస్తూ ఏదో గట్టుకు చేరుకొని పల్లం ప్రదేశంలో కూర్చునేవాడు. ఏటి గట్టుమీదే ఆ వూరి బాట కానీ ఏటి పల్లంలో కూర్చుంటే ఎవరికీ కనబడరు. ఆ ప్రదేశం బాగా క్రింద వుండటమే కాకుండా చెట్లు కూడా గుబురుగా పెరిగి వుండేవి.
    
    దేవత కోసం తపస్సు చేస్తున్నట్టు అలా కళ్ళు మూసుకుని మనసును మాత్రం ఆమె చుట్టూ తిప్పుతుండేవాడు. 

   

    పద్మజ కూడా అతను వచ్చే టైమ్ కి హాజరైపోయేది. చీకట్లు పడడంతోఇనే తయారయ్యేది. ఆ చీకట్లలో తన అలంకరణ అతనికి తెలియదని తెలిసినా అందంగా తయారయ్యేది.
    
    బ్రా వుంటే అవసరమైన కాలయాపన అని చెప్పి బ్రాలన్నిటినీ పెట్టె అడుగున తోసేసింది.
    
    ఒక్కోరోజు మరీమరీ మనసు ఆ అనుభవం కోరుకుంటూ వుంటే జాకెట్టుపై కిందనున్న బంధనాలు మాత్రమే వుంచి మధ్యలో అలా వూరకనే వదిలేసేది. పైట నిండుగా కప్పుకోవడం వల్ల బయటి వాళ్ళకి ఇది తెలిసేది కాదు.
    
    సాయంకాలం కాబట్టి ఇంట్లో ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే పెద్ద చెల్లెలికి మాత్రం డౌట్ పడింది. రోజూ ఒకేవేళకి అక్క అందంగా తయారై ఎక్కడికి వెళుతుందోనన్న ఆలోచన మొదలయింది.
    
    పెళ్ళయి, భర్తను వదిలేసిన అమ్మాయిని ఆ మాత్రం క్షమించవచ్చని సమాధానపడింది. ఎప్పుడయినా పనుల వత్తిడివల్ల పద్మజ వెళ్ళకపోతే "అక్కా ఆ పనులు నేను చేస్తాలే" అని తను తీసుకునేది.
    
    అప్పుడు గుర్తొచ్చేది పద్మజకు అర్జెంట్ గా బయల్దేరి వెళ్ళేది.
    
    అంత ఆలస్యం కావడంతో గోకుల్ కోపంతో వుడికిపోయేవాడు. అదీ క్షణం సేపే.
    
    ఇలాంటి క్షణాల్లో అతని కోపం ఎలా పోగొట్టాలో పద్మజకి బాగా తెలుసు.    

 

    పక్కన కూర్చోగానే "అబ్బ! పక్కగా వుంది. గాలి ఆడడం లేదు" అని పైటను తీసి విసురుకునేది.
    
    అంత చీకట్లోనూ ఆమె ఎద ఎత్తుగా కనిపించేది. రెండు కొండల శిఖరాల మీద ఎక్కి కింద నున్నలో చూసినట్టు నడుం నీళ్ళలో ప్రతిఫలించేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS