Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 42

    చిన్న నాఁట నుండియు భవభూతి యుత్తర రామచరిత్ర మన్న నాకు పరమానందము. అందులో పలుకులు 'జగజ్జిర్ణరణ్యమ్ . . . కూకులానాం రాశౌ తదను హృదయం పచ్యత ఇవ' అన్నవి సదా నా తలఁపులో మెదలుచుండెడివి. ' జగజ్జిర్ణరణ్యమ్' అనుటకు గొప్ప వివరము కాన వచ్చెడిది. అరణ్యమేని, అందు ఛాయా ఫల పుష్ప వృక్షములు, లతా గుల్మములు, జలాశయములు, పక్షికలకలములు, దృశ్యజ్మతు విహారములు, మనుష్య సంచారము  నుండును  ముండ్ల  పొదలు, వ్యాఘ్రు దు  ఘుతక జంతువు, సర్ప, వృశ్చిక, వృక్షాదులునున్నాను నుండును గాని పుష్పఫలాదులకై యందు ప్రవేశించువారు- కంట కాద్యపాకరణ సాధనములఁ గొని నిరపాయముగా కార్యము నిర్వర్తించుకొని రాఁ గలరు. జిర్ణారణ్యమున ఛాయా ఫలపుపుష్ప వృక్షము లుండవు. జలా శయము లుండవు. లతాగుల్మము లుండవు. ఎండు టడవి. రక్కెస మట్టలు, చీకి రేను పొదలు, పాములు, తేళ్లు, తోడేళ్లు మొదలగునవి మాత్రమే ఉండును. కర్మవశమున త్రోవ తప్పి యెవఁడే నందుఁ జేరానా వాఁ డక్కడ కడతేర వలసిన వాఁడే యగును. జగ త్తొక జిర్ణారణ్యముగా, దుర్విధిచే నే నందు చేరినట్టుగా భావించెడివాఁ డను.

                                        ౨౧
 
                                     వెలుఁ గు నీడలు

    భవభూతిపునరుక్త మయిన యీశావస్యోపనిషద్వాక్యము " అసుర్యానామ తేలోకా అంధేన తమసావృతాః, తాం స్తే ప్రేత్యాభిగచ్చన్తి యేకే చాత్మహనో జనాః" అన్నది యాత్మహత్య సంకల్పజ్వాలలను జలార్చి వేయు చుండెడిది. కడుపసిప్రాయమున కనులు మూసికొని బోరగిల పడుకొని చూచుచుండినపుడు నేను "నే నని" నాలో గోచరించిన మినుకు గ్రుడ్డి వెలుఁ గే దూరమున గోచరించి జీవితాశోచ్చ్వాస మాడించుచుండెడిది.

    మందులు మానితిని గనుక మావారు మంత్రముల కేసి దృష్టి సారించిరి. వారిని వీరిని పిలిపించి మంత్రజపము చేయింప నుద్దేశింపఁగా నేను వారింపఁ జొచ్చితిని. యా మంత్ర ప్రయో క్తల యోగ్యతలు నే  నేఱిఁగినవే. కనుక    వారిని బిలిపింప నొల్లనయితిని. నా యనారోగ్యమును నన్నడిగి విద్వాంసుఁడు గదా యని నేను చెప్పఁగా విని వేద శ్రౌత విద్వావిశారదుఁ డొకఁ డు ' ఏఁ బడి రూపాయలు తెచ్చుకొని నా కిచ్చితి వేని నీకు మోహిని పట్టినది. దానిని తొలఁగింప గలను ' ఇత్యాదిగా నేదో చెప్పెను. ధిక్కని తెగడితిని. అనుదినము సహస్రగాయత్రి మంత్ర జపము చేయుచు నమాయ కుఁడుగా నందు వృద్ధ బ్రాహ్మణు నొకని- ఆయన కుమారుఁదు మాయూర స్కూలు మేష్టరుగా కొన్నాళ్ళుండెను - బిలిపింప నుద్దేశింపఁ గా నేను వెళ్ళే యంటిని. వానిని గ్రామాంతర మున నుండి పిలిపించిరి. నలువది దినములు మంత్రజపమాయన జరపెను. ఆయన వల్ల నా కేమాత్రము మేలు జరుగ బోదని నేను బిగ్గ పలుకుచుండెది వాఁడను. వీనికిఁ పట్టిన గ్రహ చారమో, గ్రహమో ఉపకారకము లయిన పద్ధతుల పై వీనికి విశ్వాసము కుదురు నీయ కున్నదని మా వారు తెగడఁ జొచ్చిరి." నిజమే! నా కిట్టివారి ప్రజ్ఞ మిఁ ద విస్వాసను లేదు.అదే నా జబ్బు అనుచున్న వారు మిరో వారో కొల్పుఁడు' అనువాఁ డను. నలువది నాళ్ళయిన తర్వాత జల ఫలము నాకు ధారాద త్తము చేయుటకు గొప్ప బ్రాహ్మణ సంతర్పణము జరపిరివృధా ధనవ్యయ మని నేను వగవఁ జొచ్చితిని. ఇట్టి చీకాకు లెన్నో పడితిని. వేనివల్ల గాని నాకు మేలు జరగా లేదు. తొట్టె స్నానము, ఉప్పుకారములు లెనిఒ భుక్తి ఒక మాదిరిగా చేయుచునే యుంటిని.

    మద్రాసులో నా స్థానమున నియుక్తులైన విద్వాంసులు హఠాత్తుగా అంతరించి. చలి జ్వరము నూట యాఱుడిగ్రీల పై చిలుకు వచ్చి ఆ తర్వాత ఔషధము నిరుప యోగము కాఁగా పుణ్యలోకముల కరిగిరఁ ట!మా ఆఫీసు క్యురేటారు శ్రీ కుప్పు స్వామి శాస్త్రిగారు నాకు డి. ఓ. వ్రాసిన .' నీవు వచ్చి డ్యూటిలో చేరుట మంచిది. నీకు తొందర కలుగకుండ దేశాటనము చేయ నేర్పాటు చేయుదును. రావలసినది' అని. ఆవత్సరమున పరిషత్తు సంవత్సరోత్సవము గుంటూర జరగెను. నేను చాల గౌరవించు వేదము వెంకటరాయ శాస్త్రిగారి యాద్యక్షము  మిత్రులు శ్రీ రామకృష్టకవిగారు నన్ను మద్రాసు రాఁ గోరి జాబు వ్రాసిరి. గుంటూరఁ గలసికొందు నని బదులు వ్రాసి యట్లె గుంటూరు వెళ్ళితిని.నేను మాటాడినది, చేసినది ఏమియు లేదు. అయినను ఆయుపన్యాసము వినికిడికి, ఎండలకు తాళఁ జాలక పోయితిని. మిత్రులు కనుపర్తి మార్కుండేయశర్మ గారి యింట విడిసి, తొట్టె సాన్నము చేసి కొంత స్వస్ధ్యము కూర్చు కొంటిని.


 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS