మిత్రుల ప్రోద్బలమున మద్రాసు వెళ్ళ నిశ్చయించు కొంటిని. ఇంటికి వెళ్ళి తగిన యేర్పాట్లతో నే నొక్కఁడనే బయల దేరితిని. ఆప్తులు, బంధువులు మంగళగిరి నరసింహ స్వామి దర్శనము చేసి పొమ్మని నిర్బధించిరి. భక్తిభరితముగా సంకీర్తనముల పాడఁ గల బ్రాహ్మణుఁ డొకఁడు నాతో వచ్చెను. మంగళ గిరి వెళ్ళితిమి. అక్కడ బాలాంబగా రను మహానియురాలు మా కాతిద్య మిచ్చెను. పానకము మొదలగు నియ్ వేద్యములు చేయించితిమి పానక మారగింపు చేయించు నప్పుడు వెండి కవచములో నున్న మూర్తి తీరును గూర్చి నాకు యోచన. దానిని వెల్లడింపఁ గా దైవ పరిక్ష వలదని యక్కడి వారు నాకు హిత ముప దేశించిరి. స్వామి కేదో చెల్లింపఁ దలఁ చుకొంటిని గాని చెల్లింపలేదు.అది శ్రీ బాలంబ గారికి సమర్పింపఁ గోరిక ఈయబోగా నప్పుడా మెగారు ' మా యింట నాతిధ్యము గొని మి రేదో యిప్పుడిచ్చుట పూట కూళ్ళయింట నిచ్చిన ట్లగును. తర్వాత మిరు మి గంతవ్యస్ధలము చేరి యే దేని పంపుదురు గా' కనిరి.
మద్రాసు చేరితిని. ఆఫీసు డ్యూటిలో ప్రవేశించితిని. అప్పుడు మిత్రులు కొంద ఱుం డుటచే సముద్ర తీరమున బక్కింగ్ హామ్ లాడ్జిలో నుంటిని. జనార్ద౯ అను పుణ్యాత్ముఁడు హొటలు ప్రోపైటరు నాకు మిత్రుఁ డు. ఆతని హొటలులో భోజనము. డ్యూటిలో ప్రవేశించిన పదిరోజులకే అయిదు రోజులు కాషుయాల్ లీవు పెట్టితిని. రాత్రులందు నిద్ర రాదు. కడుపులో మంట. శరీరము తాపము. తీవ్రమయిన యశాంతి. అప్పుడు నా బాల్యమిత్రము శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు కూడ నాతో నుండిరి. వారి తోడ్పాటుతో డాక్టరు లక్ష్మీ పతిగా రింటి కేగితిని. ఆయన సరిగా వ్యాధిని గుర్తించి కాని మందిచ్చు వారు కారు. ఎక్కువగా మందులు వాడక ఆహారవిహరాదుల చేతనే శక్య మయినంతవఱకు వ్యాధి నివారణ చేయఁ జూతురు. ఆయన కూడ నాకు చిర మిత్రము. నా వ్యాధి చరిత్ర మంతయు విని నరముల యుద్రేకము తగ్గుట కేదో మందు (బ్రొమైడు) ఇచ్చిరి. అది పుచ్చుకొనఁ గా ఒక రాత్రి నెమ్మదిగా నున్న దిగాని మర్నాడు శరీర మంతయు పట్లు విడిపోయిన ట్లయి లేవలేని స్ధితికి వచ్చితిని. ఆ మందు మాని వేసితిని.
ఇక నౌకరీ దుష్కర మని నిశ్చయించుకొంటిని. అప్పటికే క్యూరేటరుగా రిఁక నీతఁడు సెలవు కోరినచో డిస్మిస్ చేసి యింటికిఁ బొమ్మన వలసిన దే అని రెఱ్ఱళ్ళకు ముందటి సెలవు చీటి మిఁద వ్రాసిరి. వ రందాఁ క నెంతో యోర్మితో నన్ను నెలకొల్పుకొనఁ జూచిరి. లాభము తోఁప దయ్యెను.నాకును దిక్కు దోఁప దయ్యెను. బలవంతమున శరీరమును, నరముల శక్తిని ఎగసన ద్రోసికొని స్నానము చేసి హొటలుకు వెళ్ళితిని. నేఁటితో నౌకరికి నీళ్ళు దోడు కొనకవలసినదే! ఇట్టి స్దితితో ఇంటికి మరల వెళ్లుట బ్రదికియుండియుఁ జచ్చుట యగును.చేత నున్న సొమ్ముతో హరి ద్వారమునకు టిక్కెట్టు తీసికొని (టిక్కెట్టు కే చాలినంత ధన మున్నది కాన) మార్గమున నుపవాస మే చేసి ఏ దేని యాహార మెవ్వరి వలన నేని యాయుచితముగా లభించిన నారగించి మహా ప్రస్ధాన కల్పముగాఁ బోయి గంగానదీ ప్రవాహములోఁ గల యుదును గాకాని నిశ్చయించుకొంటిని. ఆత్మాహత్య యసుర్య నరక ప్రాపక మన్న చింత రేగెఁగాని పండ వాదుల మహా ప్రస్దానము పాపాపాదకముగాఁ గాక పాపాపనోదకముగాఁ జెప్పుబదుట గోచరించి సమాధి గూర్చెను.
క్యూరేటరుగారు డిస్మిస్ చేయునందాఁక నెందుకు? నేనే రిజిగ్నేష౯ చీటి పంపుదునుగా కని నిర్ణయించుకొని అట్టి చీటి వ్రాసి చేత నంచుకొంటిని. తొమ్మిదిన్నర గంటలకు భోజనము చేసి నౌకరి చెల్లు చీటిని నాతో పటు నౌకరిలో చేరిన వాఁడు, నా యనరోగ్యమునకునాకంటె దుఃఖించుచుండువాఁ డు నగుమాస్తా యింటికి వెళ్ళి యిచ్చి వేయ నిశ్చయించు కొంటిని. హొటలుకు భోజనమునాకు బోగాజనార్దనుఁడు జబ్బుగా నంటి నని నాకై ప్రత్యేకముగా కారము లేకుండ చాల రుచ్యముగా కూరలు, పచ్చళ్ళు చేయించెను. ఆతఁడు మామూలుగానే చేయించె నేమో కాని నాకు మాత్రము నాఁటి భోజనము కొన్ని యేండ్లకు పూర్వ మెప్పుడయిన చేసియుందునో లేదో అన్నంత రుచ్యముగా నుండెను.కడుపార నారగించితిని. శరీరమున కుత్సాహము తోఁచెను. నరముల బలము చక్కబడినట్లయ్యెను.' నేఁ డాఫీసుకు పోయి పని చేయగల్గుదునా? జబ్బు కుదురునా? నేఁ డీ యుత్సాహ మేమి? ఏమో! డ్యూటిలో నుండఁజాలను. హరిద్వారము వెళ్ళ వలసినదే! గంగలోఁ గలయుట మాట అక్కడ నిర్ణయించుకొందును గాక!' ఇత్యాది విధముల యోచనలతో అక్బరు సా హెబు వీధిలో వచ్చుచుంటిని.
