Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 41

                                  

                     ఔషధసన్యాసము 

 

    అప్పడు మరల నంజుండరావుగారిని చూచితిని, ఆయన తిట్టి చివాట్లు పెట్టి నివు బ్రదుకఁదలచుకొనిన నిక నెవ్వరి యొద్దను మందులు పుచ్చుకోనక  స్వాస్ధ్యము కలుగుత కేండ్ల పా  టయినను నూరికి వెళ్ళి  యింటిదగ్గఱనె ఉంది పొమ్మని నిర్భందించెను. ఏవేవో మందు   లిచ్చెను గాని యవి కూడ  పని చేయలేదు. తలమీద పాము పోలా సూడినట్లు తోలుపోడ  లూడసాగెను.స్వగ్రామమునకు వచ్చివేసితిని, చల్లగా ఆహారము గోనుచుండగా  నుండగా కొన్ని నేలలు కామంటలు  కొంత తగ్గినవి, తొట్టె స్నానములు చేయ నారంభించితిని, కొన్నాళ్ళ  కాడి కొంత యుపకారక ముగా నున్నట్టుండెను.

    అప్పడే నానోట 'ఔషధసన్యాస' మన్న పలుకు పదింబదిగా  రాసాగెను. ఇక చచ్చినా సరే! ఏమయినా  సరే! మందులు పుచ్చుకోరాదు అన్న సంకల్పము ప్రబలముగా తోచాసాగెను. తెలియని శరీరంతర తంత్రములను సరిగా  నెఱుఁగక,ఔషదిగుణములు, నందు ననేకౌషధులు మిశ్ర మయిన మందుల గుణములు సరిగా నేఱుగక,వ్యాధి నిదానము సరిగా నేఱుగకయరకోఱయేఱుకతో గ్రుడ్డియెద్దు చెనబడ్డట్టు సాగుచున్న భేషజతంత్రముతో నింక చిక్కులందరా దని నిశ్చయించుకొంటిని, ఇంత వ్యాధి యున్నను దినములు, వారములు, నెలలు, ఏండ్లు నిద్ర లేక బాధ పడుచు సర్వవికరములతో  నున్నను  నా మనస్సుమాత్రము తార్మారు కాక, ప్రజ్ఞ చెడక, జ్ఞపకశక్తి  చెదరకసరిగానే ఉండెను, కాని స్ధిరముగా కూర్చుండి అరగంట సేపయిన చదువుట మొదలయిన మనః పరిశ్రమ చేయజాల కుంటిని, పదిదినముల కొకతూరి తీవ్రముగా చాలగా అదోమర్గమున వెడలుట, నాలుగు మూడు రోజులు కొంత శాంతిగా నుందుట, మఱల కడుపులో మంటలు , తాపము , నిద్రలేమి ఇత్యాదులు చెల రెగుటగా నుండెడిదిచాలని చప్పని యాహా రమే, తొట్టె స్నానమేనాకు గొంత శాంతి కరముగా నుండె డిది, ఆ తొట్టె స్నానములు చేయుట మూలమున ఆముదము పుచ్చుకొనుట క్రమముగా మానివేసితిని.

    ప్రతిదినము ఆంధ్రపత్రిక  చువుచునే యుంటినియుద్ద వార్తలు తెలిసికోనుచునే యుంటిని, దానిని చదువ కుండ నుండ లేను, నేటికి నంతే చదివియు నుండలేను, చదివినచో యుద్దమారణము  లనుభూయమనములుగా నుండేడివి, చదువకున్నచో యుద్దమున నేమి జరగుచున్నదో తెలియదాయెగా యన్నవ్యధ కల్గేడిది. పగల పండ్రెండు గంటలే కాక రాత్రి పండ్రెండు  గంటలుకూడ నిర్వ్యాపారముగా మెలకువతో, వ్యాకులతతో నింటిలో కొందఱ కేని యతృప్తితో నితరులు గుర్తింపరానంత తీవ్రవ్యాధితో సంక్షోభపడు తాయెను, కొని రాత్రులందు నన్నని తెర గప్పినట్లు నిద్రపోకుండేడి దేమోకానీ చీకటి వేసినను కనులు తేఱచునంత తేలికగా నుండేడిది, దని జూచి మా వారు కొందఱునిద్ర కొంత ఉన్నదనుచుండిరి.                
    అప్పటి నా తలపులలో నొక్కటి. ఏ పుణ్యాత్ముడేని ' ని విట్టి పాపకర్మము చేయుటచే ని వ్యాది ఏర్పడినది క్లోరోఫారంఇయ్యకుండ ఖడ్గముతో నీ కుడిచేతిని ఠస్సని  నఱెకి  వేయుడును. దానికి సమ్మతింతు వేని,ఆబాధ కొరవం గల్గుదు వేని, తర్వాత ని కుడి చేతి లేవడి  కిష్టపడుదు వేసి, చేతి నఱెకు మానదగినన్నాళ్ళకు ని వ్యాధి కూడ మాన్పింతును. చేతినిఱకువల్ల ని కపాయము రాదు, అంతట నీ కర్మతిరును' అన్నచో తక్షణమే అందుకు సిద్దపడగాలను అనుకోనుచుండెడి వాడను అంత  తీవ్ర మయినది నాబాధ. ఇట్లితరులతోను  చెప్పచుండువాడను క్షణక్షణము మరణయాతనయే. ' దిన దిన గండము' అనుకోనువాడను. ఆప్తె  మాట 'వేయ్యేండ్లా  యుస్సు' లోలో నెక్కడో తోచుటే కాని గుండెలలో వాక్యాకృతికి దానిని దెచ్చుటకు నోట నుచ్చరించుటకు దుఃఖించెడివాఁ డను! దినదిన గండముతో వేయేండ్లాయు స్సెందుకు? వేయేండ్లు కాదు. వేయి గంటలలయినను నెందుకు? అని బౌద్ద మతమువారు చెప్పుకోను పలుకులు " సర్వం దుఃఖం దుఃఖమ్ " " సర్వం క్షణికం క్షణికమ్" ' సర్వం స్వలక్షణం స్వల క్షణమ్ అనువాని రేధము సదా అనుభూతి కందు చుండెడిది. ఆ పలుకు నాల్కమిఁద మెదలుచుండెడిది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS