38. మంత్రాలకు బెణుకునొప్పులు పోతాయా?
సులోచన ఉదయానేనిద్రలేచింది. పైట సర్దుకొంటూయధాలాపంగా తల పక్కకు తిప్పబోయింది. కాని, 'అబ్బా' అంటూ ఆ ప్రయత్నం విరమించుకొంది. భరించలేని బాధ కలిగింది. ఒకప్రక్క మెడకండరాలు బిగదీసుకుని పోయాయి. తల కాస్త వంగి ఉంది. ఇటు_అటు తలతిప్పి చూడాలంటే నొప్పులతో చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నొప్పి భరించలేక ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
సులోచనకు మాదిరిగానే మరికొందరికి కూడా అప్పుడప్పుడు మెడబెణుకుతూ ఉంటుంది. అలాంటప్పుడు నిద్రలో మెడ "ఇరుకు" పట్టిందని చాలా మంది సరిపెట్టుకొంటారు. పైగా నిద్రలో పట్టిన ఇరుకు కనుక ఏ మందులు వాడినా ఫలితం ఉండదనీ, మళ్ళీ నిద్రలోనే తగ్గిపోతుందనీ భావిస్తారు. ఇదికేవలం అఫోహే. ఇంకొందరికి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా ఇరుకు పడటం చాలా అకస్మాత్తుగా జరుగుతుంది. అంతకు ముందు ఎటువంటి బాధా వుండడు. మెడ కండరాలు ఇరుకు పట్టడం శీతాకాలంలోఎక్కువ, ఈ కాలంలో "రుమాటినమ్" వల్ల, అదిసహజమే!
"ఎక్యూట్ రుమాటినమ్" వచ్చినప్పుడు ఎటువంటి శారీరిక అనారోగ్యం ఉండదు. ఒకవైపు మెడ కండరాలు బిగదీసుకుని పోతాయి. ఇటువంటి పరిస్థితి ముఖ్యంగా చల్లగాలివల్ల కలుగుతుంది. ఇలోయా ఇరుకుపట్టిన కండరాలు ముత్తుకుంతేనే సలవరం అనిపిస్తుంది. మెడ కండరాలు బిగపట్టాయని బలవంతంగా తల తిప్పడానికి ప్రయత్నించకూడదు. నొప్పి తగ్గడానికి టాబ్లెట్లు, రిలాక్స్ యిల్ అయింటుమెంటు పైన రాసి, వేడినీళ్ళతో కావడం పెడితే త్వరగా తగ్గిపోతుంది. ఈ చికిత్సతోపటు పూర్తీ విశ్రాంతి అవసరం. కొందరికి కాంపోజ్ లాంటి టాబ్లెట్లు వాడితే మానసిక అందోళన తగ్గడమే కాకుండా కండరాలు వదులుఅవుతాయి కూడా.
మెడకండరాలు ఇరుకు పట్టడమనేది కొందరిలో నిధానంగా వస్తుంది. ఇటువంటి వారిలో కండరాలు నిదానంగా బిగదీసుకుపోతూమెడ ఒక ప్రక్కకి వంగిపోతుంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితి న్యూరోసిస్ ఉన్న వ్యక్తుల్లో ఎక్కువ. వీరిలో తల ఒకవైపు బిగదీసుకుని వంగిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తల అటువైపు బిగదీసుకుని వంగిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తల అటువైపు "జెర్క్" ఇచ్చినట్లు ఊగుతుంది. ఇటువంటి "ఇరుగు" మామూలు కేసుల్లో లాగా త్వరగా తగ్గదు. అది తగ్గేవరకు బాధ కూడా ఉంటుంది.
గొంతుకలో టాన్సిల్స్, ఏదినాయిడ్స్ వాయడంవల్ల, మెడ దగ్గర గ్లాండ్స్ ఉబ్బడంవల్ల కూడా మెడ ఒకవైపు వంగినట్లు అయి, రెండవవైపు తిప్పలేక పోవచ్చు. అ వ్యాధి తగ్గిపోవడంతో మెడకండరాలు బిగదీయడం కూడా పోతుంది. మెడ దగ్గర ఉండే వెన్నుపూసల్లో వ్యాధి వచ్చినా, నరాల వ్యాధి వచ్చినా ఇరుకుపడుతుంది.
కొందరికి మెడకండరాలు బిగదీయవు. ఎటువంటి వ్యాధీ ఉండదు. కాని, వారు మెడ ఇరుకు పట్టినట్లు తల ఎటూ తిప్పలేక బాధ పడుతూ వుంటారు. ఇలాంటి పరిస్థితి కేవలం మానసిక బలహీనత, భయం వల్లనే.
పుట్టుకతోనే కొందరు పిల్లలకి ఇటుకుపట్టినట్లయితల ఒకవైపుకి వంగి వుండడం, తల తిప్పలేక పోవడం వుంటుంది. ఇలా ఉండడానికి కారణం, కాన్పు సమయంలో మెడ దగ్గర కండరాలు దెబ్బతినడం, లేదా వెన్నుపూసలు తొలగడం. ఇంకొందరు పిల్లలకి కొద్దిగా ఎదిగిన తరువాత, మెడ వంకరవుటుంది. వారిలో ఒక వైపు మెడ కండరాల్లో కణితి ఏర్పడి, సాగకుండా బిగాదీసుకుని పోతుంది. ఇరుకుపట్టినప్పుడు మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయాలేగాని, ఇరుకు పట్టిందంటూ, బెణుకు మంత్రాలు వేయిస్తూ కూర్చోవడం అర్ధంలేని పని.
