తా: మయూరహస్తము ముందుప్రక్కను వెనుకప్రక్కను పట్టబడినయెడల జేష్టభ్రాతృ హస్తమగును. ఇది అన్నదమ్ములయందు వినియోగించును.
విప్రకీర్ణ హస్త లక్షణములు వినియోగములు 27
-: విప్రకీర్ణ హస్త లక్షణము :-
శ్లో!! హస్తౌతు త్రిసతాకాఖ్యాతిర్యక్కూర్పర సంయుతౌ !
కధ్యతేవి ప్రకీర్ణ్కోయం హస్తోనాట్య విశారదైః !!
తా: రుండు త్రిపతాక హస్తముల మోచేతులను అడ్డముగా గూడబట్టినయెడ విప్రకీర్ణ హస్తమగును.
వినియోగములు :-
శ్లో!! కవచేచ కరన్యాసే మంత్రావాహేక్షమాగుణే !
విచారేచ ప్రయోక్తవో విప్రకీర్ణ ఇతీరితః !!
తా: కవచము కరన్యాసము మంత్రావాహనము క్షమాగుణము విచారము వీనియందు యీ హస్తము వినియోగించును.
-: గజదంత హస్త లక్షణము :-
శ్లో!! కరధ్యాం శిఖరౌ దృత్వా కనిష్టే ప్రసృతేయది !
గజదంతకరః ఖ్యాతః కరోభరత వేదిభిః !!
తా: రెండు శిఖర హస్తములును చిటికెనవేళ్ళు చాచిపట్టినయెడ గజదంత హస్తమగును.
శ్లో!! జలావగాహేద్విరద దంతయోర్చూఘి మానయోః !
శంజ్కుస్థాపనభావేషు గజదంతోని యుజ్యతే !!
తా: నీళ్ళయందు మునుగుట, ఏనుగు కొమ్ములు, భూమిమానము, శంఖుస్థాపన చేయుట వీనియందు వినియోగించును.
-: తాలముఖ హస్తలక్షణము :-
శ్లో!! కరౌ పకాక నామానౌ అన్యోన్యాభిముఖేకృతౌ !
చలితౌ చేత్తాలముఖః, ప్రోక్తో భరతవేదిభిః !!
తా: రెండు పతాక హస్తములు ఎదురెదురుగాబట్టి చలింపజేయునెడ తాలముఖ హస్తమగును.
శ్లో!! భుజజ్గ సూక్ష్మనాడ్యేచ ముఖనాట్యేచ మేళనే !
గ్రహేస్థూల పదార్ధేచ తాలవక్త్రోఅభిదీయతే !!
తా: భుజంగనాట్యము, ముఖనాట్యము, కూడిక, గ్రహించుట, లావైన పదార్ధము వీనికి చెల్లును.
-: సూచివిద్ధ హస్త లక్షణము :-
శ్లో!! అన్యోన్యమభిపంస్కృష్టౌ సూచీవక్త్రాభిధౌకరౌ !
సూచీవిద్ధకరస్స్కోయం, నృత్తహస్తానుసారభిః !!
తా: రెండు చూచిముఖ హస్తములు ఎదురెదురుగా చేరబట్టబడునేని సూచివిద్ధ హస్తమగును.
శ్లో!! హల్లీ సలీనాభినయేలగ్నార్థేమేళనేదృడే !
శాఖాద్వయస్య సంయోగే సూచీవిద్దకరో భవేత్ !!
తా: కోలాటమునందలి కలగలుపు, చేరిక, గట్టిది, రెండుకొమ్మల చేరిక వీనియందు ఈ హస్తము చెల్లును.
-: పల్లవహస్త లక్షణము :-
శ్లో!! పతాకౌమణి బంధేతుచిలితౌ చేదహోముఖౌ !
కర!!పల్ల పనామ్కాయం యుజ్యతేనాట్యవేదిభిః
తా: పతాక హస్తములు క్రిందుమొగలోగా, మనికట్లు పట్టబడిన యెడల పల్లహస్తమగును.
శ్లో!! భలపుష్పాతిభారేణ నమ్రశాఖానులమ్బనే !
నమ్రతార్థేనియోక్తవ్యః పల్ల వస్స్కోభీధీయతే !!
తా: పుష్పఫలాదులచే వంగిన కొమ్మలు వ్రేలాడుట, వంగుట వీనియందు ఈ హస్తము చెల్లును.
-: నితమ్బ హస్తలక్షణము :-
శ్లో!! అం సందేశం సమారవ్వ నితమ్బానధిచాలితౌ !
పార్శ్వయోన్తు పతాకౌద్వౌ నితమ్బకర ఉచ్యతే !!
తా: రెండు పతాక హస్తములు మూపులు మొనలుకొని పిరుదుల దాకా వ్రక్కలలో కదలుచున్నట్లు వట్టబడినయెడ నితమ్చహస్తమగును.
శ్లో!! పరివేషేచ సూర్యేన్ద్వోరజ్గలావణ్య దర్శనే !
స్రాకారా దేవతానాంచనైపధ్యే భ్రమణేపిచ !
పార్శ్వ సౌందర్య భావేచ నితమ్చాఖ్యాకరో భవేత్ !!
తా: సూర్యచంద్రుల పరివేషము, చక్కధనము, ప్రాకారము, దేవతాదుల వేషము, భ్రమించుట, ప్రక్కల చక్కదనము వీనియందు ఈ హస్తము చెల్లును.
