Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 41

    ఆడదానికి భర్తా, లేదా ప్రేమించిన మగవాడితోనే అలంటి ఫీలింగ్స్ కలుగుతాయా? వేరే ఎవరితోనూ కలగవా?
    ఇంతకీ నేను ఈమేకి భర్తనా? ప్రేమించిన మగవాడినా??"

    ఆ తన ఆలోచనలకి చికాకు పుట్టింది రాంపండుకి.

    ఆ హయైన ఫీలింగ్ ని అనుభవించకుండా ఎంతా పిచ్చి ఆలోచనలు అని తిట్టుకున్నాడు.

    తన అరచేతిని మెల్లగా ఎత్తి ఆమె అర చేతి మీద వేశాడు. ఆమె తన చేతిని ఒక మిల్లీ మీటర్ కూడా కదపలేదు.

    రాంపండు మోహం వెచ్చగా మారింది.

    తన కాలుని ఆమె వైపుకి ఒరిగించి కూర్చున్నాడు.

    ఇప్పుడు అతని మోకాలు ఆమె మోకాలుకీ తగుల్తుంది!
 
    అతని శరీరంలో విధ్యుత్ప్రాకినట్టు అయ్యింది. అతనికి తెల్లవారుఝామున తనకి వచ్చిన కల గుర్తుకు వచ్చింది.

    "ఈ చీకట్లో వైష్ణవి ని గట్టిగా ముద్దుపెట్టుకుంటెనో?" అనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు.

    హాఠాత్తుగా హాలంతా కోలాహాలం.

    ఉలిక్కిపడి స్క్రీన్ వంక చూశాడు. 'విశ్రాంతి' అన్న పదం కనిపించింది. కూల్ డ్రీంగ్స్  వాళ్ళు అరుస్తూ అతీ ఇటూ తిరుగుతున్నారు.

     హాల్లో లైట్లు వేలుగుతున్నాయ్... అవి ఎప్పుడు వేలిగాయో కూడా అతనికి తెలీదు.

    చటుక్కున ఆమె చేతి మీది నుండి తన చేతిని తీసేసి కాలు కూడా దూరంగా జరుపుకున్నాడు రాంపండు.

    "కూల్ డ్రింక్ త్రాగుతావా?" అడిగాడు రాంపండు.

    "వద్దు... సినిమా ఎలా వుంది?" అడిగింది వైష్ణవి.

    "చాలా బాగుంది!" అన్నాడు రాంపండు.

    "కానే భలే సస్పెన్స్ తో ఇంట్ర వెల ఇచ్చాడేం.... ఆ రెండో హీరోయిన్తో తిరిగేది తన భర్తే అని హీరోయిన్ కి తెలిసిపోయింది.... ఇప్పుడెం చేస్తుందో?"

    "అవునా!"

    "అవునా అంటారేం.... మీరు చూద్దాం లేదా...?అడిగింది వైష్ణవి.

    "ఎందుకు చూడ్డంలేదు... చూస్తున్నా... చూస్తున్నా... ఊర్కే అలా ఉన్నా..."

    "అవునుగానీ మీ మోహం ఏంటి అలా వుంది?" అడిగింది అతని మోహం వంక పరీక్షగా చూస్తూ.

    రాంపండు వులిక్కిపడ్డాడు.

    "ఎలా వుంది?" అడిగాడు.

    "అదోమాదిరిగా వుంది."

    "ఆడవాళ్ళు మంచి నటులు" పళ్ళు కొరికాడు అతను.

    జేబులోంచి కర్చీఫ్ తీసి మోహం గట్టిగా తుడిచేసుకుని..."అవునా?" అంటూ పకపకా నవ్వాడు.

    కర్చీఫ్ తో మోహం తుడుచుకుంటే ఫీలింగ్స్ చెరిగిపోతాయా?

    వైష్ణవి హాల్లోని జనాన్ని గమనిస్తూ కూర్చుంది.

    అతనికి ఆ సమయంలో రాజీ గుర్తుకు వచ్చింది.

    కసిగా నవ్వుకున్నాడు.

    'ఏం రాజీ లేకపోతే నాకు జరగడా...? తనకే ఎవరూ లేరు! నాకు వైష్ణవి వుంది... ఇప్పుడు ఇఇహాల్లో ఇద్దర్నీ రాజీ చూడాలంట!'అనుకున్నాడు.

    రాజీ సంగతి అలా వుంచి ఎవరైనా తెలిసినవాళ్ళు చూస్తె...? అమ్మో ఇంకేమైనా వుందా??

    సై ఆలోచన రాగానే అతను అనుమానంగా హాలంతా కలియజూశాడు. ముందు వైపు తెలిసిన వాళ్ళు ఎవరూ వున్నట్టు అనిపిమ్చాల్డు. మెల్లగా తల త్రిప్పి వెనక్కి తిరిగి చూశాడు.

    రాంపండు గుండె ఒక్కక్షణం ఆగినట్టు అయ్యింది. రెండు వరసల వెనకాల సర్వోత్తమరావు కూర్చుని వున్నాడు ప్రక్కనే వాళ్ళావిడ అయ్యుండోచ్చు.

    సర్వోత్తమరావు ఎప్పటినుండీ చూస్తున్నాడో ఏమోమరి... రాంపండునే చూస్తున్నాడు. రాంపండు వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరి చూపులూ కలిశాయి.

    రాంపండు తల గిరుక్కున త్రిప్పేసి సీట్లో సర్రున క్రిందకి జారిపోయి కూర్చున్నాడు.

    "ఏంటి...? ఏమైంది...?? ఎవరు???" అంటూ వెనక్కి తిరిగి చూసింది వైష్ణవి.

    "ఏం లేదు... ఎవరూ లరు. ఇందాకటినుండీ నిటారుగా కూర్చుని నడ్డి నోప్పోచిందన్నమాట? అందుకే ఇలా క్రిందకి జారిపోయి కూర్చున్నాను" తడబడుతూ అన్నాడు రాంపండు.

    అంతదాకా వెచ్చగా, హాయిగా వున్నా రాంపండు శరీరం చల్లబడి పోయింది.
   
                                           *    *    *    *
   
    "సార్! మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు!!" ప్యూనొప్పి రాంపండుకి చెప్పాడు.

    అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది. అసలు ఆఫీసుకు వచ్చీరాగానే సర్వోత్తమరావు తనని పిలుస్తాడేమోనని అనుకున్నాడు కానీ అతను రాంపండుని పిలవకుండా టెన్షన్ లో పెట్టాడు. ఎందుకు పిలుస్తాడు... ఎప్పుడు పిలుస్తాడు అని ఒక్క ప్రక్క టెన్షన్ కి ఫీలవుతూ కూడా రాంపండుకి మనసులో చిన్న ఆశ.

    ఒకవేళ సర్వోత్తమరావు ధియేటర్లో తనని చూళ్ళేదేమో...? అతను చూశాడని తను భ్రమపడుతున్నాడేమో....!!? చూస్తె ఈపాటికి పిలవకుండా పోతాడా...?

    రాంపండు మెల్లగా సర్వోత్తమరావు క్యాభిన్ లోకి వెళ్ళాడు.

    "పిలిచారా సార్?" అడిగాడు రాంపండు.

    అయన తలెత్తి పైకి చూశాడు. "లేదే...! ఆ ప్యూన్ గాడు వూరకే పిలిచి వుంటాడు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS