"చెబుతాను కానీ -- మీకింకో పనేమీ లేదు కదా కనీసం కొన్ని గంటల కాలం మీతో గడపవలసి ఉంటుంది" అన్నాను నేను. అతను నవ్వుతూ వాచీ చూసుకుని "ఇప్పుడు సమయం ఆరున్నరయింది. పది గంటల వరకూ మాకింకే పనీ లేదు" అన్నాడు.
నేను అతని వంక అనుమానంగా చూసి "రాత్రి పది గంటలకు పని ఏముందండీ?" అన్నాను. అయితే ఇతడే గదా నాక్కావలసిన వ్యక్తీ అన్న ఆనందం కూడా ఆక్షణంలో కలిగింది.
అతనీసారి పగలబడి నవ్వాడు. "రాత్రి పది గంటలకా? పని ఏమిటంటారా?" అతనింకా నవ్వుతూనే "నిద్రపోవడం, ఏ పరిస్థితుల్లోనూ నేను నిద్ర ఆపుకోలేను" అన్నాడు.
నాకూ నవ్వు వచ్చింది. కానీ భయం కూడా వేసింది. ఒకవేళ నేననుకుంటున్న వ్యక్తీ ఇతడు కాదేమోనని. ఏమైనా ప్రస్తుతానికింక చేసేదేమీ లేదు. అతనితో ఎలాగో అలా కాలక్షేపం చేయాలి. పదిగంటలకు అతన్ని....
జీవితంలో ఇంతవరకూ ఎన్నో పనులు చేశాను కానీ నాకు అర్ధం కాని , నాకు తెలియని పనులు చేయలేదు. ఇప్పుడు నేను చేసేపని ఏమిటో నాకే తెలియదు. అయితే ఎందుకు చేస్తున్నానో మాత్రం తెలుసు.
ఆపని చేస్తే నాకు పదివేలు ముడుతుంది. అ డబ్బుతో వ్యాపారం ప్రారంభించి గొప్ప లక్షాధికారిని కావచ్చు. అయినా నేను చేయబోతున్నది పెద్ద నేరమేమీ కాదు.
"ఏదో పని ఉందన్నారు. మీరేం మాట్లాడడం లేదు" అన్నాడు వీర్రాజు నేను నవ్వి "ఈరోజు ఎందువల్లనో అన్యమనస్కంగా ఉన్నానండీ" అన్నాను.
"మీకు అలానే ఉందా? నాకూ అంతే. 13 వ నెంబరు బస్సు ఎక్కాలనుకుని 17 వ నెంబరు బస్సెక్కాను. విషయం గమనించేక దిగిపోయి -- తర్వాత బస్సులో ఎక్కాను. అలాగే లక్కీస్త్రీటు దగ్గర దిగాలనుకుని మరిచిపోయి కొంచెం దూరం వెళ్ళిపోయాను."
"ఏదో కారణముండి ఉండాలి. అందుకు?" అన్నాను.
"మీకూ అన్యమనస్కంగా ఉందంటూన్నారు గదా. అందుకేదైనా కారణముందా?" అంటూ ఎదురు ప్రశ్న వేశాడు వీర్రాజు. "అసాధ్యుడే" అనుకున్నా నేను.
"చెప్పాను గదా మీతో పని ఉందని. దాని గురించే అన్యమనస్కంగా ఉన్నాను" అన్నాను.
"ఆ పని ఏమిటో చెప్పారు కాదు."
"మీరు పనిచేస్తున్న బ్యాంకు కు నేను నలభై వేల రూపాయలకు లోన్ అప్లికేషన్ పెట్టుకున్నాను. " అన్నాను. అతను నవ్వి , "అంత డబ్బెందుకు మీకు?" అన్నాడు.
"వ్యాపారం చేద్దామని."
"ఏం వ్యాపారం?"
"ఈపాటికి మీకది చేరే వుండాలి. అందులో వివరాలన్నీ ఉన్నాయి."
"మీకేదైనా ఆస్తి వుందా. ఏ గ్యారంటీ లేనివాళ్ళకు మా బ్యాంకు డబ్బివ్వదు."
"మీ బ్యాంకేమిటి ఏ బ్యాంకు ఇవ్వదని నాకు తెలుసు. అందుకే మీ దగ్గరకు వచ్చాను."
"నేనా? అందులో ఒక సామాన్య గుమస్తాని. నా చేతుల్లో ఏముంటుంది?"
నేను అదోలా నవ్వి "మీరు గుమస్తా కావచ్చు కానీ సామాన్య గుమాస్తా కాదు. మీవల్ల తప్పక నా పని అవుతుంది" అన్నాను.
"అవదు" అన్నాడతను ఖచ్చితంగా.
"బాగా ఆలోచించుకోండి. నాపని సక్రమంగా జరిగితే మీ చేతులు తడుస్తాయి డబ్బుతో. జరక్కపోతే నా చేతులు తడుస్తాయి రక్తంతో" ఈసారి నా మాటలు చాలా కటువుగా ఉన్నాయి.
"బెదిరిస్తున్నారా?' అన్నాడతను నిర్భయంగా.
"నేను మాటల మనిషిని కాను. చేతల మనిషిని" అంటూ జేబులోంచి రివాల్వర్ ఒకసారి బయటకు తీసి అతనికి చూపించి మళ్ళీ జేబులో పెడేశాడు. ఈసారి అతని కళ్ళలో భయం స్పష్టంగా కనబడింది. "నిజంగా నా చేతుల్లో ఏమీ లేదు. కానీ మీకు అప్పు దొరికేదారి చెప్పగలను --" అన్నాడు నెమ్మదిగా.
"నాకు మాటలు వద్దు - చేతలే కావాలి ?" అన్నాను.
వీర్రాజు మాట్లాడలేదు. కొద్ది క్షణాలు గడిచేక - "నేను బాగా ఆలోచించుకోవాలి. కొంచెం గడునివ్వండి." అన్నాడు.
నేను చేతి వాఛీ వంక చూసుకున్నాను. "ఇప్పుడు టైము ఏడున్నర దాటింది సరిగ్గా పది గంటలకు మీ నిర్ణయం చెప్పండి. అంతవరకూ నేను ఇక్కడే ఉంటాను."
అతను ఒక్కక్షణం సందేహించి - "ఈరోజు ఎనిమిది గంటలకు నా స్నేహితురాలు వస్తుంది. చాలా కాలం తర్వాత అది ఇక్కడకు వస్తోంది. ఒక్క గంట దానితో గడపనివ్వండి- " అన్నాడు.
"స్నేహితురాలంటే కాబోయే భార్యా!" అన్నాను.
అతని ముఖంలో చిరునవ్వులు చిందాయి. "కాదు, నాకు వివాహమైంది. నా భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది. ఇది నేను కులాసాగా గడపడానికి ఎన్నుకున్న గది. భార్య ఊళ్ళో లేనప్పుడు ఇక్కడ గడుపుతుంటాను" అన్నాడు.
నా ఒళ్ళు మండిపోయింది. సామాన్యంగా కనిపించే ఈ వీర్రాజు పెద్ద హీరో . "భార్య వుండగా అలాంటి పని తప్పు కదూ?' అన్నాను.
"భార్య లేకపోతె తప్పు లేదా?" అంటూ వెకిలిగా నవ్వాడు వీర్రాజు. 'అయినా ఈరోజు వస్తున్న పిల్ల చాలా అందంగా ఉంటుంది. వారం రోజుల్నించి నన్ను కలుసుకోవాలని వేధిస్తోంది. దానికి తెలుసు నా భార్య వుందని."
"సరే అయితే . కానీ నేనిక్కడే వుంటాను" అన్నాను. అతను ప్రార్ధనా పూర్వకంగా నా వంక చూసి "ఆ తలుపు తీస్తే దీన్నానుకునే ఒక గది వుంది. మేము ఆ గదిలో గడుపుతాం" అన్నాడు. నేను అతన్ని తీసుకుని ఆ పక్క గదిలోకి వెళ్ళాను. వెధవ - ఆ చిన్న గదిలో నీటుగా మంచం అదీ ఆరెంజి చేసుకున్నాడు. అన్నింటికీ సిద్దంగా ఉన్నాడు.
"బాగానే ఉంది , కానీ మిమ్మల్ని నేను అనుక్షణం గమనిస్తూనే ఉంటాను. ఏ క్షణంలో ఏ వెధవ పనిచేయడానికి ప్రయత్నించినా ఏం చేస్తానో తెలుసు కదా - మిమ్మల్ని గమనించడం నా కిష్టం లేకపోయినా నా జాగ్రత్త కోసం తప్పదు మరి - అభ్యంతరమా ?" అన్నాను. అభ్యంతరం చెప్పే సాహసం వాడి కెక్కడిది?"
ఎనిమిది అవుతుండగా ఎవరో తలుపు తట్టారు.
నేను అక్కడున్న బీరువా చాటుకు నక్కాను. కానీ నా రివాల్వర్ ఏ క్షణంలో నైనా పెల్తుందన్న భయం వీర్రాజు కు వుంది.
ఒక ఆడది లోపలకు వచ్చింది. ముఖం చూసేలోగా వెనక్కు తిరిగింది. వాడు తలుపులు వేశాడు. వాడి ముఖం నాకు కనబడుతోంది. ఆమె వాడి వైపు తిరిగి వుంది. ఏం మాట్లాడడం లేదు.
వాడు ఆమెను సమీపించి "ఈరోజు వద్దు - రేపు?" అన్నాడు.
ఆమె గారంగా "ఊహు" అంది.
"రేపు తప్పకుండా - అయినా మా ఆవిడ మరో పది రోజుల దాకా రాదులే. రేపట్నించి వరుసగా పది రోజులు..."
ఆమె ఈసారి నావైపు తిరిగింది. ముఖానికి చిన్న పరదా వుంది. మనిషి మాత్రం చాలా సౌష్టవంగా వుంది. ఆడదంటే అమెఅడది అనిపించేలా ఉంది. ఆమెను చూస్తుంటే నాకో ఉద్రేకం కలిగింది.
వీర్రాజు తాపీగా కుర్చీలో కూర్చున్నాడు. "అ గదిలో మంచాముంది. పోయి కాస్సీపు పడుకో" అన్నాడు.
ఆమె మాట్లాడకుండా ఆ గదిలోకి వెళ్ళింది. మరో పది నిముషాల అనంతారం, "వీర్రాజు "అంటూ పిలిచింది. ఆ కంఠం కొంచెం బొంగురుగా ధ్వనించింది. ఆ బొంగురు కంఠం కావాలనే తెచ్చి పెట్టుకున్నట్లనిపించింది నాకు.
వాడు వెళ్ళాడు. వాడా చిన్న గదిలోకి వెళ్ళగానే నేనూ ఆ తలుపు దాకా వెళ్ళాను.
తలుపు బార్లా వేసి వున్నా చూడ్డానికి చిన్న కంత వుంది. కంత ద్వారా చూశాను. ఆమె వీపు కనబడుతోంది. మనిషి పూర్తిగా నగ్నంగా ఉంది. "దా వీర్రాజు" అంటోందామె.
వాడు లేచాడు. ఉద్రేకంగా ఆమెను కౌగలించుకున్నాడు. నా మనసు కూడా ఉద్రేక పడింది. వీర్రాజును తప్పించి ఆ స్థానంలో నేనుండాలన్న కోరిక కలిగింది ఆ క్షణంలో.
వాడు రెండు చేతుల్తో ఆమె ముఖాన్ని తన ముఖానికి కలిపాడు. ఇద్దరూ మంచం మీద వాలిపోయారు. ఆమె నగ్నంగా వెల్లకిలా పడుకుని ఉంది. వాడి ముఖం ఆమె ముఖాన్ని కప్పేసింది.
ఆమె శరీరం నా ఒంటిని కాల్చేస్తోంది. అలాగే చూస్తున్నాను. వాడి చేతులు నెమ్మదిగా ఎక్కడెక్కడికో పాకుతున్నాయి.
ఆమె సడన్ గా లేచింది. "మరి నే వెడతాను" అంది. "వీల్లేదు" అన్నాడు వాడు.
అప్పుడే నాకేమే మొహం కనిపించింది. ఒక్క క్షణం కాళ్ళూ చేతులు ఆడలేదు.
ఆమె సునీత! నా ఏకైక సోదరి సునీత.
షాక్ తిన్న నేను అప్రయత్నంగానే అలా ఆ దృశ్యం చూస్తూ వుండిపోయాను.
ఆమె చీర కట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. వాడు వరిస్తున్నాడు. ఆమె అంటోంది. "నా పని అయిపొయింది. మరేమైనా దుర్మార్గానికి ఒడి కట్టావో, మా అన్నయ్య కాల్చేస్తాడు జాగ్రత్త!"
ఆ మాటలు వాణ్ణి ఆపలేదు. వాడు సునీత ఒంటి మీద చేయి వేస్తూనే వున్నాడు. లొంగ దీసుకుందుకు బలప్రయోగం చేస్తూనే వున్నాడు.
సునీత మాటలు నామీద పనిచేశాయి. అప్రయత్నంగా నా జేబులోంచి రివాల్వర్ తీశాను. తలుపులు తెరిచి వీర్రాజుకి గురి చేశాను.
"అగు!" అని అరిచాను. వీర్రాజు ఆగలేదు. వాడు మంచి కైపులో వున్నాడు.
రివాల్వర్ "ధాం!" అంటూ పేలింది. 'అమ్మో!" అంటూ వీర్రాజు నేల కూలాడు.
ఆ హటాత్పరిణామానికి ఆశ్చర్యపోతూ సునీత నన్ను చూసి తెల్లబోయింది. కానీ సునీత నన్నిందాకనే చూసి వుంటుందని నా అనుమానం. లేకపోతే అంతవరకూ బరి తెగించి వీర్రాజును ఆహ్వానించి, హటాత్తుగా ఇంక నా జోలికి రాకు అనడంలో అర్ధమేముంది?
