Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 41

 

                   హంతకుడూ , హతుడూ ఒకటైనారు!

                                                                     వసుంధర
    
    "జాగ్రత్తగా పరిశీలించి చూడు. అతనే వెంకటాద్రి !" అన్నాడు అతను'.
    అటువైపు చూశాను. పంచె కట్టి పైన పొడుగు చొక్కా వేసుకున్న ఆ వ్యక్తీ అతి సామాన్యంగా కనిపించాడు నాకు. దుస్తుల్లోనే కాదు - పర్సనాలిటీ లో గానీ, నడిచే తీరులో గాని , ముఖ కవళికల్లో గానీ ఏమాత్రమూ ప్రత్యేకత లేని వ్యక్తీ వెంకటాద్రి.
    'అతనేనా ?" అనుమానంగా చేయి పెట్టిచూపించి అడిగాను.
    "అలా చేయి పెట్టి చూపించకు. అతనేలే!" అన్నాడతను. "ఇప్పుడతను మరో నాలుగడుగులు వేసి కుడి ప్రక్క సందులోకి మళ్లుతాడు. అక్కడ 13 వ నెంబర్ బస్సు ఎక్కి లక్కీ స్ట్రీట్ దగ్గర దిగుతాడు. లక్కీ స్ట్రీటు లో తిన్నగా వెడితే - నాలుగు ఎలక్ట్రిక్ స్తంభాలు దాటేక వెంకటాద్రి ఇల్లు వస్తుంది. ఇంటిముందు అతని నేమ్ ప్లేట్ ఉంటుంది -"
    అతను ఆగాడు. ఈ అవతారానికి నేమ్ ప్లే లొక్కటే తక్కువ అనుకుంటూ నవ్వుకున్నాను. "గుర్తిందిగా -బస్సోచ్చేటైమైంది . అతన్ని ఫాలో చేసి అన్నీ గమనించు. ఆ తర్వాత ఈరోజు రాత్రి పది గంటలకు...."
    "గుర్తుంది -" అన్నాను.
    "గుడ్ !' అని అతను వెళ్ళిపోయాడు.
    ఒకోసారి ఏ ప్రత్యేకతా లేని వ్యక్తులు చాలా బాగా గుర్తుండి పోతారు. నేను కుడిప్రక్క సందులోకి బస్ స్టాపు దగ్గరున్న వెంకటాద్రి ని బాగానే గుర్తుపట్టాను. అయితే అతను నన్ను గుర్తు పట్టకూడదు. అందుకే సాయం సమయంలో కూడా నేను నా కూలింగ్ గ్లాస్ ని తీయలేదు. అయినా అతను నన్ను చూడను లేదు.
    13 వ నంబరు బస్సు వచ్చింది. అక్కడున్న వారందరూ హడావుడిగా బస్సు దగ్గరకు పరుగేడుతున్నారు. నేనూ కంగారుగా పరుగెత్తాను. అయితే బస్సు కదిలేముందు తటాలున దూకవలసి వచ్చింది. ఎందుకంటె వెంకటాద్రి ఆ బస్సు ఎక్కలేదు.
    నేను బస్సులోంచి దూకేసరికి వెంకటాద్రి స్టాపు దగ్గర కనబడలేదు. గుండె గుబీలు మంది. ఏమయ్యాడు వెంకటాద్రి? ఒకవేళ నేను పొరబడ్డానా? అతను 13 వ నెంబరు బస్సులో వెళ్ళిపోయాడా?
    కానీ అలా జరగడానికి వీల్లేదు. నేను అతను బస్సు స్టాపు లోనిలబడి ఉండటం కళ్ళారా చూసేకనే - జనం మధ్య లోంచి తోసుకుని పుట్ బోర్డ్ దాకా వచ్చి - బస్సులోంచి దూకడం జరిగింది. అయితే వెంకటాద్రి మాయమవడానికి మరో దారి కూడా ఉంది. నేను 13 వ నెంబరు బస్సులో ఉండగా 17 వ నెంబరు బస్సు వచ్చింది. వెంకటాద్రి అది ఎక్కి ఉండవచ్చు.
    అయితే ఇప్పుడెం చేయాలి?అసలు - వెంకటాద్రి అని నేను అనుకుంటున్న వ్యక్తీ వెంకటాద్రియేనా? ఎందుకంటె వెంకటాద్రి 13 వ నెంబరు బస్సు ఎక్కుతాడని అతను చెప్పాడు. ఏ పరిస్థితుల్లోనూ అతను తప్పు చెప్పడు.
    అయినా నేనొక పెద్ద పొరపాటు చేశాను. వెంకటాద్రి ఎక్కేవరకూ ఆగకుండా ముందుగా ఆ బస్సు ఎక్కితే - అతనికి ఏ అనుమానమూ రాదనుకున్నాను. అతి తెలివికి పొతే అసలుకే మోసమయింది. అంతలోనే నాకు అనిపించింది - ఇప్పుడు కొంప ములిగిందేముంది? అసలు వ్యవహారం రాత్రి పదిగంటలకుగదా. ఈలోగా ఇందాక అతను చెప్పిన గుర్తుల ప్రకారం మరో బస్సులో వెళ్ళి వెంకటాద్రిని కలుసుకోవచ్చు.
    అనుకుంటుండగానే 13 వ నంబరు బస్సు వచ్చింది. ఎక్కాను. లక్కి స్ట్రీట్ కు టికెట్ అడిగాను. బస్సు వేగంగానే కదిలి పది నిముషాల్లో నన్ను లక్కీ స్ట్రీటు కు చేర్చింది. దిగబోతూ ఆగిపోయాను. బస్సులో వెంకటాద్రి ఉన్నాడు.
    ఎలా వచ్చేదీ వెంకటాద్రి! లక్కీ స్ట్రీటు దగ్గర దిగడెం? ఏం చేయాలో తెలియకపోయినా దిగకుండా ఆగిపోయాను. వెంకటాద్రి బస్సులోకి ఎలా వచ్చి ఉంటాడో అర్ధమైంది నాకు. బస్సు స్టాపు కు వంద గజాల పైగా దూరంలో ఒక మార్కెట్ ఉంది. 13 వ నంబరు బస్సు ఆ మార్కెట్ మీదుగా నేనెక్కిన సందులోకి వస్తుంది. మార్కెట్లో కొనుక్కోవలసినవేవో వెంకటాద్రి కి గుర్తుకు వచ్చి ఉంటాయి. అందుకని త్వరత్వరగా అక్కడికి వెళ్ళి కొనవలసినవి కొనుక్కుని అక్కడే బస్సు ఎక్కి ఉంటాడు. అంతవరకూ బాగానే ఉంది. మరి లక్కీస్త్రీటు లో దిగడెం?
    నా పని అంత సులభంగా నెరవేరేలా అనిపించడం లేదు. వెంకటాద్రి అనుకున్నంత సామాన్యుడిలా కనిపించడం లేదు నాకిప్పుడు. అందుకే అతన్ని బాగా పట్టిపట్టి గమనిస్తున్నాను నేను.
    లక్కీ స్ట్రీటు దాటేక రెండు స్టాపులు వచ్చేయి. వెంకటాద్రి కదలడం లేదు. "ఎక్కడికి సార్?" అంటూ కండక్టర్ నా దగ్గరకు వచ్చేడు. ఏం చెప్పాలో తెలియక బస్ టెర్మినల్ దాకా టికెట్ తీసుకున్నాను. నేను టికెట్ తీసుకుంటుండగా మరో స్టాపు వచ్చింది. కండక్టర్ నాకు చిల్లర ఇస్తుంటే లెక్క పెట్టుకుంటున్నాను. బస్సు ఆగింది. వెంకటాద్రి దిగిపోయాడు. మళ్ళీ బస్సు కదిలింది.
    ఏం చేయాలో తోచలేదు. "బస్సు అపు" అన్నాను కండక్టర్ తో. కండక్టరు నవ్వి 'మీస్టాపు ఇంకా చాలా దూరం ముంది సార్" అన్నాడు. జవాబు ఎమివ్వాలో తోచలేదు కానీ తర్వాతి స్టాపులో బస్సు దిగిపోయాను కండక్టరు వారిస్తున్నా వినకుండా.
    అయితే నా వెర్రి గానీ చేజారిపోయిన వెంకటాద్రి దొరుకుతాడా? అయితే ఏ మూలో ఆశ అతను లక్కీ స్ట్రీటు లో తప్పక దొరుకుతాడని చెబుతోంది. అందువల్లనే నేను అప్రయత్నంగా లక్కీ స్ట్రీటు వైపు నడిచాను. అనుకోకుండానే ఆ వీధిలో నాలుగవ ఎలక్ట్రిక్ స్తంభం" దగ్గర ఆగాను. అక్కడ "యం. వెంకటాద్రి" అన్న నేమ్ బోర్డు గల ఇల్లు కనబడింది. నాలో ఉత్సాహం రేగింది. ఆ ఇంటికి తాళం వేసి లేదు. వెంకటాద్రి వచ్చాడో, లేదో కనుక్కోవచ్చు. వెళ్ళి తలుపు తట్టాను.
    తలుపు తెరచుకుంది. ఎవడో గళ్ళ లుంగీ, చారాల షర్టు వేసుకుని వున్నాడు.
    "వెంకటాద్రిగారున్నారా?" అని అడిగాను.
    "ఎందుకు?" అన్నాడు. కంఠం మృదువుగా లేదు.
    "ఆయనతో చిన్న పని వుంది?"
    "ఏమిటా పని? " అన్నాడు. కంఠలో మృదుత్వం మరి కొంచెం తగ్గింది.
    "అది ఆయనకే పర్సనల్ గా చెప్పాలి" అన్నాను నేను కొంచెం విసుగ్గా.
    "ఇంతకీ మీకు వెంకటాద్రి తెలుసా?" అన్నాడు వాడు అదోరకంగా హేళనగా.
    "చాలా బాగా తెలుసు" అన్నాను కొంచెం ఉడుకు మోత్తనంగా. ఈసారి వాడు నవ్వాడు. "అయితే నన్నెందుకు గుర్తు పట్టలేదు" అన్నాడు ఇంకా నవ్వుతూనే.
    "అంటే ?" అన్నాను నేను కంగారుగా, అయోమయంగా.
    "నేనే వెంకటాద్రిని." అంటూ వాడు భళ్ళున తలుపులు వేసేశాడు. ఉలిక్కిపడ్డాను నేను. ఈరోజేమైంది నాకు? ఎంతో తెలివైన వాడిననీ, వ్యవహారాల్లో ఆరితేరిన వాడిననీ నామీద నాకెంతో విశ్వాసముంది. అది ఈరోజు క్రమక్రమంగా దెబ్బ తినసాగింది.
    వెంకటాద్రి ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాను. ఈ అనుభవమంతా అతనికి చెప్పాలి. సరైన సమాచారం అందివ్వనందుకు నిష్టూరమాడాలి. నిష్టూర మాడే ముందు నేను వెళ్ళిన ఇల్లు సరైనదనే అతన్ని నమ్మించాలి గదా. అందుకే వెంకటాద్రి ఇంటికీ అటూ ఇటూ వున్న ఇళ్ళు గుర్తు పెట్టుకున్నాను. ఒకటి ఎవడో రామారావుది. రెండోది మరెవరో పుల్లయ్య ది. ఎదురిల్లు కూడా చూసి గుర్తు పెట్టుకుందామని వెళ్ళి చూసి మళ్ళీ దెబ్బ తిన్నాను. ఆ ఇంటికీ నేమ్ ప్లేటు వుంది. కె. వెంకటాద్రి అని రాసి ఉంది. ఇల్లు తాళం వేసి లేదు.
    నన్ను నేనే నిందించుకున్నాను. లక్కీ స్ట్రీటు లో నాలుగు ఎలక్ట్రిక్ స్తంభాలు దాటేక ఇల్లు వస్తుందంటే మాములుగా విని ఊరుకున్నాను. కానీ ఎటు వైపున అని అడగలేదు. ఐనా నేమ్ ప్లేటు వుంటుంది గదా అని సరిపెట్టుకున్నాను. ఎందువల్లనో ఈరోజు ఒక్క పనీ సక్రమంగా జరగడం లేదు. బస్సేక్కుతాడనుకున్నవెంకటాద్రిబస్సెక్క లేదు. బస్సు దిగుతాడను కున్న వెంకటాద్రి బస్సు దిగలేదు. ఉంటాడనుకుంటున్న ఇంట్లో లేడు. ఇప్పుడు ఇల్లు కనబడింది. ఇందులో వెంకటాద్రి ఉండక పోవడానికి అవకాశం లేదు. అనుకుంటూనే తలుపు తట్టాను.
    తలుపులు తెరచుకున్నాయి. అమ్మయ్య- తలుపు తీసిన వ్యక్తీ వెంకటాద్రి!
    "నమస్కారమండీ వెంకటాద్రి గారు ?" అన్నాను.
    ఆ వెంకటాద్రి తెల్లబోయినట్లు కనిపించాడు నాకు.    "ఎవరు మీరు? నన్ను వెంకటాద్రి అని పిలుస్తున్నారు?" అన్నాడు.
    మళ్ళీ షాక్ తిన్నాను.
    "అంటే?"
    "మా ఇంటి కున్న నేమ్ ప్లేట్ చూసి నాపేరు వెంకటాద్రి అనుకున్నారేమో - నా పేరు వీర్రాజు-" అన్నాడతను.
    "మరి - వెంకటాద్రి గారు--"
    "అది ఈ ఇంటి యజమాని పేరు" అన్నాడు నవ్వుతూ.    
    నాకు కొద్దిగా అర్ధమయింది. సందేహం  లేకుండా నాక్కావలసిన వ్యక్తీ ఇతడే. అయితే  అతను కూడా నాకు లాగే నేమ్ ప్లేట్ చూసి ఇతని పేరు వెంకటాద్రి అని పొరబడి ఉండాలి. అయితే అతను అలా పొరపాటు పడే వ్యక్తీ కాడే! ఏమైతేనేం . నాక్కావలసిన వ్యక్తీ దొరికాడు. మిగతా వివరాలు రేపు సరి చేసుకోవచ్చు.
    "మీ పేరేదైతేనేం నాక్కావలసిన వ్యక్తీ మీరే. లోపలకు రావచ్చా?" అనడుగాను. అతను మర్యాదగా లోపలకు ఆహ్వానించాడు.
    అది ఒక చిన్న గది. చాలా నీటుగా సర్ధబడి ఉంది. వీర్రాజుకు వయసు ముపై దాకా ఉండవచ్చు. అయినా బ్రహ్మచారిగానే ఎందు కుండి పోయాడో అనుకున్నా నా గది చూసి.
    ఇద్దరం చేరోకుర్చీలో కూర్చున్నాక "చెప్పండి - ఏమిటి మీ పని?' అన్నాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS