37. విరిగిన ఎముకలు పసరు మందులతో అటుకుతాయా?
సైకిలు మీద పోతున్న శివయ్య ప్రమాదానికి లోనై కాలు విరగగోట్టుకున్నాడు. ఆసుపత్రికి వెళ్ళి కట్టించుకోవటానికి ఇష్టంపడలేదు. అక్కడికి వెళ్ళితే పిండికట్టువేసి. పదివారాలు పడుకోమంటారని భయపడ్డాడు. బేణుకులకి, విరిగిన ఎముకలకు బాగారయ్య వైద్యమే మంచిదని అనుకున్నాడు. శివయ్య ఆశించినట్లే ఆ నాటు వైద్యుడు ప్రతివారం కాలుతోమి పసరుతో పది కట్లు వేశాడు. ఇక వైద్యం పూర్తీ అయింది, ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పినా శివయ్య కాలు తీసి కాలు వేయలేక పోయాడు. విరిగిన చోట వాపు ఇంకా ఉండనే ఉంది. కండరాలు గడ్డలుగా తయారయ్యాయి. ఎందుకు ఇలా ఉంది అని అడిగితె పాతనొప్పులుగా కొన్ని అలా మిగిలిపోతాయి, అంటే అనేసి ఊరుకున్నాడు. చివరకి ఆసుపత్రికి వెడితే విరిగిన ఎముక వంకర టింకరగా అంటుకునిపోయింది. పైగా విరిగిన చోట బాగా రుద్దడంతోకండరాలు రాళ్ళలా మారాయి. దానితో కాళ్ళు నడవదానికి, చాచదానికి వీలు కాకుండా తాయారయింది.
శివయ్యేకాదు, చాలామంది ఎముకలు విరిగినప్పుడు, కీళ్ళు బెణికినప్పుడు నాటువైధ్యుల దగ్గరకివెళ్ళి చాలా నష్టాలకి గురి అవుతూవుంటారు. వాళ్ళాదృష్టిలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిండికట్టు) ఒక్కసారి వేసి ఉంచివేస్తె సరిపోదని భావం ఉంటుంది. తరచూ కట్టు ఊడుదీసి పసరు రాసికట్టు కట్టడమే సరైన పద్దతిని అనుకుంటారు.
ఇది పొరపాటు అభిప్రాయం. ఎముకులు విరిగినప్పుడూ, కీళ్ళు బెణికినప్పుడు అర్ధోపిడిక్ సర్జన్ చేతగాని, ఆ వైద్యంలో శిక్షణ పొందిన డాక్టరు చేతగాని చికిత్స పొందాలి.
శరీరంలో ప్రమాదవశాత్తుఎముకులు విరిగినపుడు అ స్థలంలో ఉండే రక్తనాళాలుతెగిపోయి రక్తప్రసారం లేక గాయానికి కింది బాగామంతాకుళ్ళి పోవచ్చు. కొన్ని సందర్భాలలో తగినంత రక్తం సరఫరా కాక, ఆ శరీరభాగం చాలా బాధ కలిగించవచ్చు. దానిని గమనించి ముందే మందులు వాడితే కుళ్ళిపోయే ప్రమాదం నుంచి రక్షించవచ్చు. లేదా "మాస్కులర్ సర్జరీ" ద్వారా రక్తప్రసారాన్ని యదాస్థితికి తీసుకురావచ్చు. అన్ని కేసుల్లోనూ ఇలా తీయనవసరం ఉండదు. విరిగిన ఎముకలను వెంటనే యదాస్థితికి తీసుకుని వచ్చినట్లయితే దుష్పలితాలు ఉండవు.
ఎముకలు విరిగినప్పుడు వాటిని వెంటనే సరైనస్థితికి అమర్చకపోతే అక్కడ బయటకువచ్చి గడ్డలాగా తాయారవుతుంది. అటువంటప్పుడు రక్తప్రసారం బయటకువచ్చి గడ్డలాగా తయరవుతుంది. అటువంటప్పుడు రక్తప్రసారం తగినంత లేక కాళ్ళు చేతులు శాశ్వతంగా సన్నబడిపోవడానికి, వంకర అవడానికి అవకాశం ఉంది. నటువైద్యులు గట్టిగా వేసే కట్టువల్ల కూడా ఇలాంటి దుష్పలితాలు కలుగుతాయి.
మోచేతి కీలు దగ్గరగాని, కీలుపైనగాని, మోకాలు కీలు దగ్గరగాని, ఎముకలు విరిగినప్పుడు నరాలు దెబ్బదానికి ఎక్కువ అవకాశం వుంది. అటువంటప్పుడు ఆ క్రింది భాగం బలహీన మవటం, వంకర పోవటం సహజం.
ఎముకలు విరిగినపుడు కొన్ని సందర్భాలలో ఆ రెండు ఎముకముక్కల సందున అక్కడ ఉండే కండరాలు చిక్కుకుపోతాయి. వాటిని సరిచేసి కట్టు కట్టకపోతే, విరిగిన ఎముకలు అంతుకోవూ. ఇంకొందరిలో విరిగిన ఎముకలు చాలా ఆలస్యంగా అంటుకుంటాయి. దానికి వరు బాలహీనంగా ఉండడమో, రికెట్స్, సర్వ్, అస్తియా మలేసియా, హైపర్ పరా థైరాయిడ్ వ్యాధులు ఉండడమోకారణం. మరికొన్ని సందర్భాలలో విరిగిన ఎముకలని సరైన స్థితిలో మరచకపోవడం, రక్తప్రసారం దెబ్బ తినడం, చీముపట్టడం, ఎముకలు అనేక ముక్కలుగా విరగడంకూడా ముఖ్యకారణాలే. ఇది ఇలా వుండగా కొందరిలో అన్నీ సక్రమంగా సరిచేసినా విరిగిన ఎముకలు ఎప్పటికీ అటుకవు. వారిలో ఎముకలు అంటుకోవడానికి గట్టిపడటానికితగిన శారీరిక స్థితి లేదని గ్రహించాలి.
కీళ్ళదగ్గర ఎముకలు విరినపుడు కీళ్ళల్లోకిరక్తం పొయి గడ్డకట్టడం వల్లనో, చీము చేరడం వల్లనో కీళ్ళు శాశ్వతంగా దెబ్బతిని పోతాయి. అందుచేత వెంటనే దానికి చికిత్స చేయాలి.
చిన్న పిల్లల్లో ఎముకలు విరిగినప్పుడు వాళ్ళ ఎముకల ఏదుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎముకుల ఏదుగుదలకి కావలసిన పదార్ధం వాటి చివరిభాగాన్నఉంటుంది. ఎముక చివరిభాగం విరిగినప్పుడు దానిని సరిగ్గా అమర్చకపోతే ఎదుగుదల లేకుండా పోతుంది. ఆ కాలో, చెయ్యో పొట్టిగా ఉంది పోతుంది.
ఎముకలు విరిగినపుడు, బెణికినప్పుడుతోమడం, పసర్లు రాయడం నటువైద్యాలు చేస్తారు. ఇలా చేయడంవలన విరిగిన ఎముకుల నుంచి ఎముకుల నిర్మాణానికి కావలసిన పదార్ధం మెత్తని కందలోకి ప్రవేశించి, అదంతా నిదానంగా రాయిలా తయరవుటుంది. దానితో ఆ భాగం కావలసిన విధంగా సాగడం, వంగడం లాంటి సహజ లక్షణాలను కోల్పోతుంది. అలాగే పసర్లు రాయడం వల్ల ఒక్కొక్కసారి అ భాగంలో పుండు ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా విరిగిన ఎముకలను సరిచేసిన తరువాత వాటిని బెసగాకుండా కొన్ని వారాలు కట్టుకట్టి ఉంచాలి. అలా కదలకుండా ఉంచితేనే అవి సరిగ్గాను, త్వరగానూ అంటుకుంటాయి. అలకాకుండా మాటిమాటికీ కట్టు మర్చి కడితే సక్రమంగాను, త్వరగానూ అంతుకోవూ.
ఈనాడు ఈ రంగంలో అద్వితీయమైనా ప్రగతి సాదించబడింది. ఎముకలని తీసి కొత్త ఎముకలని కృత్రిమ్మిన కీళ్ళను అమరుస్తున్నారు. ఇదివరకటిలాగా నెలల తరబడి మంచానఉంచక వెంటనే లేచి తిరిగేటట్లుచికిత్సా విధానాలు రూపోందాయి.
****
