-: భగినీహస్త లక్షణము (చెల్లెలు) :-
శ్లో!! దక్షణేహంస పక్షంచవామే లాంగూలకంతధా !
స్వసారం ప్రతియుజ్యేత త్వాంజనేయేనచోదితమ్ !!
తా: ధక్షణ కరముచే హంసపక్షమును, వామహస్తముచే లాంగూలమును బట్టినచో తోబుట్టువునందు వర్తించునది.
-: శ్యాలక హస్తలక్షణము (బావమరిది) :-
శ్లో!! కటకాముఖ హస్తేన తామ్రచూడ ప్రదర్శితః !
శ్యాలకేతు ప్రయుజ్యేతేత్యా చార్యేణ ప్రచోదితమ్ !!
తా: కటకాముఖ హస్తమును, తామ్రచూడహస్తమును చూపినచో బావమరిదియందు వర్తించును.
-: ననాంధహస్త లక్షణము (వదిన_మరదలు) :-
శ్లో!! శుకతుండో దక్షణేచ, ముకుళొవామ హస్తకే !
ననాంధాయాం ప్రయుజ్యేత పార్శ్వత్యాపరికీర్తితమ్ !!
తా: దక్షణకరమందు శుకతుండము, వామకరమందు ముకుళహస్తము బట్టినచో వదిన _ మరదండ్రయందు వర్తించును.
-: దౌహిత్ర నప్త్యహస్త లక్షణమ్ (మనమడు, మునిమనవడు) :-
శ్లో!! మృగశీర్షస్తిర్యగాని, వామేహంసాశ్యహస్తకః !
దౌహిత్రనప్త్రోరుజ్యతేత్యగస్తేవ ప్రకీర్తితమ్ !!
తా: దక్షణకరముచే మృగశిరహస్తమును, వామకరముచేహంసాశ్య హస్తమును బట్టినచో దౌహిత్ర _ ప్రపౌతృలయందు వర్తించును.
-: భ్రాతృభగినీ హస్తలక్షణము (సోదరుడు_చెల్లెలు) :-
శ్లో!! సూచీహస్తస్త్వం సందేశే కుంచితోవీక్షితోయది !
భగిన్యాం సోదరేచైవ యుజ్యతే భరతాగమే !!
తా: భుజప్రదేశమునందు సూచిహస్తమునువంచి చూపినచో భగిని యందు, సోదరునియందును వినియోగించును.
-: బాతుర్వర్ణ హస్త లక్షణము :-
శ్లో!! కరాభ్యాం శిఖరం ధృత్వాయజ్ఞసూత్ర ప్రదర్శనే !
దక్షణేన కృతేతిర్యగ్ర్బాహ్మణానాం ప్రదర్శితః !!
తా: రెండుచేతులతో శిఖరహస్తమునుబట్టి, దక్షణహస్తముచే నడ్డముగ ఉపవీత దర్శనము (జంధ్యము) చూపినచో బ్రాహ్మణ వర్ణమునందు వినియోగించును.
-: క్షత్రియ హస్త లక్షణము :-
శ్లో!! వామేన శిఖరం తిర్యగ్ ధృత్వాన్యేవ పతాకః !
ధృతోయది క్షత్రియాణాం హస్తఇత్యభిదీయతే !!
తా: వామకరముచే శిఖరహస్తమును, అడ్డముగబట్టి దక్షణకరముచే పతాకహస్తమును ధరించినచో క్షత్రియపర్ణ హస్తమగును. క్షత్రియునకు చెల్లును.
-: వైశ్యహస్త లక్షణము :-
శ్లో!! వామేకరేతుహస్తాస్యో దక్షణే కటకాముఖః !
వైశ్యహస్తోయమాఖ్యాతోభరతాగడువేదిభిః
తా: వామకరముచే హంసాశ్యమును, దక్షణ కరముచే కటకాముఖమును బట్టినచో వైశ్యవర్ణ హస్తమగును. ఇది వైశ్యునికి చెల్లును.
-: శూద్రహస్త లక్షణము :-
శ్లో!! వామేతు శిఖరం సూచీ దక్షణె శూద్రహస్తకః !!
తా: వామిహస్తముచే శిఖరమును, దక్షణ కరముచే సూచీహస్తమును బట్టినచో శూద్రవర్ణ హస్తమగును. ఇది శూద్రునకు వర్తించును.
-: భర్తృహస్త లక్షణము (పెనిమిటి) :-
శ్లో!! విన్యస్యకంఠే హంసాస్యౌశిఖరో దక్షణేకరే !
భర్తృహస్త ఇతిఖ్యాత ప్తస్మిన్నేవనియుజ్యతే !!
తా: కంఠమందు హంసాశ్యహస్తముంచి, కుడిచేత శిఖరహస్తము పట్టిన భర్తృహస్తమగును, ఇది మగనికి చెల్లును.
-: భర్తృ భ్రాతత్రుహస్త లక్షణము (భర్త అన్న) :-
శ్లో!! వామేతుశిఖరం ధృత్వాపార్శ్వయోఃకర్తరీముఖం
ధృతో దక్షణహస్తేన భర్తృభ్రాతృకర స్మృతః !!
తా: ఎడముచేత శిఖరమునుబట్టి, రెండుపార్శ్వములయందును, కుడిచేక కర్తరీముఖ హస్తమును బట్టిన, భర్తృభ్రాతృ హస్తమగును. ఇది పెనిమిటి. తోడబుట్టిన వారియందు చెల్లును.
-: జేష్ట కనిష్ట భ్రాతృహస్త లక్షణము :-
శ్లో!! మయూరహస్తః పురతః పశ్చాద్భాగేచద దర్శితః !
జేష్టభ్రాతృః కనిష్టాస్క్యాప్వయంహస్తః ప్రకీర్తితః !!
