కన్నారావు, ఇద్దరి ముక్కుల దగ్గరా చూపుడు వేలు పెట్టి చూసి తృప్తిగా నిట్టూర్చాడు.
"ఈ మాత్రందానికే చస్తారా ఈ మొరటు పక్షులు... మూర్చపోయారు అంతే..."అన్నాడు కన్నారావు.
ఇద్దరూ తాళం చెవుల గుత్తిని తీస్కుని కారు దిగారు.
ఈ యిళ్ళలో వీళ్ళ ఇల్లు ఏది అయి ఉంటుంది?" వర్సగా ఉన్న ఇళ్ళ వంక చూస్తూ అన్నాడు చిట్టబ్బాయి.
"కారు ఈ యింటి ముందు ఆగిందాగా...ఇదే అయి ఉంటుంది..."కన్నారావు యింటి వ్తెపు తొంగి చూస్తూ అన్నాడు "అదిగో తలుపు తాళం కూడా వేసి ఉంది...ఇదే."
ఇద్దరూ గబగబా వెళ్ళి తాళం గుత్తిలోని తాళం చెవులని వరసగా ట్రే చేస్తూ చివరికి ఆ తాళం కప్పని తెరవగాలిగారు.
తలుపు తీస్కుని ఇంట్లోకి పరుగెత్తారు చిట్టబ్బాయి, కన్నరావులు ల్తేటు స్విచాన్ వెలిగించుకుంటూ. హాలు, డ్తెనింగ్ హలూ, బెడ్ రూం, వంటగది, ఆఖరికి బాత్రూం లేట్టిన్ కూడా వెతికారు ఎక్కాడా పండు జాడ కనిపించండం లేదు.
"ఇదిగో.. ఈ మూల మరో వుంది... బయట నుండి గది కూడా పెట్టి ఉంది. పండుని దీంట్లోనే ఉంచి ఉంటారు...." అన్నాడు చిట్టబ్బాయి కంగారుగా.
ఆ గది తలుపు సందుల్లోంచి ల్తేటు వెల్తురు కాస్త కనిపిస్తూంది.
"లోపల ల్తేటు కూడా వెలుగుతూంది. పండు దాంట్లోనే వుంది వుంటాడు" అన్నాడు కన్నారావు కూడా.
ఇద్దరూ గది తలుపులు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టారు.
గది ఖాళీగా ఉంది. పండు ఆ గదిలో లేడు.
"మనం వచ్చిన అలికిడి విని ఆ దుర్మార్గులు వచ్చారేమో అనుకుని భయపడి మంచం క్రింద దాక్కున్నాడేమో!" అన్నాడు కన్నారావు.
కన్నారావు చెప్పింది వినగానే పండు మంచం కింద ఉన్నాడేమో చూడ్డామాని వంగి బేల మీద మోకాళ్ళ మీద కూర్చున్న చిట్టబ్బాయి కళ్ళు ఆశ్చర్యంతో భయంతో పెద్దవి అయ్యాయి.అత్నియా ఒళ్ళు జలదరించింది.
రెండు క్షణాల తర్వాత భయంతో గట్టిగా కేకెవేశాడు చిట్టబ్బాయి.
చిట్టబ్బాయి భయంతో వేసిన కేకకి కన్నారావు శరీరం గగుర్పోడిచంది. అతని మనసు కిదుని శంకించింది. కొన్ని క్షణాలపాటు అతని నోటి వెంట మాట రాలేదు.
చిట్టబ్బాయి నెల మీద అలా కూర్చునే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చలనం లేకుండా ఉన్నాడు.
కొన్ని క్షణాలకి తేరుకున్న కన్నారావు కంగారుగా చిట్టబ్బయిని ప్రశ్నించాడు. "ఏమ్తెంది?... ఎందుకలా అరిచావ్?... మంచం కింద ఏముంది?... ఎవరున్నాడు?"
"మంచం కింద కాదు.. ఇక్కడ నేలమీద చూడు" వణికే స్వరంతో అన్నాడు చిట్టబ్బాయి.
కన్నారావు మోకాలు మీద కూర్చుని నేలమిడకి వంగి పరిశీలనగా చూశాడు.
కన్నారావు గుండె ఒక్కక్షణం పాటు ఆగి తరిగి కొట్టుకోసాగింది. అతని వెన్నులో చలి మొదల్తెంది. కన్నారావు మొహం క్షాన్నాల్లో పాలిపోయింది.
నేలమీద బొట్లు బొట్లుగా చిక్కని, ఎర్రని రక్తం!
ఇంకా ఆ రక్తం ఆరలేదు... పచ్చి పచ్చిగా ఉన్నట్టుంది.
"ఈ రక్తం ఎవరిదంటావ్?" భయం భయంగా అడిగాడు కన్నారావు చిట్టబ్బయిని.
"పండుగాడిదే అంటావా?" చిట్టాబ్బాయి ఎదురుప్రశ్న వేశాడు.
ఇద్దరికీ భయంతో కాస్సేపు మాట రాలేదు. పండుగాడికి ఎద్తేనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు వాళ్ళిద్దరె!
కాస్సేపయ్యాక కన్నారావు పెదవి విప్పాడు.
"కాని బార్లో డేవిడ్,జాన్లు మాట్లడిందాన్ని బట్టి చూస్తే పండుగాడికి వాళ్లు అపకారం ఏమి చేయలేదు...మరి ఈ రక్తం?!..." అన్నాడు చిట్టబ్బాయ్.
"తిస్కెళితే తిస్కెళ్ళారు.. మరి ఈ రక్తం ఏమిటి? పండుగాడికి అపకారం ఏమ్తెనా తలబెట్టారా వాళ్ళు!?"
"పరిస్ధితి ఇంతదాకా వచ్చిన తరువాత మన ఆలోచనలతో అనవసరంగా కాలయాపనచేయడం అంతమంచిది కాదనుకుంటా. వెంటనే మనం రంగ నాయకులు ఇంటికి వెళ్ళి జరిగింది ఆయనకీ చెప్పి క్షమించమని కాళ్ళ మీద పడిపోదాం, తరువాత పోలీసులకి ఈ విషయం చెప్తే వాళ్లు జాన్, డేవిడ్ లను పట్టుకుని ఇంటరాగేట్ చేస్తారు. ఒకవేళ జాన్, డేవిడ్ లు పండుని ఇక్కడ కాకుండా ఇంకేక్కడ్తేనా దాచి ఉంటే పండు మనకి దక్కుతాడు" అన్నాడు చిట్టబ్బాయి.
"ఏమో!... దక్కుతాడో దక్కడో!!" నేలమీద రక్తాన్ని భయం భయంగా చూస్తూ తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు కన్నారావు "వాడికి ఏమ్తెనా అయితే మనిద్దరికీ శిక్ష పడడం ఖాయం"
"నువ్వొకడివి శిక్ష శిక్ష అంటూ భయపడేవాడిని ఇంకా భయపెట్టి చంపు తున్నావ్. కాస్సేపు నోరు మూస్కుని నన్ను మనశ్శాంతిగా ఉండనియి" విసుక్కున్నాడు చిట్టబ్బాయ్.
వాళ్లు ఏ రక్తాన్ని చూసి ఏమేమో ఊహించుకుని విపరీతంగా భయపడుతున్నారో ఆ రక్తం ఎలకది. పండు ఆ గదిలో వున్నప్పుడు ఆ ఎలక శరీరం నుండి కారింది ఆ రక్తం?
చిట్టబ్బాయి కన్నరావులు మరోసారి ఇల్లంతా జాగ్రత్తగా వెతికి పండు ఆ ఇంట్లో లేదని కన్ ఫర్మ్ చేస్కున్నారు. వాళ్ళకి స్టోర్ రూంలో ఒక తాడు దోరికింది. దాన్ని తీస్కుని హడావిడిగా బయటికి వచ్చారు.
కారులోని డేవిడ్, జాన్ లకు స్పృహ రాలేడు.
చిట్టబ్బాయ్, కన్నరావులు వాళ్ళిద్దర్నీ అతికష్టం మీద కార్లోంచి బయటికి లాగారు. ఆక్కడి నుండి మెల్లగా తింట్లోకి లాగి కాళ్ళూ, చేతులూ తాళ్ళతో కట్టేసి ఇంటికి తాళం వేసి రోడ్డు మీద పడ్డారు.
ఆప్పడే ఆ వ్తెపుగా వస్తున్న ఆటోని ఆపి అందులో ఎక్కి కూర్చున్నారు.
"శాంతి నగర్ పోనియ్..." ఆన్నాడు చిట్టబ్బాయి.
ఆటో రివ్వున ముందుకు దూకింది.
కన్నారావు, చిట్టబ్బాయ్ ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు.
వాళ్ళ మనసుల్లో ఎన్నో ఆలోచనలు! ఎన్నెన్నో సందేహాలు! ఏవేవో భయాలు!!!
దాదాపు అలా ఒక అరకిలోమీటరు ప్రయాణించారు.
నిశ్శబ్దంగా అలా కూర్చుని ఉన్న చిట్టబ్బాయి, కన్నరావులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇద్దరూ మొహమొహాలు చూస్కుని ఒక్కసారిగా "ఆటో!ఆపు!!" అని గట్టిగా అరిచారు.
వాళ్ళు పెట్టిన కేకకి ఆటోవాడు కంగారుపడి చటుక్కున బ్రేకు వేసి ఆటో ని ఆపాడు.
"ఏందుకాల అరిచారు సాబ్? నాకు తెలీకుండానే ఆటోని ఎవరి మీద నుండ్తేనా ఎక్కించానా?" భయం భయంగా వాళ్ళని అడిగాడు ఆటోవాడు.
వాడికి సమాధానం చెప్పకుండా ఆటోలోంచి కిందికి దూకారు చిట్టబ్బాయ్, కన్నరావులు.
అలా దూకిన ఆ ఇద్దరూ ఏడుపు వినవచ్చియన్ దిక్కుకి చూశారు.
అక్కడ ఆ విడి దీపం కింద కళ్ళని చేతుల్తో నులుముకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పండు.
చిట్టబ్బాయి కన్నరావుల ఆనందానికి అంతు లేదు. గబగబా పండు దగ్గరికి పరుగేత్తుకిని వెళ్ళారు. చిట్టబ్బాయి పండుని ఎత్తుకున్నాడు.
