Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 40

    "అరె...ఇదేంట్రా డేవిడ్..కారు ఫ్రంట్ డోర్ తెరిచి ఉందేమిటి?... కారుని లాక్ చేయలేదా ఇందాక?"


    అది జాన్ గొంతు! మాట ముద్ద ముద్దగా వస్తుంది.


    "నేను కారు తాళం వేశానే!" ... మరి ఎలా తెరుచుకుందబ్బా..." అన్నాడు డేవిడ్, అతని మాట కూడా ముద్దు ముద్దుగా వస్తుంది.


    "ని మొహం... తాళం  వేస్తే ఇలా తెరిచి పెట్టి ఎందుకుంటుంది... నువ్వేపని చేసినా ఇలానే ఉంటుంది" జాన్ గొంతులో విసుగు ధ్వనించింది.


    కారులో జాన్ డేవిడ్ ఇద్దరు కూర్చున్నారు.


    "అర్రే!... ఇగ్నిషన్ కి కూడా కారుకే ఉందే!!...."


    డేవిడ్ గొంతులో ఆశ్చర్యం.


    "ఉండక ఎక్కడ పోతుంది?... కారుకే వదిలేస్తే!! రోజు రోజుకి మతి మరుపు ఎక్కువ్తే పోతుంది.." అన్నాడు  జాన్.


    "ఎంటో... నాకు అయోమయంగా ఉంది" అన్నాడు డేవిడ్.


    "మందేక్కువ్తేతే అలానే ఉంటుంది."


    "హిహిహి..."


    ఆ నవ్వింది డేవిడ్ కాదు. జాన్ మాటలకు నవ్వొచ్చి చిట్టబ్బాయి గట్టిగా నవ్వేశాడు. కాని అంతలోనే భయపడి చచ్చాడు. కన్నారావ్తేతే చచ్చేట్టు కంగారు పడ్డాడు.


    "సిగ్గు లేకుండా మళ్ళి అట్టా నవ్వుతావేం?" కోపగించుకుంటూ అన్నాడు జాన్.


    "నవ్వింది నేనా నువ్వా?.... చూస్తుంటే నికే మందు బాగా ఎక్కినట్టుంది..." అన్నాడు డేవిడ్.


    చిట్టబ్బాయి కన్నరావులు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.


    కారు రివ్వున ముందుకు దూకింది.



                                                                                   10


    హల్లో సోఫాలో కూర్చుని ఏడుస్తుంది చిన్నమ్మాయి.


    ఆమె మనసంతా వికలమ్తెపోయింది. పండు ఎటువంటి వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాడో  తలుచుకున్న కొద్ది ఆమెకి దుఃఖం ఆగడం లేదు.


    చిన్నమ్మాయికి పండంటే విపరీతమ్తెన ప్రేమ. వాడిని వదిలి పెట్టి ఎప్పడూ ఉండలేదు. ప్రతిరోజూ పండుకి స్నానం చేయించడం.

అన్నం తినిపించడం వాడిని తయారుచేసి స్కూలుకి పంపించడం అన్ని పనులూ చిన్నమాయే చెస్తుంది. అంతగా అలవాటు పండు చిన్నమ్మాయికి.


    వాడికేమ్తెనా అయితే మరి ఆమె తట్టుకోగలదా?


    పండు కిడ్నాప్ చేయబడ్డడని తెలిసిన దగ్గర్నుండి ఆమె మనసు మనసులో లేదు.


    తల వోంచుకుని దుఃఖిస్తున్న ఆమె విపుని ఒక చేయి నిమిరింది.


    చిన్నమ్మాయి తలెత్తి చూసింది.


    ఎదురుగా తండ్రి నిలబడి ఉన్నాడు.


    "కాస్త ఎంగిలి పడమ్మా ... ఎంతసేపని అలా ఏడుస్తూ కూర్చుంటావ్?" అన్నాడు రంగాయకులు.


    "ఉహు... నాకు ఆకలిగా లేదు..."  అంది చిన్నమ్మాయి వెక్కుతూ.


    "అలా అంటే ఎలా తెల్లి... కాస్త తినమ్మా.. నా కోసం" గడ్డం పట్టుకుని  బ్రతిమలాడాడు రంగనాయకులు.


    "ఉహు...   నేను తినను. పండుని తీసుకుని రా అప్పడు తింటాను".


    "ఎందుకు తేనురా? ని తమ్ముడంటే నీకెంత ప్రేమో,  నా కొడుకన్నా నాకు అంతే ప్రేమ కదా?...లేమ్మా"


    "పాపం పండుగాడు ఉదయం నుండి ఏమ్తెనా తిన్నాడో లేదో!" ఆ దుర్మార్గులు పండుని యేం చేస్తారో ఏమో" కుమిలిపోతూ అంది చిన్నమ్మాయి.


    "వాడికి హాని చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటమ్మా... వాళ్ళకి డబ్బు కావాలి...అందుకోసమని వాడిని కిడ్నాప్ చేసి తిస్కెళ్ళరు... మనం వాళ్ళు అడిగినంత డబ్బు ఇస్తామని చెప్పాముగా... అందుచేత వాడినేమి చేయరు...


    రేపు ఉదయం బ్యాంకుకి వెళ్ళి మిగతా లక్ష రూపాయలు డ్రా చేసి మొత్తం డబ్బు తిస్కెళ్ళి వాళ్ళ మొహన కొట్టి పండుని యింటికి తిసుకోస్తాగా...ఆ తరువాత సంగతి ఇన్స్ పెక్టర్ బంగార్రాజు చూస్కుంటాడు..."


    చిన్నమ్మాయి చెంగుతో కళ్ళు ఒత్తుకుంది.


    "లేండమ్మాయిగోరూ,  మీరు అన్నం తిననంత మాత్రాన పండుబాబు వచ్చేస్తాడా చెప్పండి? రేపు అయ్యగారు తీసుకొస్తానని అన్నారు కదండి, కొద్దిగా తినండి అమ్మాయి గోరూ."


    అప్పడే హాల్లోకి వచ్చిన పనివాడు భీమయ్య అన్నాడు.


    "ఏవండోయ్! వడ్డించేశాను రండి" డ్తెనింగ్  హాల్లోంచి చాముండేశ్వరి గట్టిగా అరిచింది.


    "మయాదారి సంత!... అంత గట్టిగా అరవాలా?  వస్తున్నాం ఉండు." అన్నాడు  రంగనాయకులు.


    "లేండమ్మాయి గోరూ! భోజనం వద్దించేశారు, కాస్త ఈటింగ్ చెయ్యండి అమ్మ" అన్నాడు భీమయ్య.


    ని యింగ్లిషు మంటేట్టా. ఇంకోసారి నా దగ్గర అల తెలుగూ యింగ్లిషూ కలిపి మాట్లాడితే పనిలోంచి తిసేస్తా మాయదారి సంత..." కసురుకున్నాడు రంగనాయకులు.


    "ఎస్ కూస్ మీ బాబు... మా ఆడదానికి  నేనిట్టా యింగ్లీషులో  టాకింగ్ చేస్తే యిష్టం బాబూ... దానికోసం ఇట్టా టాకింగ్ సేసి  సేసి ఇట్టానే మాట్లాడం అలవాట్తేపోయింది.బాబూ... ఎస్ కూస్ మీ బాబూ.." వినయంగా చేతులు కట్టుకుని అన్నాడు భిమయ్య.


    "హబ్బా...దిక్కుమాలిన సంత" తప పట్టుకుని అన్నాడు రంగనాయకులు.


    అంత బాధలోనూ చిన్నమ్మాయికి నవ్వొచ్చింది.


    "ఆ...ఆ..చిన్నమ్మాయిగోరు లాఫింగూ.. ఇంక తమరు లేసి కాస్త ఈటింగు కూడా సేసేయ్యండి...." సంబంరంగా అన్నాడు భీమయ్య.
    "ఏవండోయ్ వస్తున్నారా లేదా?..." లోపలి నుండి మళ్ళి అరిచింది చాముండేశ్వరి.


    "అబ్బబ్బ! అటు దాని అరుపులతోనూ ఇటు విడి  యింగ్లిషుతోనూ  ఇద్దరూ చంపేస్తున్నారు.... మాయదారి సంత!... లేమ్మా వెళ్దాం" అన్నాడు రంగనాయకులు చిన్నమ్మాయి భుజం మీద తాడ్తూ....


    చిన్నమ్మాయి సిఫాలోంచి లేచింది.



                                   *                *             *


    అంబాసిడర్ కారు ఆ యింటి ముందు ఆగింది.


    "ఆ కుర్ర  వెధవ యేం చేస్తున్నాడో?..."  అన్నాడు డేవిడ్.


    "పద్తే పోయిందిగా... నిద్రపోయి ఉంటాడు" అన్నాడు జాన్.


    డేవిడ్ ఇంజన్ ఆఫ్ చేశాడు.


    ఇందాకట్నుండి ఆ అదనుకోసమే ఎదురు చూస్తున్నారు వెనకసిట్లో చీకట్లో నక్కి కూర్చున్న చిట్టబ్బాయి కన్నరావులు.


    కన్నారావు చిట్టబ్బయికి  స్తేగా చేశాడు. మరుక్షణం చిట్టబ్బాయి తన చేతిలోనిడ్ ఇనుప కద్దితో డేవిడ్ తలమీద ఒకటిచ్చాడు. డేవిడ్ చిన్నగా మూలిగి స్టిరింగ్ మీదకు వాలిపోయాడు.


    "ఏయ్!... ఎవడ్రా వాడు?" ముద్దముద్దగా వెనక్కి తిరిగాడు జాన్.


    ఎర్రని కళ్ళతో క్రూరంగా ఇద్దర్ని చూశాడు జాన్.


    "కొట్టూ...అలా ఆలోచిస్తావేం?" కన్నారావు కంగారుగా అరిచాడు.


    "విడలా మరి సూటిగా మొహంలోకి చూస్తుంటే కొట్టలేకపోతున్నా..." అన్నాడు చిట్టబ్బాయ్.


    అంతలో ఎక్కడినుండి తిశాడో గాని, చటుక్కున కత్తి తిసి ప్తేకేత్తాడు జాన్.


    అంతకంటే వేగంగా కన్నారావు చిట్టబ్బాయి చేతిలోని ఇనుపకడ్డిని లాక్కుని జాన్ నెత్తిన ఇచ్చాడు.


    జాన్ మూలగాన్తేనా మూలగకుండా డేవిడ్ మీదికి ఒరిగిపోయాడు.


    "వెధవలు కొంపదిసి చావలేదు కదా?... పండుగాడిని కిడ్నాప్ చేసి  నందుకూ, వీళ్ళని చంపినందుకు రెండు నేరాలు మనమీద మోపబడ్తాయి..." భయం భయంగా అన్నాడు చిట్టబ్బాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS