Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 42

    "నన్ను వదలండి...నన్ను వదలండి..."వీళ్ళిద్దరి వంకా భయం భయంగా చూస్తూ వెక్కుతూ అన్నాడు పండు.

    "నీకేం భయం లేదమ్మా. నిన్ను మీ ఇంటికి తిస్కెళ్ళదానికే వచ్చా..." నచ్చాజేప్తూ అన్నాడు కన్నారావు పండుతో.

    "నిన్ను గదిలోపెట్టి బంధించిన రౌడిలిద్దర్ని బాగా తన్నం...తెల్సా?... అయినా నువ్వు ఆ ఇంట్లో లేకుండా ఇక్కడికెలా వచ్చావ్?" అడిగాడు చిట్టబ్బాయ్.

    "కిటికీ ఊచుల్లోంచి దూరిబయటికి దూకి వచ్చేశా..." అన్నాడు చొక్కా రత్తి కళ్ళు తుడుచుకుంటూ పండు.

    చిట్టబ్బాయ్, కన్నరావులు పండుని తీస్కుని ఆటో ఎక్కారు.

    ఆటో శాంతినగర్ వ్తెపు పరుగులుతీసింది.


                                                       11

    రెండు రోజుల తర్వాత...

    పార్కులో...

    సాయంత్ర సమయం...

    చిట్టబ్బాయ్ చిన్నయ్యయికి ఉత్సాహంగా తన వీరత్వం గురించి కోతలు కోస్తూ చెప్పేస్తున్నాడు. ఆమె ఎంతో ఆసక్తి గా వింటూంది. అతను చెప్తున్నది వింటూ మధ్య మధ్య "అమ్మో.." అంటూ గుండెల మీద చేయ్యేస్కుని విప్పారిన కళ్ళతో చిట్టబ్బాయ్ ని చూస్తుంది చిన్నమ్మాయి. ఆమె అలా ఆశ్చర్యంపోయిన కొద్ది రెచ్చిపోతున్నాడు చిట్టబ్బాయి.

    దూరంగా గడ్డిలో పిల్లి మొగ్గలు వేస్తూ ఆడ్తున్నాడు పండు.

    "అప్పడేమ్తెంది?...."

    కుతూహలంగా అడిగింది చిన్నమ్మాయి.

    "అప్పడేమో ఆ జాన్ అనేవాడు కత్తి తీశాడు. నేనేమో..."

    "పల్లి కావాలా సార్?  గరం గరం పల్లి?...."

    చిన్నమ్మాయి ఆశ్చర్యంగా చిట్టబ్బాయ్ వంక చూసింది.

        "అదేంటి?....ఆ వెధవాయి కత్తి తెస్తే మీరు వాడికి జల్లకాయి కొట్టి కత్తి లాక్కోవాలి గాని గరం గరం పల్లి కావాలా సార్ అని అడగడం యేంటి?" ...ఛి" కిసుక్కున నవ్వింది చిన్నమ్మాయి.

    చిన్నమ్మాయి పక్కకి  తిరిగి చూసింది.

    అక్కడ బుట్ట చేత్తో పట్టుకుని పల్లీలు ఆమ్మే కుర్రాడు ఉన్నాడు.

    చిన్నమ్మాయి తనని చూస్తూనే మళ్ళి అడిగాడు పల్లీలు అమ్మే కుర్రాడు "పల్లీలు కావాలమ్మా? గరం గరం పల్లీలు..." బుట్టని ముందుకు చాపాడు.

    "వద్దు...!" మొహం చిట్లిస్తూ అంది చిన్నమ్మాయి.

    "కాలక్షేపం పల్లిఅలమ్మ!"

    "వద్దంటుంటే న్కికాదు?" గట్టిగా విసుక్కున్నాడు చిట్టబ్బాయి.

    తన సహనం గురించి సీరియస్ గా చెప్తుంటే ఎంతో ఆసక్తిగా చిన్నమ్మాయి విటుంన్నప్పడు విడిలా పానకంలో పుడకలా అడ్డు తగలడం చాలా కోపం తెప్పించింది చిట్టబ్బాయికి.

    "పల్లీలు గరం గరంగా చాల బాగున్నాయి బాబూ" మళ్ళి అన్నాడు వాడు. అంత తేలిగ్గా వదిలే ఘటంలా లేడు.

    "నువ్వు చచ్చి గిపెట్టినా కొనేది లేదు... వెళ్ళు" అరిచినట్టుగా అన్నాడు చిట్టబ్బయ్.

    "పోనీ రూపయిదే తీస్కో బాబూ"

    "వద్దన్నానా?"

    "పోనీ అర్ధరూపాయిది తీస్కోండి..గరం గరం పల్లీలు..."

    "ఒక్క ప్తేసాది కూడా తిస్కోను" ఖచ్చితంగా చెప్పాడు చిట్టబ్బాయి.

    "తిస్కోరా?" అన్నాడు గిరగా.

    "తిస్కోను. ఏం చేస్తావేం?" రెట్టిస్తూ అడిగాడు చిట్టబ్బాయ్.

    వెంటనే ఆ పల్లిలబ్బాయి వెనక్కి తిరిగి పండు వ్తెపు చూస్తూ అరిచాడు. "బాబూ...వీళ్ళు పల్లీలు కొనరంట!...నన్ను వెళ్ళి పొమ్మంటున్నారు"

    గడ్డిలో పల్టీలు కొడ్తున్న పండు పల్టీలు కొట్టడం  ఆపి సీరియస్ గా వీళ్ళ వంక చూస్తూ అరిచాడు. "నాకు పల్లీలు కావాలి!...కొనండి"

    పల్లిల కుర్రాడు చిట్టబ్బాయ్ వ్తెపు తిరిగి నవ్వాడు "బాబుకి పల్లీలు కావాలంట..." అన్నాడు.

    చిట్టబ్బాయ్ మనసులోనే తిట్టుకుంటూ పల్లీలు కొన్నాడు. పల్లిల కుర్రాడు విజయగర్వంతో  వాళ్ళవంక చూసి అక్కడి నుండి  వెళ్ళిపోయాడు.

    పండు పరుగున వచ్చి చిట్టబ్బాయి  చేతిలోని పల్లిల కుర్రాడు విజయగర్వంతో వాళ్ళవంక చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

    "ఊ... చెప్పండి"అంది చిన్నమ్మాయి చిట్టబ్బాయ్  మొహంలోకి చూస్తూ.

    "ఎందాకా చెప్పానూ?" ఆలోచిస్తూ అడిగాడు చిట్టబ్బాయ్.

    "అదే...జాన్ అనే రౌడి కత్తి తీశాడు. అప్పుడు మీరేమో గరం పల్లి పల్లిలబ్బాయి మనల్ని అడిగాడు..." చాలా ఓపికగా చెప్పాడు చిట్టబ్బాయ్. అదే మరొకళ్ళు అయితే మీదపడి కరిచేసి ఉండేవాడే.

    చిన్నమ్మాయి తన పోరాబాటుకి నాలుక కోరుక్కుఅని "సారి అంది, ఈ పల్లిల కుర్రాడు వచ్చి నన్ను కన్ ప్యూజ్ చేసి పారేశాడు...ఊ... ఇప్పుడు చెప్పండి జాన్ కత్తి తీశాడు. అప్పుడు మీరేం చేశారు?" అని కుతూహలంగా అడిగింది.

    "వాడు కత్తి తీస్తే నేను అలా చూస్తూ ఊర్కుంటానని అనుకున్నాడు కాబోలు వేర్రిపినుగా. నేను వెంటనే కత్తి ఉన్న వాడి చేతిని పట్టి వెనక్కి మేలేశాను. వాడి ఎముకలు కరకరా శబ్దం చేశాయి..." హుషారుగా చెప్పసాగాడు చిట్టబ్బాయి.

    "కరకరా అంటే గుర్తొచ్చింది...నాకు చేగోడీలు కొనిపెట్టావా అంకుల్?" అన్నాడు పండు చిట్టబ్బాయ్ తో.

    చిట్టబ్బయికి పండు మీద చచ్చేంత కోపం వచ్చింది. కాని అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. చిన్నమ్మాయికి పండు అంటే చాలయిష్టం. వాడిని కోపగించినా, వాడిమీద విసుక్కున్నా తానంటే అయిష్టం కలగొచ్చు ఆమెకి. అందుకే బలవంతంగా నవ్వు తెచ్చి పెట్టుకున్నాడు.

    "మనం చేగోడీలు యింటికెళ్ళేప్పుడు కొనుక్కుందాం బాబూ"అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో.

    "ఊహూ...చేగోడీలు నాకిప్పడే కావాలి!..."అన్నాడు  పండు మొండిగా.

    చిట్టబ్బాయి చిన్నమ్మాయికి వినబడకుండా పళ్ళు కొరికాడు.

    "మీరెందుకు కరకరా... కరకరా శబ్దం చేశాయి అని అన్నారు?... అలా అన్నందుకు వాడికి కొనిపెట్టండి..." అంది చిన్నమ్మాయి నావ్వుతూ.

    "కరకర శబ్దం చేసింది జాన్ గాడి ఎముకలు అని అన్నానుగాని చేగోడీలు అని అన్లేదుగా?"

    "ఏది ఏమ్తేతేనేం? వాడికి చేగోడీలు అని అన్లేదుగా?"

    "ఏది ఏమ్తేతేనేం? వాడికి చేగోడీలు గుర్తొచ్చే మాట అన్నారు.... కొని పెట్టండి...లేకపోతే తోచానివ్వాడు"

    "ఇప్పడిక్కడ  చేగోడీలు ఎక్కడ నుండి తేను?" లోలోపల విసుక్కుంటూనే ప్తెకి  నావ్వుతూ అడిగాడు.

    "కాస్త ముందుకి వెళ్ళి కుడిపక్కకి తిరిగితే అక్కడ క్యాంటిన్ కి  వెళ్ళి చేగోడిలా పాకెట్ కొని తీసుకొచ్చాడు. పండు చేతిలోని పల్లిల పొట్లం పక్కన పడేసి చేగోడిలా ప్యాకెట్ చిత్తబ్బి చేతిలోంచి అందుకుని దాన్ని విపడం మొదలు పెట్టాడు.

    "ఆ...ఇప్పుడు చెప్పండి. జాన్ కత్తి తీశాడు... ఆ తర్వత?" చిన్నమ్మాయి.

               "చెప్పాగా కత్తి ఉన్న చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి విపుమిద ఒక గుద్దు    గుద్దాను. జాన్ బాధగా అరుస్తూ కత్తిని వదిలేశాడు. మరోసారి జాన్ విపుమిద గుద్దో కాలుతో నడ్డిమీద ఒక్క తనను తన్నాను. అంతే! జాన్ అంత దూరంలో ఎగిరిపడ్డాడు. ఇంతలో  డేవిడ్ గాడు కిందపడిన కత్తిని అమ్డుకోబోయాడు. నేను కుదరనిస్తానా? డేవిడ్ గడ్డం కింద బలంగా ఒక్క గుడ్డు గుద్దను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS