కిచకిచలు పెట్టుకుంటూ కొమ్మమీదినుంచి మరోకొమ్మ మీదికి గెంతుకుంటూ అవి అక్కడనించి నిష్క్రమించినాయి. ప్రపంచాన్ని జయించిన ఆనందంతో తృప్తిపడి అవి వెళ్ళిపోయినాయి.
ఆ తరువాత ఒక్క నిమిషామయినా అర్ధమానవుడు అక్కడ నిలువలేకపోయినాడు. కరిగిపోతున్న శరీరంతో కోరికలు కొలిమిలామండించే మనసుతో అతడు వెనుదిరిగాడు తనకుఎలాంటి కష్టమయినా, సమస్య అయినా, అశాంతి అయినా ఎదురు అయినప్పుడు జ్ఞాపకం వచ్చే ప్రధమ వ్యక్తి కెప్టెన్ మాలతి. ఆమె అతడి గురువు దైవం, సర్వస్వం.
అతడి మనసుని అర్ధం చేసుకుని ఆదరించి శాంతిని పంచి ఇచ్చే అమృతమూర్తి అపార స్నేహమయి.
ఆమె సమక్షంలో అతడు అశాంతినీ, ఆరాటాలనూ అన్నింటినీ, మర్చిపోతాడు ఏదో తెలియని అమృతప్రాయమైన ఆనందమూ శాంతి అతడిని ఆమె సమక్షంలో లభిస్తాయి. మనశ్శాంతి కరువైనప్పదు సమస్యలు ఎదురైనప్పుడు ఉద్విగ్నతలు. ఉద్రేకాలు మనసుని ఆవరించి మండి చుడుతున్నప్పుడు అతడు కెప్టెన్ మలతినే ఆశ్రయించాలి. అర్ధమనవుడు పరుగు పరుగున ఇంటివైపుగా తిరిగిపోవడం ప్రారంభించాడు.
సరిగా ఆ సమయానికి మాలతి స్నానం చేస్తోంది.
ఈ మధ్య ప్రాపంచికమైన పరిజ్ఞానం అర్ధమానవుడిలో ఆకురించింది. అతడు ప్రకృతి మిత్రుడుగానే పుట్టి పెరిగాడు అతడు ప్రకృతి పుత్రుడుగా నేరుగా తన మనసుని బయటపెట్టే అమాయకుడుగా ఉన్నంతకాలం మాలతి రవంత అయినా అనుమానించలేదు.
అర్ధ మానవుడు కల్లాకపటం కాలుష్యం, మితిమీరిన స్వార్ధం తెలియని పవిత్రమూర్తి కాని ఇప్పుడతనికి ఆలోచనలు తెలుస్తున్నాయి. బాష అర్ధమవుతోంది. మనుషుల మధ్య మెలిగే శక్తివస్తోంది.
ఇది అతనిలోని కొన్ని మార్పులకు కారణమవుతోందని మాలతికి తెలుసు. కేవలం ప్రపంచం తెలియని ప్రకృతిపుత్రుడుగానే కాక పవిత్రుడుగానే కాక మరికొంత ముందుకు పురోగమించినవాడు అర్ధమానవుడు.
మనిషిగా పుట్టినవాడు మృగంలా జీవించరాదన్న సిద్దాంతం ప్రకారం అతనిలో తాను తీసుకువచ్చిన పరిణామం అత్యంత హర్షదాయకమయినదే.
కాని మానవ ప్రపంచం తెలిసాక ప్రకృతిలోంచి ప్రజలమధ్యకు వచ్చాక అతని మనసు పెరిగినది. ఆలోచనలు పెరిగినాయి. అలాగే అవుసరమూ, స్వార్ధమూ అభివృద్ధి అవుతోంది. స్వార్ధమనేది తోడేలు వంటిది.
అది తనకోసం ఎవరిని అయినా బలికొంటుంది.
అందునుంచి అర్ధమానవుడి కదలికల్ని అమితమయిన జాగ్రత్తతో పరిశీలించి అందుకు అనుగుణంగా నడుచుకుంటోంది కెప్టెన్ మాలతి. ఇప్పుడు జనపదాలకు వచ్చారు. కొంత రక్షణ వచ్చినట్టే అయింది.
ఇక ఫిజోకూడా వచ్చే సమయమయింది. అతడుంటే తనకు భయమనేదిలేదు. అర్ధమానవుడిలో స్వార్ధం బుసకొట్టి నప్పుడు ఫిజో తనకు సాయం చేయగలడు.
చాలా రోజులతరువాత అర్ధమానవుడు అడవి వైపుగా వెళ్ళాడు. ఇప్పుడప్పుడే అతడు తిరిగిరాడు అనుకుంది మాలతి స్నానానికి ఏర్పాటు చేసుకుంది. చాలా రోజుల తరువాత వచ్చిన అవకాశం కావటం నించి ఆదమరచి హాయిగా స్నానం చేస్తోంది.
కోతి చేష్టలు చూచి నేర్చుకుని అమిత ఆవేశాన్ని పొంది సుడిగాలిలా వచ్చిన అర్ధమానవుడు ఆమె మీద విరుచుకుపడ్డాడు. ఆమెను కావిలించుకుని ఆ కోతిలా ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేయసాగాడు.
16
అనూహ్యమయిన రీతిలో ఎదురు అయిన ఈ దాడికి మాలతి నిర్విన్నురాలు అయింది. అతడు తుఫానులా అమిత వేగంతో ఆమె మీద విరుచుకు పడిపోయినాడు.
అతని శరీరమంతా కొలిమి తిత్తిలా కాలిపోతూంది. ఊర్పులు లావా కలుగుల్లోంచి బయలు వెడలుతున్నా ఉష్ణవాయువుల్లా వెచ్చగా ఉన్నాయి. ఆ వేడి కెప్టెన్ ముఖాన్ని మండిస్తోంది. ఆ వేగం ఆమె శరీరాన్ని విరిచేస్తోంది.
ఏమి చేయాలో అర్ధమానవునికి తెలియదు. శరీర తమకాన్ని తట్టుకోలేక అలా చేశాడు. బహుశా కోతుల్లాగే శారీరకమయిన తృప్తి ఏదో అతనికి కావాలి.
అందుకోసం తాను ఏమి చేయవలసిందీ మాత్రంతెలియదు. తన మనసు వాకిళ్ళు తెరుచుకుని ఒక వినూత్న లోకం కళ్ళఎదుట ప్రత్యక్ష మవుతోంది. తన ఆరాధ్యదేవత స్నేహమయి అమృతమయి అయిన మాలతి వలనే!
కనులముందు ప్రత్యక్షమవుతున్న వినూత్న ప్రపంచం అతనిలో అనేకానేకమయిన మార్పులకు కారణమయింది. ఆలోచనల్ని సంశయ పూర్ణమయిన భావాలతో ముంచెత్తి ఎన్నో సమస్యల్ని సృష్టిస్తోంది.
అతడు శారీరకంగా అయితే ఎంతయినా శక్తి సంపన్నుడు శారీరకమయిన బలప్రయోగం ప్రదర్శించాల్సి వస్తే అతనిలో ఉత్సాహం యినుమడిస్తుంది.
మాలతిని అలా నిలిపి ఎంతపని అయినా అతనెలానో సాధిస్తాడు. అది తాను సాధించినందువల్ల తన ఆరాధ్యదేవత ముఖంలో కన్పించే అనందాన్ని చూచి తన్మయుడవుతాడు. సంతృప్తుడవుతాడు.
అతని శరీరశక్తి అలాంటిది.
అదే ఒక మానసిక అయిన ఒత్తిడి అయితే అతడుదుర్భలుడు అయిపోతాడు. చిన్న పిల్లవానిలా మారిపోతాడు. రవంత అయినా తట్టుకోలేని శక్తి హీనుడవుతాడు.
అధునాతన ప్రపంచమంతా మనసు అనే యిరుసుమీద నడుస్తోంది, కాని ఆ మనసు ఒత్తిడికి గురి అయితే అర్ధమానవుడు రవంత నిలువరించుకోలేడు. తన ఆరాధ్యదేవత మాలతి మీద ఆధారపడతాడు.
మానసికమయిన ఒత్తిడినించి తనను బయట పడవేయమని ఆమెను సైగల ద్వారా అభ్యర్ధిస్తాడు.
అతడు వంచనకూ, కపటానికి దూరంగా పుట్టి పెరిగి ప్రకృతినించి పాఠాలు నేర్చుకున్నవాడు కావటంనించి ప్రధమంనించే అలా ప్రవర్తించాడు.
కాని యిప్పటి స్థితికి ఆ పరిస్థితులన్నింటికన్నా భిన్న మయినది!
