Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 40


    ఆకారణంగానే శరీరమంతా చెమటలు క్రమ్ముకున్నాయి. ఊర్పులు దీర్ఘతరాలవుతున్నాయి. రక్తం అమిత వేగంతో శరీర మంతటా పాకుతున్న అనుభూతి కలగసాగింది.
    చూపులు వాటినుంచి మరల్చుకోవటం మరచినాడు అర్ధమానవుడు.
    అతడు ప్రకృతి పుత్రుడు. మంచి అయినా, చెడు అయినా ప్రకృతి ఒక్కటే అతనికి నేర్పగల గురువు. తనలో ఆ దృశ్యాలను  చూస్తూ ఉన్నప్పుడు కలుగుతున్న మార్పు లేమిటో అతడు గ్రహించలేకపోయినాడు.
    చూస్తూ ఏవో అనుభూతులకు ఉద్విగ్నతకులోనుఅవుతూ అలా ఉండిపోయినాడు. రెప్పవేయటంమరిచాడు.
    కొంతసేపు మగకోతి తన మనస్సు తెలియపరుస్తూ ఆడ కోతిచుట్టూ పిల్లిమొగ్గలు వేసింది. దానిని ప్రాధేయపడుతున్నట్లుగా దువ్వసాగింది, మచ్చిక చేసుకుందుకు దానికి మెడచుట్టూ చేతులువేసి కిచకిచలు విన్పించింది.
    శరీరమంతా కితకితలు పెట్టింది.
    అది చేస్తున్న పనులన్నింటినీ చూస్తూ ఊరుకుంది ఆడకోతి, ప్రధమ దశలో తననించి ఎటువంటి ప్రతి స్పందనా కన్పించ నివ్వకుండా బెట్టు చేసింది.
    అయితే ప్రకృతి సిద్దాంతాలను అనుసరించి మగకోతి ఎటువంటి నిరుత్సాహమూ పొందలేదు. ఆడకోతిలో చైతన్యం కలిగించేందుకు మరింత ఉత్సాహాన్ని చూపుతోంది.అదిబెట్టు చేసిన కొద్దీ లాలించటం, ప్రాధేయపడటం చొరవ చూపింది. దాని శరీరంలోని కొన్ని ప్రత్యేకమయిన స్థానాలను చేతులతో స్పృశించసాగింది.
    వాస్తవానికి ఆడకోతిలో ప్రతిస్పందనలు ఇతఃపూర్వమే ప్రారంభమయినాయి. అదిబెట్టు చేయటమనేది స్త్రీత్వం తాలూకు నైజ గుణాన్ని అనుసరించి మాత్రమే!
    విచిత్రమేమిటంటే ప్రకృతిలోని ప్రాణులన్నింటి లోనూ స్త్రీ పురుష ప్రాణుల నైజాల్లో కొన్ని సారూప్యతలు కన్పిస్తాయి. ఆహా విహారాల విషయంలో ఆడ ప్రాణులు ఆధారపడినట్లుగానే, సెక్స్ విషయం వచ్చే సరికి మగ ప్రాణులు తొందర పడతాయి ఆడ ప్రాణులు కాసేపు బెట్టు చేస్తాయి, అది ప్రకృతి ధర్మం. అన్ని ప్రాణుల్లో నూ యిలాంటి విచిత్ర లక్షణమే కన్పించేది ఎందుకో విశ్లేషించటం కష్టమే.
    సెక్స్ అనేది అన్ని ప్రాణులకూ జన్మతఃనచ్చేలక్షణం ఆకలినిద్ర అవసరమయినట్లే ఒక నిర్ణీత కాలంలో ఆడ ప్రాణులకూ మగ ప్రాణులకూ సెక్స్ వాంఛలు కలుగుతాయి. ఆ సుఖాన్ని అవి సమంగా పంచుకుంటాయి.
    ఆ తరువాత దాని ఫలితాంశమయిన బిడ్డను కనటం అనే బాధ్యతను ఆడ ప్రాణులు స్వీకరిస్తాయి. సెక్స్ తాలూకు సుఖం రెండు ప్రాణులకూ సమామయిన అవుసరం.
    మీదు మిక్కిలి దాని ఫలితాన్ని బాధ్యతని పూర్తి స్థాయిలో స్వీకరించేవి ఆడ ప్రాణులు అందునించి సెక్స్ కార్యకలాపంలో వాటిది అత్యంత కీలమయినది.
    ఆడప్రాణి అనుమతి లేకుండా ఏ ప్రాణి దానితో జీవిత సుఖాన్ని పంచుకోలేదు. అయితే అది కాసేపు బెట్టు చేయటం. బ్రతిమాలించుకోవటం మామూలు! మగప్రాణులు ఆ తరువాత బాధ్యతను స్వీకరించవలసిన అవుసరం లేనివి. ఆనంద పరమా వధికే అవి పరుగెడతాయి.
    సెక్స్ చర్య అయిపోయింతరువాత అందుగురించి పూర్తిగా మర్చిపోతాయి. తిరిగి అవుసరమయినప్పుడు తొందరపడతాయి. అది మగలక్షణం.
    మగప్రాణిలా సెక్స్ అనుభవం తరువాత దాని గురించి మర్చిపోగలగటం ఆడ ప్రాణులకు అసాధ్యం. అందుకే అవి సెక్స్ సుఖాన్ని వాంచించినా మగ ప్రాణిలా అందుకోసం తొందర పడవు, పడలేవు.
    ఎలాగయితేనేం? సెలయేటి తీరాన చెట్టు కొమ్మమీద చాలా పిల్లమొగ్గలు వేసిం తరువాత మగకోతి ఆడకోతిని మెప్పించగలిగింది. అందుకోసం అది నానా అవస్థలూ పడింది కాని విజయం సాధించింది.
    తనతోపాటుగా జీవిత సుఖాన్ని అనుభవించేందుకు ఆడకోతి మగకోతికి అనుమతిని మంజూరుచేసింది. దానితో మగకోతి ఆనందానికి అవధులులేకుండా పోయినాయి.
    దానిచుట్టూ కాస్సేపు గెంతులువేసి తన సంతోషాన్ని ప్రకటించింది మగకోతి. ఆతరువాత చనువు తీసుకుంది. దాని శరీరంతో తన శరీరాన్ని కలిపేందుకు ప్రయత్నం ప్రారంభించింది.
    ఆస్థాయికి వచ్చాక యింక వాటికి ఈ ప్రపంచం గురించిన జ్ఞాపకాలేవి మిగలలేదు. నిశ్చింతగా తమ క్రీడలో అవి తన్మయ భావంతో మునిగిపోయినాయి. ఆనంద రసార్ణవంతో లీనమయినాయి. అర్దమానవుడు అదృశ్యాన్ని చూస్తూ బొమ్మలా నిలిచిపోయినాడు. అతని మనసులోని మారు మూలలు చైతన్యవంత మయినాయి.
    ప్రధమంనుంచి ప్రకృతి అతనికి కొన్ని అవుసరాలను కలిగించి అవి తీర్చుకునే మార్గాలనుకూడా చూపించింది. ఆకలిని యిచ్చింది. అది తీర్చుకుందుకు ఆహారాన్ని సృష్టించింది. దాన్ని సాధించుకుందుకు తెలివీ బలమూ అందించింది.
    నిద్ర యిచ్చింది. ప్రశాంతమయిన గుహాంతరాలలో ప్రశాంతంగా నిద్రించే అవకాశాలను సమకూర్చింది.
    ఆహారమూ, నిద్రా బాగానే ఒక శారీరక అవుసరమయిన ఈ చిత్ర ఆనందంపట్ల ఆకర్షితుడయినాడు అర్ధమానవుడు. ఇది తీర్చుకుందుకు ప్రకృతి ఏమీ సమకూర్చిందో అతనికి తెలియదు! ఆలోచించలేడు. అర్ధం చేసుకోలేడు.
    అయితే ప్రకృతి అతని తల్లి. అమాతృమూర్తి తన కోసం అన్నింటిని అందివ్వగలదని అతడి విశ్వాసం అవిశ్వాసంతోనే అతడు ఆ ఆనందాన్ని తానూపొందాలని అభిలషించాడు. అలాంటి కోరిక అతని మనసుకి శాంతిలేకుండా చేసింది. శరీరమంతా రోమాంచితమయింది.
    ముఖమంతా శ్వేదబిందువులతో తడసి ముద్దలా అయిపోయింది. రక్తమాంసాలు ఉడికిపోవటం ప్రారంభించాయి.
    అర్ధమానవుడి కనులు ఎదుట తమ జీవితానందాన్ని పూర్తిగా జుర్రుకున్నాయి. కోతులు రెండూ అపరిమితమయిన తృప్తితో ఆనందంతో ఒకదానినొకటి ముద్దాడుకున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS