మర్నాడు హోటల్ మయూరిలో ఓ స్త్రీ హత్య గురించి గుప్పున పైకి వార్త వచ్చింది. కుతూహలం కొద్దీ నేను వెళ్ళి చూశాను. నిన్న రాత్రి సజీవంగా చూసిన స్త్రీ మూర్తిది ఆ శవం. నేను బాగా గుర్తుపట్టాను. అయితే గుర్తు పట్టానని మాత్రం ఎవరితో చెప్పలేదు. గుర్తుపట్టానని చెప్పే వాళ్ళతో చెప్పాలికాని, అందరితో చెబితే ఏం బాగుంటుంది ముఖ్యంగా పొలేఉస్లథొ ఈ విషయం అసలు చెప్పకూడదు కదా! నేనెవరితో ఏమీ చెప్పకుండా మౌనంగా చూస్తూవుండిపోయాను. తరువాత రెండవ కంటికి తెలియకుండా చాలా విషయాలు చాటుగా ఎంక్వయిరీ చేసి తెలుసుకున్నాను.
నీపేరు కిరణ్. కాని కిషోర్ లాల్ అనే పేరుతో మయూరి థర్డ్ ఫ్లోర్ లో రూమ్ నెంబరు 44లొ దిగావు. హోటల్ రిజిష్టర్ లో బిజినెస్ నిమిత్తం వచ్చినట్టు రాసుకున్నావు.
నీ జీవితానికి అడ్డం వచ్చిన అనితని అతి చాకచక్యంగా ఈలోకంనుండి పైలోకానికి పంపించావ్. చాలా ఉపాయంగా కామినీతో కలసి పెద్ద నాటకం ఆడి అనితను మెట్లక్రింద గూటిలో పారేసి నువ్వు చల్లగా తప్పుకున్నావ్.
ఆ రాత్రి నీదగ్గరవుంది ముందు సజీవంగావున్న అనిత ఆ తరువాత శవం అయింది. హోటల్ సిబ్బందిని పోలీసులని తప్పుదోవ పట్టించడానికి కామినీతో కలిసి చాకచక్యంగా నాటకం ఆడి సరిఅయిన సమయంలో అక్కడినుండి బయట పడ్డావు అవునా!
కిషోరీలాల్ అనేవాడు లేడు కిరణ్ తప్ప.
అనితను చంపింది కిషోరీలాలా. అతని అసలు పేరు కిరణ్.
కిషోరీలాల్ కు సహాయంచేసింది కామినీదేవి. తెలివిగా కిరణ్ ని తన భర్తగా చేసుకుంది.
అనిత తరువాత అనితే అనుకునేలా భ్రమింపచేస్తూ నీ గదిలో వున్న కామిని మొహాన్ని చాటువేసి శరీరాన్ని చూపిస్తూ బ్రహ్మాండమయిన సాక్ష్యాన్ని సృష్టించింది. నీతో వచ్చిన యువతి నీతోనే బయటకు వెళ్ళేటట్లు చేయగలిగింది.
మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. నిన్ను కాదు, కామినీదేవిని అనిత మరణించిన ఐదవక్షణంనుండి ఇప్పటి దాకా ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. తెలిసి ఇన్నాళ్ళూ ఎందుకు ఊరుకున్నావు అన్న అనుమానం నీకు వచ్చింది కదూ! నాకు నీ కేసు ఒకటేకాదు సవాలక్ష పనులున్నాయి. అదేం యోగమో కాని నాకు అన్నీ ఇలాంటి కేసులే తగులుతూ వుంటాయి.
అసలు విషయానికి వస్తాను.
నేను కళ్ళారా చూడటమే కాదు. విషయమంతా తెలుసుకోవడమేకాదు మరోపనికూడా చేశాను. సాక్ష్యాలు వుంటే తప్ప నేను నిలవదని అఘోరించే మనిషిని నేను. నీకు సంబంధించిన ప్రతి విషయమూ సాక్ష్యమూ నా దగ్గిర భద్రంగా వున్నాయి.
నేను నిన్నూ అనితని ఫోటో తీశాను. డెడ్ బాడీతో వున్నప్పుడు తీశాను. కామినీని నిన్ను కలిపి తీశాను. ఇలా రాసుకుపోతే టైమ్ వేస్ట్. మొత్తానికి నుంచి ఈ క్షణం వరకూ నీ కొరకే నాలుగురీళ్ళు ఖర్చు చేశాను. ఇంతకు మించి వివరం మాత్రం చెప్పను నీకు.
ఈ విషయం బయటికి వస్తే నీ గతి ఏమవుతుందో నీకు తెలుసు నాకూ తెలుసు. ఇంతవరకూ కొన్ని కేసుల ద్వారా నాకు డబ్బుపుట్టింది. రోజులు హాయిగా గడిచిపోయాయి. ఆ డబ్బు అయిపోవస్తున్నది. కాబట్టే నీకేసు తాలూకా ఫైలు బయటికి తీశాను. అంటే ఈ క్షణంనుంచే నీకేసు చేతిలోకి తీసుకున్నాను. నేను మళ్ళీ ఇంకొకసారి నీకు లెటర్ రాస్తాను. నా చెయ్యి కొంచెం తడపాల్సివుంటుంది. ఎంత అనేది, ఎక్కడ అందివ్వాలి అనేది, ఎలా అందివ్వాలి అనేది వివరముగా మరోసారి తెలియచేస్తాను. రెడీగావుండు. అడగంగానే డబ్బు ఇవ్వకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నేను అసలే సహనంలేని మనిషిని. నా కోపం సంగతి నీకు తెలియదు.
నేనడిగిన టైమ్ కి నేను అడిగినంతా ఇచ్చావాసరే! లేక పోతే వెంటనే నా దగ్గరవున్న సాక్ష్యాధారాలను పోలీసులకి అందచేస్తాను. ఎందుకంత తొందర పడతావు అంటావేమో నే ముందే చెప్పా కదా! నే చేపట్టిన కేసుని అయిదు నిమిషాలలో అటో ఇటో తేల్చేయడమే. నా క్లయింట్ డబ్బు పెట్టగలడు, నా మాట వెంటనే వినేవాడు అయితే సరే! లేకపోతే నేనెందుకు సహనం సహించాలి. ఈ కేసులు లేక చస్తున్నారు. వాళ్ళే చూసుకుంటారు. నా కిలాన్తి కేసులు చాలా వున్నాయి నువ్వు కాకపోతే నీ తాతలాంటి వాడి కేసు చేపడతాను.
ఇదే ఫస్ట్ వార్నింగ్ లాస్ట్ వార్నింగ్. త్వరలో మరో లెటర్ ద్వారా కలుసుకుంటాను. ప్రస్తుతానికింతే.
ఇట్లు,
ఓ క్రిమినల్ అండ్ లాయర్. లెటర్ చదవటం పూర్తి చేశాడు కిరణ్. అయోమయంలో పడి మళ్ళీ మళ్ళీ చదివాడు ఆ లెటర్. పిచ్చిగా ఆ లెటర్ ను చూస్తూ ఆలోచనలో పడ్డాడు.
"భగవంతుడా! మళ్ళీ ఇదేమిటి? అనుకుంటూ ఆ లెటర్ ని అలాగే పట్టుకుని ఆలోచనలో పడ్డాడు.
"భగవంతుడా! మళ్ళీ ఇదేమిటి? అనుకుంటూ ఆ లెటర్ ని అలాగే పట్టుకుని ఆలోచనలో పడిపోయాడు.
"క్రిమినల్ అండ్ లాయర్ అంటే ఈ రాసింది క్రిమినల్ లాయర్ కాదన్న మాట. నేరస్తుడు మరియు లాయర్ అంటే అర్ధమేమిటి? నేరస్తుడు లాయర్ అయ్యాడా! లాయరు అయిన తరువాత నేరస్తుడిగా మారాడా!
వీడికి ఈ విషయం ఇంత వివరంగా ఎలా తెలిసిపోయింది. కామినీ చెప్పిందా! ఊహు... చెప్పదు. పైగా కామిని తనకి సహాయం చేసినట్లు తను స్పష్టంగా రాశాడు. ఇది కామిని పని కానపుడు ఇంకో మనిషికి తెలియడానికి అవకాశం లేదు. ఒకవేళ తెలియడానికి ఎవరికి అవకాశం వుంది. నిజంగా ఫ్లాట్ లో వున్న వ్యక్తా లేక....."
కిరణ్ కి చటుక్కున దామోదరం గుర్తుకు వచ్చాడు. "క్రిమినల్ లేడు లాయర్ అంతకన్నా లేడు. వాడే...వాడే... ఆ దామోదరం గాడే. కామినీ నుండి ఈ విషయం ఎలానో గ్రహించి వుంటాడు. వాడి మొహం చూస్తూంటేనే వాడు ఎలాంటివాడో తెలిసిపోతున్నది. వాడే... వాడే.........
కిరణ్ ఇటు తలుపులు అయితే లోపలి గడియలు అయితే వేశాడు కాని ప్రక్కగది నుండి ఈ గదిలోకి వచ్చే తలుపులు చూసుకోలేదు. ఆ తలుపులు నెమ్మదిగా తెరచుకుని రావుగారు నెమ్మదిగా లోపలికి వచ్చారు. కిరణ్ దగ్గరకు వచ్చి ఆగారు.
కిరణ్ పరధ్యానంగా వుండి తండ్రి రాకను గమనించలేదు.
రావుగారు కిరణ్ చేతిలోని లెటర్ ని చటుక్కున లాక్కున్నారు.
తండ్రిని చూసి తెల్లబోయాడు కిరణ్, అయోమయంగా "డాడీ!" అని ఆ లెటర్ ఇలా ఇచ్చెయ్యండి ప్లీజ్. మీరు చదువకూడదు" అన్నాడు.
