శ్రీచరణ్ గదిలోకి తొంగి చూసింది. తన వంకే చూస్తున్నాడు. కావాలనే అతను తొందరగా వచ్చాడేమోనన్న అనుమానం వచ్చింది.
"పాపం...అల్లుడుగారు కాఫీ కూడా తాగలేదు. గట్టిగా అడిగితే "ప్రనూ రానేయండి, వచ్చాక అందరం తాగుదామని అన్నాడు" అంది అల్లుడ్ని తెగమెచ్చుకుంటూ సత్యవతి.
కొరకొర చూసి, శ్రీచరణ్ వైపు, తనని ఏడిపించాలనే ఇదంతా చేస్తున్నాడనిపించింది.
"ఎంతయినా బావకు అక్కంటే ప్రేమే." అంది ప్రియ.
"అంతా ఆ దేవుడిదయ" అన్నాడు శర్మ గది గోడకు వేలాడుతున్న వేంకటేశ్వరస్వామి పటం వైపు చూసి చేతులు జోడిస్తూ...
"ప్చ్..." అనుకున్నాడు శ్రీచరణ్.
* * *
సత్యవతి కాఫీ కలిపి ప్రనూష చేతికి ఇచ్చి "ముందు అబ్బాయికి ఇచ్చిరా పాపం నీకోసమే కాఫీ తాగకుండా ఎదురు చూస్తున్నాడు." అంది సత్యవతి.
కోపంగా కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని శ్రీచరణ్ వున్న గదిలోకి వెళ్ళి ఏంటి కత...నా మీద పితూరీలు చెబుతున్నావ?
"ఏం పూరీలు?" అడిగాడు అమాయికంగా మొహంపెట్టి.
"పితూరీలు.... అని..." అతనామాట వ్యంగ్యంగా అడిగాడని అర్ధమై "ఏదో ఒకటి." అంది.
"నేనేం చెప్పాను?"
"నేను వచ్చేవరకు కాఫీ తాగనని ఎందుకు చెప్పావు?"
"ఓహ్.... అదా....నేను కాఫీ తాగాక, ఆ తర్వాత నువ్వొచ్చి చిందులు వేస్తే... లేదా...దానికి బిల్లు వేస్తే... ఆ బొక్క నాకెందుకని. నువ్వొచ్చాక కన్ఫర్మ్ చేస్కొని తాగుదామని అలా చెప్పా..."
"ఈ బ్రూ నా అకౌంట్లోదే..." అంది ప్రనూష.
"అంటే దీనికి డబ్బులు దొబ్బుతావా?"
"ఛీ.... ఆ లేబర్ భాషేమిటి? అసహ్యంగా అంది మొహమంతా వికారంగా పెట్టి.
"మొహమేంటి అలా వికారంగా పెట్టావు? వికారాలు చేసి నువ్వు వాంతులు చేసుకుంటున్నావేమో అనుకుంటారు జనాలు.
కోపంగా చూసింది ప్రనూష.
"ఓ.కె....ఓ....కె......నువ్వీ కాఫీకి బిల్లు వేసేట్టయితే నాకీ కాఫీ వద్దు. నేనే నా కిచెన్ లోకి వెళ్ళి వేడివేడి టీ... అదీ త్రి రోజెస్ తో చేసుకొని తాగుతాను....
ఇప్పుడుందా రుచి? హూ!
రంగూ.... హూ! వాసనా.... హూ!
అది గో ఆ టీ....అన్నమాట" అన్నాడు.
నా ఖర్మ' అంటూ కాఫీ కప్పు వెనక్కి తీసుకెళ్ళబోయి ఆగిపోయింది.
"అమ్మో కాఫీ ఎందుకివ్వలేదంటే ఏం చెప్పాలి? అనుకున్న ప్రనూష బుద్దిగా శ్రీచరణ్ దగ్గరికి వచ్చి..." "తాగు" అంది.
"ఏంటి గేదె దగ్గరికి వచ్చి "కుడితే పెట్టి" తగు అన్నట్లు ఆ స్టోనేంటి? నాకేం అక్కర్లేదు" అన్నాడు బుంగమూతిపెట్టి.
మహానుభావా....తాగండి" అంది విధిలేక.
"డబ్బు అడగవుగా..."
"అడగను"
"ఒట్టు"
"ఒట్టు"
"అమ్మతోడు"
"అమ్మతోడు"
"మీ నాన్న తోడు..."
అప్పుడనుమానం వచ్చి చూసింది శ్రీచరణ్ వైపు.
తనని ఆటపట్టిస్తున్నాడని అర్ధమైంది. కోపంగా చూసింది.
"ఇవ్వేళ్టికీ డోస్ చాల్లే" అనుకొని బుద్దిగా కాఫీ తాగాడు.
* * *
రాత్రి పదిన్నర దాటింది. అందరూ నిద్రావస్థలో వున్నారు.
నిద్రపోనిది శ్రీచరణ్, ప్రనూషలే.
చెరోవైపు పడుకున్నారు.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
శ్రీచరణ్ కో అందమైన కల వచ్చింది. ఆ కలలో తనూ, శశి ఝామ్మంటూ చెట్టాపట్టాలేసుకొని సినిమాలకు వెళ్ళినట్టు, షికార్లు కొట్టినట్టు..... రకరకాల మోడ్రన్ డ్రెస్సులతో తనతో డ్యూయెట్టు పాడినట్టు."
ఒక మనిషి మీద మనకే ఫీలింగ్ ఏర్పడితే... అది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది.
వాటిని అల్లుకొని బోల్డు ఆశలు, కోరికలు, కలలూ పరిభ్రమిస్తూ వెన్నంటి ఉంటాయి.

ఎప్పుడైతే శ్రీచరణ్ ఆలోచనల్లో శశి చోటుచేసుకుందో.... ఆమె తాలూకు ఆలోచనలు అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మనసులోని ఆలోచనను శరీరంతో ట్యూన్ చేసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రనూష కూడా ఇంచుమించు అదే ఆలోచనలో వుంది.
ఆమె కళ్ళముందు ప్రభాత్ కనిపించేడు.
అతని మాటలు వినిపించాయి.
అతని ఫీలింగ్స్, అతని నడత, నడక... అన్ని కళ్ళముందు మెదిలాయి, ఓ వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే పాజిటివ్ గా రియాక్ట్ అవుతామో...అతడి గురించి, పాజిటివ్ గానే ఆలోచించడానికి ఇష్టపడతాం...అతని బలహీనతలూ, బ్యాగ్రౌండూ గుర్తుకురావు, అతని మీద నెగిటివ్ ఫీలింగ్ కలిగేంత వరకూ... ప్రనూష ఇప్పుడు ప్రభాత్ మీద పాజిటివ్ ఫీలింగ్ ఏర్పరచుకుంది.
దివి తాలూకు పరిణామం తెలియకుండానే.
* * *
సుడిగాలిలా శ్రీచరణ్ గదిలోకి వచ్చేసింది ప్రియ.
"ఏంటి ప్రియా...." అడిగాడు ఆమె వేగాన్ని చూసి శ్రీచరణ్.
"బావా.....నువ్వలా నన్ను "ప్రియా అని పిలుస్తుంటే, నాకు ప్రియత మా అని పిలవాలనిపిస్తోంది" అంది ప్రియ మత్తుగా శ్రీచరణ్ వైపు చూస్తూ.
"నిజ్జమా...?"
"రెండుసార్లు నిజ్జం.....బావా" అంది.
ఏంటో...నువ్వలా అంటూంటే నాకు సిగ్గేస్తోంది" మెలికలు తిరిగిపోతూ అన్నాడు శ్రీచరణ్.
"అర్రె....నీక్కూడా సిగ్గుందా బావా?" అడిగింది ఆశ్చర్యపోతూ ప్రియ.
"అదేంటి ప్రియా...ఒక్కసారిగా అంతమాటనేసావ్....నాది సిగ్గులేని జన్మనా నీ ఉద్దేశం?"
"ఛ..ఛ.... నా ఉద్దేశం అదికాదు. జనరల్ గా ఆడాళ్ళు మెలికలు తిరిగి "సిగ్గేస్తోంది" .... అని అంటారుగా నువ్వులా మెలికలు తిరిగి.... "సిగ్గేస్తోంది" అంటే, ఆ టైప్ సిగ్గు నీకూ వుందా అని అడిగాను" చాంతాడంత క్లారిఫికేషన్ ఇచ్చింది ప్రియ.
"ప్రియా....నీ వైపు నేనెంత ఆరాధనగా చూస్తున్నానో నా కళ్ళలోకి చూడు." అన్నాడు కళ్ళని పెద్దవిచేసి, ఆమె మొహం ముందు తన మొహంపెట్టి!
"దాన్ని మిడిగుడ్లేసుకొని చూస్తున్నారంటారేమో బావా! అంది ప్రియ.
"ఛ...ఛ.. మీ అక్క వాడే భాషది. ఇంతకీ ఇంతపొద్దునే వచ్చేసావేం...?"
"ఏం లేదు బావా...ఓసారి నన్నెత్తుకొని గిరగిరా తిప్పవూ..." గోముగా అడిగింది ప్రియ.
"నిన్నా"?
"కాదు బావా మా అమ్మని అదే మీ అత్తయ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పితే వెరయిటీగా వుంటుంది" అంది కసిగా ప్రియ.