యాక్సిలేటర్ ని అదిమిపట్టి ఉంచాడు గౌడ్. రెప్పవేయకుండా దూరాన కనబడుతున్న రెడ్ లైట్లనే చూస్తున్నాడు.
క్షణక్షణానికి లారీకి దగ్గరవుతోంది జీపు.
"నేను అమ్మతో వెళతానూ!" అంటూ గుక్కపట్టి ఏడుస్తోంది లక్కీ.
కొద్దినిమిషాల్లో లారీకి రెండుగజాల దూరంలోకి వచ్చేశాడు గౌడ్.
అప్పుడు జరిగింది అది.
క్లీనర్ డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టి లారీలోనుంచి ఒక ఆకారం లేచి లారీ వెనుకభాగం వైపుకి ఎగబాకింది.
లారీవెనుక భాగంలో కొన్ని టిన్నులు ఉన్నాయి. వాటిలో డీసిల్ ఉంది.
టిన్నులు ఓపెన్ చేసి రోడ్డుమీద పొయ్యడం మొదలెట్టాడు అతను.
కాసేపట్లో రోడ్డు అంతా డీసిల్ నిండిపోయింది. అడుగేస్తే జర్రున జారేటట్లు స్లిప్పరీగా తయారయింది రోడ్డు.
విపరీతమైన స్పీడుతో వస్తున్న గౌడ్ జీపు ఆ డీసెల్ మడుగులోకి రాగానే పట్టుతప్పి గిర్రున తిరిగి ధనామని రోడ్డు పక్కన ఒక చెట్టుని గుద్దేసింది.
అదిచూసి వికటంగా నవ్వాడు లారీలోని వ్యక్తి.
అతనిపేరు జాన్!
పద్దెనిమిదేళ్ళక్రితం కామాక్షిని ఎత్తుకెళ్ళిరాఘవులుతో కలిసి సృజనతోబాటు ఆ అమ్మాయిని అహల్యకు అమ్మిన నరరూప రాక్షసుడు అతను.
ఆ లారీ రాఘవులుది!
అతను ఇప్పుడు రాఘవులు కాదు. రాఘవరావు.
జాన్ ఎత్తుకెళ్ళిపోతున్న ఆ స్త్రీ పార్వతి. కామక్షికి అక్క!!
"ఇలాంటి చిల్లర పనులు మానలేదు కాబట్టే నువ్విక లారీ డ్రైవరుగానే ఉన్నావు. నేను పదిలారీలకు ఓనర్ని అయ్యాను" అన్నాడు రాఘవరావు తన ఎదుట నిలబడి ఉన్న జాన్ తో. జాన్ మొహంలో భయంకనబడుతోంది. తన ముందు టీపాయ్ మీద పెట్టివున్న విస్కీ ఒక్క గుక్కతాగి బ్రెయిన్ పకోడా ముక్క ఒకటి కొరికాడు రాఘవరావు. "అందుకనేరా, అదృష్టాన్ని బట్టి ఆలోచనలు అంటారూ! ఎంతసేపూ కుండల్లో గుర్రాలు తోలుదామా! ఆడోళ్ళని ఎత్తుకెళ్ళి అమ్ముకుందామా అన్నయావ తప్ప పెద్ద ఆలోచన్లు యాడవస్తాయ్! ధూ నీయమ్మ కడుపుకాల! చేసేదంతా చేసేసినా కాళ్ళమీద పడితే సుఖమేమిటిరా! అయినా ఆడదాన్ని ఎత్తుక రావటానికి నా లారీనే దొరికిందిరా! ఏబ్రాసి మొహంఎర్రినాయాలా!"
రాఘవరావు అంటున్న మాటలని పళ్ళ బిగువున సహిస్తున్నాడు జాన్. అంతే అంతే! నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే చాలు వాడు నానా మాటలు అన్నా పడాల్సి వస్తుంది!
ఈనా కొడుకు కూడా ఒకప్పుడు తఃనలాగే ఆడపిల్లల్ని అమ్మి డబ్బు సంపాదించినవాడుకాడూ!
అయినా తన టయం బాగాలేదు. వాడిది బాగుంది. వాడు మాటలన్నా పడాలి తను! వాడిసాయం లేకపోతే పని జరగదు ఇప్పుడు.
"కాదు రాఘవులూ!" అనబోయాడు జాన్.
నుదురుచిట్లించి చూపాడు రాఘవరావు.
తప్పుదిద్దుకున్నాడు జాన్. "అది కాదు రాఘవరావు! మనకు తెలిసినవాళ్ళే సినిమాలు తీస్తున్నారు"
"ఏం సినిమారోవ్?"
"బ్లూఫిలింలు! వీడియోకేసెట్లన్న మాట! దానికి అన్ని వయసులవాళ్ళూ కావాలిట! చూసేవాళ్ళ ముచ్చట! నడివయసు పిల్లలతల్లిదీ ఒక అందమే కదా! రుచులు! అందుకనే ఈమెని ఎత్తుకొచ్చా! బ్లూఫిలిమ్ తీసి వదిలేత్తారు. నాకు పదిహేనువేలు గిడతాయి. సగం ఇచ్చుకుంటాలే ఓయబ్బా! కాస్త పోలీసోళ్ళతగూరాకుండా సూడు!"
"పదిహేను వేలా!" అన్నాడు "అంత ఇస్తార్రా!"
"లెక్కెట్టుకుని జేబులో పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది గానీ పని సంగతిజ్జూడరాదా?"
కాసేపు ఆలోచించాడు రాఘవరావు. అతను ఘరానా మనిషయ్యాడు ఇప్పుడు. చిన్న చిన్న వ్యవహారాల్లో తలదూర్చడు.
కానీపదిహేను వేలల్లో సగం అంటే....
అదిమరీ అంత కొట్టిపారెయ్యాల్సినంతచిన్న మొత్తమేంకాదు!
రాఘవరావు ఆలోచిస్తూ ఉంటే జాన్ ఇల్లంతా కలయజూసాడు. ఒకప్పుడు చిన్న ఇల్లే అది. నూటయాభై గజాల స్థలం ఉండదు మొత్తం. కానీ ఇప్పుడదే మూడంతస్తుల భవంతి అయింది. ఒక్క అంగుళం ఖాళీస్థలం వదలకుండా ఒక్కో వ్యవహారంలో డబ్బువచ్చినప్పుడల్లా ఒక్కొక్క గది చొప్పున కట్టిపారేసాడు రాఘవరావు. గోడలకి కళ్ళు చెదిరేలా ముదురురంగులు వేసి వున్నాయి. ఒకదానితో ఒకటి అతకనట్లు రకరకాల అలంకరణ సామగ్రి ఉంది ఇంటినిండా.
ఇంట్లో ఎటుచూసినా డబ్బు దర్శనమిస్తోంది గానీ అభిరుచి ఎక్కడా కనబడడంలేదు.
రాఘవులుని కొంచెం ఖుషీ చెయ్యదలుచుకున్నాడు జాన్.
రాఘవులుని ఖుషీ చేసి మంచి చేసుకోవాలంటే అతని కూతురు అలేఖ్యని పొగడాలి.
అది జాన్ చాలా రోజుల క్రితమే కనిపెట్టిన రహస్యం.
"మీయమ్మాయి ఊటీలో చదువు అయిపోయిందా?" అన్నాడు జాన్.
ఆ మాట వినగానే ఆలోచనతో ముడిపడివున్న రాఘవరావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. మొహంలో చిరునవ్వు చోటుచేసుకుంది.
"అలేఖ్య సంగతా! అయిపోతుందిరా చదువు! వచ్చేస్తుంది ఈ నెల్లో పైనెలో!" అన్నాడు తృప్తిగా. "తను వచ్చాక ఇంక మన అడ్రెసు మారిపోద్ది. మనకైతే ఈ సందుల్లో గొందుల్లో ఉంటున్నాంగానీ తను నాజూగ్గా పెరిగిన పిల్లకదా! జూబ్లీహిల్సులో మంచిబంగళా ఏమన్నా బేరానికొస్తుందా అని చూత్తన్నా!"
"కొను! కొను!" అన్నాడు జాన్ ఈర్ష్యని దాచుకుంటూ. "కొనరా నా కొడకా!" అనుకున్నాడు మనసుతో కసిగా.
"కొను రాఘవులూ! నువ్వు సంపాదించేదంతా ఎవరికోసం నీ ముద్దుల కూతురి కోసమేకదా!" అన్నాడు పైకి ఉబ్బేస్తూ.
సంతోషంగా నవ్వాడు రాఘవులు. పకోడా ఇంకొకటి నోట్లోవేసుకుని "అయితే నువ్వెత్తుకొచ్చిన ఆడది ఎక్కడుందీ" అన్నాడు.
"ఆబ్లూ ఫిలిం కంపెనీ వాళ్ళకి ఇచ్చేశా! తెల్లారేలోగా నలుగు కేసెట్లు తీసేస్తారు. నలుగురు చాకుల్లాంటి కుర్రాళ్ళు రెడీగా ఉన్నారులే!"
"ఒక్కరాత్రిలో నాలుగు కేసెట్లు తీస్తార్రా" బతుకుందా?
"పిల్లలతల్లయినా దిట్టంగా ఉంది. కాస్త పోలీసోళ్ళని కనిపెట్టి చూడు రాఘవరావ్ టేషనుకెళ్తావా ఇప్పుడు?"
"మనమెందుకురా వెళ్ళేది! వాళ్ళే వస్తారు!" అని వాచ్ చూసుకుని "ఎస్సయ్ రావాల ఇప్పుడు! వేళయింది!" అన్నాడు రాఘవరావు.