Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 41

   

    తొడకింద కారుతున్న రక్తపుబొట్లను చిన్న సీసాలో పట్టుకుంది. ఆ తరువాత తను కోసుకున్న దగ్గర నీటిగుడ్డతో అదిమిపట్టుకుని అపై పౌడర్ వేసేసింది.


    కాటుక కలిపే కార్యక్రమం మరో అయిదు నిముషాలకి అయిపోయింది మరుసటిరోజు ఉదయమే ఇద్దరూ సుధాకర్ ఇంటికెళ్ళారు. అదృష్టం కొద్దీ సుబ్బారెడ్డి పొలం వెళ్ళాడు. సరస్వతమ్మకు ముందు అబద్దమే చెప్పారు.


    అప్పుడు అతను కళ్ళు తెరచిలేడు.


    మనసు వుండబట్టలేక అతడ్ని ఠక్కున పట్టుకుంది ఉమ. అతని ఒళ్ళు బాగా కాలిపోతోంది.


    " బాగా జ్వరంగా వుందా?" ఉమను చూస్తూనే అందోళనగా అడిగింది సక్కుబాయి.


    "నేను ద్వారం దగ్గరుండి చూస్తుంటాను. ఎవరైనా వస్తారేమోనని. నువ్వు కాటుకతీసి అతనికి పెట్టెయ్" అమె మళ్ళీ చెప్పింది. అనడం తరువాయి సక్కూబాయి తలుపు దగ్గర నిలుచుంది. ఉమ కాటుక డబ్బా తీసుకుని అతని దగ్గరకు గబగబా వెళ్ళింది.


    అతను అప్పుడు కూడా కళ్ళు తెరవలేదు. గాలి వదిలినప్పుడు సైతం వేడిగా తగులుతోంది. నిద్రలో కలవరిస్తున్నట్లు పెదవులు కదులుతు పరిస్ధితి విషమంగా వుందని మనిషిని చూస్తుంటేనే తెలిసిపోతోంది.


    అమె పోలేరమ్మని, గంగమ్మ తల్లిని, వాళ్ళ కులదైవం అయిన మునీశ్వరుడ్ని తలుచుకుంటూ కాటుక డబ్బా తెరిచింది. వేలికి కాటుక తీసుకుని అతని క ళ్ళు తెరిచింది.


    అతను పూర్తిగా స్పృహలో లేడు.


    కనురెప్పల్ని తెరిచి ,  సన్నగా కాటుక రాసింది.


    అతను అప్పటికి కదిలాడు.


    కళ్ళు తెరిచాడు. "ఉమా!" అతను పెదవులను కదిపాడు గానీ, శబ్దం బయటికి రాలేదు.


    "రెండు రోజులకీ బాగయిపోతుంది"  కళ్ళలోంచి కారుతున్న కళ్ళను తుడుచుకుంటూ అంది  ఉమ.


    అతన్నే తదేకంగా చూస్తుండిపోయింది.


    "కాటుక పెట్టడం అయిపోయందా వెళదాం" సక్కూబాయి తలతిప్పకుండానే అడిగింది.


    "వెళ్ళొస్తాను" అని ఏడుపు తన్నుకురావడంతో తల తిప్పుకుని అక్కడ్నుంచి కదిలింది. తన ముర్ఖత్వంవల్ల, తన తొందరపాటుతనంవల్లే అతనికి అలా జరిగిందనీ అనుకుంటూ వుంటేనే దుఃఖం అగడంలేదు. పై పెచ్చు తనకు ఈశిక్ష కావాల్సిందేనని అనిపిస్తోంది.


    ఆ తరువాత రెండురోజులూ అమె తనకు తెలిసిన దేవుళ్ళకంతా మొక్కుకుంది. పోలేరమ్మకి కోడిపొంగలి కూడా పెడతామంది...మూడోరోజు నిద్రలేవడం తరువాయి సుధాకర్ ఇంటికి పరిగెత్తింది. ఇంటికెందుకొచ్చావని అడిగితే, ఏం జవాబు చెప్పాలో కూడా అలోచించలేదు. అమె వెళ్ళెటప్పటికి అతను బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ కనిపించాడు. అతన్ని చూస్తూనే అర్ధమయింది. జ్వరం తగ్గిపోయిందని.


    అమె అనందం చెప్పనలవి కాదు. అదృష్టంకొద్ది అమెనెవరూ చూడలేదు కాబట్టి వెంటనే వెనక్కి తిరగి నేరుగా పోలేరమ్మ, గంగమ్మ గుళ్ళకు వెళ్ళి సాష్టాంగపడింది. మునీశ్వరుడి దగ్గరయితే కొబ్బరికాయ కూడా కొట్టింది.


    అమె అనందం చెప్పనలవి కాదు. మొత్తం నెత్తిమీద పెట్టుకున్న బరువును, గుండెల్లో పేరుకుపోయిన వేదననూ తిసి పక్కన పెట్టేసినట్లుంది.


    ఇప్పుడు శత్రువులతోనైనా మనసువిప్పి మాట్లాడగలననిపించింది అమెకి. అంతముందెన్నడూ అంత జాలి మూడ్ లో లేదు.


    మరో అయిదు రోజులకి బాగా పుంజుకున్నాక, అతనోరోజు సాయంత్రం నాడార్ అంగడి దగ్గర కాపు కాసాడు. అమె రాత్రి వంటకు కావాల్సిన వస్తువులకోసం వచ్చింది.


    " నీ కోసమే వచ్చాను. రేపు సాయంకాలం నాలుగు గంటలకి మా పొలం దగ్గరికి వచ్చేయ్. ఆ టైమ్ కి మా నాన్న పొలంనుంచి తిరిగి బయలుదేరుతాడు.అడ్డదారిగుండా కాకుండా, ఏటిదోవన వచ్చేయ్ " అని చెప్పి మాయమయ్యాడు.


    ముందు అనుకున్నట్టుగానే ఆమె అతనికోసం కరెక్టు టైమ్ కి అక్కడికి వెళ్ళింది. పనులకు వెళ్ళే అమ్మాయిలకు ఏటైమ్ లోనైనా వెళ్ళే వెసులుబాటు ఇంట్లో వుంటుంద. ఏదో పొలం పని కోసం వెళుతోంది. అనుకూంటారేతప్ప, మరో ఆలోచన వచ్చే అవకాశంలేదు. చూసేవాళ్ళకి కూడా.


    ఆమె వెళ్ళేటప్పటికి అతను అక్కడే వున్నాడు.


     ఆ పూట ఆమె అతను బహూమతిగా యిచ్చిన చీరను కట్టుకుంది. ఆదే రంగు బ్లౌజు వేసుకుంది.


     నీలం చీరమీద  ఆకుపచ్చ, ఎరుపు రంగులు కలిపిన పూలు చూడటానికి చాలా బావున్నాయి.


      "నువ్వు ఈ డ్రెస్ లో ఎలా వున్నావో తెలుసా?" అంటూ ఆమె  చీర పట్టుకున్నాడు సుదాకర్.


    "ఎలా వున్నాను?" వెంటనే ఆ ప్రశ్న వేయకపోయినట్లయితే ఆమె స్త్రీనే కాదు.


    అతను చెవిలో ఏదో చెప్పాడు. అందులోని శృంగార భావనకు ఆమె ఎద పొంగి ఒక హూక్ తెగినట్లనపించి, కంగారుగా చూసుకుంది. బంధం విడిపోయిన మాటవాస్తవం. అది అతను గుర్తించకుండా పైటను కప్పుకుంది. కాటుక విషయం చెప్పింది. దాన్ని అతను  ఒప్పుకోకపోయినా, ఆమె అభిమానానికి పులకరించిపోయాడు.


     "అలాంటివేమీ లేవు పిచ్చి మొద్దూ" అంటూ ముక్కులు  పట్టుకుని ఊపుతూ  "ఆచారి మందులు పనిచేయలేదు. చివరికి టౌన్ నుంచి డాక్టర్ని పిలిపించారు. ఆయన మందులుచ్చాడు" అని చెప్పాడు.


     "అదేం కాదు" అనబోయి, అతను తన   ఆతృతను గుర్తించినందుకు లోలోపల సంతోషించి, ఇక ఆ టాపిక్ ను అంతటితో ఆపేసింది.ఉమ.


      "మరి  నే తెచ్చిన చీర ఎన్ని మూరలు వుందో కొలవానా?" అంటూ బలంగా చీరని లాగాడు సుధాకర్. నీలం  మబ్బుతునక చేతిలోకి వచ్చేసి నట్లయింది.


    ఆమె సిగ్గుతో కళ్ళు మూసుకుందిగానీ,  చీర లేకపోవడంవల్ల కనిపిస్తున్న శరీరం గురించి మర్చిపోయింది. ఆమె సిగ్గుపడే తీరుకోసమే ఆమె చీరను పదే పదే విప్పాలన్న ఆవేశానికి గురయ్యాడు  అతను.


     ఇక అప్పట్నుంచీ వాళ్ళిద్దరూ ఆ పొలం దగ్గరే కలుసుకునేవారు. ఆ  మిషన్ షెడ్డే వాళ్ళకి హంసతూలికా పాన్పయింది. ఆ పైరుగాలే సువాసనలు విరజిమ్మే అగరొత్తుల పరిమళం  అయింది. ఎవరూరాని  ఆబయలు   ప్రదేళమే వాళ్ళు విహరించే నందనవనమైంది.


    ఎప్పటికప్పుడు నెల తప్పుతానేమోనన్న భయంవున్నా, సక్కూబాయే ఏమైనా ఉపాయం చెబుతుందిలే అని ధైర్యం తెచ్చుకునేదే తప్ప, అతనికి ఎప్పుడూ ఆ విషయంలో అభ్యంతరం చెప్పలేదు. అదృష్టంకొద్దీ అలాంటి ప్రమాదం జరగలేదు.అలా   హాయిగా గడిచిపోతున్న కాలం ఠక్కున ఆగిపోయనట్లయింది ఆమె.


     ఆరోజు రాత్రి అమ్మ దగ్గరికివచ్చి  "రేపు పనికి  ఎక్కిడికీ వెళ్ళకు. పెళ్ళివాళ్ళు వస్తున్నారు. చూసిపోవడానికి" అనిచెప్పడంతో ఒక్కసారిగా ఆమెకి తలంతా తి్మ్మిరెక్కింది.


     మరుసటిరోజు పెళ్ళిచూపులు జరిగిపోయాయి.  ఆరోజు సాయంకాలం రెండు పక్షాలవారూ కూర్చుని మొత్తం  విషయాలంతా మాట్లాడేసి,అన్నిట్నీ ఫిక్స్ చేశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS