36. ఎముక విరిగిందా? బెణికిందా? తెలుసుకోవటం ఎలా?
గబగబా నడుస్తున్న గడపకి కాలు తగిలి పడిపోయింది. కిందపడిన పార్వతి పైకి లేవాబోయి చెయ్యి నొప్పి అనిపించడంతో భయపడి "బాబోయ్, నా చెయ్యి విరిగిపోయింది" అంటూ కంగారు పడిపోయింది. ఎప్పుడైనా దెబ్బతగిలి శరీరంలో ఏదైనా ఎముక విరిగితే తెలుసుకోవడం ఎలా? బేణకడం కాదని గుర్తించడంఎలా?
ప్రమాదం జరిగి శరీరంలో ఏదైనా ఎముక విరిగినపుడు ఆ భాగంలో బాధ కలుగుతుంది. ఆ ప్రాంతంలో మామూలు కదలిక వుండదు. ఒకవేల కడపదానికి ప్రయత్నించినా, కదలిక కావలసిన విధంగా ఆడక బాధ కలిగికళ్ళవెంట నీళ్ళు గిర్రున తిరుగుతాయి.
అయితే ఈ లక్షణాలు బేణికినప్పుడు కూడా ఉంటాయి. ఈ లక్షణాలతోపాటువిరిగినప్పుడు ముఖ్యంగా ఆ భాగంలో అసాధారణ కదలికకి ఆసక్రం కలుగుటుంది. చేతి ఎముక విరిగినట్లయితే ఆ భాగం కదిపినపుడు ఎముక లేనట్లుగా ముందుకీ_వేనుకకీ కదులుతుంది. మామూలుగా అలా జరగడం అసంభవం. ఎముక విరిగినపుడు ఆ భాగంలో అసాధారణ ఆకారం ఎర్రపడుతుంది. దీనికి కారణం ఎముక విరిగినచోట విరిగిన ఎముకలు ముడుకీ_వెనకికీ జరగడమే. ఇలాంటి అసాధారణ రూపం కనబడటంతో ఎవరైనా సరే ఎముక విరిగిండని తెలికిగా గుర్తించగలరు.
కొన్ని సందర్భాలలో అసాధారణ ఆకారం ఏర్పడడమే కాకుండా విరిగిన ఎముకులు ఒకదానిమీద మరొకటి ఎక్కడంతో ఆ కాలో_ చెయ్యోరెండవదానితో పోల్చిచూస్తె, పడుగు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలతోపాటు విరిగిన కొన్ని భాగాల్నికిందా పైన పట్టుకుని ఎ మాత్రం కదిపినా గరగర శబ్దం వస్తుంది. అలా అసహజమైన శబ్దం రావడానికి విరిగిన ఎముకలు రెండూ ఒకదానికి మరొకటి రాపిడి అవుతూంటమే కారణం.
ఈ లక్షణాలన్నీ వున్నా దాన్నిబట్టి ఎముకవిరిగిండని నిర్ధారణ చేసుకోవచ్చు.కొందరిలో ప్రమాదం జరిగినపుడు ఇటువంటి అసాధారణ ఆకారం గాని, కదలిక గాని, శబ్దంగాని లేకపోవచ్చు. వాపుసైతం ఉండకపోవచ్చు. అంట మాత్రాన ఎముక విరగలేదని అనుకోవడానికి వీలులేదు. ఎముక విరిగి ఎ మాత్రం ప్రక్కకి తొలగాకుండా కూడా ఉండవచ్చు. అటువంటికేసుల్లో ఒక్కోక్కప్పుడు ఎముక విరిగినట్లు చెప్పడం కష్టం. అందుకని ఎముక విరిగిమ్డీ లేనిదీ నిర్ధారణ చేసుకోవడానికి ఎక్సరేఫోటో తీయాలి. అందులో అసలు విషయం స్పష్టంగా కనబడుతుంది.
ఎముకులు విరిగినపుడు కొందరు చైతన్యం కోల్పోతారు. అలంటపుడు ప్రాణపాయం కూడా కలగావచ్చు. దెబ్బ తగిలిన ఆ వ్యక్తి అచేతనంగా వుంటే ఎముకులు విరిగాయో లేదో గమనించాలి. ఎముకులు విరిగినపుడు వెంటనే చికిత్స పొందకపోతే కొన్నికేసుల్లో విరిగినచోట వాపు కనబడటమే కాకుండా అక్కడి చర్మం రంగు మరోలా మారుతుంది. మరికొందరికి ఎముక విరిగినచోట కాలిన బొబ్బలు లాటివి రోజుల వ్యవధిలో వస్తాయి. ఇలాంటి లక్షణాలను బట్టి ఎముకులు విరిగినట్ట్లుఅనుమనిమ్చడానికి అవకాశం వుంది.
ప్రమాదం జరిగో, దెబ్బ తగిలో ఎముకలు విరిగి వాపు రావడం, బాధ అనిపించడం, మామూలు విషయం. ఇలా కాకుండా కొందరికి ఎముకలు విరిగినప్పుడు, విరిగిన ఎముకలు చర్మాన్ని గాయంచేసి బయటకి పొడుచుకుని వస్తాయి. లేదా ఆ స్థలంలో గాయం ఏర్పడి కండరాలు, నరాలు అన్నీ బయటకు కనబడతాయి. కొన్ని కేసుల్లో మూడు_ నాలుగుముక్కలు గానో లేదా మరికొన్ని ముక్కలుగానో అవుతుంది ఇది ఇలా ఉండగా, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎముకులు విరిగి ముక్కలు అవకుండా కేవల విల్లులా వంగావచ్చు. కొందరు పెద్దవాళ్ళలో ఎటువంటి దెబ్బ తగలకుండా, ప్రమాదం జరగుండా ఎముకలు విరగవచ్చు.ఇటువంటివాటిని పథలాజికల్ ఫ్రాక్చార్స్ అని అంటారు.ఎముకల వ్యాధులు ఉన్నవారిలో, ఎముకలకి కేన్సర్ వచినప్పుడు ఎటువంటి సూచినా లేకుండా గఫ్ చుఫ్ గా ఎముకలు విరిగిపోతాయి. ఎముకలు విరిగాయని అనుమానం రాగానే వెంటనే డాక్టరుని చూపించాలి. అంతేగానినొప్పి తగ్గడానికి పట్టీలు వేయడం ప్రమాదకరం.
****
