Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము  పేజి 39

 

  శ్లో!!    తత్ప్రత్యమే ప్రయుజ్యేత హంసాస్స్క్యోయ మథోముఖః !!

    తా: హంసాశ్యహస్తము  అథోముఖము కల్గునట్లు  పట్టినచో తత్ప్రత్యయాంతమునందు వర్తించును.

   శ్లో!!    కృపత్వయ్కేథోముఖశ్చ స్మృగశీర్ష కరోభవేత్ !!

    తా: మృగశీర్ష హస్తము అథోముఖముగల్గుపట్లు  పట్టినచో క్వప్రత్యయమునందు వర్తించును.

   శ్లో!!    వహప్రాపణధావానాంత్రయేచేదర్ధచంద్రకః !!

    తా: అర్ధచంద్ర హస్తము క్రిందుగాబట్టినచో  వహప్రాపణ ధాతువుల యొక్క త్రితయమునందు వర్తించును.

   శ్లో!!    పురుషత్ర భావేతు, ఔచిత్యేన విభావయేత్ !!

    తా: ప్రధమ, మధ్యమ, ఉత్తమ, పురుషభావములందు  తత్కాలోచిత హస్తములు చేయవలయును.
                              
  శ్లో!!    డుకృఙ్ఞ కరణే ధాతూనాం, కర్కోర్థ చతురోభవేత్ !!
    తా: అర్ధచంద్ర హస్తములు క్రిందుగాబట్టినచో డుకృఙ్ఞ కరణే ధాతువునందు వర్తించును.


             బాంధవ్య హస్తములు (మాతృహస్త లక్షణము)

  శ్లో!!    వామేతు శిఖరంకృత్వా దక్షణే మృగశీర్షకం !
    మాతార్థే వినియుజ్యేత కీర్తితో భరతాదిభిః !!

    తా: వామకరముచేత శిఖరహస్తమును, దక్షణకరముచేత  మృగశీర్షమును బట్టినచో మాతృహస్తమగును. ఇది తల్లి యందు చెల్లును.

                                  -: పితృహస్త లక్షణము (తండ్రి) :-

  శ్లో!!    ఏతౌ తౌలి పరీతౌచేత్పిత్రార్థే వినియుజ్యతే !!

    తా: మాతృ హస్తములను  విపరీతార్ధముచేసి. అనగా వామహస్తము సర్పశీర్షముచేత, దక్షణహస్తముచేత శిఖరమును బట్టినచో పితృహస్తమగును. ఇది తండ్రిని చెల్లును.

                    -: పితామహ హస్త లక్షణము :-

  శ్లో!!    సందంశస్త్వళికే భాగేచలితో విరళోయది !
    పితామహోని యుజ్యేత శివేన పరికీర్తితః !!

    తా: సందంశ హస్తమును లలాటమందుబట్టి చెలింపచేసి విరళముగ బట్టినచో తాతయందు వినియోగించును.

                      -: పితామహీ హస్తలక్షణము (నాయనమ్మ) :-

   శ్లో!!    ఆలపద్మః కంఠధేశేకృత్యాపి చలితోయది !
    పితామహీం నియుజ్యేత  కదితోభరతాదిభిః !!

    తా: అలపద్మ హస్తము  కంఠదేశమందుబట్టి  చలింపచేసినచో అవ్వయందు వినియోగించును.

                                    -: పుత్రి _ పుత్ర _ హస్త లక్షణము :-

   శ్లో!!    వామహస్తే సర్పశీర్షం మృగశీర్షే తతోపరి _
    విన్యనేతత్సుతాయాంచేసుతీపి వినియుజ్యతే !!

    తా: వామహస్తముచే సర్పశీర్షమునుబట్టి. దానిపై మృగశిరహస్తము నుంచినచో పుత్రిక,_ పుత్రునియందు వర్తించును.

                    -: జామాత హస్త లక్షణము (అల్లుడు) :-

   శ్లో!!    మయూరే దక్షణేహస్తే భ్రమరో, వామహస్తకే !
    జామాతారినియుజ్యేతకర కర్మవిశారదైః !!

    తా: దక్షణ కరముచేత మయూరమును. వామహస్తముచేత  భ్రమరహస్తమును బట్టినచో అల్లునియందు చెల్లును.

                    -: శ్వరహస్త లక్షణము (మామ) :-

   శ్లో!!    పతాకస్య పృష్టభాగ స్తిర్యక్చైవ ప్రదర్శితః !
    శ్వశృరార్థేనియుజ్యేతనందినా పరికీర్తితః !!

    తా: పతాక  హస్తముయొక్క  పృష్ఠభాగము అడ్డముగబట్టినచో మామయందు  వినియోగింపబడును.

                   -: శ్వశ్రూహస్త లక్షణము (అత్త) :-

   శ్లో!!    పతాకముదరే కృత్వావామే చాప్యలపద్మకం !
    శ్వశ్రాంచ సరియుజ్యేత కధితో భరతాదిభిః !!

    తా: పతాక హస్తమును  ఉదరమునందు చేర్చి, వామహస్తముచే అలపద్మమును పట్టినచో అత్తయందు వర్తించును.

                   -: స్నుషాహస్త లక్షణము (కోడలు) :-

   శ్లో!!    పతాకేన భువందర్శ్యవామహస్త్కేర్థ చంద్రకం !
    స్నుషాయాంచ ప్రయోక్తవ్యంకోహళేనప్రకీర్తితమ్ !!

    తా: పతాక హస్తముచేత భూమిని చూపించి, వామహస్తముచే అర్ధచంద్ర హస్తమును బట్టినచో కోడలియందు వర్తించును.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS