Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 40

   

     'రండి పిన్నిగారూ ఉంటారానాలుగురోజులూ' అంది లలిత.
   
    'ఆ ఎందుకూ, పొద్దున్నే బస్సుకి వెళ్ళిపోతాను'
   
    'అదేమిటీ -'
   
    'ఏ ముందమ్మా - మా వాడి కబుర్లు విన్నాను, ఇంకనేనెందుకు ఇక్కడ' అంది లలిత వంక పరిశీలనగా చూస్తూ, మెడలో ఏవీ కనిపించలేదు - ఏదో వంకని కిందకి వంగి చూసింది. వేళ్ళకీ ఏవీలేవు - ఈ పిల్లకి పెళ్ళికాలేదు అనుకుంది యశోదమ్మ - 'ఈ పిల్లని పెళ్ళి చేసుకోకూడదూ లక్షణంగా వుంది' మనసులో అనుకుంటూ, 'అమ్మా - ఏమీ అనుకోకు, నీకు పెళ్ళి అయిందా' -
   
    'లేదండీ -మానాన్నగారూ అప్రయత్నంలోనే వున్నారు' అంది నెమ్మదిగా మా రామాన్ని పెళ్ళి చేసుకోవూ అని ఈవిడతనని అడిగితే ఎంత బావుంటుంది - వెంటనే తల ఊపేదికదాతను - లలిత ఇలా అనుకుంటూ, 'మీరింత తొందరగా ఎందుకు వెళ్ళిపోటం - నిన్ననేగా వచ్చారు' అంది లలిత.
   
    'నేను అసలు రాక పోయినా ఫరవాలేదు' - నాతో ఏం పని - మీ అందరికీ చెప్పాడామావాడు - ఈమట యశోదమ్మ అంటుంటేనే గేటు తీసుకువచ్చాడు రామం, తల్లి వెంటనే మాట మార్చేసింది - 'మీ ఊళ్ళో నీళ్ళ ఇబ్బంది కదా. రోజువిడిచిరోజు....ఇంక కొన్ని రోజులుపోతే మూడురోజులకొకసారి నీళ్ళటకదా' - అంది రామం వింటుంటే - 'మీ అబ్బాయి మాకేం చెప్పలేదే' అందామనుకుంది లలిత రామం అక్కడేనుంచున్నాడు. కాసేపుకూచుని లోపలకెళ్ళిపోయింది యశోదమ్మ లలితలోపలకెళ్ళి వీధిలైటు ఆర్పేసింది.
   
    "ఇప్పుడే మేష్టారితో మాట్లాడివచ్చాను. నీతో మాట్లాడుతాడట దీపావళి వెళ్ళాక ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు - గుళ్ళో పెళ్ళి చెయ్యాలన్నాను" - రామం మాటలు వింటూ విస్తుపోయింది యశోదమ్మ అన్నీ తనే మాట్లాడుకోటం, అన్నీ తనే నిర్ణయించటం, ఎందుకు తను వున్నట్లు - మేష్టారు, తను, అన్నీ నిశ్చయించుకుని తనని పెళ్ళికి పిలుస్తారా. ఏమిటీ అన్యాయం యశోదమ్మ మనసు బాధ పడింది. "నేను రేపెళ్ళి పోతాను - పొద్దున్నే బస్సు ఎక్కించు" అంది ముభావంగా రామం ఏమీ అనదల్చుకోలేదు తల్లితో చెప్పాడు తన అభిప్రాయం. అంతవరకే తల్లి అభిప్రాయాలతో తనకి సంబంధం లేదు - రామం తల్లివంక చూస్తూ, "సరే, పడుకోపొద్దుపోయింది' అన్నాడు ఆవులిస్తూ.
   
    తెలతెలవారుతుండగా యశోదమ్మ పనులు పూర్తిచేసుకుని, ప్రయాణానికి సిద్దమయింది. లలిత రాత్రంతా నిద్రపోలేదు 'మీవాడు మా ఎవరికీ ఏమీ చెప్పలేదు పిన్నిగారూ' అందామనుకుంది. అంతలోనే ఆటోకదిలిపోయింది. లలిత నిద్రకళ్ళతో ఆమెట్లమీద అలానే కూచుంది.   
   
    తల్లిని బస్సు ఎక్కించి రామం స్నేహితుడింటికెళ్ళాడు. అక్కడ టైమయేవరకు కాలక్షేపం చేసి, హోటల్లో భోంచేసి ఆఫీసుకెళ్ళిపోయాడు రామం.
   
                                     *    *    *
   
                                           17

   
    లలితకి శారదని చూడాలనిపించింది ఆరోజు. ఇంట్లో పనులు గబగబా చేసుకుని బయల్దేరింది. ఎన్నిరోజులయింది శారదని చూసి, కేసు తేలిపోయింది. దినేష్, నీరజ ఎలా వున్నారో.. దినేష్ ఒకవేళ శారద ఇంట్లోవుంటే - వుండనీ, నన్నేంచేస్తాడూ అతనురామన్ అయితే నాకేం, కాకపోతే నాకేం - శారద అతనితో స్నేహం కోరుతుంటే తను అతనిగురించి ఏం చెప్పినా శారద మనసుకెక్కదు - అయినా తనకివన్నీ అనవసరం - శారద తన స్నేహితురాలే - చూడాలనిపిస్తోంది వెడుతోంది - అంతే - లలిత శారదయింటికి బయలుదేరింది.
   
    శారదకుర్చీలో పడుకుని పేపరు తిరగేస్తోంది. లలితనిచూసి ఒక్కనిముషం ముఖం తిప్పుకుంది. కానీ వెంటనే సద్దుకుంది.
   
    "ఎలా వున్నావే శారదా - నీ కోసం ఎన్నిసార్లు వచ్చానో - ఎప్పుడూ లేవు' అంది లలిత శారద వంక చూస్తూ.
   
    "అవునే శారదా - ఆరోజు రాత్రి నీతో మాట్లాడాలి వస్తున్నాను అని ఫోను చేశానా నీకు - నువ్వు రమ్మన్నావా. తీరా నేను వచ్చేసరికి తాళం వేసి ఎక్కడికెళ్ళిపోయావూ" - లలిత మాటలకి నవ్వింది శారద 'ఎప్పటి విషయమో -నాకేమీ గుర్తులేదు బాబూ -ఈమధ్యలో ఎన్నిసార్లు తాళాలు వెయ్యటం, ఎన్నిసార్లు తాళాలు తీయటం - ఏమిటి - ఎవరికి గుర్తు ఇవన్నీ - కూచో, కాఫీ తాగుదువుగాని' శారదలోపలకెళ్ళింది శారద రెండు కప్పులతో లోపల్నుంచి వచ్చింది.
   
    'మీ నీరజ దినేష్ అంతా బావున్నారా' - లలిత కాఫీ చప్పరిస్తూ అంది. ఉలిక్కిపడింది ఒక్కసారి శారద.
   
    'ఆ ఆ - బావున్నారు. నేనే ఆఫీసుపనిమీద బొంబాయి వెళ్ళాలనుకుంటూన్నా' అంది శారద ఎటో చూస్తో.
   
    'బొంబాయా - ఎప్పుడొస్తావు'
   
    "ఏమో - నాలుగు రోజుల్లో రావచ్చు. నలభైరోజుల్లో రావచ్చు - అక్కడే వుండి పోవచ్చు కూడా'
   
    "ఇంకానయం మీ నాన్న, అన్నయ్యలు, పిన్ని అంతా ఊరుకుంటారా - నువ్వు బొంబాయిలోనే వుండిపోతే. అసలు నిన్ను పోనీయరు మీ వాళ్ళు" అంది లలిత.
   
    "ఇంకా వాళ్ళ యిష్టంతోనే బతకాలా - నా యిష్టం నాది' శారద కోపంగా అంది.
   
    'ఏం చేద్దామనుకుంటున్నావు ఇంక' అంది లలిత.
   
    'అంటే'
   
    'అదే విడాకులయిపోయాయి కదా మరి' నసిగింది లలిత.
   
    "ఏమిటోడొంక తిరుగుడు - విడాకులయిపోయాకదా మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా - ఎవర్ని చేసుకుంటావు - ఎప్పుడు చేసుకుంటావు - ఇవేకదా నీకు కావలసింది - లలితా, నువ్వు ఫ్రెండుగావచ్చావా దూతలా వచ్చావా" అంది శారద.
   
    "దూత - దూతేమిటీ'
   
    "అదే - రామం పంపలేదు నిన్నూ - నా దగ్గర దాచకులే - పోనీకానీ, నీ పెళ్ళి ఎప్పుడూ" - శారద లలిత కాఫీ కప్పు గూట్లో పెట్టింది.
   
    "నా పెళ్ళా"
   
    "ఊ -"
   
    "నాకే తెలియదు" లలిత ఆశ్చర్యంగా అంది.
   
    "నువ్వు ఎవర్ని చేసుకున్నానాకభ్యంతరం లేదు - కానీ రహస్యమెందుకు "ఏమిటీ శారదా - నువ్వేమంటున్నావో నాకేం తెలియటం లేదు"
   
    "చెప్తావిను -నీ శంకరు అన్నయ్యనీ ఫోటో రామనాథం వకీలుకి యియ్యటం - అది ఆవకీలు రామానికియ్యటం - ఆ రామం ఆ ఫోటో జేబులో పెట్టుకుతిరగటం. ఆ నాకు తెలియదనుకున్నావా అన్నీ తెలుసు"
   
    "ఏమిటీ - నా ఫోటో రామం జేబులో పెట్టుకు తిరగటమా - లలిత ఆశ్చర్యంలోంచి తేరుకోలేక పోతోంది.
   
    "నేను అబద్దాలు కల్పించటం లేదు - మీ శంకరు అన్నయ్య కొడుకు మాతోపని చేసేనా ఫ్రెండురమ, తమ్ముడు ఫ్రెండ్సు.....మొన్ననే రమ చెప్పిందీ విషయం.....అయినా నేను ముందునించి అనుకుంటున్నదే - రామంతో కోర్టుకేసు మొదలయినప్పట్నుంచే నాకు తెలుసు - ఆ రోజు నువ్వు, రామం హోటల్లో కూచుని రాజీమాటలకని నాకోసం అన్నయ్య చేత కబురుపెట్టినపుడే తెలుసు, మీరిద్దరూ ఒకటవడానికే ఈ ప్లాన్ అని. అందుకే నేను రాలేదు. నేను రాజీకి ఒప్పుకోనని నాతో అనిపిస్తే మీ పని తేలికకదా అందుకే, అయినా నాకేం బాధలేదు. నేను కావాలనుకుంటే బాధ చెత్తలోనుంచి, ఈకుళ్ళులోంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను - నాకెవరితోనూ పనిలేదు - శారదకి ఆవేశం ఎక్కువైంది కళ్ళునిప్పులు కురుస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS