ఆ సాయంత్రం జరిగిన సంఘటనే మరింత ఆశ్చర్య కరమైనది. ఆరోజు సరోజ పుట్టిన రోజని గుర్తు పెట్టుకొని ఆమెకు బర్త్ డే గ్రీటింగ్స్ అందజేయడానికి బయలుదేరింది . హాల్లోనే సరోజ పిన్నిగారు నవ్వుతూ ఎదురై , "సరోజ కోసమా? అలా డాబా మీదికి వెళ్ళమ్మా!" అని చెప్పింది. వెనక నుంచి వెళ్లి కంగారు పుట్టిం చెయ్యాలని చకచకా మెట్లేక్కుతున్న తను, ఆఖరి అడుగు పడకుండానే ఆగిపోయింది. లోపలి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆ రెండు కంఠలు పరిచిన మైనవే. అతి సన్నిహితులని, స్నేహితులని, .'
"సరూ! ఇవాళ ఎలా ఉన్నావో చెప్పనా? అతురిత సౌందర్యరాశులను ఎట్లా వర్ణించాలో నాలాంటి వాడికి తెలుస్తుందా? పదసౌందర్యాన్నంతా సమీకరించి ముత్యాల రాసుల్లా వాటిని బహూకరించడానికి నేనేం కవిని కాను కదా?" అంటున్నాడు బావ. అతను కూడా ఒక సౌందర్యోపాసకుడైనా డన్న విషయం ఆనాటి వరకు తనకు తెలియలేదు.

సరోజ నవ్వు వినిపించింది. "నీలాంటి మహాకవిని నేనిప్పటి వరకు చదవలేదోయ్!" అన్నది .
"నీలాగ నిరాడంబరంగా ఉండగలగటం , అందునా నీ అంత అందగత్తెలు ఇంత సాధారణంగా ఉండటం ఇంకెక్కడా చూడలేక పోయాను. అలంకరణ లో ప్రాచీన హిందూ స్త్రీ కి ప్రతి రూపంగా భావాలలో నవీన భారతయువతికి ప్రతిబింబంగా ఉన్న స్త్రీ అంటే , ఎవరికైనా గౌరవ భావం కలుగుతుంది. నాకు మరీను. కొందరున్నారు చూశావూ. సరూ! చర్మానికి అంగుళం మేర పౌడరు , దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్న నల్లని పేదలకు ముదురు రంగు లిప్ స్టిక్ , అంతమాత్రపు అందానికి జాక్ లెస్ జాకెట్టు. అటువంటి స్త్రీని ఉదాహరించాలంటే నీవంటి యువతులను అవమానించట్లవుతుందేమో?"
అతని ఉద్దేశాలు అవి కాబోలు. ఆ మాటలన్నీ తన మీద దెబ్బ తియాతానికే అని తెలుసుకున్నాది. ఇంతలో సరోజ నవ్వు, దానితో మిళితమై బావ నవ్వు వినిపించాయి. సరోజ కంఠం వింటూ ఇక ఆగలేక పోయింది తను. తనకంటే అతనే ఎక్కువా ఏమిటి, సరోజకు? అనుకుంటూ లోపలికి వెళ్ళింది.
పడక్కుర్చీలో విలాసంగా వెనక్కు వాలి తెల్లని బట్టల్లో రాజహంస లా వెలుగుతున్న సరోజా, ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చుని కుతూహలంతో , ఉత్సాహంతో సంభాషిస్తున్న బావదృశ్య,మయ్యారు.
"పార్వతీ దేవి వచ్చారు" అన్నాడు బావ అదొక విధంగా చూస్తూ.
తనను చూడగానే చటుక్కున లేచి చెయ్యి పట్టుకుని కూర్చో పెట్టింది సరోజ. లోపలికి వెళ్ళింది, టీ తీసుకురావడానికి.
అ రెండు నిమిషాలు బావ ఎదట నిశ్శబ్దంగా గడపటానికి చచ్చినంత పనయింది తనకు. అతని దగ్గర నోరు విప్పిందంటే ఏవో నెలకి మాటలు తప్ప, సామాన్యమైన భాష రాదు, ఒకవేళ సరసంగా మాట్లాడ ప్రయత్నించి నా, విరసంగా పరిణమించి ఊరుకుంటుంది. అతని పరిస్థితీ అదేనేమో? ఉక్కిరి బిక్కిరి అయ్యాడు సరోజ వచ్చేవరకు. చెప్పాలంటే మగవాడు కావడం వల్ల ధీరుడు లా నిలవ గలిగుతున్నాడు గాని, తనంటే బావకూ భయమే, ఏ క్షణం లో తగువుకు దారి తీస్తుందో అని.
టీ సరంజామా తో పైకి వచ్చిన సరోజ "ఎమిటర్రా, ఇద్దరి ఆలోచన?' అన్నది.
"ఏమీ లేదు" అంటూ "ఇక వెళ్తాను" అన్నాడు బావ.
"అప్పుడేనా , రాజూ? ఇద్దరూ కలిసిపోదురు గాని" అంటున్న సరోజ అభ్యర్ధన నుంచి తప్పించుకుని పారిపోయాడు. తమ సమయానికి వెళ్ళకుండా ఉంటె, ఇంకా కాస్సీపు అక్కడే గడుపు నెమో, పాపం!
తర్వాత సరోజను పరీక్షగా చూసింది తను. బావ అన్నంత నిరాడంబరత్వం కనిపించ లేదు తనకు. అలంకరణ లోపమేమీ చెయ్యలేదు సరోజ. అన్ని విధాలా సౌందర్యానికి మెరుగు పెట్టుకున్నట్లే తోచింది. ముఖ్య విశేషమేమిటంటే సరోజ కూడా ఆరోజు తెల్లని , చాలా నాజూకు గా ఉన్న నైలాన్ చీర కట్టుకున్నది. అది చూడగానే తనకు పుట్టెడు నవ్వు వచ్చింది. అభిమానులుగా హృదయమంతా ఆక్రమించు కున్నారు, మనస్సు ను ఇంద్ర జాలికులుగా స్వాధీన పరచుకున్నవారు ఏ రూపంలో కనిపించినా ఎటువంటి స్వభావం కలవారైనా అంతరంగం అంగీకరిస్తుంది కాబోలు! తప్పు పట్టలేనటువంటి, చెడును చూడలేనటు వంటి మైకం కమ్ముకుంటుందేమో! తనకేం తెలుసు?
* * * *
ఏమైనా కానీ, ఈ పరిసరాల్లో క్షణం గడపడం కష్టమై పోతుంది. ఆ పట్టణ వాతావరణం లోని ఉత్తేజం ఇక్కడ లోపించి , ఈ నిషాను తట్టుకోలేక పోతున్నది.
"రేపే పెట్టె, గిట్టే సర్ధుకొనేసేయ్యాలి' అని నిశ్చయించు కున్నది పార్వతి దృడంగా.
పార్వతికి జానకమ్మ తల్లి కంటే ఎక్కువ అయింది. ఆమె ఆదరణ లో, పెట్టుక పోతలలో పెరిగిన పార్వతి ఒక్క క్షణం కూడా ఆమె సాన్నిధ్యం నుంచి తప్పించుకోలేదు. కాని పార్వతికి తన మానస్సును తాను గ్రహించుకునే టంత శక్తి రాలేదు. ఇంకా అస్పష్టమైన భావాలన్నీ సహజమైనవి అనుకుంటుంది. దేన్నీ స్పష్టంగా తెలుసుకోదు. ఒకరు వ్యక్తీకరించినా అర్ధం చేసుకునేటంత మాత్రపు ప్రజ్ఞా పాటవాలు లేవు. ఒకరి వైభవాన్ని, హోదాను, అధికారాన్ని చూసి అంతకంటే ఘనులు లేరను కుంటుంది. ఒక విశిష్టతను, విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని చూసి అంతకంటే పూజనీయ మైంది. గౌరవనీయ మైంది మరొకటి ఉండడను కొంటుంది. ఆమె ఆలోచనల పరిధుల్లో ఎప్పటి కప్పుడు జరుగుతున్నవే, తన చుట్టూ భ్రమిస్తున్నవే ఆక్రమించు కుంటాయి. అనుభవ శూన్యత వల్ల లోక వైశాల్యాన్ని, జీవన పరిమాణాన్ని, వాంచా వైవిధ్యాన్ని గుర్తించలేదు. ఇంకా అ స్థితి రాలేదు. అనుభవజ్ఞురాలు కాలేదు.
3
పార్వతి గదిలో తిరుగుతూ హడావుడి గా బట్టలు పెట్టెలో సర్దుతున్నది. ఆమెకు ప్రాణ ప్రదమైన బట్టలు పెట్టెలో ఉచితానాదిష్టులు లాగా భద్ర పరచబడుతుంటే అప్రియమైనవి కింద గుట్టలుగా పడి, అభాగ్యుల్లాగ తృణీకారం సహించలేక నలిగి పోతున్నాయి. గోడనున్న గడియారం పది గంటలు కొట్టి ఆగింది. పార్వతి చీర మడతలు నలిగిపోకుండా పెట్టి, టాయిలెట్ సామాను చిన్న సూట్ కేసు లో సర్దుతూ ఉంది. ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల బండిలో వెళ్ళిపోవాలని ప్రయత్నం ఆ తొందర లో అక్కగారి రాకను గమనించ లేదు పార్వతి.
ఆమె అక్క సరస్వతి ముఖంలో సౌమ్యత తప్ప మరొకటి కనిపించదు. సహజంగా పచ్చగా ఉండి సౌందర్య వతిగా చెప్పబడే సరస్వతి ని వైధవ్యం వరించింది. ముఖ్య వైఖరి వలన అతి అమాయకురాలు గానూ, బెలగానూ వినిపిస్తున్నా, మంచి ధైర్య స్తైర్యాలు గల స్త్రీ సరస్వతి . అందుచేత నే ఆమె దుఃఖాన్ని ఇంతరులెవరూ ఎప్పుడూ చూడలేరు. పార్వతి అంటే ఆమెకు ప్రాణం. అది వ్యక్తం చేయాలని గాని ప్రదర్శించాలని గాని తాపత్రయ పడదు. చెల్లెలి శ్రేయస్సు ను మూగగా మనసులోనే కోరుకుంటుంది. పాతిక సంవత్సరాలైనా నిండని సరస్వతి , పార్వతి పట్ల మాతృత్వం నెరపాలని కోరుతుంది. అటువంటి అక్కసు గురించి పార్వతి మాత్రం ఎప్పుడూ మనస్పూర్తిగా ఆలోచించ లేదు. తనంటే అక్కకు చాలా ఇష్టం అనుకుంటుంది. తనంటే అక్కకు చాలా ఇష్టం అనుకుంటుంది. ఆ అనుకోవడమైనా సరస్వతి తో మనసారా మాట్లాడుతున్నప్పుడు మాత్రమె.
"సారూ! నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు ఎందుకో , వెళ్ళమ్మా!" అన్నది సరస్వతి మృదువుగా.
"అక్కా! వెళ్ళేటప్పుడు ఆ చీర కట్టుకుంటాను-- అదిగో. అక్కడ. దాని మీదకు ఈ బౌజు బావుంటుందా?" చీరను, జాకేటు నూ చూపిస్తూ సరస్వతి ముఖంలోకి చూచింది పార్వతి.
సరస్వతి పెట్టెలోని బట్టలన్నీ చేత్తో కదిపి చూసి, "ఈ ఆకుపచ్చ చీర కట్టుకుని , ఆ నల్లటి బ్లౌజు వేసుకో" అంది.
పార్వతి చిరాకుగా "అబ్బ! నీ సెలక్షనూ , కాంబినేష నూ ఇల్లాగే ఏడుస్తాయి. నీలాంటి తెల్ల వాళ్ళకు ఆ ముదురు రంగులు, ముతక చీరలూ అమురుతాయి. అలాంటివి నాలాంటి వల్ల మొద్దులు కట్టుకుంటే అసలు మనుషులం కనిపించనే కనిపించం"అంది, తానకు నచ్చిన చీర ఇవతల పడేస్తూ.
సరస్వతి బాధపడింది. చెల్లెలు తనను తాను కించ పరుచుకున్నా కష్టమని పిస్తుంది ఆమెకు. "నీకేమే ? బంగారం లా ఉంటావు. ఎటొచ్చీ మీ బావ ఆ నైలాన్ చీరలూ, సిల్కు మిల్కులూ అంటే ఇష్టపడడు కదా అని చెప్పాను. ఎందుకు కట్టడం అవి?" సరస్వతి రాజు స్వభావాన్ని కూడా కనిపెట్టింది! ఈసారి నిజంగానే కోపం వచ్చింది పార్వతి కి.
"నెనూ నేరుగా ఒక మనిషినే! అది తెలుసా? నా ఇష్టాలు నావి. బావకి కష్టమైనా, నష్టమైనా నా కెందుకు?-- నువ్వూ , సరోజా ఒక్కాలాగే బోధిస్తారు." అన్నది ముఖం చిట్లిస్తూ.
"అది కాదే . ఊ సరే, పోనీ. నాన్నగారెండుకో పిలుస్తున్నారు. వేగంగా వెళ్ళు" అంటూ సరస్వతి వంటింట్లో కి వెళ్ళిపోయింది, వంట మనిషి పిలుస్తున్నదని.
పార్వతి సామాన్లన్నీ అలా వదిలేసి హాలులోకి వెళ్ళింది. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. వీధి వసారా లో కూర్చున్న తండ్రి దగ్గరకు నడిచింది.
అయన చుట్ట నోట్లో కాలుతూ ఉండగా వాలు కుర్చీ లో చేరగిలి తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
పార్వతి తండ్రి నరసింహ మూర్తి గారి వ్యక్తిత్వం గొప్పదని ఎక్కడ కాకపోయినా ఆ పల్లెటూళ్ళో మాత్రం చెప్పుకుంటారు. కండబలం, తెలివితేటలూ ఉన్నంత మాత్రాన మనిషిని అందరూ గౌరవించేయరు. వ్యక్తిగతమైన జీవితంలోకి కాస్తయినా తొంగి చూడక మానదు లోకం. ప్రవర్తన కూడా నిర్వ్యాజమైనదైతే ప్రతివారూ పూజ్య భావం ప్రకటిస్తారు. ఎవరికి వారే అటువంటి వ్యక్తిత్వం ఉన్న వారి సాన్నిహిత్యం కోరతారు.
అన్నిటా సమర్దు లనిపించు కున్నారు నరసింహ మూర్తి గారు. తరతరాలుగా వచ్చి కరణీకాన్ని చేపట్టి, పల్లెటూళ్ళో ప్రతి ఒక్కరి అభిమానాన్ని సంపాదించు కున్నాడాయన. తాత ముత్తాతలు వదిలి వెళ్ళిన ఆస్తిపాస్తులకు ఈ పలుకుబడి కొంత తోడు పడి, మరింత మెరుగు పెట్టింది. అ ఊరు విడిచి పెట్టడం ఇష్టం లేని నరసింహ మూర్తి గారికి అక్కడే అన్ని హంగులూ ఏర్పడ్డాయి.
