
ఆ రోజు కాలేజీ గేటు దాటి మళ్ళీ తిరుగు ప్రయాణానికి బస్సెక్కే దాకా ఇందిర తన యూనివర్సిటీ జీవితాన్ని నెమరు వేసుకుంటూనే ఉంది. చాడువేప్పుడయి పోతుందా అని ఎదురు తెన్నేను చూసిన ఇందిర కు, చదువయిపోయి యూనివర్సిటీ వదిలేశాక ఏదో తనకు దూరమై పోతున్నట్ట నిపించింది. రెండేళ్ళ క్రితం దాకా తను బాధ్యత లేరగని విద్యార్ధిని. ఎందరో స్నేహితులు, ఇంకెంతో దుడుకుతనం, పరీక్షలు, పోటీలు, యువజనోత్సవాలు! ఎందుకో చటుక్కున దిగులనిపించింది ఇందిరకు. వెంటనే 'ఛీ, ఇప్పుడేమయిందనీ!' అని తన్ను తాను మందలించుకుంది.
ఇల్లు చేరగానే మంజుల అంది "ఎవరో ఆరోరాట ఇందాక ఫోన్ చేశాడు నీకోసం. తన నెంబరిచ్చాడు రాగానే నిన్ను చెయ్యమంటూ."
బట్టలు మార్చుకుని , కాఫీ తాగి వచ్చి ఫోను అందుకుంది ఇందిర. మరునాడు సాయంకాలం "లాబోహిమీ' లో ఎస్ ప్రేస్సా తాగేందుకు నిశ్చయించుకున్నారు.
"ఎవరూ బాబూ" అంది మంజుల కుతూహలం పట్టలేక.
"జోగిందర్ అని మా యూనివర్సిటీ లోనే చదివాడు;లే" అంది ఇందిర ఏమని చెప్పాలో తోచక. తమ స్నేహాన్ని గురించి రెండు ముక్కల్లో ఎలా చేప్పగలదూ?
"సిఖ్కా షెనా?"
"ఓటి పంజాబీ, గడ్డపు వాడు కాదు" అంతకంటే ఏం చెప్పాలో తోచక ఇందిర ఊరుకుంది. ఇందిరకు చెప్పడం ఇష్టం లేదనుకున్న మంజుల కొంత చిన్నబుచ్చుకున్నా , కౌతుకాన్ని అణుచుకుని తేలిగ్గా నవ్వేసింది. యధాప్రకారం మంజుల రేడియో దగ్గిర చేరింది. ఇందిర పుస్తకం లో తల దూర్చింది.
ఇందిర మనస్సెంతో తేలికగా, హాయిగా ఉంది. జోగిందర్ కలుసుకున్నప్పటి నుంచీ అతని కెన్నో చెప్పాలని అరాతపడింది ఆమె మనసు. కానీ నిజంగా చెప్పటాని కంటూ ఏం లేదు. తనకంటే వయసులో జోగీయే పెద్దయినా , అతని కంటే తనే పెద్దదన్నట్టు వ్యవహరించేది ఇందిర. అసలు వాళ్ళ స్నేహమే విచిత్రంగా మొలకెత్తింది. పదినాళ్ళ పరిచయం లోనే ఇందిర జోగీని బాగా ఆకర్షించింది. ఆ ఆకర్షణ ఎంతవరకూ పోయిందంటే, అదే ప్రేమ అని అపోహ పడ్డారు జోగి. ఆరోజు ఆమె ఎప్పుడూ మరిచి పోలేదు. సెకండు పీరియడ్ లిటరరీ క్రిటిసిజమ్ క్లాసుకు పోతుంటే వరండా లో నుంచుని పలకరించాడతను.
"హెలో ఏమిటిక్కడ ప్రత్యక్ష మయ్యావు?"
తెల్లని అతని ముఖం ఎర్రబడిపోయింది. "ఏమి లేదు" అన్నాడు ఇబ్బందిగా కదులుతూ.
"సాయంత్రం అలా రాకూడదూ ఇంటికి?' అంది రెండడుగులు వేసి.
"ఇదిగో ఇందిరా, ఇది చదువు తరవాత" అంటూ ఒక కవరు చేతికిచ్చి రుమాలుతో నుదుటి మీద లేని స్వేదాన్ని తుడుచుకున్నాడు.
ఎవిటన్నట్టు చూసింది అతని వంక. కానీ జవాబు ఏం లేకపోయేసరికి , తల పంకించి ముందుకు కదిలింది. కవరు భద్రంగా బాగ్ లో దాచి, ఇంటికి వెళ్ళేదాకా ఎందుకో చదవ బుద్ది కాలేదు ఆమెకు. కాని ఇంటికి వెళ్ళగానే చేసిన మొదటి పని అదే. తన గదిలోకి పోయి కిటికీ దగ్గిర నుంచుని కవరు విప్పింది ఇందిర. మంచి ఉద్రేక పూరితమయిన ప్రేమలేఖ అది! అసభ్యమైన మాట గానీ,భావం గానీ ఎక్కడా లేదు. తనకెంతో ప్రేమిస్తున్నట్టూ వివాహం చేసుకోడానికి నిశ్చయించు కున్నట్టూ తెలియ జేశాడతను. చదవగానే కోపం రాలేదు సరి కదా నవ్వు వచ్చింది. ఎక్కడో హృద్యంతరం లో అతని యందు అస్పష్టమైన ఆపేక్షా, జాలీ కూడా కలిగాయి. అది తన మొదటి 'ప్రపోసల్!'
వెంటనే కూర్చుని నాలుగు పేజీల జవాబు రాసిందామే. తన జీవిత విధానాన్ని, ఆకల్నీ, ఆశయాల్నీ విపులీకరించి, పెళ్లిని గురించీ, ప్రేమనీ గురించీ అప్పట్లో ఆలోచించడం ఎంత అసందర్భమో తెలియజేసింది. ఇంకో రెండేళ్ళు పోయాక, ఈ సంగతి తల్చుకుంటే , నీకే నవ్వు వస్తుందంటూ ఉత్తరాన్ని పూర్తీ చేసి, మరునాడు అతనికిచ్చింది. రెండు రోజులు మొహం చూపించక పోయినా మూడో రోజున నవ్వుతూ పలకరించాడు. యధాప్రకారంగా . అది మొదలు వీరిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. అన్ని విషయాలూ-- వ్యక్తిగతమైనవి కూడా -- ఒకరితో నొకరు చర్చించు కుంటుండేవారు. అందుకే మాధవరావు ని గురించి అతనికి చెప్పాలని ఎంతో అనుకుంది.
"మాధవరావంటే నీ కెలాంటి అభిప్రాయం ఉంది ఇందూ?"
ఉలిక్కిపడింది ఇందిర. తన మనస్సులోని ఆలోచన తెలిసినట్టడిగింది మంజుల.
"పెద్ద అభిప్రాయమంటూ ఏం లేదు .... నీలాగే చురుకైనా వాడనుకుంటాను." అంది ఇందిర.
"పోదూ నువ్వు మరీను" అని సిగ్గుపడిన మంజులను తెల్లబోయి చూసిందిందిర.
* * * *
షాజా దగ్గిర బస్సు దిగి, "లాబో హీమీ" వేపున నడిచింది ఇందిర. పేవ్ మెంటు మీద నిలబడి ఉన్న జోగిందర్ ను చూసి చెయ్యి ఊపింది. అక్టోబరు అవడం చేత అప్పుడే కొద్దిగా చలి మొదలయింది. నల్లని ఫులో వర్ వేసుకుని సిగరెట్టు కాలుస్తున్న జోగీ, కొంచెం పెద్దవాడిలా కనబడ్డాడు మొదటిసారిగా. లోపలికి వెళ్ళాక కాఫీకి, పకోడీ లకు ఆర్డరిచ్చి కబుర్ల లో పడ్డారు. పకోడీ లు బల్ల మీదికి వచ్చేసరికే మాటలయి పోయాయి. ఎంతో చెప్పాలనుకున్న ఇందిర కు ఏవీ చెప్పేందుకు లేవనిపించింది. జోగిందర్ అంత ఉత్సాహంగా కనబడలేదు. కాఫీ చప్పరిస్తూ యధాలాపంగా అడిగింది. "కిరణ్ సంగతి చెప్పనే లేదు, ఏం చేస్తుంది?" కిరణ్ జోగీందర్ చెల్లెలు.
"అదే చెప్పాలను కుంటున్నా ఇందిరా -- కిరణ్ చచ్చిపోయింది.
"ఆ..........' ఇందిర తల అడ్డంగా ఊపింది.
"నిజం ఇందూ, కిరణ్ పోయి పది నెలలయింది. అమ్మా, నాన్నా అందువల్లే చండీఘర్ నించీ ణా దగ్గిరికి వచ్చారు. కిరణ్ లేని ఇల్లూ, చండీఘర్ కూడా దుర్భరమయి పోయాయి వాళ్లకి."
నమ్మలేనట్లు చూసింది ఇందిర.
"సరిగ్గా చెప్పు జోగీ అసలెలా......ఎలా పోయింది కిరణ్?"
"మేనేంజ్లేటిస్ అన్నారు....సరిగ్గా మూడు రోజులు మంచం మీద ఉందంతే......ఎవ్వరమూ అలా అవుతుందను కోలేదు........"
"..............."
"......................"
"మీ చెల్లెల్ని చూపిస్తావనీ, తనతో స్నేహం చేయాలనీ ఎంతో అనుకున్నాను జోగీ. ఎంత దగా జరిగిపోయింది!"
"ఏం చెయ్యను చెప్పు? అమ్మనీ, నాన్ననీ చూసి అయినా ఆగింది కాదు. కిరణ్ చచ్చిపోలేదు ఎక్కడో ఉందింకా అనిపిస్తుంది నాకు ఇందూ.."
మౌనంగా అతని చేయి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది.
"నన్ను మీ ఇంటికి ఎప్పుడయినా తీసుకు వెళ్ళు జోగి..."
"తప్పకుండా . నిన్ను చూసి అమ్మ ఎంతో సంతోషిస్తుంది.'
"ఇంక పోదాం, పద" అంటూ లేచింది ఇందిర. కుర్చీలూ, బల్లలూ దాటి తలుపు దగ్గిరికి వచ్చేసరికి భూమీలో నుంచి లేచినట్లు ఎదురుగా మాధవరావు కనబడ్డాడు. చూడనట్టు నటించడానికి కూడా వీల్లేని సందర్భం అది. తప్పనిసరిగా నవ్వి, చేతులు జోడించింది. ప్రతి నమస్కారం చేసి, "కులాసాయేనా?" అని అడిగాడు తెలుగులో. తల ఊపింది ఇందిర మౌనంగా.
ఇందిరవంకా, పక్కనే నిలబడి ఉన్న జోగీందర్ వంకా మార్చి చూసి "తొందరలో ఉన్నట్టున్నారు వెళ్ళిరండి." అన్నాడు మాధవరావు. నవ్వులాంటి దొకటి పెదిమల పై పూసుకుని జోగీందర్ తో ఇవతలికి వచ్చింది ఇందిర.
"ఎవరాయన?" సిగరెట్టు వెలిగిస్తూ అడిగాడు జోగీ.
"మాధవరావనీ ......ఒక ఆంధ్రా" అంది ఇందిర, అంతకంటే తనకేం తెలియనట్టు. అతనిని గురించి చేసుదామనుకున్నదంతా ఏమయిందో కానీ, ఇంతకు మించిన మాట రాలేదామెకు. ఆమె అన్యమనస్క అయి ఉండటం చూసి, ఆమెను ఇంటికి పంపే ప్రయత్నం చేశాడు జోగీందర్.
* * * *
తన సహధ్యాపకురాలు నీలిమారాయ్ ఇంటికి వెళ్లి ఆలస్యంగా ఇల్లు చేరింది ఇందిర. వాకిట్లో నీలం కారు చూడగానే గుండె కొట్టుకుంది దబదబా. హల్లో కూర్చుని ఉన్నారు మంజులా, గోపాలరావు గారూ మాధవరావు తో మాట్లాడుతూ.
"ఏమమ్మా, ఇంతాలాస్యమయిందేం?' గోపాలరావు గారడీగారు.
"ఇందిరకు కొత్త స్నేహితులు దొరికారు, నాన్నా." నిష్టూరంగా అంది మంజుల.
"మా స్నేహితురాలింటికి వెళ్లాను" అంది ఇందిర మాధవరావు కి నమస్కరిస్తూ. అతను కళ్ళతోనే పలకరించాడు. లేచి తన కుర్చీ ఆమె కిచ్చి మంజుల పక్క కుర్చీలో కూర్చున్నాడు.
"ఇందిర ఉత్త తెలుగమ్మాయి కాదు, మాధవ్. విశాఖపట్టణం నుంచీ వచ్చిందే కానీ, ఈమె స్నేహితులంతా పంజాబీ లూ, బెంగాలీ లూను. ఈమధ్య ఇందిర కో పూర్వ మిత్రుడి పునదర్శనం అయింది లెండి. అప్పటి నుంచీ ఇందిరకు మేం కనబడడం మానేశాం."
"ఏం మాటలవి , మంజూ?' అసహనంగా అంది ఇందిర.
"మీ బాల్య స్నేహితుడేమంటూన్నాడు?' కొంటెగా అడిగి నవ్వింది మంజుల.
"నిన్ను కాస్త నోరు మూసుకోమన్నాడు. నేనిప్పుడు ఆ నీలిమా రాయ్ ఇంటి నించే వస్తున్నాను, తెలుసా?"
"ఏమో? సెలవు పూటా , అందులోనూ చక్కని అదోవారం అంతా ఆ అరోరా ఇంట్లో గడిపావు కదా.... మళ్లీ పాత స్నేహితులే గుర్తు వచ్చారే,మోననుకున్నాను." దేప్పింది మంజుల.
"మంజులకు చాలా కోపం వచ్చింది మొన్న మీరు ఎక్కడికో వెళ్ళారనీ." పరిశీలనగా చూస్తూ అన్నాడు మాధవరావు.
"అబ్బ, ఎంత రభస చేస్తున్నారు!" మనసులో అనుకుని పైకి మాత్రం "అవును, మంజుల కి ముక్కు మీదే ఉంటుంది కోపం" అంది నవ్వటానికి యత్నిస్తూ.
"ఇంక నేను లేస్తాను, మాస్టారూ..... అందరూ వస్తున్నట్లే కదా?' గోపాలరావు వంక తిరిగాడు మాధవరావు.
"అందరమూ వచ్చే ఆదివారం నాడు "ఒక్లో ' పిక్ నిక్ కి పోతున్నాం. ఇందూ. నువ్వే సాకులూ చెప్పి తప్పించుకోడానికి వీల్లేదు." మంజుల అంది.
ఇందిర చిరాకును దాచుకోడానికి ప్రయత్నిస్తుంది. ఆదివారం నాడు మధ్యాహ్నం సాహిత్య సభ ఉంది. ప్రసిద్ద రచయిత బందోపాధ్యాయ తో తేనీటి విందు తరవాత, మేటి సాహిత్యాన్ని గురించిన చర్చ ఉంది. ఆదివారం కోసం ఎదురు చూస్తున్న తన కిదొక సమస్య.
":ఏం సాకు చెబుదామా అని ఆలోచించకు. నువ్వు రాక తప్పదు."
"కాదు, మంజూ నిజంగా నన్ను క్షమించాలి . బందోపాధ్యాయ వస్తున్నారని చెప్పానుగా ఆ సమావేశానికి హాజరవ్వాలను కుంటున్నాను."
"అంత ముఖ్యమా మీకా మీటింగు?' బొమలు ముడిచి అడిగాడు మాధవరావు.
అతనా ప్రశ్న అడిగిన తీరు ఇందిరను రెచ్చగొట్టింది.
"ఔను, ణా కటువంటి సమావేశాలు చాలా ఉపయోగిస్తాయి" అంది క్లుప్తంగా.
తను చెప్పవలసిందింకేం లేదన్నట్టు గోపాలరావు గారి వంక తిరిగి "వెళ్లి వస్తానండీ. మీరు రెడీగా ఉండండి" అన్నాడు.
"అమ్మని పిలుస్తానుండండి" అంటూ మంజుల లోపలికి వెళ్ళింది.
"దీనివన్నీ వాళ్ళ నాన్న లక్షణాలు." ఆపేక్షగా ఇందిర వంక చూస్తూ అన్నారు గోపాలరావు గారు.
మరీ దురుసుగా ఉందేమో తన ప్రవర్తన అన్న అనుమానం తో సంకోచంగా మధావరావు వంక తిరిగింది ఇందిర.
"ఈ ఆదివారం తప్ప ఇంకెప్పుడన్నా అయితే వచ్చేదాన్నే........"
"చాలా కృతజ్ఞుడ్ని . మీ కంత శ్రమ ఇవ్వడం నా అభిమతం కాదు." కోపం, అవహేళన కలిపి అన్నాడు.
సుందరమ్మ గారు రావడంతో ఇందిర కు జవాబివ్వవలసిన అవసరం తప్పింది. ఇందిర కు తప్ప , అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు మాధవరావు.
ఆనందంగా ఇల్లు చేరిన ఇందిర ఈ సంఘటనతో మనస్సు పాడు చేసుకుంది. "ఎందుకిలా అవుతుంది?" అని కూడా ప్రశ్నించుకుంది తన్ను తాను. అయితే ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు.
* * * *
