అప్పటికేమొదటిమహాసంగ్రామ మారంభ మయి సాగుచున్నది.ఆ యుద్ధమున గూర్చి క్షోభ నాలో తీవ్రముగాస సాగుజొచ్చినది.నా యనారోగ్యము దుర్భరముగా నుండెను.డాక్టరు నంజుండరావుగారు మందిచ్చుచుండిరి.అట్లు నాల్గయిదురోజులు గడచిన తర్వాత నొకనాఁడు నా దేహ మెల్ల చిమ్మచీకట్లు క్రమ్ముచున్న ట్లయి ఒడలెల్ల ధారలుగా చెమటలు దిగజారి లోన నుండి తీవ్ర బలము,ప్రజ్ఞ పోగారు చున్నట్టయ్యెను.నంజుండరావుగారు నరములకు,గుండెకు బలము కలుగుటకు మందిచ్చు చున్నారు గాన దాని కార్యమది యనుకొంటిని.ఆనాఁడు తివ్రోత్సహముతో నుంటిని.నంజుండరావుగారు కొనాళ్ళు సెలవు పెట్టి స్వగ్రామమునఁ గొన్నాళ్లుండి రమ్మనిరి.నెల కాఁ బోలు సెలవు పెట్టితిని.ఇంటికి నే నొక్కఁ డనే పాయన మయితిని.తమ్ములు,భార్య మద్రాసు లోనే యుండిరి.
బందరులో గురువర్యులగు శ్రీ వెంకట శాస్త్రి గారికి కాబోలు నేదో బంగారువస్తువు వారు సొమ్ము పంపగా చేయించుచుంటిని.దానిని తీసికొని వచ్చుటకై ఆఫీసునుండి సాయంకాల మా ఱుగంటల వేళ టౌనులోని కరిగితిని.చెన్నకేశవస్వామి గుడి ప్రాంతముల నున్నది యా సెట్టిగారి యిల్లు.నేను వెళ్ళి సొమ్మిచ్చి వస్తువులను దీసికొని,మి సోదరుఁ డేడి యని యా సెట్టిగారి నడుగగా నేఁ టికి పదునై రోజుల క్రిందట ఆతఁడు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయమునకు రాత్రి పదిగంటల వేళ వెళ్ళి యక్కడ పూజోత్స వాదులు దర్శించుచుండగా ఎమ్డెన్ గుండు దెబ్బ వినవచ్చెను.ఒక గుండలోని తునకు కన్యకాపర మేశ్వరి దేవాలయా వరణలో పడెను.దాని వెల్తురు చూచినతోడినే గుండె పగిలి నెత్తురు వాతో చేసికొని చనిపోయెను అని సావి స్తరముగా నా సెట్టిగారు చెప్పిరి.
అది వినఁ గానే నాకు మరల శరీర మెల్ల సదరిపోయి చల్లబడి మృత్యుకల్ప మయిన స్థితి కల్గెను.నా వికృతి నా సెట్టిగారి కెఱుఁగనీయక వెంటనే యటనుండి వెడలి గోవిందప్పనాతని వీధి మొగనే యొంటరిగా కాపుర మున్న శ్రీ పురాణం సూర్యనారాయణశాస్త్రి గారి తోడ్పాటు కై వారి యింటి కి వెళ్ళితిని.చాల నీరసించి యెట్లో చేరగల్గితిని.ఉదయము పది గంటలకు చేసిన భోజనము అంతకు ముం దాకలి కూడ తీవ్రముగా నుండెను.అప్పటికి హొటలు,కాఫీ వగైరాల యలవాటు నాకు లేదు.వడిగా ట్రాము మిద నన్నిల్లు చేర్పాగోరీతిని.ఆయన కాశీ విజయనగర నివాసాభ్యస్తమయిన 'భంగు'పాన పారాయణుఁడు.అది నూఱి త్రాగి కాని కదలఁజాల ననెను.అవస్థపాడుచు గూర్చింటిని.భంగుతయారు చేసికొని త్రాగి నాతో బయలు దేరి నన్ను మా యింటికి చేర్చిరి.
ఏమ్డే గుండ్ల దెబ్బలు నాటికి పదిపదున్తె దునాళ్ళకు ముందు రాత్రి వేల పారిస్ కార్నరులో తగులుట, ముందుగా ఏమ్డే నౌకవారు మదరాసు నగరముప్తె తీవ్రమయిన టార్చిల్తేటు ప్రసరింపజేయూట నాయనారోగ్యారంభావస్ధలో నుండి యయెఱుగజాల నయితిని,మర్నాడు రెళ్ళ జెప్ప కొనుట వింటిని. అంతదాక ఇండియానుండి కృత్రిమ యత్నములతోయుద్దభటులను గొనిపోవుట,కసాయివారికి మేకల నర్పించినట్లు యుద్దభూమిలో వీరిని బలియిచ్చుట, దేశ దౌర్భాగ్యము వినిగూర్చి విచారమే కాని ఇండియాలోనే యుద్దవికృతులుగానవచ్చుట యెవ్వరు గాని ఊహింపని విషయము, యుద్దచింత నన్నల్ల కల్లోలములలో ముంచి వేసి నది, నాడు బాలయ్య నేట్టిగారి యింట ఫిరంగిగుండ్లముక్క లూరెల్ల బడుట దాని చూచి నిండు జివి యాకస్మికముగా చనిపోవుట వినప్తె యుద్దమున నిండుజివులు గుండు దెబ్బలు, ఈటే పోట్లు వాగ్తెరాలు తగిలినప్పుడు చెందు మరణయాతన ణ దేహముననే గోచరించుచున్నట్టు తోంపసాగినది క్షణ క్షణమును నాకు మరణయతనయే, ప్రతి దేశ లేశాములోను,ప్రతి కాలలేశములోను నాకు మృత్యు భయమే , చచ్చిన చావూ కాక బ్రదికిన బ్రదుకు కాక చావుబ్రతుకుల సందులో ఊగులాట యయ్యెను.
