Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 38

                                           ౧౮
 
`                                                  ఆవేదన

    రెండు మూఁడు నెలలింటి కడ నుండి నేను మాతమ్ములతో మద్రాసు చేరితిని. కొన్నాళ్ళు మా బావగారింటను, గొన్నాళ్ళు హొటలలోను భుజించుచుంటిమి. ఇంటికి వెళ్ళి ఇల్లాలిని వెంటగొని వచ్చితిని. అంతకు పూర్వము నేను చెందిన వెఱపు మఱపునఁ బడెను. గార్హస్ధ్యముతో కాలము గడచుచుండేను. అప్పటికి చాటుపద్యములు చాలా చేర్చి " చాటు పద్యమణిమంజరి" యని పేర గ్రంధముగా సంధానింతిని. వానిని ముద్రించి ప్రకటించుటలో శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు గారు నాకు చాలా సహాయము చేసిరి. వేయి రిప్లై కార్డుల మిఁ ద (కార్డు కాని వెల) నోటీసు, పుస్తక మాపేక్షించువారు వ్రాయుటకు పై అడ్రసులో పోస్టు చేయించిరి. వెంట వెంటనే వేయి పుస్తకములు నమ్ముదు పోయెను. ఇట్లు నేను పుస్తక వ్యాపారము చేయుదు నని దుఃఖించిన పుస్తక వ్యాపారు లున్నారు. దీని తర్వాత, ప్రబంధరత్నావళి, భాస నాటకములు, కొన్ని ప్రకటింపఁ బూనితిని. కానీ ఇవియెల్ల ' నీవు వ్యాపారము చేయాలనే? మా కిచ్చిన మే మమ్మి సోమ్మిత్తుము గదా' యని కోరుపు పుస్తక వ్యాపారులకు, అప్పటికి నేను మరల అనారోగ్యగ్రస్తుఁ డ నగుట, తర్వాత దేశాటనము చేయ వలసిన వాఁడ నగుట యేర్పడడుటచే అమ్మి వేసితిని. ఆ పుస్తక విక్రయము వల్ల వచ్చు నా యతిచే సుఖముగానే జీవిత యాత్ర గడపు చుంటిని. తమ్ము లిర్వురలో ఒకరు స్టాన్లీ రాయపురం మెడికల్ స్కూలులోను, ఇంకొకరు ఆయుర్వేద కళాశాలలోను తర్వాత చదివిరి గాని యప్పటికి కెలెట్ హైస్కూలులో చదువుచు నా దగ్గఱనే ఉండిరి. సుఖముగా జీవయాత్ర సాగుచుండెను.

    శ్రీ రామేశంగారికి నటేశ ౯ , రామయ్యగారు ఇత్యాది గ్రంధ విక్రేతలు మిత్రులు. వారు విక్రయమునకు తెప్పించు గ్రంధముల నన్నింటిని వారము చదివి యిచ్చుటకు వా రింటికి దెచ్చుకొని పుస్తకము లేమాత్రము చెడకుండ చదివి వారి లిచ్చి వేయుచుండెడివారు. ఆ గ్రంధవిషయముల గూర్చి మిత్రుల కందరికి తెలియజెప్పుచుండెడివారు. వారు గ్రంధములను జదువుట పుస్తక విక్రేతల కధికలాభాపాదక మగుచుండెడిది. వారి గ్రంధపఠనోత్సాహము నాకును జక్కిలిగింత గొల్పినది. లైబ్రరి నుండి ముద్రిత గ్రంధముల దెచ్చుకోనుచుండెడివాఁ డును. ఒకటే చదువు! అప్పటి నా వయస్సిరువాడియాఱు.

    అప్పుడు తెలుఁ గు దేశమున పెక్కు చోట్ల కలరా వ్యాపించియున్నది. మద్రాసులోను కలరా వచ్చి మృతిచెందెను. మద్రాసు నుండి మా బావగారు, మా తోబుట్టువు ఆమెగారి యౌర్ధ్వ  దైహికమునకు బందరు వెళ్ళిరి. వారు తిరిగివచ్చునప్పు డక్కడ నుండి కొన్ని మొక్కజొన్న కండెలు తెచ్చిరి. వారి రాక తెలిసి ఆఫీసు నుండి యింటికి వచ్చిన తర్వాత వారి యింటికి వెళ్ళి అక్కడి కష్ట సుఖములు విచారించి వచ్చితిని. వచ్చునప్పుడు మా వారీయఁ గా మోకాజొన్న కండెలు తెచ్చితిని. రాత్రి మే మందఱము వానిని భుజించితిమి. నిద్రలో రాత్రి రెండు గంటల వేళ నాకు మెలఁ కువ, శరీరమంతా అలకడి. కలరా వ్యాధి క్రమి ఆ మొక్కజొన్న కండెలతో అంటి వచ్చి నాలో చొచ్చినట్టు, నాకు కలరా వచ్చినట్టు బావన. బహిర్భూమికి వెళ్ళ వలసెను. రాత్రి గనుక నే నున్న చోటు (తిరువళిక్కేణి సాతానివీధి తుది మేడ) కొబ్బ్రై తోటలు గలది గనుక ఇల్లు విడిచి బైతికే వెళ్ళితిని. వట్టి గాలియే అమితముగా వెళ్ళెను, గాని విరేచనము కాలేదు. ఇంటికి వచ్చి యీజి చైరులో కూర్చుంటిని. ఒడ  లెల్ల కంపించిపోవు చుండెను. నాల్గు మూఁ డు గజముల  దూరమున - బందరులో కలరాతో చనిపోయిన మా బావగారి తల్లిగారు అఱువది యేండ్ల వృద్ధ ధూమ్ర దుఃఖితాగ్రహ విష్టాననముతో ప్రత్యక్ష మగుచుండెను. చీకాకు కలిగెను.
    అంతకు ముందట్టి దుర్దర్శనము నే నెన్నఁ డు నెఱుఁగను. నిద్ర రక చీకాకుతోనే ఆ రాత్రి గడపితిని. ప్రొద్దుట శరీర మంతయు కిలుకీలు విఱి చినట్టు  నొప్పి. పదిగంటల వేళ ఆఫీసుకు పోవెలెను గాన భోజనము చేయబోయితిని. ఒక ముద్ద మ్రింగితినో లేదో ఒడలెల్ల అదరి చల్ల బడి పోయి మృత్యు ముఖమున మున్నట్లయితిని. తమ్ములు స్కూలుకు వెళ్ళిరి. నేఁడు హైకోర్టు జడ్జిగా నున్న చింతకుంట రాఘవ రావుగారు నేను నొక యింటనే యుంటిమి. డాక్టరు నారాయణస్వామి  నాయని  గారిని రాఘవ రావుగారే పిలుచుకొని వచ్చిరి. ఆయన పరీక్షించి విరేచనములకు మంది చ్చి జబ్బేమి లేదని వెడలి పోయెను.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS