35. ఊపిరితిత్తుల్లో నీళ్ళు చేరడానికి కారణాలేమిటి?
అంజయ్యకు అనుకోకుండా ఆయాసం ప్రారంభం అయింది. ఆయాసం రావడానికి కోద్దిరోజుల ముందునుంచీ జ్వరం వస్తోంది. జ్వరానికి ఏవేవో బిళ్ళలు మ్రింగుతూ ఉండగా అదనంగా వచ్చిన ఈయాసం అర్ధంకాకుండా తయారైంది. గాలి పీల్చలంటే చాలా బాధ పడవలసి వస్తోంది. కొంపదీసి ఉబ్బసం బయలుదేరి ఇబ్బంది కలిగించడం లేదుకదా అని అనుమానం కలిగింది. అయినా ఎందుకైనా మంచిదని జ్వరం బిళ్ళలతో పాటు, ఎవరో చెప్పారని ఉబ్బసానికి బిళ్ళలు మ్రింగడం ప్రారంభీంచాడు. అది ఉబ్బసం అయితే కదా తగ్గడానికి! చివరకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాకతప్పలేదు. డాక్టరు పూర్తిగా పరీక్షచేసి ఒకవైపు ఊపిరితిత్తుల్లో నీరుబాగా చేరిపోయిందన్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందంటేఅంజయ్య నమ్మలేకపోయాడు. కాని డాక్టర్ ఒక ఇంజక్షను సూదిని ఛాతీలోపలికి గుచ్చాగానే నీరు పంపు లాగా బయటకు తన్నింది. సిరంజి పేట్టి నీరు లాగగా లీటరు పైగా నీరు బయటకు వచ్చింది.
ఊపిరితిత్తుల్లో నీరుచేరడాన్నే'ప్లూరల్ ఎప్యూజన్' అని అంటారు. ఊపిరితిత్తులపైన రెండు సన్నటి పొరలతో కూడిన సంచి ఉంటుంది. ఇది మామూలుగా ఊపిరితిత్తులకి హత్తుక్కుని ఉంటుంది. వ్యాధులు వచ్చినపుడు ఈ సంచిలో నీరు చేరుతుంది. కొన్ని సందార్భాలలో ఈ సంచిలో నీరు చాలా ఎక్కువ వేస్తుంది. గుండెను కూడా నొక్కివేస్తుంది. ఎక్స్రే ఫోటోతీసి చూస్తె ఛాతీకిఆ వైపున అసలు ఊపిరితిత్తే కనబడకుండా అక్కడ చేరిన నీరు తెల్లగా కనబడుతుంది.
ఊపిరితిత్తుల్లోఒకవైపునే నీరు చేరవచ్చు లేదా రెండువైపులా చేరవచ్చు. అలాగే కొద్దిపాటిగా చేరవచ్చు లేదా కొన్ని లెటర్ల నీరు చేరవచ్చు. ఆ నీరు మామూలు నీళ్ళలాగా వుండవచ్చు లేదా చిక్కగా ఉండవచ్చు. కొందరి విషయంలో ఈ నీరు లేత పసుపు వన్నెలో ఉంటే, మరికొందరిలో రక్తం రంగులో ఉండవచ్చు. ఇంకొందరివిషయంలో చాక్లెట్లు రంగులో ఉమ్దవచ్చు. ఓంకావుమ్దరి విషయంలో చాక్లెట్లు రంగులో ఉండవచ్చు లేదా పాలరంగులో ఉండవచ్చు. మరికొందరిలో చీములాగా చిక్కగా ఉమ్దవచ్చు. అలా ఉండటానికి నీరు తయరవాదనికి కారణమైన వ్యాధులే మూలం.
ఊపిరితిత్తుల్లోనీరు చేరడానికి గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, రక్తహీనత, పోషకాహర లోపం కొందరిలో కారణం కాగా, క్షయవ్యాధి, న్యూమోనియో, కేన్సర్ వంటి వ్యాధులు కూడా కారణం. మరి కొందరిలో బాక్టీరియా క్రిములు కూడా ఊపిరితిత్తుల పైపొరల్లో నీరు చేరేతట్లు చేస్తాయి. ఈ నీరు చేరడం కొందరిలో అకస్మాత్తుగా జరిగితే మరికొందరికి నిదానంగా చేరుతుంది. ఇలా నీరు చేరినప్పుడుకోమ్దరిలో జ్వరం ఉండవచ్చు, మరికొదరిలో జ్వరం లేకపోవచ్చు.
క్షయవ్యాధి ఊపిరితిత్తుల్లోగాని వాటిదగ్గరలో గాని వచ్చినప్పుడు ఊపిరితిత్తిపైపొరల్లో
నీరు చేరడం చాలా సాధారణమైన విషయం ఇటువంటి దానికి నీరు చేరడానికి ముందు ఛాతీకి అ వైపున నొప్పి అనిపించటం జ్వరం రావడం, దగ్గు అనిపించడం లేదా ఆకలి తగ్గిపోయి మనిషి నీరశించి పోవడం ఉంటాయి. క్షయవ్యాధి వచ్చిన వారిలో నీరు చేరడం అకస్మాత్తుగా గానీ, నిదానంగా గానీ జరగవచ్చు. నీరు ఎండుగడ్డిరంగులో గానీ, రక్తంలాగా ఎర్రగా గానీ ఉండవచ్చు. ముఖ్యంగా కేన్సర్ కేసుల్లో ఇలా చేరిన నీరు రక్తంలాగా ఉంటుంది. ఊపిరితిత్తులదగ్గర నీరు ఎక్కువ చేరడంలో శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతుంది.రాగి చాలా అయాసపడటం కనబడుతుంది. ఇటువంటప్పుడు నీరు బయటకు లాగివేసిన మరుక్షణంలో ఆయాసం తగ్గిపోతుంది. వైద్య పరిజ్ఞానం లేని కొందరు న్టు ద్క్తర్లు రోజుల తరబడి ఇటువంటి రోగులకి ఉబ్బసం అని వైద్యం చేయడం పరిప్తి. అలాగే ఊపిరితిత్తుల్లోనీరు ఎక్కువచేరి రక్తనాళాలని, ఇతర నాళాలనినొక్కి వేయడంతో మోఖనికీ, పావుత్తకీ నీరు చేరవచ్చు. ఇటువంటి సందర్భంలో కొందరు ఉబ్బుకమేర్లమ్తూ మూర్ఖంగా వైద్యంచేస్తారు.
ఛాతీలోపల ఉండే ముఖ్యమైన లింఫ్ నాళాలు ఎ కారణం వల్లనైనా దెబ్బతింటేఅందులోని పాలవంటి థైలుఊపిరితిత్తి పైపోరల్లో చేరుతుంది.అటువంటప్పుడు అ వైపున ఛాతీలోసూదివేసి బయటకు తీసినట్లయితే పలరంగులో ఉన్న నేరు ఎంతో వస్తుంది. అరుదుగా అమిబియసిస్ వల్ల ఇదే విధంగా ఊపిరితిత్తుల్లో చాక్లెట్లు రంగులో నీరు చేరుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు నీరు చేరుతున్నప్పుడు తగిన వైద్య పరీక్షలు చేయాలి. బయటకు తీసిన నీరుని లేబరేటరీ పరీక్షలు చేసి రాగా నిర్ధారణ చేసి, వ్యాధిని బట్టి పూర్తీ చికిత్స చేయాలి.
****
