Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 38

    తా: సందంశహస్తము  క్రిందుమీదులుగ బట్టినచో  సామవేదమునందు  వర్తించును.

   శ్లో!!    మృగశీర్షోధో ముఖశ్చేద  ధర్వణపదే భవేత్ !!

    తా: మృగశీర్ష హస్తములు  అధోముఖముగ  బట్టినచో  అధర్వణవేదమందు  వర్తించునని  భరతాచార్యులు చెప్పియుండిరి.


                -: చతురోపాయ హస్త లక్షణములు :-

        సామ, దాన, భేద, దండోపాయ హస్త లక్షణములు :
        ___________________________
   శ్లో!!    మృగశీర్ష స్తిర్యగశ్చేత్స ఏవాగ్రే ప్రచాలితః !
    ముకుళోభి ముఖీభూతః పతాకశ్చే ప్రకంపితః !
    క్రమాచతురుపాయేషు యుజ్యతేవై మనీషిభిః !!

    తా: మృగశిర హస్తమును  అడ్డముగా  బట్టినచో  సామోపాయము నందును, పురోభాగమునందు  చలింపచేయుచు బట్టినచో  దానొఫాయమునందును. ముకుళహస్తము అధోముఖముగ  బట్టినచో  భేదోపాయమునందును, పతాకహస్తము  పార్శ్వములందు  చలింపచేసినచో  దండోపాయమునందును వర్తించుచున్నది.

   శ్లో!!    తర్జనీ  మధ్యమే సమ్యక్కుంచితేతలమాశ్రితే !
    శేషాప్రసారితౌస్స్కోయం నామ్నాసంయమహస్తకః !!

    తా: తర్జనీ మధ్యమాంగుళులు వంచి హస్తతలమును  ఆశ్రయింపచేసి. శేషాంగుళులను  చాచిపట్టినచో సంయమహస్తమనబడును.

                              వి ని యో గ ము లు ;

   శ్లో!!    ప్రాణాయామే మహాయోగే యజమానస్య భావనే !!

    తా: ప్రాణాయామమునందును. మహాయోగమునందును. సోమయాజినభినయించుటయందు వర్తించును.

   శ్లో!!    వక్త్రాంతిక్కేలపద్మ్కోయం సఏవోర్ధ్వం ప్రచాలితః !
    ఉత్సాహప్రభు శక్త్యర్థేయుజ్యతే నాట్యమర్మగైః !!

    తా: అలపద్మ  హస్తము  ముఖసమీపమునందు  బట్టినచో  ఉత్సాహశక్తియందును. ఆ అలపద్మమునే ఊర్ధ్వభాగమున  చలింపచేసినచో  ప్రభుశక్తియందును  వర్తించును.

   శ్లో!!    ముకుళోవిరళీభూతోప్య పద్మకరశ్చలః !
    మంత్రశక్తౌతధాసమ్యగ్భాగధేయానుభుగ్జనే !!

    తా: ముకుళహస్తము  విరళముగబట్టినచో  మంత్రశక్తి యందును, అలపద్మ హస్తము  చలింపచేసినచో  భాగ్యభోగియందును  వర్తించును.

   శ్లో!!     పతాకౌతు పురోభాగే పరస్పరాముఖాశ్రితౌ !
    సందర్థేయుజ్యతే సోయంప్రమాణార్ధేతధైవచ !!

    తా: రెండు పతాకహస్తములు  పురోభాగమునందు  పరస్పరాభిముఖముగ  కలిపి పట్టినచో సంధియందును, ప్రమాణమునందును  వర్తించును.

   శ్లో!!    త్రిపతాకః పురోభాగే చలితోవిగ్రహే భవేత్ !!

    తా: త్రిపతాక హస్తము  పురోభాగమునందు  ప్రసరింపచేసినచో తరలిపోవుటయందు  ఈ హస్తము వర్తించును.

   శ్లో!!    ఆసనార్థేచ శిఖరః పురోభాగే స్థితోయది !!

    తా: శిఖర హస్తము  పురోభాగమునందు  నిలిపినచో, గూర్చుండుట యందు వర్తించును.

   శ్లో!!    ద్వైధీభావేకర్తరీస్యాదగ్రభావే ప్రకంపితా !!

    తా: కర్తరీ ముఖహస్తము  పురోభాగమునందు కంపింపచేసినచో ద్వైధీకరణమునందు వర్తించును.

   శ్లో!!    అంజలిర్వక్షసిస్థాయీ యుజ్యతేచ సమాశ్రయే !!

తా: అంజలిహస్తము వక్షస్థలమునందు నిశ్చలముగనుంచినచో ఆశ్రయించుటయందు వర్తించును.


          -: భూత, భవిష్య ద్వర్తమానకాల హస్త లక్షణములు :-

   శ్లో!!    అభోభాగే వురోభాగే దర్శితో వృష్ఠభాగకే !
    డోలావచ్చలితోహస్తః పతాకాఖ్యః మనీషిభిః !
    వర్తమానేచ భూతార్థే భవ్యర్యేచాపియుజ్యతే !!

    తా: పతాకహస్తము క్రిందుగబట్టినచో  వర్తమానకాలమందును, పురోభాగమందు డోలాకారముగ బట్టినచో భవిష్యత్కాలమునందును పృష్ఠభాగమునందు చాచిపట్టినచో భూతకాలమునందును వర్తించును.

   శ్లో!!    ప్రయోగే కర్మణిఖ్యాతః కరోహంసోస్యప్యథోముఖః

    తా: సందంశహస్తము అధోముఖముగబట్టిన  కర్తరీ ప్రయోగమునందు వర్తించుచున్నది.

   శ్లో!!    భావే ప్రయోగవిఖ్యాతః సర్పశీర్షోప్యథోముఖః !!

    తా: సర్పశీర్ష హస్తము అథోముఖముగ బట్టినచో భావప్రయోగము నందు  వర్తించును.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS