ఆ క్షణంలో నిజానికి నరేంద్ర ఆలోచిస్తున్నది ఒక్కటే.....రమ్యశ్రీ తన కెరీర్ లో ఎంతమందితో గడిపినా యిదే తనకు తొలి అనుభవం అన్నట్టుగా అద్భుతంగా నటించింది.
"నిన్నే" ఒక్క అనుభవంతో ఏకవచనంలోకి వచ్చేసిన రమ్యశ్రీ "బహుశా యిందాకటి థ్రిల్ నుంచి యింకా తేరుకోలేదనుకుంటాను" అంది అతడి చెంపల్ని నిమురుతూ.
"అవును రమ్యా" తనూ అంతే గమ్మత్తుగా అన్నాడు "నీ గురించి అంతా అనుకునేది నిజం కాదని యిప్పటికి తెలిసింది."
చురుక్కుమందేమో "ఏమనుకుంటారు నా గురించి?" ఉక్రోషంగా అడిగింది.
"ఏం లేదు" మాట దాటేయబోయాడు.
"చెప్పాలంతే" ఇప్పుడు అతడి మీదికి వచ్చేసింది చెప్పి తీరాలని మారాం చేస్తున్నట్టుగా.
"మరేం లేదు రమ్యా. ఎవరో నన్ను మిస్ లీడ్ చేశారు."
"ఏమని?"
"బెడ్ మీద వున్నప్పుడు నువ్వేదో పుస్తకం చదువుకుంటుంటావని.....అంతగా కోపరేట్ చేయవని...."
"అది ఒక్క ధనుంజయ దగ్గర మాత్రమే" అంది సిన్సియర్ గా.
ధనుంజయ అంటే తెలుసు సినీరంగంలో ఏభైయేళ్ళ వయసున్న నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీని శాసిస్తున్న వృద్దనాయకుడు.
"ధనుంజయ దగ్గరే అలా ప్రవర్తిస్తే బోర్ ఫీలవడా?"
నవ్వేసింది రమ్యశ్రీ. నైతిక విలువల్ని ఇండస్ట్రీలో ఎప్పుడో వదిలేసిన రమ్యశ్రీ నిజం చెప్పటానికి సంశయించలేదు. "ధనుంజయ పెద్ద హీరో. కావాలంటే ఎవర్నయినా తొక్కేయగలనని భావించే మూర్ఖమణి. బెడ్ మీద నన్నలాగే ప్రవర్తించమంటుంటాడు."
"అదేమిటి?" విస్మయంగా అడిగాడు.
"ఏభై ఏళ్ళ వయసులో సైతం తను గొప్ప శృంగార పుత్రుడని నిరూపించుకోవాలన్నది ఆయన తాపత్రయం. ఒకవేళ నేను సహకరిస్తే తనకు మూడ్ వచ్చే అవకాశముందని ఏ సహకారంతో లేకపోయినా యువకుడిలా అంతా చేసుకుపోగలడని నా దగ్గర ప్రూవ్ చేసుకుంటాడు. నన్ను శవంలా పడుకోమంటాడు. అతడు ఎంత హడావిడి పడేది చూడకుండా ఏదన్నా పుస్తకం చదువుకోమంటాడు. నిజానికి నాకు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయినా అంతా అయిపోయేదాకా ఏదో ఓ పుస్తకం అడ్డం పెట్టుకుని చదువుతున్నట్టు నటిస్తుంటాను."
"నలభయ్యేళ్ళు దాటినా మగాడిలో వుండే ఇన్ సెక్యూరిటీని కవర్ చేసుకుంటాడన్నమాట" నవ్వేశాడు నరేంద్ర విచిత్రమైన ధనుంజయ కథ విన్నాక...." పాతికేళ్ళ వయసులో ఆడదాని చీర తగిలితే మగాడికి ఆవేశం వస్తుంది రమ్యా. కానీ నలభయ్యోవడిలో అడుగుపెడితే చేవ చచ్చిపోతుంది. బహుశా ఆ నిజాన్ని అంగీకరించలేక ధనుంజయ అలా ప్రవర్తిస్తుండొచ్చు...." క్షణం ఆగి అన్నాడు.
"ఏమన్నా థ్రిల్ గా వుంటుందా?"
"థ్రిల్లా పాడా వాడు వాడి ముసలి మొహమూను.....తప్పు లేకపోతే కెరీర్ కి ప్రమాదమని...."
నవ్వుకున్నాడు నరేంద్ర మనసులోనే. ధనుంజయతోబాటు రమ్య బెడ్ మీద వుండేటప్పుడు బహుశా అతడి అహాన్ని కాపాడటం మీలాంటి మగసిరి మనిషే లేడు యీ ప్రపంచంలో అంటూంటే ఇక్కడ అదే వ్యక్తి గురించి నీచంగా మాట్లాడుతూంది. ఈ సినిమా రంగంలో "సక్సెస్" విలువైనది. వ్యక్తిత్వం కాదు.
ధనుంజయ సినిమాలు కోట్ల రూపాయలు బిజినెస్ కావటానికిగాని అతడు చెప్పిందే వేదంగా యిక్కడ చెల్లుబాటు కావటానికి అతడి 'సక్సెస్' కారణం..... తెలుగు సినిమా రంగంలో పోషించే 'మాస్' ప్రేక్షకులకి అతడు ఆరాధ్యుడు కాబట్టే ధనుంజయ తను సినిమాల్లో వేసుకున్న బట్టలు సైతం యింటికి పట్టుకుపోయి తన సొంతంలా హేంగర్ కి తగిలించుకుంటే నిర్మాతలు నిశ్శబ్దంగా భరిస్తుంటారు. పొరపాటున వాటి గురించి అడిగితే యిక వాళ్ళకి పుట్టగతులుండవు. ప్రముఖ నిర్మాతలు, దర్శకులూ ధనుంజయ వెంట పడిగాపులుకాయడం తెలుసు కాబట్టే హీరోయిన్స్ సైతం అతడు అడగ్గానే పడకగదిలో ప్రత్యక్షమైపోతుంటారు.
రమ్యశ్రీ ముందుగా ఓ స్థాయికి చేరటానికి ధనుంజయే కారణమని అందరికీ తెలుసు. ధనుంజయ ఎందరితో సంబంధం పెట్టుకున్నా రమ్యశ్రీని అందరికన్నా ఎక్కువ యిష్టపడుతుంటాడని అందరూ అనుకునే విషయమే.
"టైం వేస్టు చేయొద్దు" అంది రమ్యశ్రీ చెవిలో గుసపెడుతూ.
"హఠాత్తుగా నా మీద యింత ప్రేమెందుకు పుట్టుకొచ్చిందో అర్ధం కాలేదు" అన్నాడు.
నవ్వేసింది రమ్యశ్రీ గోముగా. వృద్ద కథానాయకులకి రేపో మాపో కాలం చెల్లితే ఆ తర్వాత సినీ రంగాన్ని ఏలేది నరేంద్రలాంటి హీరోలే కాబట్టి యిప్పటి నుంచీ ఓ 'ప్రారంభం' అవసరమనిపించి రప్పించాననలేదు.