Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 38


    అంతే....విషయం విన్న కామాక్షి కూతుర్ని ముస్తాబు చేయడం ప్రారంభించింది. అంతేకాదు.....వయసుడిగిన మగాళ్ళని ఎలా రంజింప చేయొచ్చో సిగ్గొదిలి మరీ వివరించింది.
    పావని రెచ్చిపోవాలని నిర్ణయించుకుంది ఆ రాత్రి.
    
                                                           *    *    *    *
    
    రాత్రి ఎనిమిది గంటల సమయంలో రంగరాజాపురం రమ్యశ్రీ యింటి ఆవరణలో ఓ మారుతి ఆగింది.
    ఖరీదయిన యింటి పరిసరాల్ని చూస్తూ కారుదిగిన నరేంద్రని రిసీవ్ చేసుకుంది రమ్యశ్రీ.
    "వెల్ కమ్"
    విష్ చేసి ముందు హాల్లో కూర్చోబోయిన నరేంద్రతో అంది రమ్యశ్రీ "ఇక్కడ కాదు" వారించి తన బెడ్ రూంలోకి నడిపించింది.
    ఊహించని యీ ఆహ్వానానికి తొట్రుడిన నరేంద్ర "ఇదంతా కలలా వుంది" అన్నాడు.
    బెడ్ రూంలోకి అడుగుపెడుతూ బడలికగా ఒళ్ళు విరుచుకుంటూ చూసింది రమ్యశ్రీ. "ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేంగా."
    ఈ మధ్య తరచూ  వచ్చే తెలుగు సినిమా డబుల్ మీనింగ్ డైలాగుల్ని గుర్తు చేసుకుంటూ నవ్వింది రమ్యశ్రీ. "పుట్టా పామూ అనగానే కంగారుపడుతున్నారా?"
    "మరేం"
    రమ్యశ్రీ గది ద్వారం మూసి గడియ పెట్టింది.
    నరేంద్ర నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ చూశాడు.
    "ఏమిటీ అప్పుడే చెమటలు పట్టేస్తున్నాయి?" అంది రమ్యశ్రీ బెడ్ మీద వాలిపోతూ.
    నరేంద్ర ఎదురుగా ఓ సోఫాలో కూర్చోబోతుంటే "ఇలా కూర్చోండి" అంది బెడ్ మీద పక్కగా ప్లేస్ చూపిస్తూ.
    నరేంద్ర సహజంగా ధైర్యవంతుడే అయినా రమ్యశ్రీకున్న యిమేజ్ జ్ఞప్తికొస్తుంటే కొంచెం తడబడుతూనే బెడ్ అంచున కూర్చున్నాడు.
    "తొలిసారి కెమేరా ముందు నిలబడ్డ ఆర్టిస్టులా వణికిపోతున్నారు మీరు."
    "మరేం..... అలాగే వుంది" అన్నాడు నరేంద్ర రమ్యశ్రీ నైటీ దిగువన వున్న ఎత్తుల్ని ఓరగా చూస్తూ.
    "ఇంతకుముందు బెడ్ రూం సీన్సు లో ఎప్పుడూ నటించలేదా?" అడిగింది పై భాగం నైటీ బటన్స్ తీసేస్తూ.
    "నటించానుగాని అక్కడ ఎదురుగా డైరెక్టరు, కెమెరామెన్ లు వుండేవారు."
    "ఇక్కడ అలాంటి యిబ్బంది లేదుగా?"
    "నిజమే..... కానీ యిది నటనకాదు."
    కిసుక్కున నవ్వింది రమ్యశ్రీ. "పైగా సెన్సార్ బోర్డు గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఎంత డీప్ గా అయినా పాత్రల్లో జీవించేయొచ్చు."
    "మీరు అద్భుతంగా మాట్లాడుతారు."
    "సీనులో వట్టి సంభాషణలే అయితే నాకు బోరుగా వుంటుంది దృశ్యానికి ప్రాధాన్యత యిస్తే బాగా రక్తి కడుతుందని నా నమ్మకం" గ్రీన్ సిగ్నల్ అందించింది.
    "అయితే ఏక్షన్ ప్ర్రారంభిద్దామంటారు."
    తన ఒంటిమీద డ్రస్ తీసేశాడు నరేంద్ర.
    ఆ తర్వాత రమ్యశ్రీ అతడ్ని వారించలేదు. పెదవులతో చెంపల్ని, కంఠాన్ని, మరికొంచెం దిగువ భాగంలోని ఎత్తుల్నీ స్పృశిస్తూ "గాడ్" అన్నాడు ఆశ్చర్యంగా.
    "ఏ.....మైం....ది....." గొణుగుతున్నట్టుగా మూలిగింది అప్పటికే రగులుకుంటున్నట్టుగా.
    "ఇంతకాలం మీరు పేడింగ్ మీదనే ఆధారపడ్డ ఆడది అనుకున్నాను.... అంతా ఒరిజినలే అని యిప్పటికి తెలిసింది."
    "థాంక్స్" అంది రమ్యశ్రీ మత్తుగా..... తన పొంకం గురించి యింత కాలానికి ఓ మగాడు యీ స్థాయిలో అడ్మైర్ చేయడం ఆమెకు ఆనందంగా వుంది.
    అసలు నరేంద్ర కేవలం ముఖ స్తుతి కోసమే అన్నాడని రమ్యశ్రీకి తెలీదు. అదే ఇండస్ట్రీ ప్రత్యేకత. ఎవరూ నిజాయితీగా నిజాలు మాట్లాడక పోయినా ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసినా అది తమకి కాక మరెవరికో వర్తిస్తుందని అందరూ అనుకుంటారు.
    పది నిమిషాలపాటు యిద్దరూ పరిసరాలను మరిచిపోయారో, మరిచిపోయినట్టు అభినయించారో మొత్తానికి రిలాక్స్ డ్ గా కూర్చున్నారిప్పుడు.
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగింది రమ్యశ్రీ సిగరెట్ కాల్చుకుంటున్న నరేంద్రని చూస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS