"ఓహో, నేను ఈ గులాబీ ఇవ్వకూడదా?"
"ఛ...ఛ..."
మరి...
"రోజూ"
"ఫర్లేదులెండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేనేమో.." అంటూ తల పైకెత్తి సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ.
"నాకు అస్సలు లేవు"
నేను హేమంత కృష్ణా నంతి శ్వరిని..."
అంటూ ఆగి ప్రనూష మొహంలోకి చూసి.
బహుశా ఇలాంటప్పుడు...అప్పుడప్పుడూ...నాకు కృష్ణశాస్త్రి గుర్తొస్తాడు. ఆయన అక్షరాలని నా విషాదాలకో, నా అనుభూతులకో అన్వయించుకుంటాను.
కృష్ణశాస్త్రి గారే ఎక్కడో రాసినట్టున్నారు.
"మీరెవరైనా ఎప్పుడైనా సముద్ర తీరాన ఏడ్చారా? అభిమాన వంతులకిదే అనువైన స్థలం. హృదయ భారం విరబోసుకుందుకు. మన చిన్న ఏడుపు అతని రోదానారావములలో ఒక జోరై, ఇమిడిపోతుంది. మన కన్నీటి చినుకులు అతని భాష్పవాహినులలో ఒక నాలుగు బిందువులై కలిసిపోతాయి.
ఏంటో...ప్రనూషగారూ...బాధేసినా...దిగులేసినా, భేదమైనా, మోదమైనా...భావం ఏదైనా, విషాదం మిగిల్చే ప్రతీ గుర్తు...నాకు లీల జ్ఞాపకమే. నాలోని ఒంటరితనాన్ని 'బూచి'లా చూసే చేదు జ్ఞాపకాలే. పోనీలెండి....మీరు మాత్రం ఏం చేస్తారు....ఏదో అప్పుడప్పుడు మీ పలకరింపు.... మీ పరామర్శ....ఆగి ప్రనూష మొహంలోకి చూశాడు.
ప్రనూష ఒక్క క్షణం కదిలిపోయింది.
"ఎంత భావుకత? ఎంత భావ వ్యక్తీకరణ. తన బాధని అందమైన భాషగా మార్చి అద్భుతమైన పదాలు కూర్చి...అతను నినదించే తీరు..."
"సారీ! మిమ్మల్ని హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు" నొచ్చుకుంటూ అంది ప్రనూష.
"ఇందులో మీ తప్పేం వుంది ప్రనూషగారూ....నేను నా మనసులోని ఫీలింగ్ ను, నా మనసులోని కోరికను బలవంతంగా మీ మీద రుద్దాలనుకున్నాను తప్పు ముమ్మాటికీ నాదే...
చెప్పానుగా....ప్రేమ రాహిత్యం...అభద్రతా భావం....ఎవరూ లేరనే ఒంటరితనం ఆలోచన....అన్నీ....ఇవన్నీ....ఒక్కసారిగా మిమ్మల్ని చూసాక....మరిచిపోయానేమో అనుకున్నాను. ఇన్నాళ్ళూ...తోటలోనే పూచి, అక్కడే వాడి, రాలిపోయే గులాబీల సౌకుమార్యం, ఆయుషు. మీ జడలో మరింత మాధుర్యాన్ని నింపుకొని, ఆయుషుని, అందాన్నీ నింపుకుని వుంటాయని.... ఇలా తెచ్చాను."
"సారీ మీరింతగా ఫీలవుతారని అనుకోలేదు" అంటూ టేబుల్ మీద ఉన్న గులాబీ తీసుకుని జడలో పెట్టుకుని థాంక్స్" అంది.
"ఇంతసేపు మిమ్మల్ని మాటతో బాధ పెట్టనందుకా? తోటలోని గులాబీని మీకోసం....వేకువ ఝామునే లేచి, ముళ్ళు గుచ్చుకున్నా కోసుకువచ్చినందుకా?"
"నాకోసం....అంత ఎర్లీ మార్నింగ్..."
"అవును.....ఇష్టపడే వ్యక్తికోసం....కష్టపడ్డం తప్పేమీ కాదు..... గులాబీ కోస్తున్నప్పుడు ముల్లు గుచ్చుకున్నా బాధేమీ లేదు తెలుసా..." అంటూ తన కుడి చేయి చూపుడు వేలు చూపించాడు.
ముల్లు గుచ్చుకున్న గుర్తు కనిపిస్తోంది.
"అయ్యో...." అంది ఆ వేలిని ముట్టుకొని.
"అబ్బా..." అన్నాడు ప్రభాత్.
"నొప్పెట్టిందా?" అడిగింది.
"ఊహూ! రేపట్నుంచి నాకే గాయమైనా హాస్పిటల్ కు వెళ్ళను....యాంటీ సెప్టిక్ లోషన్లు...మందులూ అనవసరం" అన్నాడు.
"అదేంటి?" అయోమయంగా అడిగింది అనూష.
"అదంతే, మీరిలా చేయి వేశారు. నా నొప్పి పోయింది అన్నాడు. వెంటనే చేతిని వెనక్కి తీసుకుంది.
"ఎనీవే....థాంక్స్ ప్రనూషగారూ...నా భారాన్ని దించారు. నా భేదాన్ని పంచుకున్నారు. నా విషాదాన్ని ఊరడించారు. ఇంత కన్నా...నాక్కావాల్సిందేముంటుంది" అన్నాడు ప్రభాత్.
ఏమనాలో తోచలేదు ప్రనూషకు.
సర్ నేను వెళ్ళేదా?" అంది.
"వెళ్ళండి....వన్స్ అగైన్ థాంక్స్..." అన్నాడు.
ప్రనూష లేచింది. ప్రనూష వెళ్ళగానే...
సిగరెట్ వెలిగించి పొగను రింగులు రింగులుగా వదులుతూ...నవ్వుకున్నాడు ప్రభాత్.
ఆ నవ్వు వికృతమై ఆ ఛాంబర్లో సిగరెట్ పొగతో పాటు సుడులు తిరుగుతోంది.
తన సీటులో కూర్చున్న ప్రనూషలో...చిన్న ప్రకంపనం. అది ఎన్ని వెలవెల మనో ప్రకంపనలకు దారితీస్తుందో..?
* * *
శ్రీచరణ్, శశికళ హోటల్ తాజ్ లో ఓ కార్నర్ టేబుల్ ని సెలక్టు చేసుకొని కూచున్నారు.
"ఇవ్వాళ ఆఫీసుకు భలే డుమ్మా కొట్టాం కదూ..." అంది శశి.
"రోజూ వెళ్ళే ఆఫీసే కదా...మొనాటనీ అప్పుడప్పుడు బ్రేక్ చేస్తే మంచిదే. లేకపోతే ఒక్కరోజు జీతం "బొక్క" అన్నాడు శ్రీచరణ్.
"నువ్వు గమ్మత్తయిన పదాలు వాడుతుంటావు ఎనీవే...అని బావుంటాయి కూడా...." అంది టేబుల్ మీద వున్న ఫోర్క్, స్పూన్ ని చేతిలోకి తీసుకొని అటూ, ఇటూ పరీక్షగా చూస్తూ.
"ఏంటీ నొక్కేద్దామనే....వద్దు....ప్లీజ్" అన్నాడు శ్రీచరణ్.
"అదేంటో బాసూ....చేతులు దురదెడుతున్నాయి. అయినా ఏదో ఒకటి నొక్కెయ్యకపోతే నా దురద తీరేదెలా?" అంది శశి.
"ఓ పన్జేయ్...దురదెట్టిన చోట బరభరగోక్కో లేకపోతే జాలి,మ్ లోషన్ తెచ్చేదా?"
ఛీ...నాకేం గజ్జి, తామర లేదు" అంది ఉక్రోషంగా ముక్కు ఎగబీలుస్తూ.
"అంతకన్నా ఎక్కువే....నీ! నొక్కేసే జబ్బు దురద" అన్నాడు శ్రీచరణ్.
శశి ఫోర్క్ స్పూన్ టేబుల్ మీద పెట్టింది.
"థాంక్ గాడ్..... నేనింక ఆర్డర్ చెప్పొచ్చన్నమాట" అన్నాడు శ్రీచరణ్.
అదేంటి.
"అప్పట్నుంచి నా కాన్ సన్ ట్రేషన్ అంతా ఆ ఫోర్క్, స్పూన్ మీదే ఉంది.
అటు చూడు....వెయిటర్ నీవైపూ, నావైపూ మిడి గుడ్లేసుకు చూస్తున్నాడు. ఇంతకీ ఏం తీసుకుంటావు.
"వెజిటబుల్ కట్లెట్" చెప్పింది శశి.
వెయిటర్ రాగానే రెండు వెజిటబుల్ కట్లెట్ ఆర్డర్ చేశాడు.
వెయిటర్ వెళ్ళిపోయాక శ్రీచరణ్ శశివైపు చూస్తూ...
"నువ్వు భలే షార్ప్" అన్నాడు.
"నా షార్ప్ నెస్ అప్పుడే ఏం చూసావు." అంటూ తన కాలిని కాస్త ముందుకు జరిపి, తన పాదాన్ని శ్రీచరణ్ పాదం మీద వేసి నొక్కింది.
"ఎంత ఘాటు ప్రేమో..." అన్నాడు శ్రీచరణ్.
"ఇంత లేటు వయసులో అని మాత్రం అనుకోకు బాసూ..." అంది అతడి ఫీలింగ్స్ గమనిస్తూ.
శశికళలో శ్రీచరణ్ కు బాగా నచ్చింది ఆవిడ ఫాస్ట్ నెస్.
"సినిమా హాలులో ఓ డొక్కు పాత సినిమాకి వెళ్ళిచూస్తూ, ఆ చీకట్లో భార్య నడుమ్మీదో, ఇంకెక్కడో చేయివేసి అల్లరి చేస్తోంటే ఆ సరదాయే వేరు" అనుకున్నాడు మనసులో.
"ఏంటి బాసూ...." ఆలోచిస్తున్నావు?"
"ఏం లేదు....ఇంతకీ నీ పెళ్ళి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?" అడిగాడు శ్రీచరణ్.
"స్టేట్స్ కు వెళ్తూ....నన్ను పెళ్ళి చేసుకొని తీసుకెళ్ళే నాథుడు ఒక్కడు కనిపించడం లేదు. ప్చ్...అంది నిరాశగా శశికళ.
"మరీ అత్యాశ కాకపోతే....పెళ్ళి కావాలంటే స్టేట్స్ అబ్బాయినే చేసుకోవాలా? ఇక్కడి వాళ్ళు సరిపోరా?"
"సరిపోరని కాదు...సరి తూగరని. ఆ లగ్జరీ...ఆ పద్దతేవేరు. పోనీ మంచి బాగా డబ్బున్న కేసు కూడా దొరకట్లేదు. నీకైనా కారు, బ్యాంకు బ్యాలెన్సూ వున్నా బావుండేది" అంది శశి.
డబ్బు పిచ్చి ఎక్కువైతే మంచిది కాదు అన్నాడు శ్రీచరణ్.
"ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి వుంటుంది బాసూ....కొందరికి అందమైన భార్య వున్నా.... మరో అమ్మాయితో తిరగాలని పిచ్చి....మరొకడికి ఓ స్టెప్సీలాంటి మరొకడికి ఓ స్టెప్నీలాంటి ప్రియురాలు వున్నా, ఇంకో స్టేప్నీ కావాలని పిచ్చి....మరి కొందరికి పదవి పిచ్చి ఇంకొందరికి పేరు పిచ్చి..." అంది పెద్ద లెక్చరర్ దంచి శశికళ.
