Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 38


    
    'ఆ ముక్క అనాల్సింది నేను. బుద్దిగా లుంగీ కట్టుకుని పడుకొని వున్న నువ్వు అదే పనిగా, జీవితంలో మగాడి మొహాన్నే చొదొఅనత్గ్తుగా చూస్తూ, పైగా నన్నే అంటావా?" అన్నాడు శ్రీచరణ్ మరింత రెచ్చిపోతూ.
    "ఛీ....నీ నోట్లో నోరు పెట్టడం నాదే బుద్ది తక్కువ" అంది ప్రనూష.
    "నా నోట్లో నోరు పెట్టావా? అదెప్పుడు..... నా నోట్లో నువ్వు నోరు పెట్టనట్టు నాకు గుర్తులేదే...కొంపదీసి నేను నిద్రలో ఉన్నప్పుడు నోట్లో నోరెట్టి ఇంగ్లీషు ముద్దుకానీ, తీసేస్కున్నావా?" అడిగాడు శ్రీచరణ్ - తన పెదాల వంక చూసుకుంటూ!
    పరిస్థితి అర్ధమై, బుద్దిగా తన ప్లేస్ లోకి వెళ్ళి పడుకుంది ప్రనూష. "గుడ్ గాళ్.... గుడ్ నైట్." అన్నాడు బ్లాంకెట్ నిండా కప్పుకుని.
    "బావా....రాత్రి అక్కా, నువ్వూ ఏం చేసుకున్నారు?" శ్రీచరణ్ షేవ్ చేసుకుంటుండగా వచ్చి అడిగింది ప్రియ.
    పరాకుగా వున్న శ్రీచరణ్ కు ప్రియ సడన్ గా అలా అడిగే సరికి....చేయి స్లిప్ అయి, చిన్న గాటు పడింది.
    "అదేంటి బావా....సిగ్గుతో మొహం ఎర్రబడాల్సింది పోయి....రక్తంతో బుగ్గ ఎర్రబడింది..." అంటూ కర్చీఫ్ తో గాటుపడ్డ భాగాన్ని అదిమింది.
    "అబ్బ... నేనంటే నీకెంత "ఇది ప్రియా" అన్నాడు ఆమె చేతిని అలాగే బుగ్గకు ఆన్చుకుంటూ.
    ఇది అంటే ఏంటి బావా?
    అదే ఆ ఇది?
    అబ్బ... ఏదో ఒక ఇదిలే... మీ అక్క కన్నా నువ్వేనయం ప్రియా.
    ఎందుకు బావా. అక్కయితే కర్చీఫ్ తో అద్దదా?"
    "ఊహూ"
    "మరి చీరకొంగుతో అద్దుతుందా?"
    రెండు ఊహూలు.
    "మరి...?
    పోపుల డబ్బాలో వున్న కారం తెచ్చి బుగ్గకు గట్టిగా అద్ది....."దూల తీరిందా?" అని అడుగుతుంది అన్నాడు తమనే చూస్తోన్న ప్రనూషను గమనిస్తూ.
    "ఛ...అక్కను అలా ఏడిపించొద్దు బావా..." అంది ప్రియ.
    "నా బ్రతుక్కు అంతదృష్టం కూడానా? తను నన్ను ఏడిపించకపోతే చాలు...
    "నువ్వు మరీ జోకుతావు.... అద్సరే గానీ రాత్రి మీరేం చేసుకున్నారో చెప్పనే లేదు...." అంది ప్రియ.
    "నేనేమో అష్టచెమ్మ ఆట ఆడాను. తర్వాత తర్వాత బోర్ కొట్టి అంత్యాక్షరి ఆడుకున్నాం....ఆ తర్వాత ఇంకేంటి చెప్మా....ఆ! దొంగా-పోలీస్ ఆట ఆదుకున్నాం..." అన్నాడు అత్యుత్సాహంగా శ్రీచరణ్.
    "ప్చ్....." అంది ప్రియ.
    "అదేంటి ప్రియా.....ఎక్స్ ప్రెషన్ ఏంటి అలా మార్చావు?"
    "ఎంత హాప్ వుండేది బావా?"
    దేనికి...?
    "మీ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి....ఫ్యూచర్ లో నాకు పెళ్ళయ్యాక ఉపయోగపడతాయి అనుకున్నా....ఏం చేద్దాం....పెళ్ళయిన కొత్త జంట పడగ్గదిలో అష్టాచెమ్మా, అంత్యాక్షరీ, దొంగ-పోలీస్ ఆడుకుంటున్నారన్న నగ్నసత్యం ఇప్పుడే తెలిసింది బావా...."
    "అదేం... మరి మీ అమ్మా....నాన్నా..."
    "వాళ్ళు కూడా ఇలాగనే అష్టచెమ్మ, అంత్యాక్షరి, దొంగ- పోలీస్ ఆడుకుంటే నేనూ, అక్కా ఎలా పుట్టేవాళ్ళం....ఈ మాత్రం జనరల్ నాలెడ్జి కూడా లేకపోతే ఎలా బ్రతుకుతావు బావా?" అంది ప్రియ.
    "రోజూ కొంచెం.....కొంచెం....నీ దగ్గర నేర్చుకుంటాన్లే..." అన్నాడు. ఈలోగా ప్రనూష అక్కడికొచ్చి....
    "ఏం చేస్తున్నావే..." అని ప్రియను అడిగింది కోపంగా.
    "బావకు బ్లేడు కోసుకుంటే కర్చీఫ్ అద్దిపెట్టి హెల్ప్ చేస్తున్నా..."
    "నేను చేస్తాన్లే.....నువ్వెళ్ళు" అంది ప్రనూష.
    "బెస్టాఫ్ లక్ బావా..." అంటూ ప్రియ వెళ్ళింది.
    "ఆహా! నిజమా ప్రనూ....నాకు గెడ్డం తెగితే....నువ్వు హెల్ప్ చేస్తావా? ఏదీ చేయి చూద్దాం.....ఏమి నా భాగ్యం. ఇక నుండీ రోజూ గెడ్డం తెగినా పర్లేదన్న మాట...." అంటూ తన్మయత్వంలో రెండు కళ్ళు మూసుకున్నాడు శ్రీచరణ్ ఏవేవో ఊహించుకుంటూ.
    వెనుకవైపు బిగించి పట్టుకున్న పిడికిలి విప్పింది. అందులో కారప్పొడి వుంది. దాన్ని గాటుపడ్డ భాగం మీద కసిగా అద్ది...."పెళ్ళాన్ని వదిలి మరదలితో సరసాలాడి జోకులు జోకుతావా?" అంది.
    అంతే కెవ్వున కేకవేసి స్టీరియో ఫోనిక్ సౌండ్ లో అరిచాడు శ్రీచరణ్.
    
                                                                 * * *
    
    ఆఫీసులో అదే పనిగా నవ్వుతూ వుంది ప్రనూష.
    ఉదయం జరిగిన సంఘటనే గుర్తొస్తోంది.
    శ్రీచరణ్ కు గడ్డం తెగడం....తను కారం అద్దడం....అతను కేక వేయడం.
    సరదాగా అనిపించింది.
    పాపం! తర్వాత తన తండ్రి "ఏమైందల్లుడూ...." అని అడిగితే.
    "ఏం లేదు మావయ్యా అరవడం ప్రాక్టీస్ చేస్తున్నా"నని బుద్దిగా చెప్పాడు.
    ఆఫీసు వర్క్ చేస్తోన్న ఆమెకు ఆ సంఘటన గుర్తొస్తోంది. పదకొండు అవుతుండగా ఫ్యూన్ వచ్చి ప్రనూషని మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పాడు.
    "ఏంటి కథ....రోజూ పిలుస్తున్నాడు?" ప్రసూనాంబ అడిగింది. ప్రనూష వాళ్ళకేం సమాధానం చెప్పకుండా మేనేజర్ ఛాంబర్లోకి నడిచింది.
    "శుభోదయం" అన్నాడు ఛాంబర్లోకి వెళ్ళగానే ప్రభాత్.
    "గుడ్ మాణింగ్" అంది తనూ విష్ చేస్తూ ప్రనూష.
    "అదేంటి నేను అచ్చ తెలుగులో శుభోదయం అని చెబితే....మీరు గుడ్ మాణింగ్ అని చెప్పారు" నవ్వుతూ అడిగాడు ప్రభాత్.
    "ఇంగ్లీషులో అయితే....గుడ్ మాణింగ్ చెప్పగానే వెరీ గుడ్ మాణింగ్ అనో, గుడ్ మాణింగ్ అనో చెబుతాం. కానీ తెలుగులో మీకు శుభోదయం అని చెప్పగానే, నేను "శుభోదయం" "మరీ మంచి శుభోదయం" అని చెబితే బాగోదు కదా..!! అంది.
    "మీకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా వుందే" మెచ్చుకోలుగా అన్నాడు ప్రభాత్.
    "థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్" అంది చిర్నవ్వుతో ప్రనూష.
    ప్రభాత్ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి, అందులో నుంచి గులాబీని తీసి టేబుల్ మీద పెట్టి "మీకోసం....గులాబీతో శుభోదయం...." అన్నాడు.
    ఇబ్బందిగా ఫీలయింది ప్రనూష. "నిన్ననే ఇచ్చారుగా" అంది.
    "అదేంటి నిన్ననే తిన్నాంగా అని ఇవాళ తినకుండా వుంటామా?" అడిగాడు ప్రభాత్.
    "అది కాదు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS