Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 39


    
    రెండు గంటల ప్రాంతాన కసువు కోయడం పూర్తయింది. బుట్ట కంటే ఎక్కువగా వుండడం వల్ల తీరిగ్గా మోపు కట్టడం ప్రారంభించింది.
    
    పెద్ద మోపే తయారైంది.
    
    దాన్ని ఒక్కతే తలకు ఎత్తుకోవడం కష్టమైన పని. అందుకే అటూ ఇటూ చూస్తోంది.
    
    అక్కడ ఎవరూ వుండరు సాధారణంగా.
    
    ఇక మిగిలింది గోకుల్ కానీ అతన్ని పిలవాలంటే ఏదోగా వుంది. చదువుకున్నవాడు, పైపెచ్చు మంచి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి పిలవడానికి జంకుతోంది.
    
    ఇదంతా గమనిస్తున్నాడు అతను.
    
    ఆమె పిలిస్తే పరుగున పోవడానికి రెడీగా వున్నాడు. గానీ పిలవడం లేదు.
    
    ఇక ఇలా వుంటే ఆమె పిలిచేటట్టు లేదని తనే కదిలాడు.
    
    ఇంటికెళుతున్న బిల్డప్ ఇచ్చి ఆమెకి పక్కనున్న గట్టుమీద నడుస్తున్నాడు.
    
    పదే పదే ఆమె వేపు చూస్తున్నాడు గానీ ఆమె పిలవడం లేదు.
    
    ఆమె పరిస్థితి కూడా అలాగే వుంది.
    
    అతను వెళ్ళిపోతే ఇక ఇంటికి వెళ్ళి చెల్లెల్నో, తండ్రినో పిలుచుకు రావాలి. కాని అతన్ని పిలవడానికి నోరు పెగలడం లేదు.
    
    ఇక తనే చొరవ తీసుకోవాలని, "ఏమండీ..... ఇంకా వెళ్ళలేదా?" అని అడిగాడు గట్టుమీద నిలబడి.
    
    "ఈ మోపు తలమీదకి ఎత్తాలి" అంది ఒక్కో మాటను వెదికి తెచ్చినట్టు.
    
    "వుండండి.... నేను పెడతాను" అని ఆమె దగ్గరికి వచ్చాడు.
    
    అంత క్లోజ్ రేంజ్ లో ఓ ఆడపిల్ల ఎదురుగా నిలబడడం అదే మొదటిసారి అతనికి.
    
    ఆమె నుంచి వస్తున్న గడ్డివాసన చందనం వాసనలా అనిపిస్తూ వుందంటే అతనెంత మత్తులో వున్నదీ తెలుస్తుంది.
    
    గడ్డిమోపును పైకెత్తడానికి వంగాడు.
    
    ఆమె కూడా అంతే యాంగిల్ తో వంగింది.
    
    అయితే పైటకు ఆ యాంగిల్ నిలబడడం వీలుకాక కిందకి జారింది.
    
    ఒక్కక్షణం అతని కళ్ళముందు పెద్ద పూలచెండ్లు పరుచుకున్నాయి.
    
    మిరపకాయ బజ్జీని కోసి అందులో మసాలా దట్టించినట్లు ఎవరో తల నరాల్ని మధ్యలో కోసి కోరికను కూరినట్టు గిలగిల్లాడిపోయాడు.
    
    ఆమె ఠక్కున పైట చెంగును తీసుకుని కసిగా చీరకట్టులో దోపుకుంది.
    
    ఆ దృశ్యం మారినా అతని కళ్ళలో మాత్రం ఇంకా పెద్ద పూలచెండ్లు అలా నిలిచే వున్నాయి.
    
    మోపు ఎత్తడానికి చేతులు వణుకుతున్నాయి అతనికి. శరీరమంతా మత్తుతో మూల్గుతోంది.
    
    'వూ' అంది ఏటిటాలస్యం అన్నట్టు.
    
    అతను చేతుల్ని మోపుచుట్టూ బిగించి పైకి ఎత్తాడు.
    
    మోపును తలమీద పెట్టుకోవడానికి ఆమె కాస్తంత ముందుకి కదిలింది. ఆ సమయంలో ఆమెకి తెలియకుండానే ఎద అతని ఛాతికి తగిలింది.
    
    అలివిగాని కోరికను తన శరీరంలోకి ఆమె తన ఎదతో నెట్టేసినట్టు అతను కదిలిపోయాడు. మత్తులో మునిగిపోయిన శరీరాన్ని రక్తం మేల్కొల్పుతున్నట్టు ఏవో ప్రకంపనాలు మొదలయ్యాయి.
    
    ఆమె ఏమీ పట్టించుకోకుండా 'వస్తానండీ' అంది.
    
    "అండీ వద్దు- నా పేరు గోకుల్ రేపు కూడా వచ్చి గడ్డికోసుకోండి" అన్నాడతను. ఏదో ఆవేశం అతని చేత అన్ని మాట్లాడించింది. కానీ స్వతహాగా అయితే అన్ని మాటలు మాట్లాడే రకంగాదు అతను.
    
    ఆమె మర్యాద కోసం అన్నట్టు చిన్నగా పెదవుల్ని నవ్వుకోసం సాగదీసి వెళ్ళిపోయింది. ఆమె ఏటిగట్టు ఎక్కేవరకు చూస్తూ నిలబడి పోయాడు.
    
    ఇక ఆమె కనిపించక పోయేసరికి తిరిగి ఇంటికి బయల్దేరాడు.
    
    పద్మజ ఇంటికొచ్చాక గడ్డిని పశువులకు వేసింది. భోజనం చేసి అలసటతో మంచం మీద పడుకుంది.
    
    దాదాపు సంవత్సరం తరువాత ఆమె కూడా డిస్టర్బ్ అయింది.
    
    ఇది అని స్పష్టంగా తెలియదుగానీ ఏదో అలజడి గుండెను గిలకొడుతోంది. ఆత్మీయత కోసం మనసు తపన పడుతోంది. మనసే కాదు శరీరం కూడా ఏదో కావాలని చిన్నపిల్లలా మారాం చేస్తోంది.
    
    ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఏవేవో ఆలోచనలు మనసుని మరింత రెచ్చగొడుతున్నాయి.
    
    రెండోరోజు ఉదయం తిరిగి గడ్డిక్సోం బయల్దేరింది.
    
    ఆమెకి తెలియకుండానే మరింత అందంగా తయారైంది.
    
    వెంట్రుకలన్నీ దువ్వి మొదట్లో రబ్బర్ బ్యాండ్ వేసుకుంది. నుదుటున ఇంకాస్త పెద్దదిగా తిలకం బొట్టు పెట్టుకుంది. నీలం పూవున్న తెల్లటి చీర కట్టుకుంది.
    
    బ్రా ఎక్కడో పెట్టె లోపలుంటే కష్టపడి వెతికి బయటికి తీసింది. చిత్రం అది పట్టడం లేదు. కోరిక ఏదో అంతర్లీనంగా శరీరంలో ప్రవహిస్తుండడం వల్ల బ్రా పట్టడం లేదని ఆమెకి తెలియదు.
    
    నిజం చెబితే ఆమె అంగీకరించదు. ఎందుకంటే తనలో కలగుతున్న సంచలనానికి కారణం ఏమిటో స్పష్టంగా ఆమెకే తెలియదు.
    
    ఏదో అవస్థపడి బ్రా వేసుకుంది గానీ జాకెట్టు అసలు పట్టడం లేదు.
    
    "రాత్రికి రాత్రి ఈ శరీరానికి ఏమైంది?" అని ఆశ్చర్యపోతూ హుక్స్ లు పెట్టుకోబోయింది. అన్నీ పట్టాయి గానీ చివరిది మాత్రం సహాయ నిరాకరణ ప్రారంభించింది. చివరికి దానిని ఎలాగో లొంగదీసింది.
    
    "ఏమిటే అక్కా! నువ్వు వెళ్ళేది షూటింగ్ కా! గడ్డి కోయడానికా?" అని     అడిగింది పెద్ద చెల్లెలు.
    
    "షూటింగ్ కే" అని ఒక్క కసురు కసురుకుంది.
    
    మనకేం కావాలో మనకే స్పష్టంగా తెలియని సమయాల్లో ఎదుటివాళ్ళ మనలో వున్న దాన్ని స్పష్టంగా కనిపెట్టడం భరించలేం అనవసరంగా కోపం వచ్చేస్తుంది.
    
    పద్మజ కూడా అందుకే కసిరికొట్టింది.
    
    అక్క ఎందుకంత ఎగిరిపడిందో తెలియని ఆమె నిశ్శబ్దంగా పక్కకు తప్పుకుంది.
    
    పదిగంటల ప్రాంతాన గంప తీసుకుని పద్మజ బయల్దేరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS