ఆత్మావేక్షణపరులు లోనికి బోగా పోగా ఇఁక పోవ నెడము లేకుండ హద్దుగా గుర్తింప నగు నెలవు ప్రేమైక మాయముగానే ఉండుగా.ప్రేమ సత్పదార్ధము కాన నిత్యము.ఆ స్థలముణ ప్రేమేతర (ద్వేష )వాసనకూడ నుండదు.అద్దానిని జేరుకొనుట కై లోనికి బోను పోను,ప్రేమే తదార్ధము పలుచబడుచు సన్నసన్నగా దిగనాసిల్లు చుండును.ప్రేమపదార్ధము చుక్కనగుచు దాని విజ్రుంభణము అంతరంగంమునే కాక బహిరంగమునఁ గూడ 'అంత ర్బహిశ్చ'క్రమక్రమముగా నిండా ర్చును.అసలు తత్త్వన్వేషి సముద్రమధనకధగా సత్సంకల్పపు మందర పర్వతమున శరీరసముద్రమున దింపి శరీరము మిధింపగా లోనుండి మంచి చెడ్డలు రేగుచుండును.చేడుగులను దొలఁ గఁ ద్రోసి కొనుచు మంచిని గుర్తించి స్వీకరించి మనుభవించుచు బోవఁ గాఁ దుదకు అమృత లాభము కలుగును.ఇందు మూలాదారము కూర్మమగును.
అప్పుడే గార్హస్ధ్యము నందిన మా బావగారిని నా దుఃఖ కారణము విచారింపఁ గోరిరఁట !ఒకనాఁడు నిద్రలేచి యూరి నంటి యున్న మా పొలమున కరిగి అక్కడి మా మంచినీటి బావికడ కాలకృత్యముల దీర్చుకొని స్నానోన్ము ఖుఁడ నగుచు తాటిచెట్టు చాటు కరిగి దుఃఖించుచున్న నన్ను వెనుకతట్టున నుండి వచ్చి పట్టుకొని మా బావగారు దుఃఖకారణము ప్రశ్నించిరి.ఏమి లే దంటిని.ఉన్నను,అది చెప్పినను మిరు దాని విలువ గుర్తింప లే రంటిని.ఆతఁడేదో గొప్పదోషము నాలో నున్న దనుకొని తీవ్రముగా చకితుఁ డయి పదింబదిగా ప్రశ్నింపఁ దొడఁ గెను.నా కేదో యోగ్యతాలో పభీతి కలదని యాతఁ డనుమానపడుచున్నట్టు తోఁ చెను.ఇఁ క దాపరాదని యున్న దున్నట్టు చెప్పితిని.మా తలిదండ్రుల పతనము గోచరించుచున్నట్టున్న దన్న మాట మా తలిదండ్రులతో చెప్పరా దని యాన వెట్టితిని.అంతా విని యాతఁ 'డయ్యో యిదా నీ యేడుపు!'అని పగలబడి నవ్వఁ జొచ్చెను.'లోకసాధారణము మయిన భావము లనునీ తలనే విఱిగిపడిణ వానిగా భావించి యఘోరించెద వేల 'యని తెగడెను.తర్వాత మా తలిదండ్రులతో నుచిత మగునంతవఱుకు చెప్పి వారిని తేర్చెను.రాగవిరాగములు రెండుగా నాలో నప్పుడు రేగినవి.
ముహూర్తము జరిగినది.తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనము వంటిదే యిది కూడ నయ్యెను.వాత్స్యయన కామసూత్రాది గ్రంధము లేవేవో చదివి యుంటినే కాని అది పుస్తక విద్యయే కానీ యనుభూతి లేనిది.నాకు నర్మసచివుఁ డు మా బావ మర్నాడు శుష్కేష్టితంత్రముగా నాకు తెలియఁ జెప్పినపై కృతార్ధుఁడ నయితిని.ఇంజనీయరింగు,వైద్యముమొదలగుననేకవిద్యలలో పుస్తక పఠణ మాత్ర నప్రాజ్ఞాలై మెలమెల్లగా చేతిక్రింది చిన్ని యుద్యోగుల యుద్బోధముతో చతురు లగుట చూచుచున్నాము గాదా?
