-: ఋతువుల హస్త లక్షణములు :-
శ్లో!! త్రిపతాక కరస్సోయ మూర్ద్వభాగే ప్రచాలితః !
కరోప్యర్ధ పతాకాఖ్యః పర్యాయేణాగ్రతశ్చలః !
త్రిపతాఖ్యకరశ్చోర్ధ్వభాగే పార్శ్వద్వయయేఛలః !
వసంత గ్రీష్మసమయ వర్షకామేషుచక్రమాత్ !
యుజ్యతే యోగకుశలై భరతాన్వయవేదిభిః !!
తా: త్రిపతాక హస్తము ఊర్ధ్వభాగమున చలింపచేసినచో వసంత ఋతువునందును, అర్ధపతాకహస్తము పురోభాగమున చలింపచేసినచో గ్రీష్మఋతువునందును, త్రిపతాకహస్తము ఊర్ధ్వభాగమునందు ఉభయ పార్శ్వములందు చలింపచేసినచో వర్షఋతువునందును వర్తించును.
శ్లో!! అలపద్మశ్చ సింహాఖ్యః కర్ణధేశే ప్రచావితౌ !
అధోముఖః సర్పశీర్షః పుర్కోర్థ ముకుళస్తధా !
శరద్ధేమంత శిశిర సమయేషు యధాక్రమమ్ !!
తా: అలపధ్మ హస్తమున్ను, సింహముఖ హస్తమున్ను, కర్ణప్రదేశములందు చలింపచేసినచో శరదృతువునందు, నర్పశిరహస్తము అధోముఖముగ బట్టిన హిమవంత ఋతువునందు, అర్థముకుళహస్తము
పురోభాగమున బట్టిన, శిశిర ఋతువునందును వర్తించుచున్నది.
శ్లో!! అగ్రేసూచి నిశ్చలాచేత్కాష్టేర్ధే వినియుజ్యతే !!
తా: సూచీముఖ హస్తము పురోభాగమునందు నిశ్చలముగ నిల్పినచో "కాష్టము" నందు వర్తించును.
-: కాలముల హస్త లక్షణములు :-
శ్లో!! సందాశస్యాత్కళార్థేపినఖహంసః క్షణేభవేఠ్ !
లవార్థేముకుళః ప్రోక్తః కరటీకావిచక్షణైః !!
తా: సందంశ హస్తము, కళాకాలమునందును, నఖహంసహస్తము క్షణకాలమునందును, ముకుళహస్తము లిప్తకాలమునందు వర్తించును.
శ్లో!! ఘటికార్థ్కేర్థముకుళ స్తిర్యగూపోనియుజ్యతే !
చతురోప్యర్థయామార్థే, యామార్థేహంసవక్త్రకః !
ద్వియామేర్థ పతాకాఖ్యా, స్త్రీయామేతామ్రచూడకః !
ధివారాత్రౌ పద్మకోశ ముకుళశ్చ యధాక్రమం !
పూర్వేద్యుర్యుజ్యతే సూచీనాట్యశాస్త్ర విచక్షణైః !!
తా: అర్ధముకుళహస్తము అడ్డముగపట్టినచో ఘటికాలమునందును, చతురహస్తము అర్థయామమునందును, హంసాశ్యహస్తము యామకాలమునందును, అర్ధపతాకహస్తము రెండుయామముల కాలమునందును, తామ్రచూడహస్తము మూడుయామముల కాలమునందును, పద్మకోశహస్తము పగటికాలమునందును, ముకుళహస్తము రాత్రికాలమునందును, సూచీముఖహస్తము పూర్వదినమునందును వర్తించుచున్నవి యని నాట్యాచార్యులు వాగ్గేయకారులు చెప్పిరి.
శ్లో!! పక్షార్థేయుజ్యతే సర్పశీర్షశ్చేత్తిర్యగాశ్రితః !
మాసార్థేనిశ్చలాశూచీచలితాచేద్యుగేభవేత్ !
శుకతుండో నిశ్చలశ్చే దూర్థ్వవర్షేనియుజ్యతే !!
తా: సర్పశీర్ష హస్తము అడ్డముగపట్టినచో పక్షకాలమునందు. శూచీ ముఖహస్తము నిశ్చలముగ పట్టిన మాసకాలమందును, చలింపచేసినచో యాగమునందును, శుకతుండ హస్తము నిశ్చలముగ బట్టినచో రాబోవు సంవత్సరమునందు వర్తించును.
శ్లో!! ఇందీవరేచకల్హారే చంపకేచరాటకే !
తాపింఛేబుద్భుదార్థేఛ, ఛకోరాణాంచభావనే !
ఊర్ధ్వాకారాననోహస్తోలాంగూలో యుజ్యతేక్రమాత్ !!
తా: లాంగూలహస్తము ఊర్ధ్వముఖముగ బట్టినచో నల్లకలువయందును, కల్హారకుసుమముయందును, సంపంగి పుష్పమునందును. తమాల పుష్పగుచ్చమునందు నీటిబుగ్గయందును, చకోరపక్షులు చూపుటయందు వినియోగించును.
శ్లో!! నక్థ్యంతికగతౌగండతలయోరంతి కేస్థితౌ !
తత్రైవరేచితౌనామ్నా. పతాకాభిదహస్తకౌ !
మర్థలార్థే కపోలార్థే తద్వఈతాడనక్రమే !
యుజ్యతే యోగకుశలై న్నాట్యకర్మ విచక్షణైః !!
తా: రెండు పతాకహస్తములు మోకాళ్ళ సమీపమున నుంచినచో, మర్దళమునందును. చలింపచేసినచో మృదంగ వాద్యమందును. కపోలసమీపమునందు బట్టినచో గండస్థలమునందును, కపోల సమీపమున ఛలింపచేసినచో చెంపగొట్టుటయందును వర్తించుచున్నది.
-: చతుర్వేద హస్త లక్షణములు :-
శ్లో!! ఋగ్వేదేచ పతాకోగ్రేచలితోయది యుజ్యతే !!
తా: పతాకహస్తము పురోభాగమునందు చలింపచేసినచో ఋగ్వేధమునందు వర్తించును.
శ్లో!! పతాకచతురేంగుష్టం పౌనః పుణాత్ప్రచాలితః !
యుజుర్వేదేపి యుజ్యేత నాట్యశాస్త్ర విశారదైః !!
తా: పతాక చతుర హస్తమునందు అంగుష్టము మాటిమాటికి చలింపచేసినచో యజుర్వేదమునందు వర్తించును.
శ్లో!! అధస్థాదూర్ధ్వభాగస్థ్తో హస్తసందంశ నామకః !
యుజ్యతే సామవేదార్థే భరతక్రమపారగైః !!
