Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 36

        అప్పటివఱకు ఆ వధువు నాకు ధర్మ పత్నిగా నాతో సంసారయాత్ర సాగింప నున్నది సుమా యన్న తలఁపే కాని యంత కెక్కువ యోచనలు లేవు. ఇఁకమిఁద నా వధువు మా యింటికి రానున్న దని,వివాహ ప్రయోజన  మిఁ క  మిఁ దనే అనుభవింప నంటిమని, నాహృదయము నే నెఱుఁ గుదు ననుకొనుచుంటిని గాన ,ఆమె హృదయము నాకర్పించి నా హృదయమున నప్పన గొనుటో, తన హృదయమును నా కర్పింపక నాహృదయమును హరించుటో యేదిచేయునోయనీ, అంత దాఁక నన్నత్యంతము ప్రేమించుచున్న మా తలిదండ్రుల కాపిల్ల ప్రేమ పాత్ర మగునో కాదో అనీ, ఆ పిల్ల వారి నెంత యేర్పడించునో అనీ, నా యన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రుకు, నాకుఁగాల సౌమన స్య మిఁక ముందేమి కానున్నదో కదా అనీ వెఱపు. క్షణక్షణమునకు స్పష్టాతి స్పష్టముగా విచారము పెరుగ సాగెను. మఱియు మా తలిదండ్రుల చాటుననే యంతదాఁక నా జీవితము సాగుచుండెను. సర్వభారము వారు మోయుచుండఁగా నిర్భయుఁడనై నే నుంటిని. నా దృష్టిని వారు వ్రాలి య స్తమింపబోవుచున్నట్టును, నే నొక వంశవృక్షమును వెలయించి యుచ్చస్థాన మాక్రమింప బోవు చున్నట్టును దోచ సాగెను. నే నంత నిర్వహింప గల్గుదునా? మా తలిదండ్రులు న్నంత దాఁ క వారి చాటువాఁడ నగుటే శ్రేయము గాదా? నేను వెలయింపఁ బోవు వంశవృక్షముతో మా తలిదండ్రులు వేలయించిన వంశవృక్షముతో పొంది పోసఁగి లోబడి యుండ వలదా? ఏమగునో? నా జీవితమార్గము మంచికో,చెడుగుకో దారి త్రొక్క నారంభించు సంఘటన దాపురించినది. ఎందఱ కుటుంబములో యిట్టిపట్టుల నప మార్గములఁ బట్టినవి కానవచ్చినవి. ఇంక నెందఱ కుటుంబముతో సన్మర్గముల  బట్టినవి  కానవచ్చినవి. ఏవంవిధమయిన    కొట్టుకాడుచున్న నా ముఖమున న శాంతిలక్షణములు ప్రవ్యక్తముగా గోచరించుచుండెను. వానిని జూచి మా తల్లిదండ్రులు, నక్క గారు త్రొక్కట పడఁజొచ్చిరి.

    సంతోషము  గాని  సంతాపము గాని యంతరంగమును కలవరపఱచుచున్నప్పుడు దాని చేష్టయ కృత్రిమముగా, స్పష్టముగానున్న దున్నట్లు కొందఱ ముఖమున గోచరించుచును. కొందఱు లోని సంతోషము దాఁచి యుంచు కొని ముఖమున, సంతోషమును దోపయకున్న మానెగాని, యేవో ప్రయోజనము లర్ధింప పైగా విచారమునే వెలయించుకొనఁ గల్గుదురు. ఎంత దుఃఖకారణము కల్గినను దాని బలమును వివేకముచే తగ్గించుకొని దానిని లోనగూడ భావింపకుండుట మంచిది గాని లోన కుములుచు బైటికి నవ్వు దెచ్చుకొనుట రోఁతయే. అ నవ్వు వెడన వ్వగునె కాని తియ్యని నవ్వుగా తెరలు వాఱదు. స్మిత ప్రయత్నమే కాని దాని సత్ఫలితము కలుగదు.

    తాను ప్రేమించువా రెవ్వరు గాని తప్పు చేసినట్టు తాను భావించునప్పుడు వారిని సరిదిద్దఁ గోరునపు డాయా వ్యక్తుల వివే పరిపాకము ననుసరించికోపసూచనలుచేయుట, గర్హించుట, తిట్టుట, కొట్టుట గూడ జరగుచుండును. అందులో  నంతరంగము  నవ్యక్తముగా, స్థాయిగా అనురాగమే కుదుర్కొని యుండును.అట్టిచో చివ్వన కోపము రేగును. కోపసూచన మొదలుగా కొట్టుట దాఁక వివేకపరిపాకనుసారము నొక చేష్ట జరగుచుండ అంతరంగమున కేసి చూడఁ గా నక్కడ అనురాగ రేఖలు నవ్వుచుండుట, అవి తన్నే కోపించుట, తిట్టుట, కొట్టుట, జరపినట్లయి యిఁక నిట్టి చేష్టలు చేయకుమా యని మంద లించుట అంతరాత్మావేక్షణా నుభూతి కలవారి గోచరించును. రేగిన యా కోపోద్రేక మా మానవుని యంతరంగము తనలో హాయిగా నున్న యనురాగము శరీరాణువులం దంతటను నిండారుటకు చేయు జతనములో తనకు విరుద్ధమయిన, తనతో లోనుండ గూడని కోపపు బండాల మునదను చూచి బైటి వెడల గోట్టునప్పుడు చెలరేగి బయటబడి నది గగుర్తింపనగును. శరీరమును జుట్టియుండి నావృత్తి దాకఁ నది యెఱ్ఱని పొగలతో చెలరేగి దిద్దుబాటు చెంద వలసిన వారిని దాఁకి వారి యనుకూల్య ప్రాతికూల్య, సౌమనస్య, వైమనస్య, ప్రబలు, దౌర్బల్యాద్యనుగుణముగా దను చేయఁ గల మంచిని జేసి యుపరత మగును. ఈ విధముగానప్పు డప్పుడు లో నిల్వయున్న కోపపు సరకులో నెంతో కొంత అసత్పదార్ద మగుటచే నిలువ వీలులేనిది కాన కర్చు పడి పొగా  పోగా లో స్థాయిగా నున్న ప్రేమ సత్పదార్ధము గాన శాశ్వతమై పెపొందుచుండును. దీని నాత్మా వేక్షణ పరులు గుర్తింపఁ గల్గుచుందురు. అంతరంగమున స్థాయిగా ననురాగము, ప్రేమ ఉన్న సందర్భముల  ను గూర్చి వ్రాసిన దిది.         


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS