-: నానార్ధములు :-
శ్లో!! వక్షేనానార్ధహస్తానాం నిర్ణయక్రమభావనాం !!
తా: నానార్ధ హస్తములను క్రమరీతిగా వివరించెదను.
శ్లో!! కర్ణనా సాదరణాంచ సమీపేచవితేయది !
సందంశ హస్తోరేఖదౌ. వర్ష ధారాసుయుజ్యతే !!
తా: సందంశ హస్తమును కర్ణనాశికాధరముల సమీపములందు చలింపజేయుచున్నచో. రేఖాదులయందును. ఊర్ధ్వాడోముఖములుగా చలింపచేసినచో వర్షాధారలయందును వినియోగించును.
శ్లో!! అధోధుజాంతరేతిర్యక్థ్సాయీచేన్మృగశీర్షకః !
పతిచేత శ్శరీరార్ధభావనాసునిరూప్యతే !!
తా: మృగశీర్ష హస్తము భుజాంతరాధః ప్రదేశమున అడ్డముగా స్థాయిగా నిలిపిపట్టినచో పతియందు, మనస్సుయందు, శరీరము చూపుటందు వినియోగించును.
శ్లో!! కనిష్టి కేముకుళయోస్సమ్యగేవ ప్రసారితే !
నామ్నార్ధ ముకుళోహస్తస్తయోర్యోగోవిధీయతే !!
తా: రెండు ముకుళ హస్తములు కనిష్టితాంగుళులు చక్కగా చాచి పట్టినచో. అర్ధముకుళహస్తము వచ్చునని నానార్ఖములలో చెప్పబడియున్నది.
-: వి ని యో గ ము లు :-
శ్లో!! అన్యోన్యాభిముఖీవాచ్చలచ్చోపరిచాలనాత్ !
వక్షస్థానవ్రచలనాదుపవేశనకర్మణి !
తధై వేతి ప్రవచనే ఆత్మార్ధే వినియుజ్యతే !!
తా: రెండు అర్ధముకుళ హస్తములు అన్యోన్యాభి ముఖభావము వలన అధోభాగమునందు చలింపచేసినచో ఉపవేశన కర్మయందును, ఊర్ధ్వభాగమంచలింపచేసినచో, అటులేయనుటయందు, వక్షస్థలమునందు చలింపచేసినచో మనస్సునంను వర్తించును.
శ్లో!! అధోభాగే ముకుస్యాగ్రే వక్షస్థానే నివేశితః !
ముకుళోజనసల్లాపే సంతోషే వినియుజ్యతే !!
తా: ముకుళ హస్తమును ముఖాగ్రభాగమునకు క్రిందుగా చలింపచేసినచో జనుల సల్లాపమందు, వక్షస్థలమందు, చలింపచేసినచో సంతోషము నందు వినియోగించును.
శ్లో!! అధోభాగే దక్షణాంగే ముఖాస్యాగ్రే నివేశితః !
బ్రహ్మచర్యే నిశ్చలార్ధే లేఖనేపిచ సూచకః !!
యుజ్యతే కలిభిర్నాట్య మర్మార్ధచతురైస్సదా !!
తా: సూచిముఖ హస్తము ముఖాగ్రభాగమున నుంచినచో బ్రహ్మచర్యమందును, దక్షణభాగమున క్రిందుగ పట్టినచో, కదలకుండుటయందును, వ్రాయుటయందును వినియోగించును.
శ్లో!! పురోభాగేచోర్ధ్వదేశేప్యధోభాగేచ నిశ్చలః !
వైష్ణవాభిదహస్త్కోయం. గార్హస్థైపికరౌయుగే !
భూగర్తేపిచయుజ్యేతకరార్ధచతురై స్తధా !!
తా: వైష్ణవ హస్తము పురోభాగమందుబట్టిణచో గార్హస్థ్యమునందును, ఊర్ధ్వదేశమునందు బట్టినచో కలియుగమునందును, అధోముఖమునబట్టినచో భూగర్తయందును వినియోగించుచున్నది.
శ్లో!! అన్యోన్యాభిముఖీభావాత్పురో భాగేచచాలనాత్ !
ఊర్ధ్వాగ్రయుగ్మసంయోగాత్పతాక చతురౌకరౌ !
వానప్రస్థాపిగమనేదేవనీరాజనావిథౌ !
యుజ్యతే పర్ణ శాలాయాం, భరతక్రమవేదిభిః !!
తా: రెండు పతాక చతుర హస్తములు పరస్పరాభి ముఖభావముల వలనబట్టినచో వానప్రస్థాశ్రమమందును, పురోగభాగమునందు త్రిప్పినచో దేవతా నీరాజనమునందును, ఊర్ధ్వముఖముగబట్టినిచో (అంగుళులను పరస్పరము కలిపిపట్టినచో) వర్ణ శాలయందును వర్తించును.
శ్లో!! దక్షణాంశే పురోభాగే తీరశ్చీనస్తు నిశ్చలః !
సంయాసేచ స్థిరార్ధేచ సమాలంచేతిభాషణే !
శిఖరాఖ్యకరస్స్కోయం యజ్యతే నాట్యకోవిధైః !!
తా: శిఖరహస్తము దక్షణభాగమునందు కదలకుండ బట్టినచో సన్యాసాశ్రమమునందు, పురోభాగమున బట్టిన స్థిరమనుటయందు, అడ్డముగ బట్టినచో పట్టుకొనుమనుటయందు వర్తించును.
శ్లో!! ఊర్ధ్వాధోముఖవిన్యాసాత్పూరోభాగే ప్రసారణాత్ !
వక్షస్థానే నిశ్చలౌచేత్కపిద్ధాకరౌతధా !
దుదోహోత్యపివాక్యేచమధనే ధూమయానకే !
యుజ్యతేయోగకుశలై ర్నాట్యశాస్త్రవిశారదైః !!
తా: రెండు కపిద్ధ హస్తములు ఊర్ధ్వాదోముఖములుగ పట్టినచో పాలు పితుకుటయందును. పురోభాగ ప్రసారణమువలన _ మధించుట వలన వక్షస్థలము నిశ్చలముగ బట్టినచో ధూపహారములయందును వర్తించును.
