Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 37

 

    "ఒరే పండూ! ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు నన్ను అర్ధం చేసుకుంది ఇంతేనా? మనసు కదా ముఖ్యం ప్రేమకి. బెస్ట్ ఆఫ్ లక్ మై ఫ్రెండ్" మనస్పూర్తిగా అంటున్న శ్రీచంద్ర అపురూపమైన మిత్రుడిలా కనిపించాడు సత్తిపండుకు.

 


                                                            * * *


    రాత్రి పదయింది.


    త్రీ టౌన్ పోలిస్ స్టేషన్.


    యముడ్ని, నారదుడ్ని లాకప్ లో వేసారు.


    నారదుడ్ని ఓ కుర్చీలో కుచోపెట్టి చుట్టూ తాళ్ళతో కట్లు కట్టారు.


    యముడ్ని రెండు ఇనుప గొలుసులతో కట్టిపడేశారు.


    ఇన్స్ పెక్టర్ చండశాసన్రావ్ ఠీవిగా లాకప్ గదిలోకి వచ్చాడు.


    "నేను పెలిచేవరకు ఎవరు లోపలకు రావద్దు. నేనసలే చండశాసనుడ్ని. ఈ రోజు వీళ్ళ పీచమడిచి కానీ నేను బయటకు రాను. నేను బయటకు రాగానే హారతి పళ్ళెంతో దిష్టి తీయండి అర్ధమైందా" అంటూ కానిస్టేబుళ్ళ మొహలవైపు చూసి లాకప్ తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు.


    ఇన్స్ పెక్టర్ చండశాసన్రావ్ అదో టైప్.


    తను స్ట్రీట్ ఆఫీసర్ అని, తానంటే అందరూ బయపడి చస్తారని అతని ఉద్దేశం.


    లాకప్ లోకి అడుగుపెడుతూనే మూలనున్న లాఠీ చేతిలోకి తీసుకున్నాడు. నారదుడి దగ్గరకు వచ్చాడు.


    నారదుడి సిక్ట్ సెన్స్ ఏదో చెబుతోంది.....


    "ఇప్పుడు చెప్పండి....ఒక్కొక్కటిగా అన్నీ బయటకు రావాలి. నేనెవర్నో తెలుసుగా చండశాసనముండా వాడిని. నేనవర్ని?"


    నారదుడు తాపీగా చెప్పాడు "చండశాసనముండా వాడివి" అని.


    ఇన్స్ పెక్టర్ మొహం ఎర్రగా కందిపోయింది.


    :"మాట వరసకు ముండావాడిని అంటే నువ్వు అంటావా? చెబుతా, ఇప్పుడు చెప్పరా ఆ బ్రోతల్ హౌస్ ఎన్నాళ్ళనుంచి నడుపుతున్నావు? ఆ మసాజ్ పార్లర్ పేరుతో ఎంత మంది అమ్మాయిలను విదేశాలకు అమ్మేశావ్.....చెప్పు.....చెప్పరా."

 

    "నారాయణ.....నారాయణ" అన్నాడు చెవులు ముసుకోవడానికి క్కూడా వీల్లేని పరిస్థితిలో నారదుడు.


    "ఓహో.....ఆ నారాయణ నీ బిజినెస్ పార్టనరా? ఎవరతను? ఈ గొలుసులకు కట్టేసిన శాల్తియేనా?" అడిగాడు లాఠీని నారదుడి తలమీద పెట్టి,


    
    "మానవా తప్పు" అన్నాడు నారదుడు.


    "ఓహొ.....మరి నువ్వు మనవుడివి కావా?" వ్యంగ్యంగా అన్నాడు చండశాసన్రావ్.


    "నేను నారదులవారిని. త్రిలోక సంచారిని."


    "అలాగా.....మరి నేనెవర్ని....కంసుడ్ని.....అన్నాడు లాఠీతో నారదుడి వీపు మీద ఒకటిచ్చి.


    "అమ్మా నారాయణా...." అన్నాడు నారదుడు ఆ బాధ భరించలేక.


    "ఆ అమ్మ నారాయణ ఎవరు?" అడిగాడు లాఠీతో మరో దెబ్బ వీపు మీద తగిలింది.


    ఈసారి నారదుడు గట్టిగా అరిచాడు.


    "నారాయణా.....నారాయణా.....నారాయణా....." అంటూ.


    వైకుంఠంలో శేషపాన్పుపై పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి కళ్ళు తెరిచాడు.

 

    అతడి కాళ్ళు పడుతున్న శ్రీలక్ష్మి భర్త వంక ఆందోళనగా చూసి......


    "స్వామి! మీరే అవతారమైనా ఎత్తాలన్న ఎత్తుగడ వేస్తున్నారా? నేను సహించేది లేదు. మీతో పాటు అవతారాలు ఎత్తే ఓపిక లేదు" అంది ప్రాధేయపూర్వకంగా.


    "లేదు దేవీ. నారదుల అవస్థలు కేకల రూపంలో వైకుంఠన్ని చేరాయి" అంటూ కళ్ళు మూసుకుని "అంతా విష్ణుమాయ" అన్నాడు.


    అలా శ్రీ మహావిష్ణువు అనడంతో భూలోకంలో లాకప్ లో టాఠీ దెబ్బలు తింటున్న నారదుడుకి ఉపశమనం కలిగింది.


    మరో దెబ్బ వేసాడు నారదుడి మీద ఇన్స్ పెక్టర్ చండశాసన్రావ్.


    నారదుడు చిరునవ్వు నవ్వాడు.


    ఆదెబ్బ తాలుకూ నొప్పి చండశాసన్రావ్ కి ఎఫెక్టిచ్చి "అమ్మా" అని అరిచాడు.


    ఆశ్చర్యంగా నారదుడి వైపు చూసి మరో దెబ్బ నారదుడి మీద వేసాడు.


    మళ్లా ఆ దెబ్బ తాలుకూ నొప్పి తనమీదే ప్రత్యక్షమైంది.


    నారదుడి మీద పడ్డ ప్రతి దెబ్బ తాలుకూ నొప్పి ఇన్స్ పెక్టర్ కె కలుగుతోంది. భయంతో లాఠీ విసిరేసి నారదుడి ముందు మోకాళ్ళ మీద కూలబడి-


    "ఒరే.....నువ్వేవడివిరా? ఒరిస్సా మంత్రగాడివా? డిల్లి జాదువా? నికేమేం విద్యలు వచ్చురా? నిన్ను కొడితే దెబ్బలు నాకెంట్రా తగులుతున్నాయి?" అంటూ ఏడ్చేశాడు.


    
    "విష్ణు మాయ మానవా" అన్నాడు నారదుడు నవ్వుతూ.


    ఇన్స్ పెక్టర్ చండశాసన్రావ్ యముడి దగ్గరకు వెళ్లి-


    "ఒరే పెద్ద మీసాలు.....నీ చూపెంట్రా అలా వుంది. ఝడుసుకు చస్తాన్రా......నిన్ను చూస్తుంటేనే భయమేస్తోంది. నీ గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతా, నిజం చెప్పరా? నీకూ ఆ బ్రోతల్ హౌస్ కూ సంబంధమేమిట్రా! నేనసలే చండశాసన్రావ్ ని" అంటూ తన ప్యాంటుకు వున్న బెల్ట్ తీశాడు.


    
    యమధర్మరాజుకు మండుకొచ్చింది.


    "యమయమా!" అని గట్టిగా అరిచి చేతులు విదిల్చాడు. ఇనుప గొలుసులు ఫట్ మని తెగాయి.


    "నా ఆయుధమేదిరా చండశాసనముండావాడా?" అడిగాడు.


    అప్పటికే ఇన్స్ పెక్టర్ కి చెమట్లు పట్టాయి.


    భయంతో లాకప్ లో ఓ ములన వున్న గదిని చూపించాడు.


    యమధర్మరాజు గదివైపు చూడ్డంతోనే ఆ గద అలా గాలిలో తేలుతూ వచ్చింది ఆ గదను అందుకున్నాడు యమధర్మరాజు.


    "గదతో నీ నెత్తిన ఒక్కటిచ్చిన చచ్చురుకుంటావు" అన్నాడు యముడు.


    అప్పటికే చెమటతో ఇన్స్ పెక్టర్ యూనిఫామ్ తడిసిపోయింది.


    ఇదంతా కలలా వుంది.


    "ఇన్స్ పెక్టర్ ఒక్కసారి నీ బెల్ట్ తో నువ్వే నీ చొక్కా చిరిగేవరకూ కొట్టుకో."


    "ఉహూ....నేను కొట్టుకొను" బుంగమూతి పెట్టి అన్నాడు ఇన్స్ పెక్టర్.


    
    "నేను నా ఆయుధముతో కొట్టేదా?" యముడు అడిగేసరికి భయమేసి-

 

    "ఉహూ! నేనే కొట్టుకుంటా. నా ఒళ్ళంతా దురదగా వుందికదా" అంటూ బెల్ట్ తో తనని తనే కొట్టుకున్నాడు ఓ అయిదు నిముషాలపాటు.


    అలా కొట్టుకుంటూనే కేకలేసాడు.


    లాకప్ బయట వున్న కానిస్టేబుల్స్ లో ఒకరు "మన ఇన్స్ పెక్టర్ గొంతులా వున్నట్టుందే" అన్నాడు.


    "లేదు...లేదు.....మన ఇన్స్ పెక్టర్ పెట్టె బాధలు భరించలేక వాళ్ళే మిమిక్రి చేస్తున్నట్టుంది" అన్నాడు మరో కానిస్టేబుల్.

 

    అయిదు నిమిషాల తరువాత యముడు"అగు....చాలిక" అన్నాడు.

 


                                                               * * *


    "అమ్మా! నాకిరోజు షూటింగ్ వుంది. కాస్త త్వరగా వెళ్ళాలి గానీ టిఫిన్ రెడి చేస్తావా?" అంది సమీర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS