Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 36

 

    "చావలేదనుకో! సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడేరు. ఇప్పుడది పెళ్ళి చేసుకుని సుఖంగానే ఉంది. ఓసారి నేను దాన్ని కదిపి వీడి గురించి అడిగాను. అసలు ఇంక మగాళ్ళే దొరకనట్టు వీడికోసం ప్రాణాలు తీసుకునేటంత సాహసం ఎందుకు చేశావే అని. దానికి అది ఏమందో తెలుసా కిన్నెరా?"


    "ఏమంది?" ఉత్కంఠగా అడిగింది.

 

    "బావతో మాట్లాడుతుంటేనే పడగ్గదిలో కాపురం చేస్తున్నట్టు ఉంటుంది బామ్మా! ఇక ముట్టుకుంటే స్వర్గం కనిపించదు అంటూ ఎంత గొప్పగా చెప్పిందంటే......"


    "అంటే ......బాగా ముట్టుకున్నరేమో?"


    "లెదటమ్మా. అంటి ముట్టనట్టు ఉంటూనే అంత పిచ్చి ఎక్కించాడట."


    "అమ్మయ్యా!" అనుకోలేదు కిన్నెర.


    ఏ ఆలోచన లేకుండా ఊరికినే రానిచ్చేవాడా? అంత దూరం వెళ్ళాడు ఆ 'కొంచెం' వదిలిపెట్టి ఉంటాడని గ్యారంటీ ఏమిటి? లేకపోతే ఆత్మహత్య దాకా ఎందుకు వెళ్ళి ఉంటుంది?

 

    ఛఛ! ఈ పెద్దమనిషి సామాన్యుడు కాడు! ఓ మనిషిపై
ప్రేమ పరాకాష్టకు చేరుకోవాలి అంటే నెలలు, సంత్సరాలు కానక్కర్లేదు చాలా స్వల్ప వ్యవధిలో అతడిపై అసాధారణమైన మక్కువను పెంచుకుంది కిన్నెర. అందుకే అతి మాములు ఆడపిల్లలా అసూయ పడుతుంది.


    
                                                                        *    *    *    *


    సాయంకాలం నాలుగు గంటలకల్లా ఇంటికి వచ్చాడు రాఘవ.


    అసలు మధ్యాహ్నం నిజంగా లంచ్ తీసుకొస్తుందని చాలా ఎదురు చూశాడు కూడా. ఎవరో పనివాడితో కెరియర్ పంపింది.


    తననో గొప్ప అదృష్టవంతుడని బ్యాంకులో అంతా గుర్తించినందుకు గర్వపడుతూనే కారులో వచ్చిన భార్యతో కబుర్లు చెప్పుకుంటూ చాంబర్ లో కూచుని చాలామందికి అసూయ కలిగిద్దా మనుకున్నాడు కాని, కనీసం కిన్నెర ఫోన్ కూడా చేయలేదు.


    ఇంట్లో అడుగు పెట్టగానే కిన్నెర ఎదురవుతుందనుకున్నాడు. అందంగా అలంకరించుకున్న కిన్నెర మొహం సైతం చూడకుండా అలిగినట్టు సీరియస్ గా పడగ్గదిలోకి నడుద్దామనుకున్నాడు గాని, కిన్నెర జాడలేదు.


    "ఏమైంది?


    పడగ్గదిలోకి వస్తూనే చూశాడు. కిన్నెర వెల్లకిలా పడుకుని ఏదో ఇంగ్లీషు నవల చదువుకుంటుంది తనను గమనించనట్టుగా.


    "హు!" అణువంత ఉక్రోషాన్ని ప్రదర్శించబోయాడు కాని అసలు రెస్పాన్స్ లేదు. బట్టలు మార్చుకుంటూ అన్నాడు "అప్పుడే మోహం మోత్తిం దన్నమాట!"


    సీరియస్ గా చూసింది.


    ఇప్పుడు కిన్నెర భార్యలా కాక తొలిసారి బొజ్జన్న కొండ దగ్గర కలిసిన కిన్నేరలా ఉంది.


    "నాకు తెలుసు. నిజంగానే మొహం మొత్తింది. "రెట్టించాడు స్వగతంలోలా.


    "దేనిమీద?" దీర్ఘం తీసింది.


    "తెలుగు సాహిత్యం మీద!" వాదానికో టాపిక్ దొరికినట్టు అన్నాడు. "లేకపోతే నిన్న కాక మొన్నదాకా తెలుగు క్లాసిక్సో, నా కవితలో చదివే నీకు, హటాత్తుగా ఇంగ్లీషు నావేల్స్ పై వ్యామోహం కలగడమేమిటి?"


    "అదంతే.....ప్రతి వాళ్ళకి కొన్ని చిత్రమైన వ్యామోహలుంటాయి "పుస్తకంలో నుంచి తల తిప్పకుండానే అంది.


    "అవునవును, అందులో కట్టుకున్న వాడ్ని కేర్ చేయకుండా ఇంకా ఇంగ్లీషు నవలని చదువుకుంటూ పడుకోవడం ఒకటి" వేదాంతిలా నవ్వాడు. "అందుకే ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ లో జేన్ ఆస్టిన్ అలా చెప్పింది కూడా."


    కిన్నెర నిశ్శబ్దంగా చూస్తుంది.


    "అసలు భర్త మీద అభిమానం ఉంటే జేన్ ఆస్టిన్ చెప్పిందేమిటి తెలుసుకోవాలని చెప్పారు అంటూ నా భుజం పై తలానించి కళ్ళలో గోముగా చూస్తూ అడిగేదానివి."


    "అంత ఆంగికం ప్రదర్శించడం నాకు అలవాటు లేదు __" అని అతడు ఉదయం అన్న మాటల్ని అతడికే అప్పచెప్పింది. "ఆ కొటేషనేమిటో చెప్పి బరువు తగ్గించుకోండి."


    "ఎ లేడిస్ ఇమెజినేషన్ ఈజ్ వెరి రేపిడ్. ఇట్ జంప్స్ అడ్మిరేషన్ టు లౌ. ఫ్రం లౌ టు మెట్రిమోని ఇన్ ఎ మూమెంట్."

    
    "అంటే మీ ఉద్దేశం ఏమిటి?" దెబ్బలాటకు దిగినట్టు అంది. "నేను అంత తొందరపాటు మనిషిననా?"


    కిన్నెర మొహంతో రోషాన్ని చూసి కంగారు పడిపోయాడు. "ఖచ్చితంగా అదే అని కాదు ఇంచుమించు నువ్వు ఆ టైప్ మనిషివి అనిపిస్తుంది."


    "మీరూ ఖచ్చితంగా ఏమిటో నాకు తెలిసి వుంటే అలా తొందరపడేదాన్ని కాదు."


    "ఇప్పుడు నీకు నేనేం అన్యాయం చేశాను ప్రియా!"


    "ప్రియా.....పచ్చడి అంటూ ప్రేమ నటించకండి, మీరేమిటో తెలిసింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS