Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 35

 

    "ఎంతైనా వాడు చాలా అదృష్టవంతుడే పిచ్చితల్లి! వాడి బ్రతుకంతా మహారాజు భోగమని చిన్నప్పుడే వాడి చెయ్యి చూసిన ఓ కొండ దొర చెప్పాడు."


    స్వప్నంలోకి జారినట్టు రాఘవ గురించి ఆలోచిస్తూ ఉండిపోయిన కిన్నెర, బామ్మ భుజం పైన చేయివేసి కుదుపుతుంటే తేరుకుంది.


    "అది సరే......రాత్రి వాడు బాగా అల్లరి పెట్టాడా?"


    "బాప్ రే!" అందోళనగా చూసింది. ఇలాంటి విషయాలూ అడుగుతారని తెలీని ఆడపిల్లయినందుకేమో బిడియంగా తల వంచుకుంది.


    "ఫర్వాలేదు చెప్పమ్మా!"


    "అల్లరంటే....." నీళ్ళు నమిలేసింది కిన్నెర. "అదో టైపన్న మాట!"


    "నువ్వు చెప్పకపోతే మాత్రం వాడేమిటో నాకు తెలీదా పిచ్చిపిల్లా! సుబ్బులు చాలా సార్లు చెప్పిందిగా!"


    నిశ్చేష్టంగా చూసింది కిన్నెర......"సుబ్బులేవరు?"


    "వరసకు వీడి మేనకోడల్లే. వైజాగు లో ఉంటుంది.'


    కిన్నెర మోహంలో రంగులు మారిపోతున్నాయి.


    "ఏం చెప్పింది."


    "దగ్గర కొచ్చిన ఆడపిల్లను ఎంత పిచ్చేక్కిస్తాడు అన్న విషయం నీకు తెలిదమ్మా! వీడు అసాధ్యుడు!"


    అంటే, రాత్రి తాను ఆకతాయిగా అన్నది నిజమేనా? పెళ్ళికి ముందే పెద్ద గ్రంధసాంగుడా? అసూయతో కంపిస్తూ మాణిక్యమ్మను చూసిందామె.


    "చెప్పండి బామ్మగారూ!" కిన్నెర నేత్రాలు అరుణ రాగరంజితాలయ్యాయి. "సుబ్బుల్ని ఈయన ప్రేమించారా?"

 

    అసలు కిన్నెర ఏ ఆలోచనతో ఈ ప్రశ్న వేసింది మాణిక్యమ్మ ఉహించలేకపోయింది. అర్ధం చేసుకోవటానికి ఈ తరానికి చెందిన మనిషి కాదుగా!

    
    "ఎందుకులే తల్లీ చెప్పుకుంటే సిగ్గుచేటు!"


    కిన్నేరకు మరింతగా టెన్షన్ పెరిగిపోయింది. మోహంలో భావాలను కనిపించనివ్వకుండా ఈసారి బామ్మ పక్కన కూర్చింది-- "ఫర్వాలేదు చెప్పు బామ్మా!"


    ఓ కోటేశ్వరుడి బిడ్డ అంత ఆప్యాయతని ప్రదర్శిస్తుంటే ఎలా తట్టుకోగలదని! పైగా బామ్మా అంటూ పక్కన చేరిందాయే.


    "నీ అంత అందగత్తే కాకపోయినా , అది బాగానే ఉంటుందమ్మా. అసలు వీడి మేనమామకు ముందునుంచి విడ్ని అల్లుడ్ని చేసుకోవాలని ఉండేది. ఆ విషయం సుబ్బులు పుట్టగానే నిర్ణయమైపోయింది కూడా. దానితో వీడు చదువుకునే రోజుల్లో వీడి గడికే వచ్చేదట."


    అసలు విషయానికి సూటిగా రాకుండా బామ్మగారు తాత్సారం చేయడం బొత్తిగా నచ్చలేదు.

 

    "వచ్చి ఊరుకునేదా? సినిమాలకి, షికార్లకి వెళ్దామంటు వెంటపడేదట!"


    సిగ్గు లేకుండా ఈ విషయాలన్ని బామ్మకు చెప్పుకునే వాడేమో అనుకుంటూ "వేళ్ళేవారా?" అంది కోపాన్ని దిగమింగుకుంటూ.


    "చెప్పేది విను."


    "వెళ్ళే ఉంటారు లెండి!" తప్పకుండా సుబ్బులతో చెడామడా తిరిగి ఉంటాడన్న నమ్మకం ఏర్పడిపోయింది కిన్నేరకు. "ఎంతైనా సుబ్బులు అందగత్తెగా!"


    "అయితే ఆ విషయం ఆ నోటా ఈ నోటా వీళ్ళ మేనమామ దాకా వెళ్ళింది. కూతుర్ని మందలించటం మొదలుపెట్టడట. అలావాటు పడిన ప్రాణంగా."


    ""దేనికి?" కిన్నేరకు కావాల్సిందదే, దేనికి అలవాటు పడ్డారో ఇప్పుడు అర్జెంటుగా తెలియాలి. "తిరగటానికా?"


    "వాడి మొహం. అంతటి దైర్యం కూడానా?"


    "అంటే సినిమాలకు వెళ్ళేవారు కాదా?" ఉద్వేగంగా అడిగింది. "అలవాటు పడిన ప్రాణం అన్నారుగా?"


    "అంటే సుబ్బులు గదికి రావడం అలవాటు పడింది కదా అని!"


    "ఆ తర్వాత?"


    "తండ్రి మందలించడంతో మన పెళ్ళి సంగతి మాట్లాడు అంటూ వీడి వెంట పడింది."


    "మాట్లాడేరా?"


    "కుదురదన్నాడట. అసలు ఇప్పుడు నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు పొమ్మన్నాడట అలాంటప్పుడు ఇంతకాలం మాటల్తో నన్నెందుకు జోకొట్టావు అంటూ నిలదీసిందట."


    "అది నిజమేగా?" మంటగా అనేసింది కిన్నెర.


    "మాట్లాడిన ప్రతి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అంటే ఈపాటికి నాకు ఓ వెయ్యి మంది పెళ్ళాలుండేవారంటూ తెగేసి చెప్పాడట. ఆ పిచ్చిపిల్ల వింటేగా? ఏడ్చింది, మొత్తుకుంది. అ తర్వాత ఇంత కాలము తనతో తిరిగాడని ఊరంతా టమ్కు వేసిందట. దానితో వీడికి మండి అసలు మేనమామ ఇంటికి వెళ్ళడమే బంద్ చేశాడు."


    "ఆ తర్వాత?"


    "పాపం సుబ్బులు ఎండ్రిన్ తాగేసింది."


    ఉలిక్కిపడింది కిన్నెర.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS