"సైజులన్నీ ఊహించి తెచ్చాను. పట్టుకుంటే తిట్టుకోకు" అన్నాడు అతను సన్నగా కన్నుగీటుతూ.
"ఊరికే ఇస్తే తీసుకోను. వీటికి అయిన డబ్బులిచ్చేస్తాను. మీ దగ్గిరికే వచ్చయిన తీర్చేస్తాను. అలా అయితేనే తీసుకుంటాను" అంది. ఉచితంగా బహుమానం తీసుకోవడానికి మనసొప్పడంలేదు ఆమెకి.
డబ్బులు తీసుకోవడానికి అతను ఒప్పుకోలేదు. కానీ చివరికి ఆమే గెలిచింది. డబ్బులు తీసుకునేందుకు మొండిగా అతన్ని ఒప్పించింది.
"నువ్వు నిలుచునే వున్నావ్ కూర్చో" అంటూ అతను ఎంతో చొరవతో ముందుకు లాగాడు.
అతను అలా లాగుతాడని ఆమె ఊహించలేదు.
విసురుగా వచ్చి మీదపడిపోయింది. అతను వెనక్కి వాలిపోయాడు. ఆమెమీద పడిపోయిందిగానీ తిరిగి వెనక్కి లేవడానికి చేతకావడంలేదు.
అందులోనూ శరీరం అతన్ని వదిలిపెట్టడానికి అనుమతించలేదు. ముఖ్యంగా ఎదభాగం అయితే మరింత నొక్కుకుపోవాలనుకుంటోందే తప్ప తప్పుకోవటంలేదు. అతను మెల్లగా ఆమె మీద చేతులు వేసి మరింతగా తన మీదకి లాక్కున్నాడు సుధాకర్.
అతను తన పెదవుల్ని ఆమె పెదవులకి ఆన్చి వాటిని లోపలికి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
నిజంగా ఆమెకు మతిపోయినట్లయింది. ఏదో ఇంగ్లీషు, సినిమాలో అట్లా పెట్టుకుంటారుగానీ నిజానికి అట్లా ముద్దుపెట్టుకుంటారని తెలియదు. ఏం రుచి? మొత్తం మనిషినంతా చక్కెరపాకంలో ఊరబెట్టినంత మధురంగా వుంది ఆ చర్య.
అతను ఆమె పెదవుల్ని వదిలిపెట్టలేదు. ఆమె కూడా పెదవుల్ని వెనక్కి లాక్కుందామని అనుకోలేదు. ఎంగిలంత రుచిగా వుంటుందని ఇద్దరికీ అంతకు ముందు తెలియని విషయం.
అతని చేతులు కంఠాన్ని దాటి కిందకు దిగాయి.
ఆమె ఎలా అయిపోయిందంటే పారవశ్యం లాంటిది కమ్ముకొస్తుంటే కళ్లు దానంతటవే మూసుకుపోయాయి. అతనేం చేసినా అతని ఇష్టం అన్నట్టు శరీరం అతనికి పూర్తిగా ట్యూన్ అయిపోయింది.
అతనికీ కొత్తేనన్న విషయం ఆమెకీ తెలుస్తోంది. జాకెట్టుకు ముందో, వెనకో ఎక్కడ హుక్ లు వున్నాయన్న విషయం సరిగ్గా కనిపెట్టలేకపోయాడు. కానీ అలా వెదుక్కుంటున్నప్పుడు అతని వేళ్ల కదలికల నుంచి సంగీతం విన్పిస్తుండడాన్ని ఆమె ఫీలయ్యింది.
మొత్తానికి అతను విజయం సాధించాడు.
ఆమెకి ఎంత సిగ్గొచ్చిందంటే ఇక ఎప్పటికీ తను కళ్లుతెరిచి అతన్ని చూడలేనేమోననిపించింది. మధ్యలో విడిపోయిన జాకెట్టు సీతాకోక చిలుకలా వుంది.
అతను ఆ భాగం నునుపునంతా ముఖంతో తడుముతున్నాడు. ఆమె కళ్లు మూసుకుంది.
అతనివేళ్లు మరింత కిందకు దిగి పనసపండు తొనలాంటి ఆమె బొడ్డులో కూరుకుపోయాయి.
ఆమె గట్టిగా కౌగిలించుకుంది ఇక వదలనట్టు.
ఏదో వత్తిడి మేరకే అతను ఆమెను పక్కకు తిప్పాడు.
ఆమె మంచంమీద వాలిపోతే, అతను మంచంమీద పాతికభాగమే వున్నాడు. అతను బరువుగా అనిపించకపోవడం ఆ సమయంలోనూ ఆమెకి గుర్తొచ్చింది.
ఏదో చెయ్యాలన్న వత్తిడి ఇద్దరికీ వుందిగానీ మిగిలినదంతా ఆల్ జీబ్రా లెక్కలా బోధపడడంలేదు.
ఆమెకంటే అతను కొంచెం మెరుగు. ధీరిటికల్ నాలెడ్జ్ అయినా వుంది. అందులోనూ లోపల కలుగుతున్న వత్తిడి కొంతమార్గాన్ని సూచిస్తోంది.
తనను ఆమెను తనవేపుకు తిప్పుకోవడంలో ఆమె కూడా మంచం మీద పాతికభాహగమే వుంది. అతను ఆమెను మరింతగా తనలో కలుపుకోవాలని చూస్తున్నాడు. ఆమె కళ్లు మూసుకున్నా నవవసంతాలు విచ్చుకున్నట్టుంది. మంచువర్షంలో తడుస్తూ, మల్లెపూల గొడుగు పట్టుకుని దిగంతాలవైపు నడుస్తున్నట్లుంది. స్వర్గానికి వెళుతూ వెళుతూ మానస సరోవరం లోకి తొంగిచూస్తున్నట్లుంది అతనికి.
అతను ఆమెను మరింత హత్తుకున్నాడు.
తేనెవాగులోంచి జారుతూ మాధుర్యపు సుడిగుండంలో చిక్కుకు పోతున్నట్టు అన్పిస్తోంది.
ఠక్కున ఆమెకి ఏదో స్పురించింది. కళ్లు విప్పింది.
"వద్దు.. .ఇప్పుడొద్దు" కంగారు ముఖంలో కన్పిస్తోంది.
అతను ఆమెలోకి సూటిగా చూస్తున్నాడు.
" ఇప్పుడు .... మంచిదికాదు.... మగాడు చచ్చిపోతాడట...." ఆమె ఏమన్నదో అతనికి అర్దంకాలేదు.
"చచ్చిపోతానా?" అన్నాడతను విస్మయంగా.
" ఆ - ఇప్పుడు నేను ఇంటికి దూరం" అంది ఉమ కళ్లను మరింతగా సాగదీస్తూ.
అప్పుడు తెలిసింది అతనికి విషయం ఏమిటో.
"ఛీఛీ! అదంతా పచ్చి అబద్దం... .అన్ సైంటిఫిక్" అతను ఎంత మాత్రం ఒప్పుకోలేదు.
అతను తను అన్నదాన్ని వ్యతిరేకించడం, అలాంటిదేమీ లేదనడం ఎందుకనో బావుంది. కానీ ఎక్కడో లోన భయం కళ్ళల్లోంచి బయట పడుతోంది.
అతను ఆగలేదు. తిరిగి పొదివిపట్టుకున్నాడు. ఆ ఆరుబయటే కొట్టంలో వాళ్లిద్దరూ ఒకటైపోయారు.
వాళ్లిద్దరూ ఎంతగా పరిసరాల్ని మర్చిపోయారంటే - అది పందిరి అనిగానీ, అక్కడికి ఎవరైనా వస్తే మొత్తం కనిపెట్టేస్తారనిగాని గుర్తుకే రాలేదు.
మరో పావుగంట వరకు వాళ్లకి కాలం స్తంభించింది. అతను వెళ్లిపోయాకకూడా ఆమె అక్కడ్నించి లేవలేదు. అలానే కళ్లుమూసుకుని పడుకుండిపోయిందామె.
చివరలో అంతా అయిపోయాక " ఐయామ్ సారీ......! నేను చాలా తొందరపడ్డాను" అని అతను బాధపడడం, ప్రపంచం ఏదో మునిగిపోయినట్టు అమ్మాయి ఏడ్వడం లాంటి అసహజమయిన సీన్ లేమీ జరగలేదు అక్కడ.
ఇద్దరూ ఆ అనుభూతినుంచి తేరుకున్నాక "ఓ.కే. వస్తాను....." అన్నాడు సుధాకర్.
ఆమె సింపుల్ గా తలవూపింది.
అతను అక్కడ్నించి వెళ్లిపోయాకకూడా ఆమెకు లేవబుద్దికాలేదు. శరీరమంతా ఏదో మధురమైన నొప్పులు. తీపులంటారే అలాంటివి. అసలు తన శరీరమే తనకు కొత్తగా వుంది. దానికి అంతలా సుఖపడటం తెలుసని గూడా ఇంతవరకూ తెలియదు.
నిజంగా ఆవి ఆమెకు అధ్బుతమైన క్షణాలు.... బాధలాగే సుఖం కూడా సలుపుతుందని మొదటిసారి అర్దమైంది ఆమెకు.
రెండురోజులు గడిచాయి.
