౧౭
తొలి కలయిక
నాకు టైఫాయిడ్ తగ్గి యారోగ్యము లభించు నాఁ టికి జీవిత వాంఛలు రెండు గల వంటిని. తొలిది శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనము. అది తొలుత నగమ్యగోచరముగా నుండుట, యీనాఁ టికిఁ జాల విషయములు దెలియ నగుట రేఖామాత్రముగాఁ జెప్పితిని గదా! రెండవది వివాహ మాడితిని గనుక అచుంబిత ప్రక్రియయ గుస్త్రీ సుఖము నను భవింపగోరుట. అది యేదో వేంకటేశ్వర దర్శనము వలె నపూర్వాద్భు తాతిలో కానందము గొల్పునదిగా నుండఁ గల దనుకొనుచు నువ్విళ్ళురుచుం టిని. ఈ రెండు నెఱవేరినచో నా జీవిత ప్రయోజనము లభించినట్టే యనుకొంటిని.
తిరుపతినుండి యింటి వెళ్ళినతో డ్తో నారోగ్యవృద్ధి క్షణక్షణవిజ్రుంభణము గాఁజొచ్చినది. మా తలిదండ్రులు వగైరాలు మద్రాసునుండి వచ్చుదాఁక ఇంచుమించుగా పదునైనాళ్ళు నా మిత్రులు శ్రీ సుసర్ల కుమార స్వామి శాస్త్రి గారి యింటనే యుంటిని. వారును, వారి కుటుంబిని శ్రీమతి రామమ్మ గారును నన్నుబిడ్డను గాఁగాపాడిరి. ఆకలి నాక మితము గారేగుచుండెను. ఎక్కువగా భోజనము చేసెడి వాఁ డను. దృష్టి తగులు నని రామమ్మ గారు నాకు చాటుగా భోజనము చూడ కుండు నట్లు భోజనము పెట్టుచుండెడి వారు. ఆ దంపతులు నేఁ డు లేరు. వారి పుణ్య గతికై తలఁ పు నాకు వచ్చినపు డెల్ల తపించుచుందును. కుమారస్వామి శాస్త్రిగారిని నేను నా భ్రుక్తరహిత తారకరాజయోగా నుష్టానమున తర్వాత 1917 వ సంవత్సరమున చేర్చితిని.కాని వారు దుర్బలమయిన చిత్త వృత్తి కలవారు గాన యిందు శ్రద్ధాళువులు కారయిరి. దుస్సహ వాసముల మరగి సంపదా రోగ్యములను సంపూర్ణముగాఁ జెడగొట్టుకొనిరి. వారి భార్యగారు ముందుగాను, 1928 ప్రాంతముల గాబోలు వారును చనిపోయిరి.
కుమారస్వామి శాస్త్రి గారు చనిపోయిన పదవ నాఁడు నేను ధ్యానము చేసికొను చుండఁ కా నా కన్నుల యెదుట స్పష్టముగా గోచరమై చిఱునవ్వు నవ్వుచు ' నీ మంచి సహవాసమును దూరస్థుఁ డనుగా నుండుటచే కోల్పోయి నీ మాట వినక దుస్సహావాసము జిక్కి చెడితిని. శారీరక వాంఛలు నన్నట్టుగా నాకట్టుకొని పెడ మార్గమును బట్టించినవి. చక్కబఱుప సాధ్యము కాని తుచ్చ శరీరము తొలఁ గెను . ఇఁక నీ గోష్ఠిలో నేను సుప్రతిష్ఠితుఁ నుగా నుండును' అని లజ్జా గర్భితముగా పలికి నాతో ధ్యానమగ్నఁ డగుట కాన వచ్చెను. శీలము పవిత్రముగాకున్నను, ఉపకార ప్రకృతి యాతనికడ నసాధారణమైనదిగా నుండెడిది. ఆ ర్తతలో నున్నవారి కెందఱకో ఆతఁ డుపకరించెడి వాఁ డు. తన కల్మినందుకుఁ గోల్పోయెను. ప్రధానముగా నాయెడ నాతఁ డు నెఱపిన సౌహార్దవాత్సల్యములకే, ఆ సుగుణమునకే శాశ్వతముగా నా జీవు డుద్గతి నొందగ కానీ తపించుచుందును.
వారి యింట పదిహేనురోజుల కెక్కువకాలమే అప్పుడుంటిని. అంతలో మా తల్లిదండ్రులు వగైరా లింటికి వచ్చిరి. మూఁడు నాలుగు నెలలకు నే నంతకు ముం దెన్నఁడు నెఱుఁగని యానరోగ్యము పొందితిని. నా తలఁ పున గుర్తించినవారగుటచే మా తలిదండ్రులు, నక్కగారు పునస్సంధాన ముహూర్తము నిర్ణయించుటకు మా యత్తవారిని గోరిరి. ఇంకను గొంత కాలము మా మామగారు ముహూర్త నిర్ణయమున కంగీకరించిరి. కొలఁ ది రోజులు ముందుగా మా సోదరికి గూడ పునస్సంధాన ముహూర్త మేర్పఱచిరి.
అంతదాఁక బులపాటము చెందుచున్న నాకు ముహూర్త నిర్ణయము నాటనుండి చాల మనోదుఃఖము రేగెను. నా వ్యాకులతను గుర్తించి రేకానికారణమేదోయెవ్వరునెఱుఁగరు. తొలుత నేను నెఱుఁగను. కారణ మెఱుఁగ రాకుండ వ్యాకులత పెరుగసాగెను. వివాహము నాఁటి నుండియు నా జీవితము క్లేశముల పాలగుచుండుట, దానికి కారణము పెండ్లాడిన పిల్ల జాతకముపొంతనములు ససిపడినవి కాకపోవుట యని మావారు చీకాకు చెందుట యని వెదకి వెదకి కొంత గుర్తించితిని. నా వివాహము నాఁడు వధువు జాతకము చూపింప గోరఁగా మా మామగారు నేను జాతకము వ్రాయ లేదని చెప్పి వేసిరి. కాన దాని గుణదోషములు గుర్తింప వీలుపడదయ్యెను. అసలు నాకు జాతక పరిశీలనము మిఁద విశ్వాసము లేదయ్యెను.' యస్యాం మనశ్చక్షుషోర్నిబంధ స్తస్యా మృద్దిః ' అన్న ధర్మసూత్రము నాకు నవ్వ్హి నేను మనసార ప్రేమించి యా పిల్లను బెండ్లాడితిని గాన నా కప్పుడు కొఱఁత తోఁపలేదు.
