Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 36

                     33. 'పక్షవాతమేమో' అనిపించే మూతివంకరవ్యాధి.
   
    రాఘవరావుకి రెండు రోజుల క్రితం ఎడమచెవి వెనుక కాస్త నొప్పి అనిపించింది. ఆ నొప్పి చెవికి సంభందించిందేమోనని నొప్పి తగ్గడానికి కాస్త తులసి రసం_సున్నం నీళ్ళు కలిపి  చెవిలో పోశాడు. దాంతో ఆ పోటుతగ్గడం అటుంచి మూడవ రోజుకే మూతివంకర అయిపోయింది. నొప్పి వచ్చినది ఎడమ చెవి దగ్గర_ కాని కుడివైపునాకు గుంజుకుని పోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్ధంకాక అయోమయంలో పడిన రాఘవరావు, నరాల వతానికి ముసలమ్మాల వైద్యమే మంచి వైధ్యమని భావించి ఏవేవో చిట్కాలు ప్రయోగించాడు. అయినా   ఫలితం కనబడలేదు. మూతివంకర అలాగే వుంది.

    మంచి నీళ్ళు తరగబోతే సగం నీళ్ళు మూతి ప్రక్కనుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇక లాభం లేదని "పక్షవతల స్పెషలిస్టు" దగ్గరకి వెళ్ళాడు. ఇక ఆ డాక్టరుగారు "ఇంకేముంది! ఇప్పటికే వ్యాధి ముదిరి పోయింది. రేపో_ఎల్లుండో ,ఉన్న రెండుకాళ్ళు పక్షపటంలో పడిపోవడానికి సిద్దంగా వున్నాయని బెదిరించాడు. డబ్బు మూట ముందేపుచ్చుకున్నాడు. కఠినపథ్యంచేయాలన్నారు కాషాయం కళ్ళుమూసుకుని తాగితే తప్పపక్షవాతం దిగిరాదన్నాడు. విరేచనాలకి గుళికలు మింగించాడు.  ఈ చికిత్సలో మూతివంకర తగ్గడం అటుంచి మరింత నీరస పడిమంచాన పడేంత పని అయింది.

    ఇంతాచేస్తే రాఘవరావు మూతి వంకరావడానికి ఎడమవైపు ఉన్న ఫేషియల్ సర్వ ఒకచోట ఒత్తిడికి లోనవ్వడమే. ఇటువంటి పరిస్థితినే "బెల్స్ పాల్సీ" అంటారు. ఈ రకంగా కేవలం మూతివంకర పోవడానికి, ఒకవైపు కాలు_చెయ్యి పడిపావువడ్నికి సంభంధంలేదు "బెల్స్ పాల్సీ" లో కేవలం మూతి మాత్రమె ఒక పక్కి వంకరపోతుంది. ఇలా ఏ వయస్సులో వున్నవారికైనా జరగవచ్చు. కొందరిలో వరం పడి రోజులలో మూతి యధాస్థితికిరావచ్చు. ఇంకొందరికి జీవితాతం కొద్దోగొప్పోమూతివంకర మిగిలిపోవచ్చు.

    ఫేషియల్ సర్వ్తల లోపలినుంచి చెవి వెనుకగుండా ఒక రంధ్రం ద్వారా బయటకు వచ్చి అటువైపు కండరాల కదలికను అదుపు చేస్తుంది. కొన్ని సందర్భలలో చెవిదగ్గర నరం బయటకి వచ్చేచోట నరం చుట్టూ ఉండే పొరలు వాచీపోతాయి. అలా పొరలు వాయడంతో నరం నొక్కుకుని బలహీనతమైపోతుంది. అటువంటప్పుడు ముఖ్నికి రెండవవైపు వుందే నరాలు చుట్టూ వుందే పోర వాపు తగ్గినప్పుడు నరం మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఈ రకంగా నరం చుట్టూ వుండే పొరలు వాయడం, శీతాకాలంలో చల్లగాలివల్ల ఎక్కువ "బెల్స్ ఫాల్సీ" కి సంభందించిన ఈ విషయం తేలియక కొందరు "పక్షవాత స్పెషలిస్టు" ల మని బోర్డులు కట్టుకునే వారి మాటలకు మోసపోయి, న్న బాధలను గురి అవుతూ వుంటారు.

    మూతివంకరని మాత్రమే కలిగించే ఈ నరాల వ్యాధి వచ్చే ముందు ఏదో ఒక చెవి వెనుక రెండు రోజులు నొప్పి అనిపించవచ్చు, లేదా అనిపించకపోవచ్చు. తరువాత రెండు మూడు రోజులకు మూతి వంకరాయి చెవి నొప్పి అనిపించిన వైపు కన్ను సరిగా మూటపడకుండా అవుతుంది. దాంతోకంటిలోదుమ్ము పడుతున్నా, కన్ను పూర్తిగా మూసుకుకోలేని స్థితి ఏర్పడుతుంది నరం దెబ్బతిన్న వైపు ముఖంమీద స్పర్శజ్ఞనం తగ్గినట్లు అనిపిస్తుంది. అన్నం ముద్దా నమలబోతే పూటిగా మింగుడు పడకుండా పళ్ళవరసకీ దవడకీమధ్య నిలవ వుండిపోతుంది.

    అంతేకాదు, మాట్లాడాదామని నోరు తెరవకపోతే మూతి మరింత వంకరపోతుంది. అంతకు ముందు ఏంత చక్కగా ఈల వేసి హుషారుగా గంతేసే మగాడైనా ఫేషియర్ సర్వ్ దెబ్బతినడంతో ఈల వెయబోయే సరికి ఈల బదులు చొంగ వస్తుంది. కొందరికి నాలిక ముందు భాగంలో రుచి తెలియకుండా పోతుంది. ఇది ఇలా వుండగా మూటపాడనీ కన్ను మూయబోతే కన్నుగుద్దు వంకరటింకరగా తిరుగుటుంది. ఈ రకంగా మూతి వంకరపావువడ్నికి నరం మీద ఒత్తిడి ముఖ్యకారణం కాగా, అరుదుగా మెదడులో కణితిలాగా ఏర్పడటం, వైరస్ క్రిములవల్ల నరం వ్యాధి గ్రస్తుమవడం కూడా కరాణాలే. అందుకని మూతి వంకర అయినప్పుడు సరైన కారానాన్ని గుర్తించి చికిత్స చేయవలసి ఉంటుంది.

    "బెల్స్ ఫాల్సీ" వచ్చినప్పుడు మొదట్లో నొప్పి ఉంటే అస్ప్రిన్వంటివి వాడటం, కార్తికోస్తిరాయిడ్స్  కోర్సుగా వాడటం, చలినుంచి రక్షన్ కల్పించటం వసరం మూతి మరీ వంకర అవుతూ వుంటే స్ప్రింట్ పద్దతి అవలంభించలి. కంతిలోకి దుమ్ముపోకుండా కన్నుని రక్షించలి. వ్యాధి తీవ్రత తగ్గినా తరువాత ముఖానికి సంభందించిన కండరాల వ్యాయామం చేయాలి.       

                                                                       ****
   
               


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS