తా: ముకుళహస్తము వక్షస్థలమునందు విరళముగ నిలిపిపచో వార్ధక్యమునందు వినియోగించును.
శ్లో!! తర్జన్యాస్యాందంత్య వర్వణ్యంగుష్టోనే ప్రసారితా !
నఖహంస ఇతిఖ్యాతః కరః కరవిచక్షణైః !!
తా: అంగుష్టమును తర్జన్యంగుళియొక్క అంత్యపర్యంతమునందుంచి ఇతరాంగుళులను జూచిపట్టినచో "నఖహంస" హస్తమగును.
శ్లో!! వజ్రవైడూర్య రూపేచ పఖార్ధే నాశికామణౌ !
నఖహంస ఇతిఖ్యాతః కరః కరవిచక్షణైః !!
తా: నఖహస్తము వజ్రమునందును, సైఢూర్యమునందును, నఖమును చూపుటయందును, నాసామణియందును వర్తించును.
శ్లో!! నాధూసాదధహంసాస్య ఉరశ్పీమానమాశ్రితః !
ఉపవీతేపి వైకక్ష్యేయాత్రాభేదేపియుజ్యతే !!
తా: హంసాశ్య హస్తము వామభుజమువలన వక్షస్థలము బొందినచో యజ్ఞోపవీతమునందును, కంఠహారమునందును, యాత్రేభేదమునందును వర్తించుచున్నది.
శ్లో!! పతాకాఖ్యేకనిష్టాయామూలేంగుష్టోనివేశితః !
పతాక చతురస్స్కోయం, తత్స్వరూపవిహోచ్యతే !!
తా: పతాక హస్తమునందు కనిష్టాంగుళి మూలమునందు అంగుష్టము నుంచినచో పతాక చతురహస్త మగును.
-: వినియోగము :-
శ్లో!! ఆననే శ్వేత వర్ణేపి సూపార్ధేపిచయుజ్యతే !!
తా: పతాక చతురహస్తము "ముఖమునందు", తెలుపు వర్ణమందు, సూపార్ధమునందు వినియోగించును.
శ్లో!! చతురౌతు యధాశ్లిష్టా అననాభిముఖౌతధా !
కపోలేనే నేత్రభావేచ యుజ్యతే భరతాదగైః !!
తా: రెండు చతురహస్తములు కలిపిపట్టి ముఖమునకు అభిముఖముగ ఉంచినచో కపోలమునందు, నేత్రములందును వినియోగించురు.
శ్లో!! తామ్రచూడకర స్తిర్యగ్లామిచే దరుణీభవేత్ !!
తా: తామ్రచూడ హస్తము అడ్డముగపట్టిన, "అరుణపర్ణము" నందు వర్తించును.
శ్లో!! తిరశ్చీనః పతాకశ్చేత్పీతవర్ణేనియుజ్యతే !
తా: పతాకహస్తము అడ్డీముగ బట్టినచో "పీతవర్ణము" నందు వర్తించును.
శ్లో!! తిరశ్చీనః సింహముఖశ్శామలేపరియుజ్యతే !!
తా: సింహముఖ హస్తము అడ్డముగబట్టినచో "నీలవర్ణము" లందు వర్తించును.
శ్లో!! అంసదేశః పతాకాగ్రహస్తేన యదితర్మితః !
క్షత్రియార్దేభుజార్ధేపి జయలక్ష్మీ ప్రదర్శనే !
తూణీరార్ధాపి పృష్ఠర్ధ పురుషస్య ప్రదర్శనే !
ఇత్యర్ధేషు నియుజ్యంతే నాట్యకర్మ విశారదైః !!
తా: పతాక హస్తాంగుళులచే భుజప్రదేశమును స్పృశించినగో క్షత్రియులయందు, ధుజములందు, జయలక్ష్మిని చూపుటయందు అమ్ములపొది చూపుటయందు, పశ్చిమభాగమందుండెడి పురుషుని చూపుటయందు ఈ హస్తము వినియోగించుచున్నది.
శ్లో!! వతాకయాప్యూరుదేశం దర్శయేద్వైశ్యభావనే !!
తా: పతాకహస్తముచే ఊరుప్రదేశము చూపించినచో, వైశ్యవర్ణము నందు వర్తించును.
శ్లో!! జంషూంచేత్స్పర్మయేచ్చూద్రే హస్తేనార్ధ వతాకయా !!
తా: అర్ధపతాక హస్తముచేత జానుప్రదేశము స్పృశించినచో శూద్రవర్ణమునందు వర్తించును.
శ్లో!! అనామికాచ విశ్లిష్టా మృగశీర్షాఖ్యమస్తకే !
నామ్నార్ధ మృగశీర్ష్కోయం తస్యభావవిహోభ్యతే !!
తా: మృగశీర్ష హస్తమునందు అనామికాంగుళిని. విశ్లిష్టముగా బట్టినచో అర్ధమృగశీర్ష హస్తమగును.
-: వి ని యో గ ము లు :-
శ్లో!! బాలస్త్రీణాం భావనేస్యాత్యాంవాదేచయుజ్యతే !!
తా: అర్ధమృగశిర హస్తము బాలికను చూపుటయందును, లలిత వచనమునందును వినియోగించుచున్నది.
శ్లో!! విసృజ్యముకుళం పూర్వం పశ్చాశ్చేన్మృగశీర్షకః !
వృద్ధస్త్రీణాం భావనాయాం కృపాశాంతిరసోదయే !!
తా: ముందుగ ముకుళహస్తము బట్టివిడిచి, తదుపరి మృగశిరహస్తమును బట్టినగో, వృద్ధస్త్రీని చూపుటయందు కృపారసశాంతి రసావిర్భావములయందు వినియోగింపబడును.
