Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 36

 

    "ఎస్ సర్ .........హిప్నాటిజం లేదా మేస్మరిజాలతో ప్రజల మూడ నమ్మకాలను ఆసరాగా తీసుకుని భక్తీ - ముక్తి అనే మత్తు మాటలతో తన సంపదను - కీర్తి - ప్రతిష్టలను పెంచుకుంటున్నాడనిపిస్తోంది.
    "అనుక్షణం విష్ణును స్టడీ చేసిన మీదట అతానితో ఏ శక్తీ లేదని నేను నిర్ధారణ కొచ్చాను. అంతేకాదు విగ్రహాలను దొంగాలించింది ఎవరో కూడా అతనికి తెలుసుకునే నా అనుమానం. మనలను తప్పు త్రోవ పట్టించడానికే తను స్వయంగా ఫోన్ చేసి మరీ దొంగతనం వివరాలు చెప్పాడు......."ఇంతకాలం మనం అనుమానిస్తూ వస్తున్న ఆ ఇద్దరమ్మాయిలు మరొక వైపు విష్ణును బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇకవాళ్ళు అతనిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో కూపీ లాగావలసి వుంది సర్" వినయ్ కుమార్ క్షణం ఆగాడు.
    'మిస్టర్ వినయ్! మనకు ఈ మధ్య కొన్ని కంప్లయింట్ వచ్చాయి. అని నువ్వు చూశావా? దొంగ సాధువులు, సన్యాసుల బారి నుండి ఆడపిల్లలను కాపాడండి" అనే ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయి...
    "సాధువులు, సన్యాసులు ముసుగులో అఘోర సంప్రదాయం అనే మూడచారంతో కన్నెపిల్లలను బలులు ఇవ్వటం కోసం ఒక ముఠా ప్రయత్నిస్తున్నదని పుకార్లు ఉన్నాయి. బహుశా నీ అనుమానం సరయినదే అయితే విష్ణు తన ఆశ్రమంలో వుంటున్న శిష్యులతో ఈ నీచ కృత్యాలకు పాల్పడుతూ వుండవచ్చు. ఎందుకయినా మంచిది వెయ్యి కళ్ళతో విష్ణు మందిరాన్ని కనిపెడుతూ వుండు....."
    "ఎక్స్ క్యూజ్ మీ సర్......నాదొక చిన్న సజెషన్"
    "ఏమిటది?"
    "విష్ణు టాడా క్రింద అరెస్టు చేస్తే బావుంటుందేమోనని" నసిగాడు .
    "వ్వాట్........వ్వాట్.....నీకేమయినా మతిపోయిందా?"
    "సారీ సర్.....ఐ.ఏస్.ఐ . వాళ్ళతో విష్ణుకు సంబంధాలు వున్నాయని అనుమానం......"వినయ్ కమీషనర్ మూడ్ అర్ధం చేసుకుని మెల్లగా అన్నాడు.
    "ఏమిటి నువ్వంటున్నది?"
    "సర్......ఈ మధ్య ఐ.ఎస్.ఐ ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ స్థావరాలను ఏర్పరచుకుని ఏజెంట్ల ద్వారా తమ కార్యకలాపాలను నిర్విగ్నంగా కొనసాగిస్తున్నాదని మనకు సమాచారం ఉండనే వుంది.
    ఆంధ్రప్రదేశ్ లో పాక్ ఏజెంట్ వున్న వ్యక్తీ విష్ణు ఎందుకు కాకూడదు? ఆ స్థావరం విష్ణు మందిరమే అయి వుంటుందని నా అనుమానం. ఆశ్రమంలో చేరిన ఆ ఇద్దరు వనితలు విష్ణును బ్లాక్ మెయిల్ చేయడం చూశాక నా అనుమానం రెట్టింపు అయింది. విష్ణు అలాంటి అక్రమ చర్యలకు పూనుకోకపొతే అతను వాళ్ళకు భయపడనవసరం లేదు కదా!
    "శత్రుదేశానికి చెందిన విద్రోహశక్తులతో అతనికి సంబంధం వుండబట్టే విగ్రహాలను, నగలను తనే దొంగిలించి ఏమీ తెలియనట్టు నాటకమాడుతున్నాడు. భక్తుల దృష్టిలో నగలుపోయినట్టు ప్రచారం కావలి కాబట్టి పిలిచి పోలీసు కంప్లయింట్ ఇచ్చాడు. వాస్తవానికి ఆ నగలు గోప్యంగా వాళ్ళ స్థావరానికి ఎప్పుడో పంపి వుంటాడని నా అనుమానం.
    "అసలు విష్ణు హిందువా? ముస్లిమా? క్రిస్టియానా? అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అటువంటి రహస్యమేదో అతని డైరీలలో వుండి వుండాలి....."
    "ఎస్.....యూ ఆర్ రైట్ బోయ్...అది చదివిన ఇద్దరు యువతులు అతనిని బ్లాక్ మెయిల్ చేస్తుండవచ్చు. అయితే ఆ డైరీలను మనం స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే నిజం ఏమిటో తెలిసిపోతుందిగా" పృద్విరాజ్ సలహా ఇచ్చాడు.
    "నా ఉద్దేశ్యం కూడా అదే సర్.........కానీ మీ డైరీలు ఒకసారి చూపించండి అని అడిగితే విష్ణు చూపించకపోవచ్చు కాబట్టి సెర్చి వారెంట్ తో వెళ్ళడం మంచిది. దేశ సమగ్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలకు అతను ఊతం ఇస్తున్నాడన్న ఆధారాలు దొరికిన వెంటనే అతనిని మనం కస్టడిలోకి తీసుకోవచ్చు" వినయ్ కుమార్ చాలా ఆవేశంగా అన్నాడు.
    "నీ అనుమానం బాగానే ఉంది. కాని నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు సమర్ధించరు. ఎందుకంటే ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు విష్ణు భక్తులే వున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మనం ఎలాంటి యాక్షన్ తీసుకున్నా అసలు వాస్తవం మరుగున పడి ప్రజలకు విష్ణు మీద మరింత భక్తీ భావం పెరగను వచ్చు.
    'అంత పాపులారిటీ వున్న విష్ణును తొందరపడి ఇప్పుడే అరెస్టు చేయడం అంత మంచిది కాదనిపిస్తుంది. అదే జరిగితే శాంతి- భద్రతల సమస్య తలెత్తవచ్చు. జిల్లా కలెక్టరుకు మనం సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి వచ్చినా రావచ్చు" అన్నాడు సి.పి. తనకున్న విజ్ఞతతో.
    ఆ మాటలకు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ లోని ఆవేశం చప్పున చల్లారిపోయింది.
    నిజమే.....తను ఆ కోణంలో నుంచి ఆలోచించనే లేదు. పైపెచ్చు అతనంటే పైపైన కోపం వెలిబుచ్చినా, లోలోపల అతని బోధనల పట్ల ఆకర్షితులరాలయిన భక్తులతో కలెక్టర్ ధీరజ కూడా వుంది.
    మరి అలాంటప్పుడు విష్ణుపై ఈగ వాలినా ఆమె సహించకపోవచ్చు. పబ్లిక్ నిరశనకు తోడుఆమె తోడ్పాటు కూడా కలిస్తే ప్రజావెల్లువ ఉప్పొంగుతుంది. అప్పుడు విష్ణు దేశ విద్రోహకార్యకలాపాలకు అండగా నిలిచాడో లేదో అనే విషయం మరుగున పడిపోతుంది తనచుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న విషయం తెలిసిన వెంటనే అతను జాగ్రత్త పడడానికి అవకాశం వుంది.
    అందుకే ఆచితూచి అడుగులు వేయాలనుకున్నాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
    రెండు నిమిషాల తరువాత.........


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS