Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 34

    తా: సర్పశీర్ష  హస్తములు  ఫాలప్రదేశమున  నుంచినచో  పాపడదువ్వుటయందు  వినియోగించుచున్నది.

   శ్లో!!    వామభాగా దక్షిణాంగం శ్రితస్సూచీ ముఖఃకరః !
    వలయేపిచభిత్త్యౌదౌయుజ్యతేకవిభిఃక్రమాత్ !!

    తా: సూచముఖ హస్తము  వామభాగమునుండి  దక్షిణాంగ  పర్యంతము  తెచ్చి  నిలిపినచో  వలయమునందును. భిత్తి  మొదలగువానియందును వర్తించును.

   శ్లో!!    కిరీటార్దేయుజ్యత్కేయ మూర్ధ్యగోహ్యల పద్మకః !
    అధోముఖ ఘధస్యాచ్చేన్మిస్తకే  వినియుజ్యతే !
    స ఏవ  భుజగామీచేద్ఘటభావేనియుజ్యతే !!

    తా: అలపద్మక  హస్తము  ఊర్ధ్వభాతమునందు  పట్టినచో  కిరీటము సందును. అధోముఖముగ  బట్టినచో  శిరస్సునందును. భుజమునందుబట్టినచో ఘటమునందును  వర్తించును.

   శ్లో!!    అలకేయుజ్యతే  హంసోవానుదక్షణ కర్ణగః !!

    తా: హంసాస్య  హస్తమును  వామకర్ణము  మొదలు దక్షణకర్ణము వర్యంతము త్రిప్పిపట్టినచో  ముంగురులయందు  వర్తించును.

   శ్లో!!    కర్ణద్వయాంతికగతౌ  మృగశీర్ష కరౌయదా !
    కర్ణద్వయార్ధేయుజ్యతేతధావక్త్రానుభావనే !!

    తా: మృగశీర్ష  హస్తములు కర్ణ ద్వయ  సమీపమునందుంచి  పట్టినచో. రెండు చెవులయందును. ముఖము చూపుటయందును వర్తించును.

   శ్లో!!    కటస్థౌహంసహస్థాచేదంబరార్ధేనియుజ్యతే !!

    తా: హంసాశ్య హస్తములు  కటిపార్శ్వములందు  పట్టినచో  "చీరె" కట్టుకొనుటయందు  వర్తించును.

   శ్లో!!    అన్యోన్యాభిముఖంకట్యాం పతాకౌయది హస్తకౌ !
    యోగపట్టేకల్కల స్వభావనాయాంని  యుజ్యతే !!

    తా: రెండు పతాక హస్తములు  కటిప్రదేశమునందు  అన్యోన్యాభిముఖమగునట్లు  పట్టినచో యోగపట్టమందు  నారచీరెలు    చూపుటయందు  వర్తించును.

   శ్లో!!    కటిదేశాదూరుయుగ్మమధ్యస్థాచేత్పతాకకా !
    పర్ణాంబరే పింఛరూప వపనేపినియుజ్యతే !!

    తా: రెండు పతాక హస్తములు  కటి ప్రదేశములనుండి ఊరుయుగ్మమథ్యమునకు  బట్టినచో వర్ణ వస్త్రమునందును, నెమలిపింఛ వస్త్రమునందును. నెమలిపింఛ వస్త్రమునందును వర్తించును.

   శ్లో!!    అలపద్మః కర్ణగశ్చేత్కబర్యేర్ధేనియుజ్యతే !!

    తా: అలపద్మ  హస్తము శ్రోత్రప్రదేశమునందు  చూపినచో  కబరిని  చూపుటయందు  వర్తించును.

   శ్లో!!    అమాతదేశాదళికగామీచేర్ధం సహస్తికః !
    లలంతికార్దేయుజ్యేతికవిభిత్యో జనాంపదైః !!

    తా:హంసాశ్య హస్తము పాపడ ప్రదేశమునుండి  దింపి ఫాల ప్రదేశమునందు బట్టినచో పాపడ బొట్టునందు  వర్తించును.

   శ్లో!!    తాటంకార్దేయుజ్యత్కేసౌ  సూచికాఖ్యస్తుసభ్రమః !!

    తా: సూచీముఖహస్తము కర్ణముల సమీపమునందు  చలింపచేయుచు పట్టినచో చెవుల ఆభరణములకు ఈ హస్తము వినియోగించును.

   శ్లో!!    ముష్టిన్త్వళికగామీఛేత్కాకపక్షేనియుజ్యతే !!

    తా: ముష్టిహస్తము  భులప్రదేశమునందు  బట్టినచో  తాకపక్షముకు వర్తించును.

   శ్లో!!    మృగశీర్షౌశ్లిష్టముఖౌవక్షసోష్టాంగుళిస్థితౌ !
    ప్రాకారేపితదాప్యగ్రే క్రీమవాప్యాంనియుజ్యతే !!

    తా: రెండు మృగశీర్ష  హస్తములు వక్షస్థలముకు విడిచి అష్టాంగుశ ప్రమాణముగల  ప్రదేశమునందు  శ్లిష్టములుగా  బట్టినచో  "కోటి" చూపుటయందు. కొనలను  చూపుటయందు. క్రీడాసరస్సునందు వర్తించును.

   శ్లో!!    కృపార్ధేయుజ్యాతేసూచీ కరస్స్కోయమధోముఖః !!

    తా: సూచిముఖ  హస్తమును  అధోముఖముగ  బట్టినచో  దయ చూపుటయందు  వర్తించుచున్నది.
   
   శ్లో!!    మృగశీర్షో  బాలభాలే  కౌమారే శిఖరోభవేత్ !

    తా: మృగశీర్ష  హస్తము  బాల్యవయస్సునందును, శిఖరహస్తము కౌమార వయస్సునందును  వర్తించును.

   శ్లో!!    అలపద్మోహం  సహస్తో  యౌవనే  చలితాయది !!

    తా: అలపద్మ హస్తము, హంసాశ్య హస్తము  చలింప చేసినచో యౌవ్వనమందు వినియోగించును.

   శ్లో!!    ముకుళోనిరళీభూతో వక్షస్థోయదివార్ధకే !
    యుజ్యతేయోగకుశలైన్సరసః కరవేదిభిః !!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS