Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్  పేజి 35

    "అమ్మ దుర్మార్గుళ్ళారా? ఎంత్ పనిచేశారు?" గుండెల మీద చెయ్యేసకుంటు అన్నాడు కన్నారావు.

    "అసలు అలాంటివాళ్ళని వదలకూడదుసార్!" అన్నాడు చిట్టబ్బాయి.

    "ఆ విషయం ది గ్రేట్ గోల్డెన్ కింగ్ అంటే ఈ బంగార్రాజుకి  నువ్వు చెప్పాలా? వాళ్ళని ఎక్కడున్నా  గాలించి పట్టుకుని మర్డరు చేస్తా... ఆనక జ్తేల్లో తోయించేస్తా..."  అన్నాడు బంగార్రాజు .

    "అయితే వాళ్ళ ఆచూకి మీకింకా తెలిలేదు కదండి?" మనసులో  భయపడ్తూనే అడిగాడు చిట్టబ్బాయి.

    సగం తెలిసినట్టే. వాళ్ళని ఎలాగోలా పట్టేసి మర్డరు చేస్తా..."

    "మనం  ఇక వెళ్దాంసార్ . వీళ్ళు అమాయకుల్లా  ఉన్నారు" అన్నాడు ఏడుకొండలు.

    "అవున్సార్ మేము అమాయకులమే!" అన్నారు చిట్టబ్బాయి కన్నారావు కోరస్ గా.

    "మరి మీరు తప్పేం చేయనప్పుడు నన్ను చూసి ఎందుకు కంగారుపడ్డారు?" అడిగాడు బంగార్రాజు.

    "నన్ను కూడా చూసి కంగారుపడ్డారు సార్..."  ఉత్సాహంగా అన్నాడు ఏడుకొండలు.

    "షటప్ నోర్ముయ్! మధ్యలో అడ్డు తగిలావంటే నిన్ను మర్డరు చేస్తా. ఊ చెప్పండి?..." అన్నాడు కన్నారావు.

    బంగార్రాజు గర్వంగా మీసాలు మేలేశాడు.

    "తప్ప చేసినా చెయ్యకపోయినా పోలీసులు వచ్చి ప్రశ్నిస్తే అనవసరంగా అనుమానించి కేసులో ఎక్కడ ఇరికించేస్తోరో అని భయపడ్తారు కదండి ఎవర్తెనా? అందులో మీలాంటి పొలిసు ఇన్ స్పెక్టర్, దిగ్రేట్ సిల్వర్ కింగ్ ప్రశ్నిస్తే భయం వెయ్యందాండి?" అన్నాడు చిట్టబ్బాయి.

    "సిల్వర్ కింగ్ కాదు... గోల్డెన్ కింగ్!" గర్వంగా మీసాలు మళ్ళి మెలేస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్ బంగార్ర్రాజు.

    బంగార్రాజు మొహం చూసి ఏడుకొండలు కిసుక్కున నవ్వాడు.

    "ఏంటా వెర్రి నవ్వు!... నా మొహంలో కోతులేమ్తెనా  ఆడుతున్నాయా? మర్డరు చేస్తా జాగ్రత..."

    "అదికాదు సార్. ఇందాకట్నుండి మీసాలు ఒక పక్కనే మేలిపెడ్తున్నారు కదా... అందుకే ఈ పక్క రొయ్యలా చుట్టుకునిపోయి  అటు పక్కన మామూలుగా ఉంది. హిహి..."

    చిట్టబ్బాయి, కన్నారావులు కూడా కిసుక్కున నవ్వారు.

    బంగార్రాజు కంగారుగా అటుపక్కకి తిరిగి రెండో పక్క కూడా మిసాన్ని బాగా మేలిపెట్టుకున్నాడు.

    సరిగ్గా అప్పడే ఓ తీయని కంఠం వాళ్ళ నలుగురికి వినిపించింది.

    "హలో!...."

    నలుగురూ తలలు తిప్పి ఆ కంఠ స్వరం వినిపించిన దిక్కుకి చూశారు.

    "ఎవరి అమ్మాయి?" అనుకున్నారు చిట్టబ్బాయి, బంగార్రాజు ఏడుకొండలూ.

    కన్నారావు మొహం మాత్రం సంతోషంతో వెలిగిపోయింది.

    "హలో మీరా? ఎవిటిలా వచ్చారు?" అన్నాడు.

    ఆ అమ్మాయి తనని తాను చూస్కుని "ఎలా వచ్చాను? బాగానే ఉన్నానుగా?"

    కన్నారావు ఘోల్లున నవ్వాడు. అతనితో బాటు చిట్టబ్బాయి, బంగార్రాజు ఏడుకొండలు కూడా ఘోల్లున నవ్వారు.

    కన్నారావు వాళ్ళ వంక చికాకుగా చూశాడు. "ఆ అమ్మాయి జోక్ వేసింది నాతో. మీరందరూ నవ్వతారేం?" అన్నాడు మొహం చిట్లించి.

    అతని మాటలకి ఆమె కిలకిలా నవ్వింది.

    కనారావు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.

    "ఎవరి అమ్మాయి?..." కన్నారావు చెవిలో గుసగుసలాద్తూ అడిగాడు చిట్టబ్బాయి.

    కన్నారావు కూడా చిట్టబ్బాయ్  చెవిలో గుసగుసలాడాడు.

    "నేను చెప్తుంటానే పేరు చేప్పంకుండా ఏడిపిస్తుంటుందని.  ఆ అమ్మాయి"
    ఇంతలో ఆ అమ్మాయి చిట్టబ్బాయ్ ని చూపిస్తూ కన్నరావుని హఠత్తుగా ప్రశ్నించింది.

    "ఇతనేనా మీరు పొద్దున్న చెప్పింది?"

    "నేనా? ఏం చెప్పాను?" బుర్ర గోక్కుంటూ అడిగాడు కన్నారావు.

    "అయ్యో! ఇంత మతిమరుప్తేతే ఎలాగండి?... ఆప్ప తీసుకున్నాడని... ఎగ్గోడుతున్నాడని చెప్పలేదూ?..."

    "నేనా? ని దగ్గర అప్ప తిస్కున్నానా? ని గర్ల్ ప్రెండ్స్ దగ్గర ఇలా కూడా కోతలు కోస్తున్నావన్నమాట!..." అన్నాడు  చిట్టబ్బాయి కోపంగా చూస్తూ.

    కన్నారావు మనసుకి అప్పుడు తట్టింది... తను మారువేషంలో ఉండగా ఆ అమ్మాయి కనబడి అడగడం, తను నోటికొచ్చినట్టు ఎదో వాగడం.

    "అవునుగా. నువ్వు నా దగ్గర అప్ప తీస్కుని ని చుట్టూ చచ్చేట్టు తిప్పావుగా?"  అన్నాడు వాళ్ళెవరికి కనబడకుండా చిట్టబ్బయికి కన్ను కొడ్తూ కన్నారావు. చిట్టబ్బాయ్  కన్నారావు వంక అయోమయంగా చూశాడు.

    "అమ్యితే మీరు డబ్బులు వసూలు చేయడానికి పోలిసుల సహాయం కూడా తిస్కున్నారన్న  మాట" అంది ఆమె బంగార్రాజుని ఏడుకొండల్ని చూస్తూ "అన్నట్టు ఇతన్ని మారువేషంలోనే పట్టుకున్నారా?"

    మారువేషం అనే మాట వినగానే బంగార్రాజులో చలనం కలిగింది.

    "మారువేషం?... ఎవరేస్కున్నారు? ఎక్కడేస్కున్నారు?? ఎందుకేస్కున్నారు?? ఎప్పడేస్కున్నారు???"  అంటూ చిందులు వేశాడు కాని స్టేబుల్ ఏడుకొండలు.

    "ఏయ్ సెవెన్ హిల్స్... నోర్ముయ్...ఎంటా చిందులు? మర్డరు చేస్తా!" అరిచాడు బంగార్రాజు.

    ఏడుకొండలు నోటిమిద  చెయ్యి పెట్టుకొని అతేన్స్హన్ లో నిలబడ్డాడు.

    "ఒహొ.... బాగుందే నివర్స! అసలు ఇన్ స్పెక్టర్ నేనా నువ్వా?" అన్నాడు  బంగార్రాజు.

     "చా చా చా" అన్నాడు ఏడుకొండలు.

    "నోటి మిడి నుండి చెయ్యి తిసి మాట్లాడు"

    "మిరే సార్!" అన్నారు నోటిమిద నుండి చెయ్యి తీస్తూ.

    "మరి నువ్వెందుకిలా హాడావుడి పడ్తావ్!"

    "పడను సార్... మిరే పడండిసార్.

    కన్నరావుకి ముచ్చమాటలు పోశాయ్. చిట్టబ్బయికి  పరిస్ధితి యెంటో అర్ధంకాక అయోమయంగా చూడసాగాడు.

    ఇన్స్పెక్టర్ బంగార్రాజు ఆ ఆమ్మాయి వంక తిరిగి "చెప్పు, మారు వేషం ఎవరేస్కున్నారు? ఎందుకేస్కున్నారు?" అని అడిగాడు.

    "ఇతనేండి... మీరెందుకల కంగారుపడ్తున్నారు?" అడిగింది ఆ అమ్మాయి.

    ఆ అమ్మాయి అడిగిదాన్ని పట్టించుకోకుండా కన్నారావువ్తెపు తిరిగి క్రూరంగా చూస్తూ ప్రశ్నించాడు బంగార్రాజు.

    "నిజం చెప్పు... లేకపోతే మర్డరు చేస్తా. మారువేషం ఎందుకేస్కున్నావ్?"

    "అయ్యో రాత! మారువేషం వేస్కోడం కూడా తప్పేనండి?  నేను విడి దగ్గర అప్ప వసూలు చెయ్యడానికి మారుఅవేశం వెయ్యాలా? నేనెక్కడా ఇలా సిన్లేదే!!"

    "మరేం చెయ్యమంటారు, అప్ప తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తుంటే? ఇంటికి వెళ్తే ఇంట్లో లేడని చెప్పిస్తాడు. దార్లో ఎక్కడ్తేనా ఎదురవుతే నన్ను చూసి పక్కసందుల్లోకి  పారిపోతాడు. అందుచేత  వీడిని పట్టుకోడానికి మారు వేషం వెయ్యాల్సి వచ్చింది" అన్నాడు కన్నారావు.

    "ఏమ్మా!... ఇతను చెప్తుంది నిజమేనా?" ఆ అమ్మాయి వ్తెపు తిరిగి ప్రశ్నించాడు బంగార్రాజు.

    "నిజమే అనుకుంటానండి... పొద్దున్న కూడా నాకు అలానే చెప్పాడు" అంది ఆ అమ్మాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS